దీపక్కి బ్రోకర్ నుండి కాల్ వచ్చింది – హలో సార్… మీరు NCRలో ఆస్తిని చూస్తున్నారా?… దీపక్ – అవును నేను చూస్తున్నాను … బ్రోకర్- సార్, నోయిడా సెక్టార్ 150లో ప్రాపర్టీ ఉంది…దీనికి 1000 చదరపు అడుగుల బిల్డర్ ఫ్లోర్ ఉంది…ధర రూ.55 లక్షలు. దీపక్- బిల్డర్ ఫ్లోర్ వద్దు… బ్రోకర్- సార్ ఇది మంచి డీల్… డిస్కౌంట్ కూడా ఉంది. మీరు ఒకసారి చూడండి. దీపక్- బిల్డర్ ఫ్లోర్ వద్దు… నాకు సొసైటీ ఫ్లాట్ కావాలి అని దీపక్ అడిగాడు. బ్రోకర్- సార్ ఒక్కసారి చూడండి… మీ మనసు మారుతుంది… మీకు మంచి డిస్కౌంట్ కూడా ఇస్తాను… దీపక్ కోపంగా – హే బ్రదర్, నాకు డిస్కౌంట్ వద్దు, బిల్డర్ ఫ్లోరూ వద్దు అని తెగేసి చెప్పాడు దీపక్. బ్రోకర్- సార్, మీరు బిల్డర్ ఫ్లోర్ తో సమస్య ఏమిటో నాకు చెప్పండి, దానిని నేను పరిష్కరిస్తాను. దీపక్- హేయ్ బిల్డర్ ఫ్లోర్ గురించి నాకు చెప్పకు… దానికి సంబంధించిన అన్ని విషయాలూ నాకు తెలుసు అని దీపక్ అన్నాడు.
దీపక్ ఇల్లు కొనాలనుకుంటున్నాడు కానీ బిల్డర్ ఫ్లోర్ ను వద్దనుకుంటున్నాడు…ఎందుకు? బడ్జెట్లో గృహాలను కొనుగోలు చేసేవారికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది మంచి పేరున్న సొసైటీలో ఫ్లాట్, రెండవది బిల్డర్ ఫ్లోర్… బిల్డర్ ఫ్లోర్ అనేది మూడు లేదా నాలుగు అంతస్తులు కలిగిన తక్కువ-స్థాయి బిల్డింగ్ లో ఓ భాగం. ..ప్రతి అంతస్తులో ఒకటి లేదా కొన్నిసార్లు రెండు రెసిడెన్షియల్ యూనిట్లు ఉంటాయి. అయితే, హైరైజ్ సొసైటీలో చాలా టవర్లు ఉంటాయి. ఒక టవర్‌లో చాలా అంతస్తులు.. ఒక అంతస్తులో 7-8 ఫ్లాట్లు ఉండవచ్చు. హైరైజ్ సొసైటీలో ఫ్లాట్లు.. లేదా బిల్డర్ ఫ్లోర్ ఉండవచ్చు. మరి ఈరెండింటిలో ఎవరికి ఏది సరైనది? వీటికి సంబంధించి మనం కొన్ని ముఖ్యమైన అంశాల అర్థం చేసుకుందాం. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
బిల్డర్ ఫ్లోర్ విషయంలో, సాధారణంగా మీకు మొత్తం ఫ్లోర్ వస్తుంది. ఇలా పూర్తి ఫ్లోర్ ఉండడం.. దీనిని కొనేవారికి మరింత స్వేచ్ఛను, ప్రైవసీని ఇస్తుంది. కొనుగోలుదారుకు స్థలాన్ని ఉపయోగించుకునే… తన ఇష్టానుసారం నిర్మించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఫ్లాట్లను కాని పోల్చి చూస్తే.. బహుళ అంతస్థుల భవనాల్లోని బిల్డర్ ఫ్లోర్లో ఎక్కువ వినియోగ స్థలం పొందచ్చు. కానీ కామన్ స్పే్స్ తక్కువ. హైరైజ్ సొసైటీలో ఫ్లాట్‌లో ఎలాంటి నిర్మాణాలు చేసినా సొసైటీ లేదా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ నుండి అనుమతి తప్పనిసరి. అలాగే బిల్డింగ్ బయటి నిర్మాణంలో ఎలాంటి మార్పులూ మీరు చేయలేరు.
