50:30:20 పర్సనల్ ఫైనాన్స్ నియమంతో జీతం ఆదా !

అమన్ లాగా, మీరు కూడా పొదుపు లేదా పెట్టుబడి కోసం, అధిక జీతం అవసరం లేదు, కానీ ప్రతి నెలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే, అది దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో పెరుగుతుంది

అమన్ ఈ-కామర్స్ యాప్‌లో షాపింగ్ చేస్తున్నారు. తాను స్మార్ట్ వాచ్ ను ఆర్డర్ చేశానని తన స్నేహితుడు రవికి చెప్పాడు. రవి అతనితో ఏం చెప్పాడంటే ” ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూనే ఉంటావని…ఎంత షాపింగ్ చేశావు అని అడుగుతాడు?” అమన్ చిరునవ్వుతో “మరీ ఎక్కువగా చేయలేదని.. ఎప్పుడో ఒకసారి మాత్రమే షాపింగ్ చేస్తానన్నాడు”. దీంతో రవి షాకయ్యాడు. ఏంటీ.. “ఒకసారా? కేవలం రెండు రోజుల క్రితం ఫోన్, ఇంకా కొన్ని దుస్తులను ఆర్డర్ చేశావు… ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్. అసలు ఎప్పుడైనా డబ్బు ఆదా చేశావా.. లేదా షాపింగ్ కోసం ఖర్చు చేశావా అని అమన్‌ని అడిగాడు. దీనికి అమన్ ఏం చెప్పాడంటే.. జీతం చాలా తక్కువ… మరీ చిన్నమొత్తం పొదుపు చేస్తే ఏం తేడా వస్తుంది… భవిష్యత్తులో జీతం పెరిగినప్పుడు పొదుపు గురించి ఆలోచిస్తానని చెప్పాడు. అందుకే ఇప్పుడు తనకోసం తాను షాపింగ్ చేసుకొంటానన్నాడు.

అమన్ నెల జీతం గురించి రవి ఆరా తీశాడు. తన శాలరీ 30,000 రూపాయలు” అని అమన్ చెప్పాడు. దీనిపై రవి అడిగాడు: అన్ని ఖర్చులు తీసివేసిన తర్వాత, ఎంత ఆదా చేస్తావన్నాడు. షాపింగ్, విహారయాత్రల కోసం ఎంత ఖర్చు చేస్తావని అడిగాడు. దీనికి అమన్.. దాదాపు 8000 నుంచి 9,000 రూపాయలు ఖర్చు చేస్తానని చెప్పాడు. 8 నుంచి 9 వేల రూపాయలు మిగిలి ఉన్నప్పుడు, దాంతో ఎందుకు ఆదా చేయలేదని అడుగుతాడు. దీంతో ఇంత తక్కువ మొత్తంతో ఎలా పొదుపు చేయగలను.. మరి ఇంత చిన్న మొత్తంతో ఏం తేడా వస్తుంది? అని అమన్ తిరిగి ప్రశ్నిస్తాడు.

24-25 ఏళ్ల వయసున్న అమన్ లాంటి చాలా మంది యువకులు… రూ. 25-30 వేల జీతంతో కెరీర్ ను ప్రారంభిస్తారు. ఇంత తక్కువ జీతంతో ఏం పొదుపు చేస్తామని అనుకుంటారు. జీతం పెరిగినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. కానీ జీతం పెరిగిన వెంటనే…ఖర్చులు కూడా పెరుగుతాయి…తర్వాత వారు తమ జీతం తక్కువగా ఉందని భావిస్తారు. దీనివల్ల దీర్ఘకాలంలో పొదుపు చేయడం కష్టమవుతుంది… అది కూడా మీరు యంగ్ స్టర్ అయినా.. లేదా ఓ మోస్తరుగా సంపాదించేవారైనా సరే. ఇప్పుడు ప్రతీ ఒక్కరికీ పొదుపు ముఖ్యం. 50:30:20 పర్సనల్ ఫైనాన్స్ నియమం.. ఈ విషయంలో మీకు హెల్ప్ చేస్తుంది. ఈ రూల్ ఏంటా అని ఆలోచిస్తున్నారా? దీనిని ఎలా ఫాలో అవ్వాలా అని చూస్తున్నారు? దానికి ఈ వీడియోలో మీకు సమాధానం లభిస్తుంది.

 

50:30:20 నియమం, నెలవారీ బడ్జెట్ నిర్వహణతో పాటు, సాధారణ పొదుపును అలవాటు చేస్తుంది. ఈ నియమం ప్రకారం, మీ జీతంలో 50% అద్దె, యుటిలిటీ బిల్లులు, కిరాణా సామాగ్రి , EMIల వంటి ముఖ్యమైన ఖర్చులను కవర్ చేయాలి. 30% lifestyle సంబంధించిన ఖర్చులకు, మిగిలిన 20% ఆదా చేయాలి. మీరు 20% కంటే ఎక్కువ ఆదా చేసుకోగలిగితే, మీరు మీ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేసుకుంటారు.

