మిహిర్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆఫీసుకు వెళ్లి 3BHK ఫ్లాట్ కొనాలనుకున్నాడు. ఏజెంట్ అతనికి అన్ని సౌకర్యాలతో కూడిన ఫ్లాట్ ను చూపించాడు. మిహిర్ కు ఆ ఫ్లాట్ ఓకే. అయితే బిల్డర్‌కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. డెవలపర్ దాని కోసం దరఖాస్తు చేసుకున్నారని… అది కొన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తుందని ఏజెంట్ చెప్పారు. OC ఇంకా ఆమోదం పొందనందున ఫ్లాట్ చౌకగా ఉందని ఆయన తెలిపారు. OC ఆమోదం పొందిన వెంటనే ధర 4-5 లక్షల వరకు పెరుగుతుంది. ఒప్పందం ఆకర్షణీయంగా ఉన్నందున ఇప్పుడే కొనుగోలు చేయాలని మిహిర్‌ను కోరారు.
మిహిర్ అయోమయంగా చూశాడు.
మిహిర్ లాగా, మీరు కూడా OC లేని ఫ్లాట్ కొనాలని ఆలోచిస్తున్నారా? అప్పుడు వేచి ఉండండి. ఈ విషయాలు తెలుసుకోండి తద్వారా, మిహిర్ లాగా, మీరు చౌకగా ఉన్నట్లు చెప్పుకునే ప్లాన్ లో చిక్కుకోరు.
మనం ఫ్లాట్ కొన్నప్పుడల్లా ఒక పదం వింటాము.
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్. మీ కలల ఇంటికి ఈ పదం ఎంతో అవసరం. మీరు దానిని నిర్లక్ష్యం చేసినట్లయితే, అది ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. దీని గురించి తెలుసుకుందాం…
డెవలపర్లు ఎప్పుడు భవనాన్ని నిర్మించినా, వారు వివిధ నిబంధనలకు లోబడి ఉండాలి…
నిర్మాణ ఉప-చట్టాలు, బిల్డింగ్ ప్లాన్లు, మాస్టర్ ప్లాన్లు, ఫైర్ అండ్ సేఫ్టీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్లు, మైనింగ్ నుండి అనుమతులు, విమానాశ్రయ అధికారుల అనుమతులు.. మరియు పర్యావరణ అనుమతులు మొదలైనవి
ఇందులో అనేక విభిన్న ప్రణాళికలు మరియు ఆమోదాలు ఉన్నాయి.
మునిసిపల్ కార్పొరేషన్లు మరియు డెవలప్మెంట్ అథారిటీల వంటి స్థానిక పట్టణ సంస్థలు, ఈ ప్లాన్లను ఆమోదించి, భవనాన్ని నిర్మించడానికి డెవలపర్‌కు అనుమతి ఇస్తాయి…
భవనం నిర్మాణమయ్యాక, పూర్తిగా సిద్ధమైన తర్వాత, భవనం నిర్మాణ ఉప-చట్టాలు మరియు లేఅవుట్‌తో ఆ నిర్మాణం సరిపోతుందా లేదా అని అథారిటీ తనిఖీ చేస్తుంది…
నిబంధనలను అనుసరించినట్లయితే, డెవలపర్‌కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC)ని జారీ చేస్తుంది…
OC, లేదా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్… భవన నిర్మాణం నిబంధనలకు కట్టుబడి ఉందని సూచిస్తుంది. అవసరమైన అన్ని ఆమోదాలు పొందారు మరియు భవనం ఆక్యుపెన్సీకి సిద్ధంగా ఉంది అని అర్థం. అంటే, మీరు అందులో నివసించవచ్చు…
ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC) లేకుండా సిద్ధంగా ఉన్న ఫ్లాట్లను కొనుగోలు చేయడం మానుకోండి… నిర్మాణ సమయంలో నిర్మాణ నిబంధనలను పాటించకపోవడం వల్ల స్థానిక అధికార యంత్రాంగం OCని నిలిపివేసే అవకాశం ఉంది…
అటువంటి సందర్భాలలో, ఏదైనా ప్రమాదం జరిగితే, బాధ్యత అధికారులపై ఉండదు. ఇంటి కొనుగోలుదారుపై ఉంటుంది.
