EMI భారం తగ్గించుకోవాలా? 30% ఆప్షన్ ను ట్రై చేయచ్చు!

బ్యాంకు రుణాలు ఇవ్వడం ద్వారా కస్టమర్లను పొందాలనుకుంటుంది. కానీ మీ ఆదాయం,

గౌరవ్, అభిషేక్ వివిధ రకాల అప్పుల గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. గౌరవ్ తన ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఇల్లు, కారు, పర్సనల్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాడు.

అభిషేక్ ఒకేసారి రకరకాల రుణాలు ఎందుకు తీసుకుంటున్నాడో అని తెలుసుకోవాలనుకున్నాడు.

గౌరవ్ ఏం చెప్పాడంటే.. లోన్ ఇవ్వడానికి బ్యాంక్ సిద్ధంగా ఉన్నందున ఇది ఈజీగా ఉంటుందని… కారణం కూడా ఇదేనన్నాడు. పైగా ఇవన్నీ ఒకేసారి తీర్చగలనని చెప్పాడు.

బ్యాంక్ లోన్ లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, అతను వాటన్నింటికీ అప్లయ్ చేసుకోవాలని కాదు, ఎందుకంటే EMI చెల్లింపులు జీతంలో 30% కంటే ఎక్కువ ఉండకూడదు అని అభిషేక్ అతనికి చెప్పాడు.

ఇప్పుడు గౌరవ్ ఈ 30% రూల్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించాడు.

మీరు సంపాదించడం ప్రారంభించిన వెంటనే… గౌరవ్ లాగానే మీకు కూడా కారు లేదా ఇల్లు కొనుక్కోవాలని అనిపించవచ్చు. మార్కెట్లో వివిధ రకాల సులభమైన EMI ఆప్షన్లు అందుబాటులో ఉన్నందున ఇది
మరింత సౌకర్యవంతంగా మారుతుంది. ఈ రోజుల్లో, మీరు సులభమైన నెలవారీ వాయిదాలపై రుణాన్ని పొందుతారు, అంటే మీ ప్రతి అవసరం మరియు కోరిక కోసం EMI …లోన్ ఆప్షన్స్ అందుబాటులో
ఉన్నందున, మీరు వాటిని తీసుకోవాలని అర్థం కాదు. మీరు లోన్ సరిగ్గా ప్లాన్ చేయకపోతే, అది మీకు ఓ పీడకలగా మారవచ్చు. ఎందుకంటే మీ సంపాదనలో ఎక్కువ భాగం EMI చెల్లించడానికే సరిపోతుంది.
అందుకే, మీ జీతంలో రుణం కింద ఎంత భాగం చెల్లించాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అభిషేక్ గౌరవ్ తో చెప్పిన 30% EMI నిబంధనను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీని ప్రకారం, అన్ని రకాల రుణాల మొత్తం EMIలు మీ మొత్తం ఆదాయంలో 30 శాతానికి మించకూడదు. కొంతమంది
ఆర్థిక నిపుణులు మొత్తం EMIలను జీతంలో 40% వరకు ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు. దీనినే 40% EMI రూల్ అంటారు. కానీ మీకు మా సలహా ఏమిటంటే మీ జీతంలో ఎంత తక్కువ భాగం EMIలకు వెళ్తే
అంత మంచిది.

 

దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం, గౌరవ్ ఇంటి ఆదాయం నెలకు ఒక లక్ష రూపాయలు అయితే, అతని అన్ని రుణాల మొత్తం EMIలు రూ. 30,000 మించకూడదు. ఇందులో కారు, ఇల్లు, వ్యక్తిగత
రుణాలు అలాగే క్రెడిట్ కార్డ్ బిల్లులు వంటి అన్ని రకాల రుణాలు ఉంటాయి.

ప్రతి ఒక్కరి జీవితం ఎత్తుపల్లాలతో నిండి ఉంటుంది. అటువంటి పరిస్థితులలో, EMIల తక్కువ భారం అనారోగ్యం లేదా ఉద్యోగ నష్టం వంటి కష్ట సమయాలకు మరింత బఫర్ ను సూచిస్తుంది. అధిక EMIలు
అవసరమైన రోజువారీ ఖర్చులను తగ్గించేస్తాయి. ఇది పొదుపు, పెట్టుబడులకు బ్రేక్ ఇస్తుంది, ఇది మీ భవిష్యత్తు ప్రణాళికకు మంచిది కాదు.

 

కోరికలు తీర్చుకోవడానికి రుణాలు తీసుకోవడం గౌరవ్ ఆర్థిక ప్రణాళికకు ఎలా డేంజరో కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం ముందే చెప్పుకున్నట్టు గౌరవ్ కు నెలకు లక్ష రూపాయల జీతం వస్తుంది.
30% EMI నిబంధన ప్రకారం, అతని అన్ని రుణాల మొత్తం EMIలు రూ. 30,000 మించకూడదు. గౌరవ్ EMIలు ఈ నియమాన్ని క్రాస్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

గౌరవ్ మొత్తం లోన్ EMI రూ. 30,000కి బదులుగా రూ. 40,000 అయిందని అనుకుందాం. టెన్యూర్ 10 సంవత్సరాలు. అంటే గౌరవ్ ప్రతి నెల EMIగా రూ. 10,000 అదనంగా చెల్లిస్తాడని అర్థం. అటువంటి
సందర్భంలో, అతను సంవత్సరానికి రూ. 1,20,000, 10 ఏళ్లలో రూ. 12 లక్షలను EMIగా చెల్లిస్తాడు. ఈ డబ్బు పొదుపు చేసి పెట్టుబడి పెడితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.