ఇప్పుడు అమన్ గురించి మాట్లాడుకుందాం… అమన్ టేక్ హోమ్ జీతం నెలకు 30 వేలు… అవసరమైన ఇతర ఖర్చులు అన్ని తీసిన తరువాత 8-9 వేలు పొదుపు చేస్తాడు.. అంటే ఆఖరికి అమన్ దగ్గర దాదాపు 30 శాతం ఉంది. ప్రతినెలా జీతం ఆదా అవుతుంది… అయితే, సమస్య ఏమిటంటే అతను తరచుగా ఈ సేవ్ చేసిన మొత్తాన్ని అనవసరంగా ఖర్చు చేస్తాడు, ఇది ముఖ్యమైన ఆర్థిక పొరపాటు, దాన్ని సరిదిద్దుకోవాలి..అమన్ ఎలా పొదుపు చేయాలి…సంపాదించిది ఎలా కాపాడుకోవాలి… నిపుణుల నుంచి మనం అర్థం చేసుకుందాం…

ప్రశ్న-1)- తన ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు, ఒక యువకుడు ముందుగా బీమా తీసుకోవాలా లేక పొదుపు చేసి పెట్టుబడి పెట్టాలా? భీమా కోసం అతను చెల్లించాల్సిన జీతంలో కనీస శాతం ఎంత?

మీకు, మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కోసం టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం…ఆరోగ్య బీమా మిమ్మల్ని ఆకస్మిక వైద్య ఖర్చుల నుంచి కాపాడుతుంది, అయితే టర్మ్ ఇన్సూరెన్స్ మీరు లేనప్పుడు మీ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది…అమన్ వంటి యువకులతో ప్రయోజనం ఏమీటి అంటే, చిన్న వయసులో బీమాను కొనుగోలు చేసినప్పుడు తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవర్‌ను పొందవచ్చన్నమాట.

పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్ పర్ట్స్ ప్రకారం, టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ మీ ఆదాయం కంటే కనీసం 10 నుంచి 15 రెట్లు ఉండాలి… అమన్ వార్షిక వేతనం దాదాపు రూ.4 లక్షలు.. అంటే మొదట్లో రూ.40 నుంచి 60 లక్షల బీమా కవరేజీ తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు, మీరు మీ నెలవారీ ఖర్చులు, దాని భవిష్యత్తు ఖర్చులు, ఆర్థిక బాధ్యతలు, భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలు, వయస్సును పరిగణనలోకి తీసుకోవాలి…తర్వాత ఇల్లు కొనడం, వివాహం, పిల్లల చదువు మొదలైన డబ్బు సంబంధించిన బాధ్యతలు పెరుగుతాయి. దీంతో టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని కూడా పెంచాల్సి ఉంటుంది.

ఒకవేళ అమన్ 24 సంవత్సరాల వయస్సులో 65 సంవత్సరాల వయస్సు వరకు రూ. 1 కోటి టర్మ్ కవర్‌ను ఎంచుకుంటే… పాలసీబజార్.కామ్ ప్రకారం, రూ. 1 కోటి కవరేజీకి ప్రీమియం నెలకు రూ. 800 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది. .

అదే సమయంలో, ఆరోగ్య బీమాలో భవిష్యత్తులో చికిత్సకు అయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం… ఈరోజు చికిత్సకు రూ. 5 లక్షలు అవసరం… 13-14 శాతం వైద్య ద్రవ్యోల్బణం కారణంగా, 18-20 సంవత్సరాల తర్వాత దాని ఖర్చు రూ. 50 లక్షలకు మించి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఏ వ్యక్తి అయినా రూ. 10 లక్షల ఆరోగ్య కవరేజీని తీసుకుంటే , అప్పుడు policybazaar.com ప్రకారం, అతని ప్రీమియం రూ. 700 నుంచి రూ. 1200 మధ్య ఉంటుంది… వివిధ బీమా కంపెనీల ప్రీమియంలు వేర్వేరుగా ఉంటాయి.

