FY24 మూడవ త్రైమాసికం భారతీయ సంస్థలకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. నిపుణులు చెప్పినదానిని బట్టి చూస్తే.. కంపెనీ లాభాల వృద్ధి 10% కంటే ఎక్కువగా ఉంది. అయితే ఆదాయాలు 10% కంటే తక్కువ పెరిగాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే.. నిఫ్టీ ఎలా పనిచేసింది? ఏ సెక్టార్ బాగా పనిచేసింది, ఏ రంగం పనితీరు నిరాశపరిచింది? త్రైమాసిక ఫలితాల ప్రకారం చూస్తే.. మీరు ఇప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టవచ్చో చూద్దాం.
బ్రోకరేజ్ హౌస్ మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం, డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ కంపెనీల లాభం 17% వార్షిక వృద్ధిని సాధించాయి. అంచనా వేసింది 11% కు మించి రిజల్ట్ వచ్చింది. టాటా మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, జెఎస్డబ్ల్యు స్టీల్..ఈ ఐదు కంపెనీలు మాత్రమే 56% వృద్ధిని కనబరిచాయి. FY24 మొదటి 9 నెలల్లో, ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు, నిఫ్టీ-50 కంపెనీల లాభం 26% పెరిగింది.
త్రైమాసిక ఫలితాల తర్వాత బ్రోకింగ్ హౌస్ ద్వారా ఏదైనా అప్‌గ్రేడ్ లేదా డౌన్‌గ్రేడ్ జరిగిందా? డిసెంబర్ త్రైమాసిక పనితీరు ఆధారంగా, మోతీలాల్ ఓస్వాల్… టాటా మోటార్స్, కోల్ ఇండియా, హీరో మోటోకార్ప్, సిప్లా, భారతీ ఎయిర్టెల్ కు FY25 లాభాల అంచనాలను పెంచింది.
మరోవైపు, ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో.. మోతీలాల్ ఓస్వాల్… UPL, LTI మైండ్‌ట్రీ, ITC, దివీస్ ల్యాబ్స్, HUL కు లాభాల అంచనాలను తగ్గించింది.
ఇది నిఫ్టీ-50 కంపెనీల త్రైమాసిక ఫలితాలను కవర్ చేస్తుంది. అయితే ఎంచుకున్న రంగాల పనితీరును అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని మర్చిపోకూడదు.
మూడవ త్రైమాసికంలో.. 3,381 కంపెనీల ఆదాయంలో సంవత్సరానికి 8.2% వృద్ధి ఉంది. అయితే మునుపటి సంవత్సరం ఇదే త్రైమాసికంలో, ఈ కంపెనీల ఆదాయ వృద్ధి 17.3%. FY24 మొదటి మూడు త్రైమాసికాలలో కంపెనీల ఆదాయ వృద్ధి వరుసగా 5.3%, 5.9%, 8.2%. అయితే, బ్యాంకులు, NBFCలను మినహాయించి చూస్తే.. కంపెనీల ఆదాయ వృద్ధి వరుసగా 0.9%, 1.6%, 4.5% మాత్రమే.
ఆదాయానికి విరుద్ధంగా, లాభాల పెరుగుదల చాలా బలంగా ఉంది. త్రైమాసికంలో, ఈ కంపెనీల లాభాల వృద్ధి 25%. అయితే, అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో 2.2% స్మాల్ బేస్ ఉంది. FY24 మూడు త్రైమాసికాల్లో.. కంపెనీల లాభాల వృద్ధి సైకలాజికల్ స్టాండ్ పాయింట్ నుంచి చూస్తే.. 10% కంటే ఎక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు.
ఈ విధంగా, కంపెనీల లాభాల వృద్ధి విశ్లేషకుల అంచనాల కంటే మెరుగ్గా ఉంది. ఆటో, ఫైనాన్షియల్స్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్-ఫార్మా, టెలికాం, బిల్డింగ్ మెటీరియల్స్, మెటల్, ఆయిల్-గ్యాస్ వంటి రంగాల్లోని కంపెనీల ఫలితాలు… అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయి. బ్రోకింగ్ హౌస్ ప్రభుదాస్ లిల్లాధర్ ప్రకారం, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (QSRలు), రిటైల్, కన్జ్యూమర్ డ్యూరబుల్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు డిమాండ్ తగ్గడం వల్ల ప్రభావితమయ్యాయి. అదనంగా, 26 త్రైమాసికాల తర్వాత, మొదటిసారిగా ఐటీ రంగ కంపెనీల ఆదాయంలో స్వల్ప తగ్గుదల కనిపించింది.
హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, గత త్రైమాసికాల్లో అధిక వృద్ధిని కనబరిచిన చాలా కంపెనీలు ఈ త్రైమాసికంలో నిరాశ కలిగించాయి. అయితే ఇటీవలి నెలల్లో అనేక కంపెనీలు మొదటిసారిగా గణనీయమైన వృద్ధిని కనబరిచాయన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి.
స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్లోని HoR సంతోష్ మీనా ప్రకారం, “PSU బ్యాంకుల ఫలితాలు అత్యంత బలంగా ఉన్నాయి. అదనంగా, ఆటో, వినియోగం, మూలధన వస్తువులు, హోటల్, ఫార్మా రంగాలలో వృద్ధి బాగానే ఉంది. అయినా రసాయన రంగంలో కంపెనీలు నిరాశపరిచాయి. IT కంపెనీల ఫలితాలు ఆశించిన విధంగానే ఉన్నాయి. ఆశ్చర్యపరిచే స్థాయిలో అయితే లేవు. అయినా ఈ షేర్లలో పెరుగుదల కనిపించింది. కొన్ని ప్రభుత్వ బ్యాంకులలో మంచి ఫలితాలు వచ్చినా.. మార్జిన్లపై ఒత్తిడి వల్ల లాభాల స్వీకరణ విషయాన్ని గమనించాల్సి వచ్చింది.
సో, త్రైమాసిక ఫలితాల ఆధారంగా ఏ కంపెనీల షేర్లను కొనాలి? ఈ రిజల్ట్ ఆధారంగా.. SBI, సిప్లా, ఆర్కియన్ కెమికల్, సొనాటా సాఫ్ట్వేర్, ఇంజనీర్స్ ఇండియాలో షేర్లను కొనుగోలు చేసే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని సంతోష్ మీనా అన్నారు. 6 నుంచి 12 నెలలకు SBIకి ₹880 నుంచి 1000 రూపాయిలు, సిప్లాకు ₹1700 రూపాయిలు, సొనాటా సాఫ్ట్‌వేర్‌కు ₹1100… అదే సమయంలో, 12 నుంచి 15 నెలల కాలానికి, ఆర్కియన్ కెమికల్‌కు ₹1000 రూపాయిలు, ఇంజనీర్స్ ఇండియాకు ₹310 రూపాయిల లక్ష్యాలతో కొనుగోలు చేయడాన్ని పరిగణించవచ్చు.”
మొత్తంమీద, మూడవ త్రైమాసికంలో, కంపెనీలు వరుసగా మూడవసారి.. లాభాల్లో 10% కంటే ఎక్కువ వృద్ధిని సాధించాయి. అయితే, ఈ త్రైమాసికంలో, మంచి పనితీరు కనబరుస్తున్న కంపెనీల జాబితాలో కూడా కొన్ని మార్పులు జరిగాయి. 6 నుంచి 15 నెలల కాలానికి.. ఫలితాల ఆధారంగా ఎంపిక చేసిన కంపెనీల లిస్టుతో పోర్ట్‌ఫోలియోలను నిర్మించవచ్చు.
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.