ఫ్యాక్టరీ అవుట్ లేట్ మాల్స్ ఎలా పని చేస్తాయి?

ఫ్యాక్టరీ అవుట్‌లెట్ మాల్స్ అంటే ఫ్యాక్టరీ సొంతంగా తెరిచే ప్రత్యేక మాల్స్. ఫ్యాక్టరీ అవుట్‌లెట్ అనేది ఒక షాప్. ఇక్కడ కాలం చెల్లిన లేదా ఫ్యాక్టరీలో మిగిలిపోయిన స్టాక్‌ను తయారీదారుని తగ్గింపుతో సేల్ చేస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, కంపెనీలు తమ అదనపు స్టాక్‌ను ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌లో విక్రయిస్తాయి.

శిరీష హైదరాబాద్ లో ఉంటోంది. తన ఫేవరెట్ బ్రాండ్ బ్యాగ్ ఒకటి కొనాలని అనుకుంటోంది. ఈ-కామర్స్ సైట్‌లలో బ్యాగ్‌ల కోసం వెతకడం ప్రారంభించింది. అప్పుడు ఆమె స్నేహితురాలు మేఘా అక్కడకు దగ్గరలో ఆ బ్రాండ్ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ మాల్ ఒకటి ఉందని చెప్పింది. ఇది విన్న శిరీష సంతోషంగా వీకెండ్ లో ఆ మాల్ కి వెళ్ళి తనకు కావలసిన బ్యాగ్ కొనుక్కోవాలని నిర్ణయించుకుంది.

ఇలా మీరు కూడా చాలాసార్లు ఫ్యాక్టరీ అవుట్ లేట్ అనే మాట వినే ఉంటారు. అసలు ఈ ఫ్యాక్టరీ అవుట్ లేట్ అంటే ఏమిటో ఎప్పుడైనా తెసుకున్నారా? దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం.

ఫ్యాక్టరీ అవుట్‌లెట్ మాల్స్ అంటే ఫ్యాక్టరీ సొంతంగా తెరిచే ప్రత్యేక మాల్స్. ఫ్యాక్టరీ అవుట్‌లెట్ అనేది ఒక షాప్. ఇక్కడ కాలం చెల్లిన లేదా ఫ్యాక్టరీలో మిగిలిపోయిన స్టాక్‌ను తయారీదారుని తగ్గింపుతో సేల్ చేస్తారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, కంపెనీలు తమ అదనపు స్టాక్‌ను ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌లో విక్రయిస్తాయి.

గత కొన్నేళ్లుగా, ఈ-కామర్స్ సైట్‌ల వ్యాపారం చాలా పెరిగింది. ఈ సైట్‌లు భారీ తగ్గింపులను ఇస్తాయి. దాదాపు ప్రతి నెలా రకరకాల డిస్కౌంట్ సేల్స్ అందిస్తాయి. ఈ కారణాల వల్ల, ప్రజలు ఈ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఎక్కువ షాపింగ్ చేస్తారు. ఈ ఆన్‌లైన్ సైట్‌లకు పోటీగా, రిటైల్ డెవలపర్‌లు భారతదేశంలో కనీసం అరడజను ఫ్యాక్టరీ అవుట్‌లెట్ మాల్స్‌ను తెరవడానికి సిద్ధమవుతున్నారు. ఈ వీకెండ్ లో శిరీష షాపింగ్ కు వెళ్లాలనుకుంటున్న ప్రాంతంలో ఆ బ్రాండ్ షాపింగ్ మాల్ ఉంది.

ఈ మాల్‌లో అనేక ప్రీమియం బ్రాండ్‌ల ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ఈ బ్రాండ్‌లలో కొన్ని దేశంలోనే తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించాయి. ఇది ఇంకా ప్రారంభ దశ, కానీ ప్రజలు ఈ మాల్స్ గురించి తెలుసుకోవడంతో, ఈ మోడల్ ప్రజాదరణ పొందుతుందని నమ్ముతారు. ఇటువంటి మాల్‌లో, మీరు టామీ హిల్‌ఫిగర్, కాల్విన్ క్లైన్, లాకోస్ట్, స్కెచర్స్, అడిడాస్ – బిర్కెన్‌స్టాక్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

ఇలాంటి మాల్స్ విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఎంత పాపులర్ అంటే విదేశాలకు వెళ్లే భారతీయులు కూడా అక్కడి నుంచి షాపింగ్ చేసి తిరిగి వస్తుంటారు. వీటిని అక్కడ అవుట్‌లెట్ మాల్స్ అంటారు. 1980 – 90 లలో అమెరికాలో ఇటువంటి మాల్స్ రావడం ప్రారంభించాయి. అమెరికా మాత్రమే కాదు, కొన్ని యూరోపియన్, ఆసియా దేశాలలో ఇటువంటి మాల్స్ తరువాత ప్రారంభం అయ్యాయి. ఆసియా, థాయ్‌లాండ్, హాంకాంగ్‌లలో అవుట్‌లెట్ మాల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి.

బెంగళూరు, కోయంబత్తూర్, గౌహతి భారతదేశంలోని అరడజను నగరాలలో త్వరలో ఇటువంటి మాల్స్‌ రాబోతున్నాయి.

ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌లలో, బ్రాండెడ్ ఉత్పత్తులు వాటి సాధారణ రిటైల్ ధర కంటే 30 నుంచి 70 శాతం తక్కువ ధరకు లభిస్తాయి. అందుకే ఇది వినియోగదారులకు లాభదాయకమైన డీల్‌ అవుతుంది. కస్టమర్ల ప్రయోజనాలకు అతీతంగా, ఈ ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌ల నుంచి ప్రీమియం బ్రాండ్‌లు ఏ ప్రయోజనం పొందుతాయనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.

భారతదేశంలో రిటైల్ ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌లు ఇప్పటికే ఉన్నాయని, అయితే వాటి వృద్ధి అంత వేగంగా లేదని పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు అంటున్నారు… ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ మాల్స్‌ను ప్రారంభించడం వల్ల ప్రీమియం బ్రాండ్‌లు ప్రయోజనం పొందుతాయి. సాధారణంగా మాల్స్‌లో ఫుట్‌ఫాల్ ఎక్కువగా ఉంటుంది కానీ మాల్‌లకు వెళ్లే ప్రతి వ్యక్తి అక్కడి నుంచి షాపులకు వెళతారనే గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఈ బ్రాండ్‌లు తమ ఫ్యాక్టరీ ఔట్‌లెట్ల నుంచి షాపింగ్ చేయడానికి ఇలాంటి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. చాలా మాల్స్‌లో, ఉత్పత్తులు మాల్స్‌లో షాపింగ్ చేయడం సామాన్యులకు దూరం కావడం వల్ల పెద్ద పెద్ద బ్రాండ్‌లు ఖరీదైన ధరలకు లభిస్తున్నాయి. కానీ, ఫ్యాక్టరీ ఔట్‌లెట్ మాల్స్‌లో అదే పెద్ద బ్రాండ్‌లు తమ ఉత్పత్తులను తక్కువ ధరలకు విక్రయిస్తాయి. కాబట్టి షాపింగ్ చేయడం.. వినియోగదారులను ఆకర్షించడం ఖాయం అని చెప్పవచ్చు.

Published: August 5, 2023, 16:04 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.