బీమా తీసుకున్న తర్వాత అమన్ ఎంత డబ్బు ఆదా చేస్తున్నాడో ఇప్పుడు మనం లెక్కిద్దాం. అమన్ జీతం నుంచి ప్రతి నెలా దాదాపు 9 వేల రూపాయలు ఆదా అవుతాయి. ఇప్పుడు అమన్ ఆరోగ్య, టర్మ్ ఇన్సూరెన్స్‌ను మంచి కవర్‌తో కొనుగోలు చేస్తే, ప్రీమియం కోసం ప్రతి నెలా దాదాపు రూ. 2500 ఖర్చు చేస్తాడు. ఈ అవసరమైన ఖర్చు తర్వాత, అమన్‌కు రూ. 6500 మిగిలి ఉంది… ఇది అతని జీతంలో 20 శాతం కంటే కొంచెం ఎక్కువ. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అమన్ మొదట ఎమర్జెన్సీ ఫండ్‌ని సృష్టించి, ఆ తర్వాత పెట్టుబడి పెట్టాలా లేదా ఎమర్జెన్సీ ఫండ్ , ఇన్వెస్ట్‌మెంట్ రెండింటినీ ఒకేసారి ప్రారంభించవచ్చా?

మీరు ఇన్వెస్ట్‌మెంట్ , ఎమర్జెన్సీ ఫండ్‌ల మధ్య బ్యాలెన్స్ ని కొనసాగించగలిగితే, అది మంచిది, కానీ మీరు రెండింటినీ ఒకేసారి చేయడంలో ఇబ్బంది పడుతుంటే, అత్యవసర నిధికి ప్రాధాన్యత ఇవ్వండి. ఉద్యోగం కోల్పోవడం, మీ కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం ఆసుపత్రి బిల్లుల చెల్లింపు వంటి కష్ట సమయాల్లో ఆర్థిక అవసరాలను కవర్ చేయడానికి అత్యవసర నిధి సహాయపడుతుంది. అత్యవసర ఫండ్ లో కనీసం 6 నెలల అవసరమైన ఖర్చులకు సమానమైన డబ్బు ఉండాలి. మీరు అత్యవసర ఫండ్ ని నిర్ణయించే ముందు, మీకు అవసరమైన ఖర్చులను లెక్కించండి. అమన్ జీతం రూ.30 వేల రూపాయల జీతం నుంచి రూ. 17 వేలు అవసరమైన ఖర్చులు అని అనుకుందాం, అప్పుడు అతని అత్యవసర ఫండ్ కనీసం రూ. 1 లక్ష రూపాయలు (17,000*6) ఉండాలి. ఈ మొత్తం ఎల్లప్పుడూ అతని వద్ద అందుబాటులో ఉండాలి. మీరు మీ అత్యవసరఫండ్ ని పొదుపు ఖాతాలో ఉంచుకోవచ్చు, తద్వారా అవసరమైనప్పుడు మీరు వెంటనే డబ్బును పొందవచ్చు.

ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, మీరు అత్యవసరఫండ్ ని సిద్ధం చేసుకున్న తర్వాత, మీరు పెట్టుబడికి సిద్ధంగా ఉన్నారా?… అయితే ఈ పెట్టుబడిని ఎలా ప్లాన్ చేయాలి? దీన్ని ఎక్కడ ప్రారంభించాలి?

అమన్ సంపాదిస్తున్నాడు అలాగే ఖర్చు చేస్తున్నాడు…కానీ ఈ సంపాదన, ఖర్చులో అతనికి పొదుపు, పెట్టుబడి కూడా ముఖ్యం.ప్రతి నెల పొదుపు కోసం అమన్ ఈ క్రింది విధంగా ప్లాన్ కలిగి ఉండాలి.

– ముందుగా, అతను జీవిత బీమాను కొనుగోలు చేయాలి.
– దీని తర్వాత అతను తగిన కవరేజీతో ఆరోగ్య బీమా పొందాలి.
– మూడవదిగా, అతను కష్ట సమయాల్లో అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి, అతను వెంటనే డబ్బును పొందే విధంగా ఉండాలి.
– నాల్గవది, అతను తన ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించుకోవడం ద్వారా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి.
అతను తన ఎమర్జెన్సీ ఫండ్ , ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను సంవత్సరానికి ఒకసారి సమీక్షించాలి, తద్వారా ఏవైనా లోటుపాట్లను పరిష్కరించవచ్చు…

అమన్ లాగా, మీరు కూడా పొదుపు లేదా పెట్టుబడి కోసం, అధిక జీతం అవసరం లేదు, కానీ ప్రతి నెలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే, అది దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో పెరుగుతుంది ….సరైన ఆర్థిక ప్రణాళిక మీ జీవితాంతం డబ్బు ఒత్తిడిని దూరం చేస్తుంది. మీరు వ్యక్తిగత ఫైనాన్స్‌లో అప్‌డేట్‌గా ఉండాలనుకుంటే, సరైన ఆర్థిక ప్రణాళిక ద్వారా మీ భవిష్యత్తును మెరుగుపరచుకోవాలనుకుంటే, Money9 సూపర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.అన్ని వ్యక్తిగత ఫైనాన్స్ చిట్కాలు , ట్రిక్‌లను పొందండి.

Published: May 15, 2024, 18:24 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.