పన్ను మినహాయింపులో అతి ముఖ్యమైన కండీషన్స్ గురించి తెలుసా?

మల్హోత్రా మాట్లాడుతూ, 1.1 కోట్ల పన్ను డిమాండ్‌లు 25,000, 10,000 రూపాయలు ఉన్నాయి. వాటి విలువ 3,500 కోట్ల రూపాయల కంటే తక్కువ.

ప్రభుత్వం చిన్న పన్ను డిమాండ్‌లను ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్ ఫిబ్రవరి 1, 2024న సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో చిన్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం
కలిగేలా ప్రకటన చేశారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పన్ను డిమాండ్‌ల ఉపసంహరణను ఆమె ప్రకటించారు.

మాఫీ అవుతున్న పన్ను డిమాండ్ మొత్తం గురించి ఏ వివరాలను ప్రకటించారో చూద్దాం. మేం మీకు ఆన్‌లైన్ చెకింగ్
ప్రాసెస్ ను కూడా చెబుతాం. అసలు దీని గురించి ఏం ప్రకటించారో చూద్దాం.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2014-15 వరకు బాకీ ఉన్న పన్ను చెల్లింపుదారులకు మధ్యంతర బడ్జెట్‌లో
ఉపశమనం కల్పించామని సీతారామన్ తెలుపారు. పెద్ద సంఖ్యలో చిన్న, వివాదాస్పద పన్ను డిమాండ్‌లు
ఉన్నాయని, వీటిలో చాలా వరకు 1962 సంవత్సరానికి ముందువని అన్నారు. దీంతో నిజాయితీగా పన్ను
చెల్లించేవారు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇది తరువాతి సంవత్సరాల్లో వాపసు విషయంలో ఇబ్బందులను
తీసుకొస్తోంది. ఇప్పుడు తీసుకున్న చర్య వల్ల ఒక కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతుందని
నిర్మలా సీతారామన్ తెలిపారు.

ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ఏమన్నారంటే.. 2010 ఆర్థిక సంవత్సరానికి 25,000 రూపాయల వరకు, 2011
నుండి 2015 వరకు 10,000 రూపాయల వరకు బకాయి ఉన్న ప్రత్యక్ష పన్ను డిమాండ్లను
ఉపసంహరించుకోవాలని ఆమె ప్రతిపాదించారు. ఇంకా ఈజీగా చెప్పాలంటే.. ఈ కాలంలో చేసిన
వివాదాస్పద పన్ను డిమాండ్‌లు కొంత మొత్తం వరకు మాఫీ చేస్తారు. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్
(CBDT) ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్డర్ ప్రకారం, గరిష్టంగా ఒక లక్ష రూపాయల పన్ను మాఫీకి సెట్ చేశారు. ఇది జనవరి 31, 2024 నాటికి అవుట్
స్టాండింగ్ గా ఉంటుంది. ఇది ఆదాయ పన్ను, సంపద పన్ను, బహుమతి పన్ను డిమాండ్‌లను కవర్ చేస్తుంది. 1 లక్ష
రూపాయల పరిమితిలో పన్ను డిమాండ్, వడ్డీ, పెనాల్టీ, ఫీజులు, సెస్, సర్‌చార్జి ప్రధాన మొత్తం ఉంటుంది. CBDT
తన ఆర్డర్ లో కొన్ని అంశాలను స్పష్టం చేసింది:

ఈ మినహాయింపు TDS లేదా TCS డిమాండ్లకు వర్తించదు. ఇది ఏదైనా క్రెడిట్ లేదా రీఫండ్‌ను క్లెయిమ్
చేయడానికి పన్నుచెల్లింపుదారులకు అవకాశం ఇవ్వదు. ఇది పన్ను చెల్లింపుదారులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న,
ప్రారంభించబడిన లేదా తీసుకున్న లేదా క్రిమినల్ చట్టపరమైన చర్యలను ప్రభావితం చేయదు. ఇది చట్ట
ప్రకారం పన్ను అధికారులు తీసుకున్న ఏదైనా చర్య నుండి మినహాయింపును ఇవ్వదు.

CBDT ఆర్డర్‌ను అనుసరించి, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారి పాత పన్ను డిమాండ్‌లు మాఫీ
అవుతాయి. రద్దు అవుతాయి. పన్ను చెల్లింపుదారులు తమ స్టేటస్ ను ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్
వెబ్‌సైట్‌ www.incometax.gov.in లో చెక్ చేయవచ్చు .పన్ను డిమాండ్ స్థితిని చెక్ చేయడానికి, పన్ను
చెల్లింపుదారులు తమ వినియోగదారు ID, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి లాగిన్
అవ్వాలి. ఆ తర్వాత వారు పెండింగ్ యాక్షన్ కింద ఉన్న “రెస్పాన్స్ టూ అవుట్ స్టాండింగ్ డిమాండ్” ఆప్షన్ కు వెళ్లి
ట్యాక్స్ డిమాండ్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.

రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా అందించిన సమాచారం ప్రకారం.. వివిధ ప్లాట్‌ఫారమ్‌లపై 2.68 కోట్ల
పన్ను డిమాండ్‌లకు గాను 35 లక్షల కోట్ల రూపాయల మొత్తం వివాదంలో ఉంది. ఇందులో 2.1 కోట్ల డిమాండ్లు
25,000 రూపాయల కంటే తక్కువ. కాగా, 2.1 కోట్ల కేసుల్లో 58 లక్షల కేసులు 2009-10 ఆర్థిక సంవత్సరానికి
చెందినవి కాగా, మిగిలిన 53 లక్షలు FY11 నుండి FY15 మధ్య కాలానికి చెందినవి.

మల్హోత్రా మాట్లాడుతూ, 1.1 కోట్ల పన్ను డిమాండ్‌లు 25,000, 10,000 రూపాయలు ఉన్నాయి. వాటి
విలువ 3,500 కోట్ల రూపాయల కంటే తక్కువ. ప్రభుత్వ నిర్ణయం చిన్న పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ ను
కలిగించబోతోంది. ఇది చిన్న పన్ను డిమాండ్‌లపై ఐటీ శాఖ చేసే పెద్ద వ్యయాన్ని కూడా తగ్గిస్తుంది.

మీకు పన్ను డిమాండ్‌ల గురించి ఏవైనా ప్రశ్నలు లేదా సమస్యలు ఉంటే, మీరు 1800 309 0130 కు కాల్
చేయవచ్చు లేదా taxdemand@cpc.incometax.gov.in లో ఈమెయిల్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం
పొందవచ్చు.

Published: March 4, 2024, 18:09 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.