ఆ క్రెడిట్ కార్డుల బెనిఫిట్స్.. గోవిందా!

మీరు మీ కార్డ్‌ని ఎక్కడ ఉపయోగిస్తున్నారో సమీక్షించండి, ప్రయోజనాలను రివ్యూ చేయండి. మీరు ఉపయోగించే ఫీచర్‌ల విలువ

రోహన్ అధిక వార్షిక ఫీజుతో ప్రీమియం క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. దీనికి వార్షిక రుసుములు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ప్రయోజనాలు కూడా చాలా బాగున్నాయి. కానీ కొన్ని నెలల తర్వాత, క్రెడిట్ కార్డ్ కంపెనీ కార్డు విలువను తగ్గించింది. అంటే కార్డుతో లభించే ప్రయోజనాలను తగ్గించిందని అర్థం. రోహన్ అధిక వార్షిక రుసుములను చెల్లించే సేవలు ఇకపై కార్డులో మిగిలిపోతే.. అప్పుడీ కార్డుతో ప్రయోజనమేంటి? ఇప్పుడు ఆ కార్డ్‌ని క్లోజ్ చేసే ఆలోచనలో ఉన్నా రోహన్. ఒకవేళ కంపెనీ మీ క్రెడిట్ కార్డ్ విలువను తగ్గిస్తే, ఆ కార్డ్‌ని కొనసాగించాలా వద్దా అని ఆలోచించాలి. ఈ వీడియోలో కార్డ్ డివాల్యుయేషన్, దాని ప్రభావం కార్డ్ హోల్డర్ పై ఎలా ఉంటుందో చూద్దాం.

క్రెడిట్ కార్డ్ విలువ తగ్గింపు అంటే కార్డ్‌తో అందించిన విలువ, ప్రయోజనాలను తగ్గించడం. క్రెడిట్ కార్డ్ కంపెనీ లేదా బ్యాంక్.. కార్డ్ నిబంధనలు, రివార్డ్ ప్రోగ్రామ్ లేదా ఫీజులను మార్చినప్పుడు ఇది జరుగుతుంది, దీని కారణంగా కార్డ్ హోల్డర్ అందుకున్న ఆ కార్డ్ విలువ కూడా తగ్గుతుంది.

క్రెడిట్ కార్డ్ విలువ తగ్గింపు అనేది దాని ప్రయోజనాలు, రివార్డ్‌లను దృష్టిలో ఉంచుకుని కార్డ్ తీసుకున్న వ్యక్తులకు నిజంగా బ్యాడ్ అనే చెప్పాలి. కార్డ్ విలువ తగ్గింపు వల్ల, కార్డ్ హోల్డర్ ఆర్థిక ప్రణాళిక ప్రభావితం కావచ్చు. ఇటీవల అనేక పాపులర్ కంపెనీలు క్రెడిట్ కార్డ్‌ల విలువను తగ్గించాయి. ఈ లిస్టులో యాక్సిస్ బ్యాంక్ నుండి యాక్సిస్ మాగ్నస్ కార్డ్, HDFC బ్యాంక్ నుండి Regalia క్రెడిట్ కార్డ్, SBI కార్డ్ నుండి SBI క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఉన్నాయి.

యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ వార్షిక రుసుము రూ. 10,000 నుండి రూ. 12,500కి పెరిగింది. నెలవారీ రూ.1 లక్ష ఖర్చుపై ఇచ్చే 25,000 EDGE రివార్డ్ పాయింట్‌ల నెలవారీ మైల్ స్టోన్ ప్రయోజనాన్ని కూడా ఆపేసింది. హెచ్‌డిఎఫ్‌సి రెగాలియా క్రెడిట్ కార్డ్‌లో ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం, మీరు ఒక త్రైమాసికంలో కనీసం రూ.1 లక్ష ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే SBI.. క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డ్ నుండి ఉచిత లాంజ్ యాక్సెస్ ను కట్ చేసింది.

ఇప్పుడు క్రెడిట్ కార్డుల విలువను ఒకదాని తర్వాత మరో సంస్థ ఎందుకు తగ్గిస్తున్నాయనే ప్రశ్న తలెత్తుతోంది.

కొవిడ్ తర్వాత మారిన ఆర్థిక పరిస్థితి దీనికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతోంది. దీంతో వస్తువులు, సేవల ధరల పెరుగుదల వల్ల, క్రెడిట్ కార్డ్ కంపెనీలు తమ రివార్డ్ ప్రోగ్రామ్‌ల నిర్వహణకు శ్రమపడుతున్నాయి. ఉచిత లాంజ్ యాక్సెస్ ఉదాహరణతో దీనిని అర్థం చేసుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్ సర్వీస్ అగ్రిగేటర్ కంపెనీ డ్రీమ్‌ఫోక్స్ ప్రకారం, రెండేళ్ల క్రితం బ్యాంకులు ఎయిర్‌పోర్ట్ లాంజ్‌ల కోసం ఒక్కో సందర్శనకు సగటున రూ.600 చెల్లిస్తున్నాయి, ఈ సగటు ధర 2023 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.990కి పెరిగింది. అంటే 2 ఏళ్లలో ఈ ఖర్చు 65 శాతం పెరిగింది. పెరుగుతున్న విమాన ట్రాఫిక్‌తో, ఉచిత లాంజ్ యాక్సెస్‌ను అందించడం బ్యాంకులకు ఆర్థిక సవాలుగా మారింది.

ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ క్రెడిట్ కార్డ్ విలువ తగ్గిపోతే.. ఏం చేయాలి?

అన్నింటిలో మొదటిది, మీరు కార్డ్ నిబంధనలు, షరతులు, రివార్డ్ ప్రోగ్రామ్‌లు లేదా ఫీజులు మొదలైన వాటిలో మార్పుల గురించి తెలుసుకోవాలి. దీనివల్ల, బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీ నుండి వచ్చే ప్రతీ నోటిఫికేషన్‌పై శ్రద్ధ పెట్టాలి. దానిని జాగ్రత్తగా చదవాలి. తరువాత మీరు పొందే ప్రయోజనాలపై విలువ తగ్గింపు అంశం.. ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. మీకు పూర్తి సమాచారం ఉంటే, మీరు కార్డు వినియోగానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవచ్చు.

మీరు మీ కార్డ్‌ని ఎక్కడ ఉపయోగిస్తున్నారో సమీక్షించండి, ప్రయోజనాలను రివ్యూ చేయండి. మీరు ఉపయోగించే ఫీచర్‌ల విలువ తగ్గినా లేదా ఆగిన, మీరు కార్డ్‌ మార్చుకోవచ్చు. మరొక కార్డ్‌ని తీసుకునే చేసే ముందు, అక్కడ సారూప్యమైన లేదా మెరుగైన ప్రయోజనాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. రివార్డ్ ప్రోగ్రామ్‌లు, ఫీజులు, వడ్డీ రేట్లు మొదలైనవాటిని పోల్చడం ద్వారా, మీరు మీ ఆర్థిక అవసరాలు, లక్ష్యాలకు సరిపోయే కార్డ్‌ని ఎంచుకోవచ్చు.

Published: April 9, 2024, 15:48 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.