• English
  • हिन्दी
  • ગુજરાતી
  • বাংলা
  • मराठी
  • ಕನ್ನಡ
  • money9
  • బీమా
  • పొదుపు
  • షేర్ మార్కెట్
  • లోన్స్
  • పెట్టుబడి
  • Breaking Briefs
downloadDownload The App
Close
  • Home
  • Videos
  • Podcast
  • టాక్స్
  • స్టాక్స్
  • మ్యూచువల్ ఫండ్
  • రియల్ ఎస్టేట్
  • Breaking Briefs
  • Money9 Conclave
  • బీమా
  • పొదుపు
  • షేర్ మార్కెట్
  • లోన్స్
  • పెట్టుబడి
  • మ్యూచువల్ ఫండ్
  • రియల్ ఎస్టేట్
  • టాక్స్
  • ట్రేండింగ్
  • Home / Exclusive }

Malware Attack: మాల్వేర్ దాడి నుంచి ఎలా తప్పించుకోవాలి?

తెలియని ఈ మెయిల్ నుంచి వచ్చే అటాచ్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే, మాల్వేర్(Malware Attack) సిస్టమ్‌లోకి ప్రవేశిస్తుంది.

  • Sumathi Vallamshetty
  • Last Updated : September 23, 2023, 13:27 IST
  • Follow
Malware Attack
  • Follow

సుమిత్రకు క్రెడిట్ కార్డుకు సంబంధిచిన ఈ మెయిల్ వచ్చింది. అయితే అది ఆమెకు చాలా ఖరీదైనదిగా మారింది. ఎలాఅంటే..

సుమిత్ర క్రెడిట్ కార్డు తీసుకోవాలని అనుకుంది. దాని కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేసింది. ఆ తరువాత ఆమెకు ఈ ఈ మెయిల్ వచ్చింది. సుమిత్రకు క్రెడిట్ కార్డు ఆఫర్ చేస్తూ ఎదో ఒక కంపెనీ ఈ మెయిల్ పంపించింది. ఆ మెయిల్ చూసిన సుమిత్ర అది ఆఫర్ వివరాలు చెప్పే మెయిల్ అనుకుంది. అందుకే దానిలో ఉన్న లింక్ ను డౌన్ లోడ్ చేసింది. అయితే, దానిని ఓపెన్ చేయలేదు. తరువాత చూద్దాం అని వదిలి వేసింది. అయితే ఇది సాధారణ లింక్ కాదు.. ఈ విషయం 14 వేల రూపాయలు తన ఎకౌంట్ నుంచి ఎగిరిపోయాకా సుమిత్రకు అర్ధం అయింది. ఎందుకంటే, ఆమె డౌన్ లోడ్ చేసిన ఈ మెయిల్ లింక్ ద్వారా మాల్వేర్ దాడి జరిగింది.

తెలియని ఈ మెయిల్ నుంచి వచ్చే లింక్ లతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే, మీ ల్యాప్‌టాప్ ద్వారా, సైబర్ దుండగులు మీ బ్యాంక్ ఎకౌంట్ ను యాక్సెస్ చేస్తారు. మీరు అటాచ్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే, మాల్వేర్(Malware Attack) సిస్టమ్‌లోకి ప్రవేశిస్తుంది… ఆపై మీరు సైబర్ దుండగుల టార్గెట్ అయిపోతారు.

అటువంటి దాడులను మీరు ఎలా గుర్తించగలరు? వాటిని మీరు ఎలా నివారించగలరు? ఇక్కడ మీకు అటువంటి సమాచారాన్ని అందిస్తున్నాము. అయితే అంతకంటే ముందు, మాల్వేర్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. Malware ఒక హానికరమైన సాఫ్ట్‌వేర్, అంటే ప్రోగ్రామ్ లేదా ఫైల్. దీనిని ఉద్దేశపూర్వకంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, నెట్‌వర్క్‌లు లేదా సర్వర్‌లు మొదలైన వాటికి హాని కలిగించడానికి ఉపయోగిస్తారు. కంప్యూటర్ వైరస్‌లు, ransomware, స్పైవేర్ మొదలైన అనేక రకాల మాల్వేర్‌లు ఉన్నాయి. ఇటీవలి కాలంలో భారతదేశంలో కొన్ని మాల్వేర్ దాడులు(Malware Attack) గురించి రిపోర్ట్స్ ఏమి చెబుతున్నాయి చూద్దాం.

