ఏ ఆటోమొబైల్ కంపెనీ షేర్స్ కొంటే లాభం?

ఇలాంటి పరిస్థితుల్లో ద్విచక్ర వాహన కంపెనీల భవిష్యత్ వ్యూహం ఏంటనేది పెద్ద ప్రశ్న. ఈ కంపెనీలు గ్రామీణ భారతదేశం

కొవిడ్ మహమ్మారి తర్వాత, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు వేగంగా రికవరీ అయ్యాయి.
దేశ ప్రధాన సూచీ నిఫ్టీ FY21లో సుమారు 71 శాతం , FY22లో 19 శాతం లాభాన్ని నమోదు చేసింది. కానీ
మహమ్మారి తర్వాత, ఆర్థిక వ్యవస్థలోని ఏదైనా ఒక విభాగం ఎక్కువగా ప్రభావితం అయిందీ అంటే, అది గ్రామీణ
భారతమే.

సిమెంట్, పెయింట్, ఎఫ్‌ఎమ్‌సిజి, ప్లాస్టిక్, ద్విచక్ర వాహనాల వంటి రంగాలకు డిమాండ్‌లో ఎక్కువ భాగం గ్రామీణ
రంగం నుండి వస్తుంది. ఈ వీడియోలో ద్విచక్ర వాహనాల సెగ్మెంట్ అమ్మకాలపై.. గ్రామీణ రంగం ప్రభావం ఎలా
ఉంటుందో చూస్తాం. ఇప్పుడు 2 వీలర్ కంపెనీల షేర్ల కోసం ఎలాంటి వ్యూహాన్ని తయారు చేయాలి.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉన్నా.. ఆర్థిక
వ్యవస్థలోని ప్రతి విభాగంలోనూ ఈ స్పీడు కనిపించడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో… కోవిడ్ టైమ్ లో
గ్రామీణ డిమాండ్ తీవ్రంగా ప్రభావితమైన సమయంలో ఈ అసమానత పెరిగింది. తరువాత, ప్రతికూల
వాతావరణం.. డిమాండ్‌ను మరింత తగ్గించింది. అయినా, FY24లో ద్విచక్ర వాహనాల అమ్మకాల గణాంకాలు 10
శాతానికి పైగా పెరిగాయి. ఇది గ్రామీణ డిమాండ్‌లో మెరుగుదలని సూచిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా
ద్విచక్ర వాహనాలను కోరుకుంటారు. మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలలో ఇక్కడి నుంచి వచ్చే డిమాండ్.. 50%
కంటే ఎక్కువగా ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌లో కొనసాగుతున్న పురోగతి వల్ల FY24లో ద్విచక్ర
వాహనాల అమ్మకాలు.. ప్రీ-కోవిడ్ స్థాయికి వెళుతున్నాయి. దాదాపు 1.85 కోట్ల యూనిట్ల అమ్మకంతో రూరల్
డిమాండ్ లో రికవరీ ట్రెండ్ కనిపిస్తోంది. నీల్‌సన్ సర్వే ప్రకారం, 3 సంవత్సరాలలో మొదటిసారిగా, డిసెంబరు,
జనవరి , ఫిబ్రవరిలో గ్రామీణ డిమాండ్ పట్టణ డిమాండ్ కంటే ఎక్కువగా ఉంది.

కోవిడ్ తర్వాత ద్విచక్ర వాహనాల అమ్మకాల పునరుద్ధరణలో 150సీసీ కంటే ఎక్కువ ఉన్న బైక్‌లు అంటే ప్రీమియం
సెగ్మెంట్.. ప్రధాన పాత్ర పోషించింది. మొత్తం అమ్మకాలలో 18% ప్రీమియం సెగ్మెంట్ బైక్స్ దే. అందుకే FY23
అమ్మకాలలో 10 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. FY18లో, ప్రీమియం బైక్‌లు మొత్తం ఆటో అమ్మకాలలో
కేవలం 14% మాత్రమే ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలలో, ఎంట్రీ లెవల్.. అంటే 76-100cc బైక్‌లు, కమ్యూటర్..
అంటే 110-150cc బైక్‌లు మొత్తం అమ్మకాలలో గణనీయంగా తగ్గాయి. అయినా, FY22లో ద్విచక్ర వాహన
మార్కెట్ దశాబ్ద కనిష్టానికి పడిపోయింది. FY23లో కూడా చాలా తక్కువ రికవరీ ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో ద్విచక్ర వాహన కంపెనీల భవిష్యత్ వ్యూహం ఏంటనేది పెద్ద ప్రశ్న. ఈ కంపెనీలు గ్రామీణ
భారతదేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎంట్రీ లెవల్ , కమ్యూటర్ బైక్‌లపైనా లేదా ప్రీమియం సెగ్మెంట్‌పైనా
ఎక్కువ దృష్టి పెడతాయా? లేక పట్టణ ప్రాంతాల బైక్‌లపైనా ఫోకస్ పెడతాయా? దీనిపై, మంత్రి ఫిన్‌మార్ట్
వ్యవస్థాపకుడు అరుణ్ మంత్రి ఏం చెప్పారంటే.. ఎంట్రీ లెవల్‌కు బదులుగా మిడ్-సైజ్ లేదా 125-200సీసీ బైక్‌లకు
డిమాండ్ బలంగా ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీలు కూడా దీనిపై దృష్టి సారించవచ్చు. ఈ రోజుల్లో రుణాలు
సులభంగా లభిస్తాయి కాబట్టి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ప్రీమియం బైక్‌లు సులభంగా
అమ్ముడవుతున్నాయి.

ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, కోవిడ్ మహమ్మారి తర్వాత బైక్‌ల డిమాండ్ సరళిలో మార్పు వచ్చిన
తర్వాత, ద్విచక్ర వాహన కంపెనీల షేర్లలో వ్యూహం ఎలా ఉండాలి?

దీనిపై, అరుణ్ మంత్రి… 3 నెలలలో, బజాజ్ ఆటోను 10,600 రూపాయలు లక్ష్యంతో, ఐషర్ మోటార్స్‌ను 4300 రూపాయలు
లక్ష్యంతో కొనుగోలు చేయవచ్చు. మార్చి త్రైమాసికం ఫలితాలు బాగుంటే, 6-9 నెలల కాలవ్యవధికి కొనుగోలు
చేయవచ్చు. బజాజ్ ఆటోలో రూ. 11,000, ఐషర్ మోటార్స్‌లో 4700 రూపాయలు లక్ష్యాలు కూడా సాధ్యమే. ఈ
విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న TVS మోటార్.. 2W ​​EVలో స్టాక్ వేల్యూ ఎక్కువగా ఉంటుంది.

ఓవరాల్‌గా ప్యాసింజర్ వెహికల్‌ మార్కెట్ లోకి.. అంటే చిన్న కార్లకు బదులుగా మిడ్-సైజ్ కార్లు వచ్చాయి. ఈ
సెగ్మెంట్‌లో టయోటా-మారుతి, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి 3-4 కంపెనీలు మాత్రమే లీడర్స్ గా ఉన్నారు.
అయితే హోండా మార్కెట్ పూర్తిగా వెనుకబడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ద్విచక్ర వాహన విభాగం ఎక్కడి
వరకు వెళ్లి సెటిల్ అవుతుందో చూడాలి. ఈ కంపెనీలు ప్రీమియం బైక్‌లపైనా లేక ఎంట్రీ లెవల్‌పైనా ఎక్కువ దృష్టి
పెడతాయా.? అందుకే ఈ విభాగంలో ఎంపిక చేసిన కంపెనీలలో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు ఈ కోణం నుండి
కొనుగోలు చేయాలి. త్రైమాసిక ఫలితాల ఆధారంగా దీర్ఘకాలిక పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.

Published: April 16, 2024, 19:00 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.