Paytm స్టాక్స్ పై బ్రోకర్లు ఎందుకు బుల్లిష్ గా ఉన్నారు?
ఇప్పుడు అతని మదిలో సాఫ్ట్‌బ్యాంక్ విక్రయిస్తున్న షేర్లకు బ్రోకర్లు గుడ్డిగా వెంటపడుతున్నారా? అనే ప్రశ్న మెదులుతోంది. ఇంకో రకంగా కూడా అనిపిస్తోంది.. దీనిని కొనమని రేటింగ్‌లు ఇస్తున్న బ్రోకర్లు Softbankని
హైదరాబాద్ కు చెందిన గణేష్ అయోమయంలో పడిపోయాడు. ఎందుకంటే.. అతను Paytm స్టాక్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ఒక పక్క దాని వాల్యూ తగ్గుతూ వస్తోంది. మరో పక్క బ్రోకర్లు Paytmలో బుల్లిష్‌గా ఉన్నారు. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయమని సలహా ఇస్తున్నారు. దీంతో అతను తికమక పడుతున్నాడు. అసలు ఇప్పుడు అయోమయంలో ఉన్నారు.
ఇప్పుడు అతని మదిలో సాఫ్ట్‌బ్యాంక్ విక్రయిస్తున్న షేర్లకు బ్రోకర్లు గుడ్డిగా వెంటపడుతున్నారా? అనే ప్రశ్న మెదులుతోంది. ఇంకో రకంగా కూడా అనిపిస్తోంది.. దీనిని కొనమని రేటింగ్‌లు ఇస్తున్న బ్రోకర్లు Softbankని భిన్నంగా చూస్తున్నారా…? అందుకే గణేష్ అయోమయంగా ఉన్నాడు.
అందుకే ఇప్పుడు అసలు Paytm లో ఏమి మారిందో అర్థం చేసుకుందాం. బ్రోకర్లు ఉత్సాహంగా ఎందుకు ఉన్నారు? సాఫ్ట్‌బ్యాంక్ వంటి ఇన్వెస్టర్స్ లాభాలను పొందడంలో బిజీగా ఎలా ఉన్నారు వంటి విషయాల గురించి తెలుసుకుందాం..
ఇది తెలియాలంటే ముందుగా Paytm స్టాక్ ఎలా పని చేసిందో అర్థం చేసుకోవాలి. ఈ స్టాక్ గత 6 నెలల్లో అద్భుతమైన రాబడిని చూపింది. ఈ స్టాక్ 3 నెలల్లో దాదాపు 30% అలాగే 6 నెలల్లో 50% కంటే ఎక్కువ లాభపడింది. ఇది మాత్రమే కాదు, షేరు తన 52 వారాల కనిష్టమైన రూ. 438.35 నుంచి 90% కంటే ఎక్కువ రికవరీని చూపింది.
<ఆల్ఫా 3 ఇన్> 52 వారాల కనిష్ట స్థాయి రూ. 438.35ని నవంబర్ 24, 2022న స్టాక్ తాకింది… <ఆల్ఫా 3 అవుట్>
అంటే, దాదాపు 8 నెలల్లో స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయి నుంచి దాదాపు రెట్టింపు అయింది. స్టాక్ ఇంత త్వరగా జూమ్ అవడం కోసం కంపెనీలో ఏమి మారింది అనే డౌట్ రావడం సహజం. అదే తెలుసుకుందాం. Paytm ఫలితాలు లిస్టింగ్ నుంచి చాలా వేగంగా మెరుగుపడుతున్నాయి… అయితే కంపెనీ నిర్వహణ లాభాల్లోకి ఎప్పుడు వస్తుందా అని మార్కెట్ ఎదురుచూస్తోంది.
మూడవ త్రైమాసికంలో అంటే డిసెంబర్ త్రైమాసికంలో, కంపెనీ మొదటిసారిగా ‘సర్దుబాటు చేసిన నిర్వహణ లాభం’ నమోదు చేసింది. విజయ్ శేఖర్ శర్మ సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో నిర్వహణ లాభాల అంచనాను విడుదల చేసినప్పటికీ, గోల్డ్‌మన్ సాచ్స్ మార్చి త్రైమాసికంలో ఎబిటాను సానుకూలంగా అంచనా వేసింది …
కంపెనీ నిర్వహణ లాభం మార్చి త్రైమాసికంలోగత త్రైమాసికంతో పోలిస్తే 7.5 రెట్లు పెరిగింది. ఈ నెంబర్స్ నిరంతర అభివృద్ధి కారణంగా కంపెనీ నష్టం 57% తగ్గి రూ. 168 కోట్లకు చేరుకుంది.
