Home » Shows
డబ్బుతోనే ప్రపంచం. ప్రతి స్థాయిలోనూ డబ్బును జాగ్రత్త చేసుకోవడం. దానిని ఇన్వెస్ట్ చేయడం అందరూ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎప్పుడూ ఎదో ఒక అనుమానం తలెత్తుతూనే ఉంటుంది. అటువంటి సందేహాలను తీర్చడం కోసం మనీ9 తీసుకువస్తోంది ఇన్వెస్ట్మెంట్స్ లో నిష్ణాతులను మనీ మాంక్ షో తో. వారి సలహాలు సూచనలు మీకు ఇన్వెస్ట్మెంట్ దారిలో ఇక్కట్లు లేని ప్రయాణాన్ని అందిస్తాయి.
మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి అందరికీ ఎన్నో సందేహాలు ఉంటాయి. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ రంగంలో నిత్యం ఎన్నో కొత్త ఫండ్స్ వచ్చి చేరుతూ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో వచ్చే సందేహాలను తీర్చడం.. ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన ఫండ్స్ గురించి వివరించడం.. ఫండ్స్ పనితీరుపై విశ్లేషణలు.. వివరణాత్మక కథనాలు అందించేదే మ్యూచువల్ ఫండ్ సెంట్రల్.
ఇన్సూరెన్స్ విషయంలో ఎన్నో సందేహాలు. మనదేశంలో ఇన్సూరెన్స్ పై అవగాహన లేక ఏజెంట్స్ పై ఆధారపడి వాళ్ళు ఏది చెబితే అది చేసేవారే ఎక్కవ. ఇన్సూరెన్స్ రంగంలో ఎన్నో మార్పులు ఇప్పటికే వచ్చాయి. ఇకపై మరెన్నో మార్పులు రానున్నాయి. ఇన్సూరెన్స్ కి సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది ఇన్సూరెన్స్ సెంట్రల్
స్టాక్ మార్కెట్ అంటేనే పెద్ద మాయాజాలంగా కనిపిస్తుంది. ఇన్వెస్ట్ చేయాలంటే భయం ఉంటుంది.. ఇన్వెస్ట్ చేస్తే బోలెడు డబ్బులు వచ్చేస్తాయనే ఆశా ఉంటుంది. భయం ఆశ మధ్యలో సాధరాన ఇన్వెస్టర్ ఊగిసలాడటం సహజం. అయితే.. షేర్ మార్కెట్ గురించి అన్ని విషయాలు తెలుసుకుని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది లేకుండా మన డబ్బు పెరుగుతూనే ఉంటుంది. స్టాక్ మార్కెట్ విషయాలను వివరంగా వివరించే మనీ9 షో స్టాక్ సెంట్రల్.
బంగారం అలంకరణలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. వ్యాపారంలోనూ అంతకంటే ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఇన్వెస్టర్స్ కు సిరులు కురిపించే బంగారం.. ఒక్కోసారి డీలా పడిపోయేలా కూడా చేస్తుంది. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్రయత్నాలు చేసేవారికి.. గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నవారికి.. అందరికీ బంగారానికి సంబంధించిన గోల్డెన్ విశేషాలను ప్రతి నెలా మీకు అందిస్తుంది గోల్డ్ సెంట్రల్
చాలా మందికి పలు ప్రభుత్వ పథకాలు అవగాహన ఉండదు. అలాగే ఎలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టాలి.. ఎలా పెట్టుబడి పెట్టాలో కూడా తెలియదు. అందుకే ప్రతి ఒక్కరికి ఆదాయం వచ్చే పథకాల పట్ల అవగాహన కల్పించడానికి నేర్చుకుందాం.. సంపాదించుకుందాం.. అనే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాం...