అధికారులు OCని జారీ చేయనందున, భవనం ఆక్యుపెన్సీకి సరిపోతుందని అది ధృవీకరించలేదు…
అధికారులు.. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసే వరకు… ఆస్తి టైటిల్ లేదా యాజమాన్య హక్కులు కూడా మీకు బదిలీ అవ్వవు. నోయిడా, గ్రేటర్ నోయిడా మరియు అనేక ఇతర ప్రదేశాలలో, డెవలపర్లకు దీని గురించి తెలుసు.
పొసెషన్ ఫర్ ఫిట్ అవుట్ గుంచి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఫ్లాట్‌లో ఇంటీరియర్ వర్క్ పూర్తయిందని చెబుతారు. అది నివసించడానికి వీలుగా ఉందని అంటారు. కానీ చాలామందికి దీనిపై అవగాహన లేకపోవడం వల్ల, అందులో నివసించడానికి సిద్ధపడతారు.
దీనివల్ల బిల్డర్ పూర్తి డబ్బును తీసుకుంటాడు. అయినప్ా సరే ఆ భవనం యాజమాన్య హక్కులు మీకు బదిలీ అవ్వవు.
ఫ్లాట్‌కు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎంత కీలకమో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. మిహిర్ లాగా, మీకు చౌకైన ఇంటిపై మంచి డీల్ ఆఫర్ చేస్తే, దానికి దూరంగా ఉండటం మంచిది. సరైన సమాచారం లేక, మీరు ఓసీ లేకుండా ఫ్లాట్ కొనుగోలు చేసినట్లయితే… బిల్డర్ లేదా ఎవరి నుంచైనా కొంటే దీని కొని అందులో ఉన్నట్టయితే.. ఏమి జరుగుతుంది? మీరు మీ ఇంటిని వదిలి వెళ్ళవలసి ఉంటుందా? దీనికి సంబంధించి నిపుణులు ప్రదీప్ మిశ్రా, ఫౌండర్, హోమెంట్స్ ఏమంటారో చూద్దాం.
OC లేకుండా ఫ్లాట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. అది.. భద్రత మరియు టైటిల్ సమస్యలకు దారి తీస్తుంది.
ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేని ఫ్లాట్ల కోసం మీరు రెడీ అయితే.. మీకు రుణం పొందడం కష్టం కావచ్చు. మీరు రుణం పొందగలిగితే, వడ్డీ రేటు ఎక్కువగా ఉండవచ్చు లేదా రిజిస్ట్రీ పూర్తయ్యే వరకు మీరు ప్రీ-ఈఎంఐ చెల్లించాల్సి రావచ్చు. మీరు భవిష్యత్తులో అలాంటి ఆస్తిని విక్రయించాలని నిర్ణయించుకుంటే, మీకు ఇబ్బందులు ఎదురవ్వచ్చు. మీరు ఫ్లాట్‌కు సరైన ధరను పొందలేకపోవచ్చు. కొనుగోలుదారుని వెదకడం కూడా సవాలుగా మారవచ్చు.
మీరు మీ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇంటిని కొనుగోలు చేస్తారు, అందుకే దీనిని ‘డ్రీమ్ హోమ్’ అని పిలుస్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా ఫ్లాట్‌ను కొనుగోలు చేయడం వల్ల మీ కలల ఇల్లు, మీ ఆర్థిక పరిస్థితులు మరియు మీ భద్రతపై ప్రభావం చూపుతుంది. మీరు బిల్డర్ లేదా విక్రేత నుండి సిద్ధంగా ఉన్న ఫ్లాట్‌ని కొనుగోలు చేసినా, కచ్చితంగా OC కోసం తనిఖీ చేయండి… నిర్మాణంలో ఉన్న ఆస్తుల విషయంలో, లేఅవుట్ ప్లాన్, బిల్డింగ్ ప్లాన్ మరియు రెరా రిజిస్ట్రేషన్ వంటి వాటిని తనిఖీ చేయండి… మీకు చిన్న సందేహం ఉన్నా, ప్రాజెక్ట్ , డెవలపర్ గురించి డెవలప్మెంట్ అథారిటీని అడగండి… తద్వారా మీ డబ్బు , మీరు సురక్షితంగా ఉంటారు. మీరు నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ని కొనుగోలు చేసినట్లయితే, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకోకండి…
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.