ఐటీఆర్ ఫైల్ చేశారా? రీఫండ్ రాలేదా? ఇలా చేయండి..

టాక్స్ పేయర్ చెల్లించిన పన్ను తన టాక్స్ రెస్పాన్సిబిలిటీ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఐటీ రీఫండ్ పొందే అర్హత కలిగి ఉంటాడు. మీరు ఎక్కువ పన్ను చెల్లించినట్లయితే, ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడం ద్వారా మీరు రీఫండ్ క్లెయిమ్ చేయవచ్చు.

అఖిల్ చాలా హ్యాపీగా ఉన్నాడు మరి. అతని ఎకౌంట్ లోకి రూ.22,540 రాబోతుంది. తన స్నేహితుడు హరీష్ తో కలిసి తాను ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాడు. ఈ ఉదయాన్నే హరీష్ ఖాతాలో రీఫండ్‌ క్రెడిట్ అయింది. అఖిల్ కూడా తన ఎకౌంట్ లోకి రీఫండ్ ఎమౌంట్ వస్తుందని ఎదురుచూస్తూ ఉన్నాడు. అయితే, చాలా రోజులు గడిచినా అతని ఎకౌంట్ లోకి ఎమౌంట్ రాలేదు. దీంతో అఖిల టెన్షన్ పడుతున్నాడు. రీఫండ్ ఇప్పటికీ ఎందుకు రాలేదు? అఖిల్ లాగా, మీరు కూడా మీ రీఫండ్ అందుకోకపోతే, దానికి కారణం ఏమిటి…? రీఫండ్ స్థితిని ఎలా తనిఖీ చేయాలి… ? మనం తెలుసుకుందాం…

టాక్స్ పేయర్ చెల్లించిన పన్ను తన టాక్స్ రెస్పాన్సిబిలిటీ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఐటీ రీఫండ్ పొందే అర్హత కలిగి ఉంటాడు. మీరు ఎక్కువ పన్ను చెల్లించినట్లయితే, ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడం ద్వారా మీరు రీఫండ్ క్లెయిమ్ చేయవచ్చు. ఇక్కడ మీరు రీఫండ్ క్లెయిమ్ కోరుతున్న ఎమౌంట్ ఫారమ్ 26ASలో కనిపించాలని గుర్తుంచుకోండి. ఆదాయపు పన్ను శాఖ ద్వారా క్లెయిమ్ చెల్లుబాటు అయ్యేదిగా గుర్తించినట్లయితే మాత్రమే రీఫండ్ వస్తుంది.

ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 11 కోట్ల 50 లక్షల మంది వ్యక్తులు పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు… ప్రస్తుత సీజన్ అంటే 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరం గురించి చూస్తే, 7 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు ఫైల్ అయ్యాయి. వీటిలో సుమారు 5 కోట్ల 20 లక్షలకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు వెరిఫై అయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ ఇప్పటి వరకు 3 కోట్ల 36 లక్షలకు పైగా వెరిఫైడ్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లను ప్రాసెస్ చేసింది. ఈ రీఫండ్ డబ్బులో ఎక్కువ భాగం అర్హత కలిగిన పన్ను చెల్లింపుదారుల ఎకౌంట్ కు క్రెడిట్ అయ్యాయి. లేదా కొన్ని రోజుల్లో క్రెడిట్ అవుతాయి. .

ఆదాయపు పన్ను రీఫండ్ రావడానికి పట్టే సమయం ఆదాయపు పన్ను శాఖ అంతర్గత ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా రిటర్న్‌ను దాఖలు చేసిన తేదీ నుంచి 20 – 45 రోజులలోపు రీఫండ్ ప్రాసెస్ చేయబడుతుంది…అయితే, ఇటీవలి కాలంలో వాపసు ప్రక్రియ త్వరగా అవుతోంది. ప్రస్తుతం దీనికి 7 నుంచి 15 రోజులు పడుతుందని టాక్స్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు… అటువంటి పరిస్థితిలో, టాక్స్ పేయర్స్ ఎప్పటికప్పుడు రీఫండ్ పరిస్థితిని చెక్ చేస్తూ ఉండాలి.

రీఫండ్స్ ఆలస్యం అవడానికి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేసిన తర్వాత దానిని వెరిఫై చేయకపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. చాలా సార్లు రిటర్న్స్ ఫైల్ చేసినపుడు బ్యాంక్ వివరాల్లో తప్పులు చేస్తుంటారు, దాని వల్ల రీఫండ్ కూడా ఆగిపోతుంది. బ్యాంక్ ఎకౌంట్ ముందుగా ధృవీకరించబడకపోవడం, బ్యాంక్ ఎకౌంట్ కు PAN లింక్ చేయకపోవడం, సరిపోలకపోవడం ఐటీఆర్‌లో రీఫండ్ క్లెయిమ్‌లో – ఫారమ్ 26ASలో పన్ను మినహాయించినప్పుడు లేదా మునుపటి సంవత్సరాల్లో ఏదైనా టాక్స్ డిమాండు ఉంది అది క్లియర్ కాకపోయినా రీఫండ్ నిలిచిపోతుంది… ఆదాయపు పన్ను శాఖ కోట్లాది రిటర్న్‌లను అందుకుంటుంది, అటువంటి పరిస్థితిలో ప్రాసెసింగ్‌లో ఆలస్యం కావచ్చు. .

రీఫండ్ స్థితిని ఎలా తనిఖీ చేయాలి?

మీరు ఆదాయపు పన్ను శాఖ (eportal.incometax.gov.in) ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఐటీ రీఫండ్ చెక్ చేయవచ్చు.

  • యూజర్ ID – పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి
  • ఇ-ఫైల్ ఎంపికకు వెళ్లడం ద్వారా ‘ఆదాయ పన్ను రిటర్న్స్’కి వెళ్లండి
  • ‘ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్’లో ‘వ్యూ ఫైల్డ్ రిటర్న్స్’పై క్లిక్ చేయండి
  • అప్పుడు మీరు రీఫండ్ స్థితిని చెక్ చేయగలరు

మీ రీఫండ్ విఫలమైతే లేదా రీఫండ్ హోల్డ్‌లో ఉంటే, దీనికి కారణం కూడా తెలుస్తుంది. మీ రీఫండ్ విఫలమైతే అంటే రిజెక్ట్ అయితే, మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రీఫండ్‌ను తిరిగి ఇవ్వమని రిక్వెస్ట్ చేయవచ్చు.
మీరు అఖిల్ లాగా మీ రీఫండ్ కోసం వేచి ఉండి, ఇంకా మీ రీఫండ్ అందుకోనట్లయితే, ఇప్పుడు చెప్పిన విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు మీ రీఫండ్ స్థితిని చెక్ చేయవచ్చు. రీఫండ్‌లో సమస్య లేదని నిర్ధారించుకోవడానికి ఇలా చెక్ చేసుకోవడం అవసరం. ఆదాయపు పన్ను ఉన్న రిజిస్టర్డ్ బ్యాంక్ ఎకౌంట్ ముందుగా వెరిఫై అయి ఉండాలి. బ్యాంక్ ఖాతా PANకి లింక్ చేసి ఉండాలి అలాగే రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీరు ఫారమ్ 26AS ను చెక్ చేశారని నిర్ధారించుకోండి.

 

Published: August 5, 2023, 15:28 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.