క్రెడిట్ కార్డుతో కారు కొంటే ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా?

ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. బిల్లింగ్ సైకిల్‌లో బ్యాలెన్స్‌ను తిరిగి చెల్లించడానికి మీ వద్ద తగినంత నగదు ఉన్నప్పుడు మాత్రమే కారును కొనుగోలు

క్రెడిట్ కార్డ్ ను సక్రమంగా ఉపయోగిస్తే, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు నిర్మల్ గురించి చెబుతాం.
అప్పుడు క్రెడిట్ కార్డ్ నుండి మీరు ఎంత ఆదా చేయవచ్చో మీకు అర్థమవుతుంది.

పూణేలో నివసిస్తున్న నిర్మల్‌ రూ. 12 లక్షలతో కారు కొన్నాడు. ఇందులో, అతను తన క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.7
లక్షల డౌన్ పేమెంట్ చేసాడు. దీని మీద అతను దాదాపు రూ. 50-60 వేల విలువైన ఎయిర్ మైల్స్‌ను పొందాడు.
అంటే, ఇది ధరలో 50 నుండి 60 వేల రూపాయల తగ్గింపు అనుకుందాం. క్రెడిట్ కార్డ్ తో కొనడం
ఉపయోగకరమైన విషయం కాదని అనగలమా?

మీకు ఎక్కువ క్రెడిట్ లిమిట్ తో క్రెడిట్ కార్డ్‌ ఉందనుకుందాం. ఆ కార్డ్‌ని సద్వినియోగం చేసుకునే సమయం
వచ్చింది. ఈ వీడియోలో మనం దీని గురించి మాట్లాడుదాం.

మీ క్రెడిట్ కార్డ్‌తో కారును కొనుగోలు చేయడం ద్వారా.. మొత్తం ధరపై 5-10 శాతం తగ్గింపును ఎలా పొందవచ్చో
చూద్దాం. కారు కొనడం చాలా పెద్ద విషయం. మీరు మీ పొదుపులో ఎక్కువ భాగాన్ని డౌన్‌ పేమెంట్‌గా చెల్లిస్తారు.
మిగిలిన డబ్బును లోన్‌గా తీసుకుంటారు. అలాంటప్పుడు మీరు క్రెడిట్ కార్డ్‌తో మంచి డీల్‌ని పొందవచ్చు. మీరు
రూ.15 లక్షల విలువైన కారును కొనుగోలు చేయాలని అనుకుందాం. ