SIPలో ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే మీకు ఊహించని లాభం

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, కాలక్రమేణా డబ్బు పెరగడం అంటే కాంపౌండింగ్.

రాజు తన మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను చెక్ చేస్తున్నాడు. అవి 2 లక్షల రూపాయిలకు పెరిగాయి. అయితే తన ఫ్రెండ్ ను ముఖేశ్ తో నీ పెట్టుబడులు ఎంతవరకు పెరిగాయి అని అడిగాడు. 2 లక్షల 70 వేల వరకు పెరిగాయని ముఖేశ్ జవాబిచ్చాడు. దీంతో రాజు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇద్దరూ కలిసి ఒకేసారి.. ఒకే మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశారు. అలాంటప్పుడు ముఖేశ్ కు అంత పెద్ద మొత్తం ఎలా సమకూరింది? దీనికి ముకేశ్ ఇచ్చిన జవాబు ఒక్కటే.. గత రెండేళ్లుగా ఏటా SIP అమౌంట్ ని పెంచుకుంటూ వెళ్లానని చెప్పాడు. అందుకే అంత పెద్ద మొత్తం సమకూరింది అని అన్నాడు. ముకేశ్ ముందుగా తనకీ విషయం చెప్పనందుకు రాజు బాధపడ్డాడు. కానీ SIPని ఎలా పెంచుకోవాలి.. దాని బెనిఫిట్స్ ఏమిటో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడు.

SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. దీని ద్వారా మీరు మ్యూచువల్ ఫండ్‌లో ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. దీనిలో మీరు చాలా తక్కువ మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. అంటే రూ. 500తో కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇది సింపుల్ SIP. కానీ మీరు స్టెప్ ను SIPని పెట్టుబడి ప్రాసెస్ కు యాడ్ చేస్తే.. అది మీ రాబడిని పెంచుకోవడానికి గొప్ప మార్గంగా మారుతుంది. స్టెప్-అప్ SIP అంటే మీరు మీ SIP మొత్తాన్ని పెంచుకునే మార్గం. మీ ఆదాయం పెరిగితే, SIP మొత్తం కూడా పెరుగుతుంది. ఇది అవసరం కూడా. దీనిని స్టెప్-అప్ SIP సహాయంతో చేయవచ్చు. ఇంతకీ SIP కంటే ఇది ఎలా మెరుగ్గా ఉంటుంది? ఈ టెక్నిక్‌ని ఉపయోగించడం ద్వారా ఎక్కువ రాబడిని ఎలా సంపాదించవచ్చు? దీనిని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.

సాధారణంగా ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెట్టి దాని గురించి మరచిపోతారు. మనం SIPని స్టార్ట్ చేసినప్పుడు అదే మొత్తంతో ఏళ్ల తరబడి నడిపిస్తాం. ఇది ఒక రకమైన ఆర్థిక తప్పిదమే. ఆదాయం పెరిగినప్పుడు SIP వెంటనే పెరగాలి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించాలంటే, మీరు SIP మొత్తాన్ని కూడా పెంచాలి.

సాధారణంగా SIP మొత్తాన్ని పెంచడానికి మీకు రెండు మార్గాలు ఉన్నాయి. ముందుగా మీరు పాత SIPని మూసివేసి, పాత SIP మొత్తాన్ని, ఇంకా మీరు పెంచాలనుకుంటున్న మొత్తాన్ని కలిపి.. కొత్త SIPని ప్రారంభించండి. రెండో మార్గం ఏమిటంటే.. పాత SIPని కొనసాగిస్తూ.. మీరు మీ పెట్టుబడిని పెంచాలనుకుంటున్న మొత్తంతో కొత్త SIPని ప్రారంభించండి.

మీరు పెట్టుబడిని ప్రారంభించేటప్పుడు స్టెప్-అప్ SIP ఆప్షన్ ను ఎంచుకుంటే, మీరు కొత్త SIPని ప్రారంభించకుండా పాత SIP మొత్తాన్ని నిర్ణీత వ్యవధిలో పెంచుకోవచ్చు. దీనర్థం ఏమిటంటే.. మీరు మీ SIPని కొంత మొత్తంతో పెంచవచ్చు. అంటే ప్రతీ 6 నెలలు లేదా సంవత్సరానికి రూ.500, రూ.1000 లేదా 10 లేదా 20 శాతం వంటి స్థిరమైన పెట్టుబడిని పెంచుకోవచ్చు. దీన్ని టాప్-అప్ SIP అని కూడా అంటారు.

ఉదాహరణకు, మీరు 2024 సంవత్సరంలో రూ. 5,000తో ఒక స్కీమ్‌లో SIPని ప్రారంభించినట్లయితే.. స్టెప్-అప్ ద్వారా ప్రతి సంవత్సరం ఆ మొత్తాన్ని 10 శాతం పెంచుకునే ఆప్షన్ ను ఎంచుకుంటే, ఒక సంవత్సరం తర్వాత మీ SIP రూ. 5,500 అవుతుంది. ఆ తరువాతి ఏడాది ఇది రూ. 6,050 అవుతుంది. ఈ విధంగా మీ SIP ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది.

ప్రశ్న-1)- ప్రతీ సంవత్సరం కనీసం ఎంత SIP మొత్తాన్ని పెంచాలి?