సౌకర్యాల పరంగా చూస్తే, హైరైజ్ సొసైటీలోని ఫ్లాట్లు బిల్డర్ ఫ్లోర్స్ కన్నా అవుట్ షైన్ తో ఉంటాయి. ఢిల్లీ-ముంబైతో సహా అన్ని పెద్ద నగరాల్లోని ప్రధాన రెసిడెన్షియల్ సొసైటీల్లో.. లిఫ్ట్, జిమ్, స్విమ్మింగ్ పూల్, కమ్యూనిటీ హాల్, క్లబ్ హౌస్, మార్కెట్, పార్క్, గార్డెన్ ఉంటాయి. సాధారణంగా బిల్డర్ సొసైటీలో ఈ సౌకర్యాలు ఉండవు.
బిల్డర్ ఫ్లోర్ ధరలు సాధారణంగా బహుళ-అంతస్తుల అపార్ట్మెంట్ల కంటే తక్కువగా ఉంటాయి… అయితే, ఈ ధరలు ఎక్కువగా లొకేషన్‌పై ఆధారపడి ఉంటాయి… శివారు ప్రాంతాల్లో ఉన్న హైరైజ్ సొసైటీలలోని ఫ్లాట్ల కంటే ప్రైమ్ లొకేషన్లలో బిల్డర్ ఫ్లోర్ల ధర ఒక్కోసారి ఎక్కువుగా ఉండొచ్చు.
ధర గురించి తెలుసుకోవడానికి.. మేము ప్రాపర్టీ పోర్టల్ Housing.com సహాయం తీసుకున్నాం. దీని ప్రకారం, సెక్టార్-62, నోయిడాలోని 2BHK బిల్డర్ ఫ్లోర్ ధర రూ. 30 లక్షల నుండి రూ. 45 లక్షల మధ్య ఉంది. అదే సమయంలో, అదే సెక్టార్‌కు చెందిన రెసిడెన్షియల్ సొసైటీ అయిన గెయిల్ అపార్ట్మెంట్లోని 2బిహెచ్కె ఫ్లాట్ రీసేల్ ధర రూ.75 లక్షలు, పూర్వాంచల్ భాగీరథి అపార్ట్మెంట్లోని 2బిహెచ్కె ఫ్లాట్ రూ.70 లక్షలు. ఈ రెండు సందర్భాల్లోనూ, బిల్డర్ ఫ్లోర్ – సొసైటీ ఫ్లాట్ ధరలు ప్రాంతాన్ని బట్టి భిన్నంగా ఉన్నాయి. బిల్డర్ ఫ్లాట ల కంటే రెసిడెన్షియల్ సొసైటీ ఫ్లాట్ల ధర ఎందుకు ఎక్కువగా ఉంది. నిపుణుల నుంచి దీనికి సమాధానం తెలుసుకుందాం.
ప్రశ్న-1) సొసైటీ ఫ్లాట్‌తో పోలిస్తే బిల్డర్ ఫ్లోర్ ధరను ఎంత శాతం తగ్గించవచ్చు? దీనికి కారణం ఏమిటి?
భద్రత విషయానికొస్తే, హైరైజ్ రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ చాలా ఎక్కువ. ఇక్కడ అనేక స్థాయిల్లో భద్రత ఉంటుంది. మెయిన్ గేట్‌ను సెక్యూరిటీ గార్డులు CCTV ద్వారా మానిటర్ చేస్తారు. ఒక్కో టవర్ కు సెక్యూరిటీ గార్డ్స్, సీసీ టీవీలు ప్రత్యేకంగా ఉంటాయి. కామన్ ఏరియాస్, జిమ్ ఇలా అన్నింటిలోనూ సెపరేట్ గా సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. క్లబ్ హౌస్ కోసం ప్రత్యేక సెక్యూరిటీ గార్డులు, CCTV ఏర్పాట్లు ఉన్నాయి. బిల్డర్ ఫ్లోర్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఉండవు. కొనుగోలుదారులు కోరుకుంటే, భవనానికి గార్డులను, CCTVలను ఏర్పాటు చేసుకోవచ్చు.
