80% భారతీయులు తమ ఉద్యోగాలు పోతాయనే భయంతోనే జీవిస్తున్నారు: మనీ9 సర్వే
10 భాషల్లో 35 వేలకు పైగా భారతీయ కుటుంబాలపై మనీ9 సర్వే జరిపింది. ఇందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. కుటుంబాల నెలవారీ ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో బీహార్,
10 భాషల్లో 35 వేలకు పైగా భారతీయ కుటుంబాలపై మనీ9 సర్వే జరిపింది. ఇందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. కుటుంబాల నెలవారీ ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో బీహార్, ఒడిశా, జార్ఖండ్, అసోం, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంతోపాటు.. తమ ఉద్యోగాలు కోల్పోతామనే భయం.. ఎక్కుమంది ఉద్యోగుల్లో ఉంది. దేశంలోని 20 రాష్ట్రాల్లోని 115 జిల్లాల్లో భారతీయ కుటుంబాలపై నిర్వహించిన Money9 పర్సనల్ ఫైనాన్స్ సర్వే ప్రకారం,
24 శాతం మంది ఉద్యోగస్తులలో తమ ఉద్యోగాలు పోతాయనే భయం ఎక్కువగా ఉంది. 56 శాతం మంది ఉద్యోగులు తమ జాబ్స్ ను కోల్పోతామని భయపడుతున్నారు. కాకపోతే వీరిలో అంత భయం లేదు. అంటే దేశంలోని 80 శాతం మంది ప్రజలు.. తమ ఉద్యోగాలు పోతాయన్న భయంతోనే బతుకుతున్నారు. కేవలం 20 శాతం మందిలో మాత్రం తమ ఉద్యోగాలు పోతాయన్న భయం కనిపించలేదు.
సర్వే ప్రకారం, ఉద్యోగం పోతుందనే భయంతో ఉన్నవారిలో 24 శాతం మంది.. తమ వద్ద తగినంత పొదుపు ఉందని, ఉద్యోగం కోల్పోతే 6 నెలలు జీవించవచ్చని చెప్పారు. అదేవిధంగా, 56 శాతం మంది… అంటే ఉద్యోగం పోతుందన్న టెన్షన్ ఎక్కువగా లేనివారు.. ఒకవేళ తమ జాబ్ ని కోల్పోయినా 2-3 నెలలు జీవించగలమని తెలిపారు.
Money9 సర్వే ప్రకారం.. చాలా భారతీయ కుటుంబాలు ఆర్థికంగా సురక్షితంగా లేవని, కేవలం 6 శాతం కుటుంబాలు మాత్రమే ఆర్థికంగా పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని తేలింది. , దాదాపు 20 శాతం కుటుంబాలు తక్కువ భద్రతతో ఉన్నాయని స్పష్టమైంది. 36 శాతం కుటుంబాలు ఆర్థికంగా అభద్రతతో ఉన్నాయని, 38 శాతం కుటుంబాలు సంక్షోభంలో ఉన్నాయని తేలింది. 7 శాతం భారతీయ కుటుంబాలు తమ నెలవారీ ఆదాయంతో నెలవారీ ఖర్చులను భరించలేమని కూడా సర్వే డేటా చూపిస్తోంది.
10 భాషల్లో 35 వేలకు పైగా భారతీయ కుటుంబాలపై జరిపిన ఈ సర్వేలో.. బీహార్, ఒడిశా, జార్ఖండ్, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు.. భారతీయ కుటుంబాల నెలవారీ ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలు అని తేలింది. సర్వే ప్రకారం, భారతదేశంలోని 39 శాతం కుటుంబాలు నెలవారీ ఆదాయం రూ.15 వేల కంటే తక్కువ.
Published: December 26, 2023, 18:11 IST
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.