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, కాలక్రమేణా డబ్బు పెరగడం అంటే కాంపౌండింగ్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. కాంపౌండింగ్ అంటే రిటర్న్ ఆన్ రిటర్న్. మీరు రూ.60 వేలు డిపాజిట్ చేశారనుకోండి. దానిపై మీకు 8 శాతం రాబడి వచ్చిందని అంచనా వేద్దాం. అంటే రూ. 4,800. ఈ రూ. 4,800 మీ ఇన్వెస్ట్‌మెంట్‌కు కలుపుతారు. అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ. 64,800 అవుతుంది. వచ్చే ఏడాది మీకు రూ. 64,800పై 8 శాతం రాబడి వస్తుంది. అంటే మీకు రూ.5,184 వస్తుంది. దీనిని మళ్లీ మీ పెట్టుబడికి కలుపుతారు. ఈ విధంగా మీ డబ్బు కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది.

కాలానుగుణంగా SIP మొత్తాన్ని పెంచడం ద్వారా.. అంటే స్టెప్-అప్ SIP సదుపాయాన్ని తీసుకోవడం ద్వారా, మీరు కాంపౌండింగ్ ప్రయోజనాన్ని మరింతగా పొందగలుగుతారు. ఎందుకంటే మీ పెట్టుబడి పెరిగేకొద్దీ… దానిపై రాబడి కూడా పెరుగుతుంది. దీనివల్ల మీ పెట్టుబడి పెరుగుతూనే ఉంటుంది.

సాధారణ SIP, స్టెప్-అప్ SIP రిటర్న్‌లలోని వ్యత్యాసాన్ని కొన్ని లెక్కలతో అర్థం చేసుకుందాం. రాజు, ముఖేష్ ఇద్దరూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో రూ.10 వేల SIP చేస్తున్నారనుకుందాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో లాంగ్ టర్మ్ అంటే.. 7 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. కాల వ్యవధిలో 10-12 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడిని ఇచ్చే అవకాశం ఉంది. రాజు సాధారణ SIP చేస్తుండగా.. ముఖేష్ ప్రతి సంవత్సరం SIP మొత్తాన్ని 10 శాతం పెంచుతున్నాడు. రెండింటి పెట్టుబడి కాలం 10 సంవత్సరాలు.

Money9 SIP కాలిక్యులేటర్ సహాయంతో, రాజు పెట్టుబడికి సంబంధించి భవిష్యత్తు విలువను మనం చూద్దాం. నెలవారీ SIP మొత్తం రూ. 10 వేలు అనుకుంటే… అంచనా వేసిన రాబడి 12 శాతం. పెట్టుబడి కాలం 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత రాజు కార్పస్ రూ.23 లక్షల 23 వేల 391 అవుతుంది. ఇందులో పెట్టుబడి మొత్తం రూ.12 లక్షలు కాగా.. ఆదాయం రూ.11 లక్షల 23 వేలు అని అంచనా.

ముఖేష్ కూడా రూ.10 వేలతో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. కానీ ప్రతి ఏడాది SIPని 10 శాతం పెంచాడు. 10 ఏళ్లలో ఆ మొత్తం రూ.19 లక్షల 12 వేల 491 అయ్యింది. 12 శాతం రాబడిని ఆశించడంతో… అతడు రూ.14 లక్షల 61 వేల 835ను సంపాదించారు. 10 సంవత్సరాల తర్వాత అతని కార్పస్ రూ.33,74,326 కావచ్చు. ముఖేష్ ప్రతీ సంవత్సరం SIP మొత్తాన్ని 10% పెంచడం ద్వారా రాజు కంటే రూ.10 లక్షలు అదనంగా సాధించగలడు. అంటే, SIP మొత్తాన్ని 10% పెంచడం ద్వారా రాబడి 30 శాతం పెరగవచ్చు.

మీరు మీ ప్రస్తుత SIPలో స్టెప్-అప్ ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, కొన్ని విషయాలను తెలుసుకోవడం ముఖ్యం. మొదటిది – చాలా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు కొనసాగుతున్న SIPలో టాప్-అప్ ఎంపికను అందించవు. అయినా సరే, మీరు మీ కంపెనీతో ఒకసారి మాట్లాడాలి. రెండవది- ఇప్పటికే ఉన్న SIP మొత్తాన్ని పెంచడానికి పెట్టుబడిదారులకు ఆప్షన్ ను అందించే కొన్ని ఫిన్‌టెక్ పెట్టుబడి యాప్‌లు ఉన్నాయి. మూడవది- స్టెప్-అప్ SIPలో క్యాపింగ్ కూడా వర్తించవచ్చు. దీనివల్ల మీరు SIP పెరుగుదలను కంట్రోల్ చేయవచ్చు.

ప్రశ్న-2)- క్యాపింగ్

స్టెప్-అప్ SIP అనేది మీ ఆర్థిక లక్ష్యాలను వేగంగా సాధించడంలో మీకు సహాయపడే మంచతి ఆప్షన్. మీరు ఎక్కడికైనా త్వరగా చేరుకోవడానికి కారును ఉపయోగించినట్లే ఇది పని చేస్తుంది.స్పీడ్ పెంచాల్సి ఉంటుంది. సిప్ స్పీడ్ పెంచకపోతే మీ ఇన్వెస్ట్‌మెంట్ వాహనం గమ్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.

రాజు పెట్టుబడి ప్రయాణంతో కథ మొదలైంది. రాజు SIP చేసి చాలా మంచి పని చేశాడు. కానీ SIP చేస్తే సరిపోదు. ప్రతీ సంవత్సరం దాని మొత్తాన్ని పెంచుకోవడం మంచిది. మీరు కూడా పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా, Money9 సూపర్ యాప్ మీ కోసమే ఉంది. మీరు Invest9 సెక్షన్‌పై క్లిక్ చేసి, మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ ను ఎంచుకుని, మీ వివరాలను అందించండి. కొన్ని సింపుల్ స్టెప్స్ తర్వాత, మీరు పెట్టుబడిని ప్రారంభించవచ్చు.

Published: April 12, 2024, 18:11 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.