బంగారు ఆభరణాలలో పెట్టుబడి కంటే గోల్డ్ ఇటిఎఫ్ ఎందుకు మంచిది ?

ఇప్పుడు మనం గోల్డ్ ఇటిఎఫ్‌పై పన్ను ఎలా విధిస్తారు తెలుసుకుందాం? ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత కొనుగోలు చేసిన గోల్డ్ ఇటిఎఫ్ యూనిట్ల అమ్మకం ద్వారా

ధృవ్ రజత్‌తో బంగారం ధరల గురించి మాట్లాడుతున్నాడు. బంగారం 73 నుంచి 74 వేల రూపాయల వరకు ట్రేడవుతుందని రజత్ తెలిపారు.ధృవ్ బంగారంపై పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచిస్తున్నానని, లేకపోతే ధరలు మరింత పెరగవచ్చని అన్నాడు. రజత్ అతనితో ఏకీభవించాడు. అప్పుడు ధృవ్ బంగారాన్ని ఎలా కొనుగోలు చేస్తారని ఆశ్చర్యపోయాడు. జీఎస్టీ, మేకింగ్ చార్జీలతో కలిపి దాదాపు 75 నుంచి 76 వేల వరకు ఖర్చవుతుంది. బంగారం కొనుగోలుకి ఒక మార్గం గోల్డ్ ఇటిఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం అని రజత్ సూచించాడు. ఇది కేవలం కొన్ని వేల రూపాయలతో పెట్టుబడి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

బంగారం ఎవర్‌గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్.. బంగారంకి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.. ముఖ్యంగా దాని ధరలు పెరిగినప్పుడు, ఎక్కువ రాబడిని ఆశిస్తూ.. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితి దీని వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది… ఇలాంటి వాతావరణంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి ఎంపికల్లో డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు… బంగారానికి డిమాండ్ పెరగడానికి ఇదే కారణం… గోల్డ్ ఈటీఎఫ్ చేయవచ్చు. సకాలంలో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి మంచి మార్గం…గోల్డ్ ఇటిఎఫ్ అంటే ఏమిటి ? బంగారు ఆభరణాలలో పెట్టుబడి పెట్టడం కంటే ఇది ఎందుకు మంచిది ఇప్పుడు తెలుసుకుందాము.

గోల్డ్ ఈటీఎఫ్ లేదా గోల్డ్ ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనేది కమోడిటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్, ఇది బంగారంలో పెట్టుబడి పెడుతుంది. ఈ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ షేర్ల వలె పనిచేస్తాయి. BSE, NSE వంటి ఎక్స్ఛేంజీలలో కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ మీ డీమ్యాట్ ఖాతాలో డీమెటీరియలైజ్డ్ రూపంలో క్రెడిట్ చేస్తారు. మీరు Physical బంగారాన్ని కొనుగోలు చేయనవసరం లేదు,కానీ అమ్మితే మార్కెట్‌లో బంగారం ధర లభిస్తుంది.

ఒక వ్యక్తి కేవలం 1 యూనిట్ గోల్డ్ ETF కూడా కొనుగోలు చేయవచ్చును . ఇది 99.5% స్వచ్ఛత కలిగిన 1gm బంగారానికి సమానం. గోల్డ్ ఇటిఎఫ్ గురించిన ప్రత్యేకత ఏమిటంటే, బంగారు ఆభరణాల వంటి దాని భద్రత గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు, దొంగతనం జరిగే ప్రమాదం లేదు. బంగారం స్వచ్ఛత గురించి టెన్షన్ ఉండదు. ఆభరణాలు కొనడం కంటే బంగారంలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వ్యక్తులకు గోల్డ్ ఈటీఎఫ్  మంచి ప్రత్యామ్నాయం. మరొక ప్రయోజనం ఏమిటంటే సావరిన్ గోల్డ్ బాండ్ వంటి లాక్-ఇన్ పీరియడ్ లేదు.