సైబర్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ ట్రెండ్ మైక్రో నివేదిక ప్రకారం… భారతదేశంలో, 2022లో 7 లక్షల మాల్వేర్ దాడులు జరిగాయి. 2021లో ఈ సంఖ్య 6.5 లక్షలుగా ఉంది. ఈ సంవత్సరం విడుదల చేసిన SonicWall సైబర్ థ్రెట్ రిపోర్ట్‌లో కూడా ఇదే విషయం ప్రస్తావించారు. నివేదిక ప్రకారం, 2022లో మాల్వేర్ దాడుల్లో 31 శాతం పెరుగుదల ఉందని ఈ గణాంకాలు ధృవీకరిస్తున్నాయి. భారతదేశంలో మాల్వేర్ దాడులు నిరంతరంగా పెరుగుతున్నాయి… సైబర్ దుండగులు మాల్వేర్ ద్వారా ఫోన్‌లు లేదా ల్యాప్‌టాప్‌లలోకి చొరబడి ప్రజల సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారు.

మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌పై మాల్వేర్ దాడి జరిగితే మీకు ఎలా తెలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం…

మీ ఫోన్ దానంతట అదే వేడెక్కుతున్నట్లయితే… యాప్‌లు తెరవడానికి చాలా సమయం తీసుకుంటుంటే మాల్వేర్ దాడికి(Malware Attack) గురైందని భావించవచ్చు. సిస్టమ్ అప్పుడప్పుడు క్రాష్ అవుతూ ఉంటుంది… ల్యాప్‌టాప్ స్లో అవుతుంది… లేదా ఎర్రర్ మెసేజ్‌లు పదే పదే కనిపిస్తాయి… ఇలా అయితే మీ కంప్యూటర్ మాల్వేర్ దాడికి గురై ఉండవచ్చని గుర్తించవచ్చు.

మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ బ్యాటరీ చాలా త్వరగా అయిపోతుంటే… మీ ఫోన్‌లో డేటా వినియోగం దానంతటదే పెరిగిపోతూ ఉన్నా కూడా మాల్వేర్ పని అయి ఉండవచ్చు. మీ ఫోన్‌లో అనవసర పాప్-అప్‌లు కనిపిస్తాయి… ల్యాప్‌టాప్ షట్ డౌన్ చేయడం లేదా రీస్టార్ట్ చేయడం సాధ్యం కాదు… ల్యాప్ టాప్ లో కూడా యాదృచ్ఛిక పాప్-అప్‌లు, వెబ్ పేజీలో పిచ్చి ప్రకటనలు కనిపిస్తాయి ఇలా అయితే మీ పరికరం మాల్వేర్ ద్వారా దాడి జరిగి ఉండవచ్చని తెలుసుకోండి.

మీ క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో మీకు ఏవైనా అనధికారిక ఛార్జీలు కనిపిస్తే, దానిపై శ్రద్ధ వహించండి, మీ పరికరంలో మాల్వేర్(Malware Attack)ఉండవచ్చు.

మీ ల్యాప్‌టాప్ బ్రౌజర్ లేదా డెస్క్‌టాప్‌లో కొత్త టూల్‌బార్లు లేదా చిహ్నాలు కనిపిస్తే… అది మాల్వేర్ దాడి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మాల్‌వేర్ దాడుల బారిన పడకుండా ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం…

అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా, మీ పరికరంలోకి వైరస్ ప్రవేశిస్తే… అప్పుడు మీరు భద్రతా సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చులేదా దాన్ని తీసివేయడానికి వైరస్ స్కానర్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేయవచ్చు. దీనితో, మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో మీ సిస్టమ్‌ను రక్షించుకోగలరు. మీరు మీ బ్రౌజింగ్ హిస్టరీని కూడా ఎప్పటికప్పుడు తొలగించడం మంచిది. అలాగే క్యాచే కూడా క్లియర్ చేయాలి. మీరు డౌన్‌లోడ్ చేయని ఏదైనా యాప్‌ మీకు కనిపిస్తే దానిని కూడా తొలగించాలి.