 

గౌరవ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో నెలకు అదే రూ. 10,000 SIPని ప్రారంభిస్తే, 10% అంచనా రాబడిని ఊహిస్తే, 10 ఏళ్ల తర్వాత అతని వద్ద రూ. 20,65,520 ఉంటుంది. ఇందులో గౌరవ్ మొత్తం రూ.12
లక్షలు పెట్టుబడి పెట్టి రూ.8,65,520 రాబడిని పొందుతాడు. రాబడి 12% ఉంటే, గౌరవ్ రూ. 23,23,391 పొందవచ్చు.

గౌరవ్ 30% EMI నిబంధనను అనుసరిస్తే, అతను లోన్ వడ్డీని ఆదా చేయడమే కాకుండా అదే డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడిని కూడా పొందవచ్చు. గౌరవ్ SIP పెట్టుబడుల ద్వారా సంపాదించిన
డబ్బును కారు లేదా ఇల్లు కొనుగోలు వంటి తన ఆర్థిక లక్ష్యాలలో దేనినైనా సాధించడానికి ఉపయోగించవచ్చు.

EMI మొత్తాన్ని తగ్గించడానికి గౌరవ్ కు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది – గౌరవ్ ఎక్కువ డౌన్ పేమెంట్ చేయవచ్చు, తద్వారా అతని EMI తగ్గుతుంది. రెండోది – బహుళ రుణాలు తీసుకునే బదులు, అతను
గృహ రుణం వంటి ఖచ్చితంగా అవసరమైన రుణాలను మాత్రమే తీసుకోవడం. అతను ఆదా చేసిన డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఆ నిధులను కారు లేదా ఇంటి ఇంటీరియర్ వర్క్ వంటి ఇతర అవసరాలకు
ఉపయోగించవచ్చు. ఈ వ్యూహంతో, గౌరవ్ కొన్నేళ్లలో ఎలాంటి రుణం లేకుండా కారు, ఇంటీరియర్స్ కోసం నిధులను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇప్పటికే ఉన్న రుణాలపై అధిక EMIలు ఇతర ప్రయోజనాల కోసం కొత్త లోన్ తీసుకోకుండా మిమ్మల్ని అడ్డుకుంటాయి. మీరు కొత్త లోన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు, బ్యాంక్ మీ లోన్ అర్హతను చెక్ చేస్తుంది.
మీరు EMIని సులభంగా చెల్లించగలిగేలా మీకు ఎంత రుణం ఇవ్వవచ్చో బ్యాంక్ చూస్తుంది. మీరు ఇప్పటికే అధిక EMIలను చెల్లిస్తున్నట్టయితే.. బ్యాంక్ కొత్త రుణాన్ని తిరస్కరించవచ్చు లేదా ముందుగా ఉన్న
లోన్లను క్లోజ్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు.

మీరు ఇప్పటికే ఇప్పటికే రుణాలు తీసుకుని ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, మీరు కొత్త రుణం కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు, మీరు అడిగే లోన్ మొత్తానికి మీకు అర్హత లేకపోతే, బ్యాంకు కొత్త లోన్ మొత్తాన్ని
తగ్గించవచ్చు లేదా ముందుగా కొన్ని పాత రుణాలను క్లోజ్ చేయమని అడగవచ్చు. అటువంటప్పుడు, మీరు ముందుగా ఏ లోన్లను మూసివేయాలో తెలుసుకుందాం.

అధిక EMIలు అంటే మీ జీతంలో ఎక్కువ భాగం మీ చేతుల్లో లేకుండా పోతుంది. ఇది మీ పొదుపు, పెట్టుబడులను నిలిపివేస్తుంది. ఈ స్థితిలో, మీరు మీ ఉద్యోగం కోల్పోతే లేదా తీవ్రమైన అనారోగ్యం కారణంగా
మీ ఆదాయం ఆగిపోయినట్లయితే, మీరు EMIలను చెల్లించలేరు. EMI చెల్లించకపోవడం వల్ల వడ్డీ, జరిమానాలు విధిస్తారు. క్రమంగా మీ రుణ భారం పెరిగిపోతుంది.

బ్యాంకు రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, మీరు ఈఎంఐలు చెల్లించి ఎన్ని రుణాలు కావాలన్నా తీసుకోవచ్చు. దీనికి కనిష్ట లేదా గరిష్ట సంఖ్యను నిర్దేశించలేదు. బ్యాంకు రుణాలు ఇవ్వడం ద్వారా
కస్టమర్లను పొందాలనుకుంటుంది. కానీ మీ ఆదాయం, లోన్ EMIల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం మీ బాధ్యత. అవసరానికి మించి అప్పులు తీసుకోవడం మీ స్వంత డబ్బుతోను, భవిష్యత్తుతో గేమ్ ప్లే
చేయడమే. రుణాలు తీసుకోవడం కంటే పెట్టుబడుల ద్వారా వచ్చిన మొత్తంతో మీ కోరికలు తీర్చుకోవడం మంచిది.

Published: May 9, 2024, 18:51 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.