కంపెనీ మొత్తం సంవత్సరానికి అంటే వార్షిక ప్రాతిపదికన నిర్వహణ లాభాలకు ఎప్పుడు తిరిగి వస్తుందో అలాగే త్రైమాసిక ప్రాతిపదికన ఎప్పుడు లాభం పొందుతుందనే దానిపై ఇప్పుడు మార్కెట్ దృష్టి సారిస్తోంది.
FY23లో కంపెనీ నిర్వహణ నష్టం 88.4 శాతం తగ్గి రూ. 176 కోట్లకు చేరుకుంది. ఫలితాల్లో మెరుగుదల కారణంగా, స్టాక్ దిగువ స్థాయిల నుంచి కోలుకుంది. ఆ తర్వాత ఇప్పుడు సాఫ్ట్‌బ్యాంక్ వంటి విదేశీ పెట్టుబడిదారులు తమ షేర్లను లాభాలకు విక్రయిస్తున్నారు. సాఫ్ట్‌బ్యాంక్ తన పెట్టుబడి విభాగం SVF ద్వారా Paytmలో 2% వాటాను విక్రయించడం ద్వారా సుమారు $200 మిలియన్లను సేకరించింది. SVF ఇండియా హోల్డింగ్స్ మే 9, 2023 – జూలై 13, 2023 మధ్య మొత్తం 1.27 కోట్ల షేర్లు అమ్ముకుంది. ఈ వాటా విక్రయం తర్వాత, Paytmలో సాఫ్ట్‌బ్యాంక్ వాటా 9.15 శాతానికి తగ్గింది. ఇది తొలిసారిగా 10 శాతం దిగువకు పడిపోయింది.
సాఫ్ట్‌బ్యాంక్ దాదాపు నెల రోజులుగా నెమ్మదిగా Paytm షేర్లను బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తోంది. చాలా ట్రేడ్‌లు లాభదాయకంగా ఉన్నాయి. ఎందుకంటే Paytm షేర్ సాఫ్ట్ బ్యాంక్ కొనుగోలు ధర రూ. 830 కంటే ఎక్కువగా ఉంది. అంతకుముందు, ఫిబ్రవరి 10 నుంచి మే 8, 2023 మధ్య, SoftBank 1.31 కోట్ల షేర్లను విక్రయించింది.
నిపుణులు వాటా విక్రయం గురించి ఆందోళన చెందనప్పటికీ, సాఫ్ట్‌బ్యాంక్ ప్రపంచవ్యాప్తంగా తన పెట్టుబడిని తగ్గించిందని వారు నమ్ముతున్నారు. ఆదాయాల లెక్కలు చెప్పేటపుడు పంచుకున్న డేటా ప్రకారం FY22లో మొత్తం $44.3 బిలియన్ల పెట్టుబడిని కలిగి ఉండగా.. FY23లో సాఫ్ట్‌బ్యాంక్ కేవలం $3.2 బిలియన్లను పెట్టుబడి పెట్టింది. భారతదేశంలో కూడా, సాఫ్ట్‌బ్యాంక్ 2022లో 6 డీల్స్‌లో మాత్రమే పాల్గొంది. అయితే 2021లో 17 డీల్స్‌లో పాల్గొంది. సాఫ్ట్‌బ్యాంక్ చాలా సంవత్సరాలుగా భారతదేశంలో పెట్టుబడులు పెడుతోంది…
గత 6 సంవత్సరాలలో, ఇది 42 ఒప్పందాల ద్వారా సుమారు $12 బిలియన్లను పెట్టుబడి పెట్టింది. ఈ ఏడాది (2023) సాఫ్ట్‌బ్యాంక్ భారత్‌లో ఎలాంటి పెట్టుబడులు పెట్టనప్పటికీ… బహుశా అందుకే చాలా మంది బ్రోకర్లు కూడా పేటీఎంపై బుల్లిష్‌గా మారారు. పని లాభం వచ్చినప్పటి నుండి ఈ స్టాక్ పట్ల బ్రోకర్ల దృక్పథం మారడం ప్రారంభించింది.
Paytmలో కనీసం 5 గురు బ్రోకర్లు కొనుగోలు రేటింగ్ ఇచ్చారు. అందులో ముగ్గురు విదేశాలకు చెందినవారు. ఈ స్ట్రిప్ జూలై 19న రూ. 842.60 ముగియగా, గోల్డ్‌మన్ సాచ్స్ అత్యధికంగా రూ. 1,150 లక్ష్యాన్ని అందించింది. ఈ సమాచారం అంతా తెలుసుకున్న తరువాత గణేష్ మనస్సులో గందరగోళం తొలగిపోయి ఉంటుంది. అంటే కాదు మీ మనసులోనూ ఇటువంటి ఆందోళన ఉంటే అది తొలగిందని అనుకుంటున్నాం. ఇక గణేష్ తన పెట్టుబడి వ్యూహాన్ని పేటీఎమ్‌లో సులభంగా ప్రయోగించగలడని ఆశిద్దాం…
Published - July 24, 2023, 16:04 IST
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.