మేము మీకు సమస్యల గురించి చెప్పాము- మీరు దానిని ఎలా నివారించవచ్చో కూడా మీకు తెలియజేసాము. మీరు ఈ విషయాలను గుర్తుంచుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఇటువంటి సమస్యల గురించి వాటి నుంచి తప్పించుకునే మార్గాల గురించి మీకు మా వీడియోల ద్వారా చెబుతూనే ఉంటాం. ఆ వీడియోల కోసం Money9ని చూస్తూ ఉండండి.

Published: September 23, 2023, 13:27 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.    

  • Computer
  • Exclusive
  • Malware Attack

Related

  • యాక్సిడెంట్ పేరుతో సైబర్ మోసం! పసిగట్టేదెలా? పట్టించేదెలా?
  • ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త, Google Play Store నుండి 17 లోన్ యాప్‌లను తొలగించింది
  • ఎలక్ట్రిక్‌ కార్లకు ఏ రకమైన ఇన్సూరెన్స్‌ సరైనది?
  • ఉల్లి, టమాటా ధరల పెరుగుదల , బల్క్ FDపై అధిక వడ్డీ
  • పోస్ట్ ఆఫీస్ FD కొత్త రూల్స్‌.. కొత్త సిమ్‌కార్డు కొనుగోలుపై నిబంధనలు మార్పు
  • ఒక్క ఫోన్ కాల్ తో మిమ్మల్ని ఎలా మోసం చేస్తారో తెలుసా? మరి.. పరిష్కారం..?

Latest

  • 1. యాక్సిడెంట్ పేరుతో సైబర్ మోసం!
  • 2. క్లెయిమ్‌ను తిరస్కరించిందా?
  • 3. హోమ్‌లోన్‌ EMIలు చెల్లించడంలో ఇలా చేయండి
  • 4. ఎలక్ట్రిక్‌ కార్లకు ఏ రకమైన ఇన్సూరెన్స్‌
  • 5. బీమా పాలసీపై రుణం తీసుకోవడం మంచిదేనా?
  • Trending Stories

  • యాక్సిడెంట్ పేరుతో సైబర్ మోసం! పసిగట్టేదెలా? పట్టించేదెలా?
  • యాక్సిడెంట్ పేరుతో సైబర్ మోసం! పసిగట్టేదెలా? పట్టించేదెలా?
  • యాక్సిడెంట్ పేరుతో సైబర్ మోసం! పసిగట్టేదెలా? పట్టించేదెలా?
  • ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త, Google Play Store నుండి 17 లోన్ యాప్‌లను తొలగించింది
  • ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త, Google Play Store నుండి 17 లోన్ యాప్‌లను తొలగించింది
  • TV9 Sites

  • TV9Hindi.com
  • TV9Telugu.com
  • TV9Marathi.com
  • TV9 Gujarati
  • TV9 Kannada
  • TV9 Bangla
  • News9 Live
  • Trends9
  • Money9 Sites

  • Money9 Hindi
  • Money9 English
  • Money9 Marathi
  • Money9 Telugu
  • Money9 Gujarati
  • Money9 Kannada
  • Money9 Bangla
  • Topics

  • బీమా
  • పొదుపు
  • లోన్స్
  • స్టాక్స్
  • మ్యూచువల్ ఫండ్
  • రియల్ ఎస్టేట్
  • టాక్స్
  • క్రిప్టో
  • ట్రేండింగ్
  • Follow us

  • FaceBook
  • Twitter
  • Youtube
  • Instagram
  • Linkedin
  • Download App

  • play_store
  • App_store
  • Contact Us
  • About Us
  • Advertise With Us
  • Privacy & Cookies Notice
  • Complaint Redressal
  • Copyright © 2023 Money9. All rights reserved.
  • share
  • Facebook
  • Twitter
  • Whatsapp
  • LinkedIn
  • Telegram
close