కార్పోరేట్ ప్రపంచంలో ప్రతి రోజూ ఎన్నో మార్పులు.. కంపెనీల పనితీరులో తేడాలు.. షేర్ మార్కెట్లో కంపనీల షేర్ల ధరల్లో మార్పులు వాటి ప్రభావం.. ఇలా ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇవే కాకుండా స్టార్టప్ కంపెనీల పనితీరు.. ప్రభుత్వ ఆదేశాలు.. వాటి ప్రభావం.. ఇలా కార్పోరేట్ ప్రపంచం చుట్టూ చోటు చేసుకునే సంఘటనల విశ్లెశనాత్మక౨ కథనాల సమాహారం వారం వారం మీకు అందిస్తుంది కంపెనీ కబుర్లు
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి ప్రతిరోజూ చోటు చేసుకునే అంశాలను మీకు సంక్షిప్తంగా వివరిస్తుంది మనీ9 ఫటాఫట్. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలా అన్నిరకాల పర్సనల్ ఫైనాన్స్ విషయాలలో నిత్యం ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. వాటి ప్రభావం ఎలా ఉంటుంది? ఆయా విషయాల్లో వస్తున్న మార్పులను మీకు ఫటా ఫట్ చెప్పేస్తుంది మనీ9 ఫటా ఫట్ కార్యక్రమం
రెండు రెళ్ళు ఆరు అని ఎవరైనా అంటే వారిని అదోలా చూస్తాము కదూ! కానీ మనీ9 మీకోసం తీసుకువస్తోంది ఈ లెక్క సరైనదే అని మీచేత అనిపించే అద్భుత పెట్టుబడి విశేషాలను. సరైన ఎంపికలో మీ డబ్బును పెట్టుబడి పెడితే స్టాక్స్ దా మ్యూచువల్ ఫండ్స్ నుంచి అది రెండు రెళ్ళు నాలుగు కాకుండా ఆరుగా రాబడి ఇస్తుంది. ఎలా పెట్టుబడి పెడితే మీ సొమ్ము భద్రంగా చేతికి అందే అవకాశం ఉంది అన్ని విషయాలను మీకోసం 'రెండు రెళ్ళు ఆరు' చెబుతుంది.
డబ్బు ఎవరికీ ఊరికే రాదు కదా.. రూపాయి రూపాయి కష్టపడి సంపాదించి దానిని భవిష్యత్ అవసరాల కోసం ఎవరో చెప్పారని ఎక్కడో పెట్టుబడి పెట్టేస్తే.. తరువాత అక్కడ మీకు నష్టం వస్తే ఆ బాధను తట్టుకోవడం కష్టమే. మీకు ఆ ఇబ్బంది.. బాధ ఉండకూడదంటే మీరు చేస్తున్న పని తప్పో రైటో చెప్పే ఒక అలారం ఉండాలి. మనీ9 ఆ అలారం మీకోసం తీసుకువస్తోంది. డబ్బుకు సంబంధించిన విషయాలపై ఎప్పటికప్పుడు హెచ్చరించి మిమ్మలను మేల్కొలుపుతుంది మనీ9!
మన జీవితంలో పెట్టుబడులు.. ఆర్ధిక అంశాలు ఎప్పుడూ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాయి. కొన్ని పదాల అర్ధాలు తెలియవు. తెలుసనుకుని మనం వేసిన అడుగు మనల్ని ముంచేయడమూ జరగోచ్చు. పోనీ, తెలీని విషయాన్ని తెలుసుకుందామని ఎవరినైనా సలహా అడిగితే వాళ్ళు చెప్పే విషయాలు అర్ధం అయ్యేలోపు మన డబ్బు ఎగిరిపోతుంది. డబ్బు పెట్టుబడి లేదా పొదుపు ఎప్పుడూ అయోమయపరిచే విషయాలే. అందుకే మీకోసం మనీ9 తీసుకువస్తోంది 'తెలుసుకుందాం..రండి!'
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంటే పది రూపాయలు పెట్టి షేర్లు కొనేస్తే వంద రూపాయలు వచ్చేస్తాయని కాదు. పది రూపాయల పెట్టుబడికి వంద రూపాయల రాబడికి మధ్య చాలా లెక్కలు ఉంటాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి రాబడి మధ్య ఉండే నిష్పత్తుల లెక్కల చిక్కుముడులను విప్పి మీ పెట్టుబడి మార్గానికి దారి చూపించే ఫార్ములా గురువు ను తీసుకువస్తోంది మీ మనీ9.