మీరు ఏదైనా స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, మీరు తెలుసుకోవలసిన మొదటి విషయం దాని రాబడుల ట్రాక్ రికార్డ్. గోల్డ్ ఇటిఎఫ్‌లలో రిటర్న్ గణాంకాలు ఏమి చెబుతున్నాయి? చూద్దాం… ఏప్రిల్ 23, 2024 నాటికి ఏస్ మ్యూచువల్ ఫండ్ డేటా ప్రకారం, గత ఐదేళ్లలో ప్రధాన గోల్డ్ ఇటిఎఫ్ పథకాల సగటు రాబడి 16.73 శాతం. మనం ఒక సంవత్సరం గురించి మాట్లాడినట్లయితే, ఈ రాబడి 17.73 శాతంగా ఉంది… మూడు సంవత్సరాలలో, గోల్డ్ ఇటిఎఫ్ పథకాలు సంవత్సరానికి సగటున 13.59 శాతం రాబడిని ఇచ్చాయి… ఎందుకంటే ఈ పథకాలు స్వచ్ఛమైన బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల వాటి వార్షిక రాబడి పెద్దగా తేడా లేదు.

కాబట్టి బంగారంలో ఈ పెరుగుతున్న ట్రెండ్ భవిష్యత్తులో కూడా కొనసాగుతుందా? పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా , అమెరికాలో ద్రవ్యోల్బణం సెంట్రల్ బ్యాంక్ లక్ష్యం కంటే ఎక్కువగానే ఉందని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ విశ్లేషకుడు మెల్విన్ శాంటారిటా చెప్పారు. అటువంటి పరిస్థితిలో,ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందేందుకు బంగారంపై పెట్టుబడి పెట్టడం మంచి ఎంపిక.. ద్రవ్యోల్బణం ప్రమాదం నుండి మీ పోర్ట్‌ఫోలియోను రక్షించడానికి మీరు మీ పెట్టుబడులలో బంగారు ఇటిఎఫ్‌లను చేర్చవచ్చు.

ధృవ్ పోర్ట్‌ఫోలియోలో బంగారం భాగం ఎంత ఉండాలి అనే ప్రశ్న తలెత్తుతుంది… పెట్టుబడి నియమం ఏమిటంటే, మీరు మొత్తం కేటాయింపును అంటే మొత్తం డబ్బును ఒకే ఆస్తిలో పెట్టుబడి పెట్టకూడదు… మీ డిన్నర్ ప్లేట్‌లో బ్రెడ్ , కూరగాయలు వంటి వివిధ ఆహార పదార్థాలు ఉన్నట్లే, మీ పోర్ట్‌ఫోలియోలో కూడా వైవిధ్యం ఉండాలి. అదే విధంగా, మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లేట్‌లో ఈక్విటీ, డెట్, గోల్డ్ వంటి విభిన్న ఆస్తులు ఉండాలి…అంటే, మీ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో ఏ ఒక్క ఆస్తిపై ఆధారపడి ఉండకూడదు, వైవిధ్యభరితంగా ఉండాలి… ఇది పెట్టుబడిపై రిస్క్ తగ్గిస్తుంది.

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటా 10-15 శాతం ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో అస్థిరత లేదా యుద్ధం లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, బంగారంలో మంచి పెరుగుదల కనిపిస్తుంది… బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి రాబడిని పొందవచ్చు.

ఇప్పుడు మనం గోల్డ్ ఇటిఎఫ్‌పై పన్ను ఎలా విధిస్తారు తెలుసుకుందాం? ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత కొనుగోలు చేసిన గోల్డ్ ఇటిఎఫ్ యూనిట్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం హోల్డింగ్ వ్యవధితో సంబంధం లేకుండా స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. అంటే,అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం వార్షిక ఆదాయానికి జోడిస్తారు… మీ పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి.

గోల్డ్ ఇటిఎఫ్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి మంచి ఎంపిక…ధృవ్ తన మొత్తం పెట్టుబడిలో 10 నుండి 15 శాతం మొత్తాన్ని గోల్డ్ ఇటిఎఫ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పెట్టుబడిని గోల్డ్ ఈటీఎఫ్‌లు, సావరిన్ బాండ్‌లు వంటి వివిధ రకాల బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి ప్రయోజనాల కోసం బంగారు ఆభరణాలను ఎంచుకోవడం సరైనది కాదు.. దాన్ని భద్రంగా ఉంచుకోవడానికి మీకు లాకర్ కావాలి… బంగారం
విక్రయించేటప్పుడు వివిధ లావాదేవీల ఖర్చులు మీ లాభాలను తగ్గిస్తాయి. డబ్బు వృధా అవుతుంది.

Published: May 10, 2024, 17:55 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.