బిల్డర్ ఫ్లోర్లలో నిర్మాణ నాణ్యత సరిగా ఉండకపోవచ్చు. వాస్తవానికి చాలా సందర్భాలలో ప్రాపర్టీ ఓనర్లు తమ ప్రాపర్టీని స్థానిక బిల్డర్‌కి ఫ్లోర్ చేయడానికి ఇస్తారు. వీటిని నిర్మించిన తర్వాత బిల్డర్ ఫ్లోర్లన్నీ.. దాని ఓనర్ తో పాటు బిల్డర్ పంచుకుంటారు. బిల్డర్ తన వాటాలో ఫ్లోర్ ను అమ్ముకోవడం ద్వారా నిర్మాణ వ్యయంతో పాటు లాభాన్ని తీసుకుంటారు. అటువంటి పరిస్థితిలో, బిల్డర్ ఎలాంటి నిర్మాణ సామగ్రిని ఉపయోగించారో తెలుసుకోవడం చాలా కష్టం.
అదే సమయంలో, హై-రైజ్ సొసైటీ విషయంలో, ప్రఖ్యాత బిల్డర్లు నిర్మాణ నాణ్యత విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకంటే వారు స్థానిక అధికారుల నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందవలసి ఉంటుంది. అన్ని నియమాలను పాటించినప్పుడు మాత్రమే అధికారులు ఈ సర్టిఫికేట్ ను ఇస్తారు. భవనాన్ని నిర్మాణంలో నాణ్యత లేని మెటీరియల్‌ని ఉపయోగించడం కూడా డెవలపర్ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.
ప్రశ్న-2)- బిల్డర్ ఫ్లోర్, హైరైజ్ సొసైటీలో ఫ్లాట్ కొనడానికి ముందు ఏ విషయాలు చెక్ చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బిల్డర్ ఫ్లోర్లో ప్రతినెలా మెయింటెనెన్స్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ మెయింటెనెన్స్ బాధ్యత కొనుగోలుదారుడిదే. బిల్డింగ్ మొత్తం రిపేర్ చేయాలంటే.. ఫ్లోర్ ఓనర్స్ అందరూ కలిసి దానికి అవసరమైన డబ్బును సమకూరుస్తారు. ఎవరికైనా తమ బిల్డర్ ఫ్లోర్లో ఏదైనా సమస్య ఉన్నా.. లోపం ఉన్నా, వారు దానిని స్వయంగా రిపేర్ చేయించుకోవాల్సిందే. అయితే హైరైజ్ రెసిడెన్షియల్ సొసైటీలో, ఫ్లాట్ కొనుగోలుదారు నిర్వహణ ఛార్జీలను చెల్లించాలి. ప్రతి నెలా బిల్డర్ లేదా అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్‌కు… ఫ్లాట్లు, టవర్లు, కామన్ ఏరియా నిర్వహణకు ఇది ఉపయోగపడుతుంది. దీని కోసం ప్లంబర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్లతో కూడిన పూర్తి మెయింటినెన్స్ టీమ్ ఉంటుంది. మీ ఫ్లాట్ కు మీరు మెయింటెనెన్స్ చేయించినా, చేయించకపోయినా, మీరు ఛార్జీలను చెల్లించాలి.
దీపక్ లాగా, మీకు కూడా బిల్డర్ ఫ్లోర్ ప్రయోజనాలు, సమస్యల గురించి తెలిసి ఉండాలి. బిల్డర్ ఫ్లోర్ లేదా సొసైటీ ఫ్లాట్.. వీటిలో ఏది కొనాలి అనేది ఆర్థికపరిస్థితిపై ఆధారపడి ఉంటుంది, అంటే మీరు ఇల్లు కొనడానికి ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారు.. మీరు ఎలాంటి జీవనశైలిని కోరుకుంటున్నారు…అన్నదానిపై క్లారిటీ ఉండాలి. మీరు బిల్డర్ ఫ్లోర్ లేదా ఫ్లాట్ … వీటిలో ఏది కొనాలనుకుంటే దానికి సంబంధించిన టైటిల్ డీడ్.. అంటే రిజిస్ట్రార్ ఆఫీస్ లోని రిజిస్ట్రీ లేదా లోకల్ అథారిటీలో చెక్ చేసుకోవాలి. బిల్డర్ గత ప్రాజెక్ట్‌లు, అతని క్రెడిబులిటీని చెక్ చేయాలి… నిర్మాణ నాణ్యతను స్ట్రక్చరల్ ఇంజనీర్ ద్వారా తనిఖీ చేయించాలి. అలాగే ఆస్తిపై ఏమైనాఅవుట్ స్టాండింగ్ లోన్లు, బిల్స్ లాంటివి ఉన్నాయో చూడాలి.
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.