మనకి నిత్యం ఎన్నో కొత్త కొత్త విషయాలు డబ్బుకు సంబంధించి వినిపిస్తూ ఉంటాయి. వాటిని అర్ధం చేసుకోవాలంటే ఒక్కోసారి ఎంతో ఇబ్బంది. కానీ లోతులో ఆ పదాల వెనుక ఉండే సంగతులు మనకు తెలియవు. ఎవరైనా నిపుణులను అడిగినా వారు చెప్పినా మనకు అర్ధం కావు. ఎప్పటికప్పుడు పెట్టుబడుల వార్తలు.. పొదుపు సంగతుల మధ్య వెల్లువెత్తే ఎన్నో విషయాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని మనీ9 మీకోసం తీసుకు వస్తోంది సరికొత్త ''మనీ జ్ఞాన్ షో'' తో.
డబ్బుకు సంబంధించి ప్రతిరోజూ వినవచ్చే వార్తలు.. డబ్బు గురించి మనకు కనిపించని విషయాలు.. డబ్బు విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు.. అలాగే మన ఎకానమీపై ప్రభావం చూపించే ప్రపంచ సంఘటనలు వీటన్నిటి విశ్లేషణాత్మక కథనం ప్రతి రోజు నిపుణులు అందిస్తారు మనీ9 అందిస్తున్న మనీ సెంట్రల్ కార్యక్రమంలో.
ప్రపంచం అంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది. డబ్బు లేనిదే జీవితం లేదనేలా పరిస్థితి ఉంది. నిత్య జీవితంలో డబ్బు చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అదేవిధంగా డబ్బుకు సమబంధించి ఎన్నో వార్తలు ప్రతిరోజూ వినవస్తాయి. వాటిలో చాలా వార్తలు నేరుగా సామాన్యుల జేబుపై ప్రభావం చూపిస్తే.. మరికొన్ని వార్తల ప్రభావం పరోక్షంగా మనపై పడుతుంది. అలాంటి వార్తలు.. వాటి ప్రభావాల గురించి ప్రతి రోజూ మనీ9 మనీటైమ్ లో తెలుసుకోవచ్చు.
పొదుపుగా ఖర్చు చేయడం ఒక కళ. సాధారణంగా మనం ఏదైనా ఖర్చు పెట్టేసిన తరువాత ఇక్కడ కొంత తక్కువ ఖర్చు పెడితే సరిపోయేదేమో అని బాధపడతాం. అటువంటి ఇబ్బంది పడకుండా ముందుగానే ప్లాన్ చేసుకుని ఖర్చు చేస్తే బోలెడు డబ్బు పొడుపు చేయవచ్చు. ఎలా ఖర్చును పొదుపుగా చేయాలి? దీని కోసమే ఈ షో! పొదుపుగా ఖర్చు పెడదాం. ఎక్కడ కొనుగోలు చేస్తే తక్కువ ఖర్చు అవుతుంది.. ఎలా వ్యవహరించడం ద్వారా ఖర్చు అదుపులో ఉంచుకోవచ్చు తెలుసుకుందాం.
పన్ను లేదా టాక్స్.. ఈ మాట వినగానే సామాన్యుడికి భయాందోళనలు మొదలవుతాయి. కానీ టాక్స్ నిజంగా అంత కఠినమైనదా? మీరు మీ పన్నును ఎలా లెక్కించాలి? మీ టాక్స్ ఎలా ఆదాచేసుకోవాలి?ఈ విషయాలను మరింత తెలుసుకోవడానికి ''పట్టింపు వద్దు ఇదిగో టాక్స్ రద్దు'' ప్రత్యేక కార్యక్రమాన్ని చూడండి. ఈ కార్యక్రమంలో, పన్నుకు సంబంధించిన ప్రతి ప్రత్యేక విషయాన్ని.. మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన ప్రతి విషయాన్నీ దీనిద్వారా తెలుసుకోవచ్చు.
ఆస్తులు కొనుగోలు చేయడం.. అమ్ముకోవడం అంత తేలికైన పనికాదు. కుటుంబంలో ఆస్తి పంపకాల లెక్కలూ అంత తేలికగా తేలవు. ఆస్తుల విషయంలో ఎన్నో చిక్కుముడులు ఉంటాయి. ప్రతి చిక్కుముడి చట్టం చట్రంలో ఉంటుంది. ఆస్తుల విషయంలో తలెత్తే సమస్యలు.. వాటికి చట్టం చెప్పే పరిష్కారాలు సులువుగా అర్ధం చేసుకోవడానికి మనీ9 మీకోసం అందిస్తోంది ''రియల్ రియాల్టీ'' షో. ఇందులో ఆస్తులకు సంబంధించి అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది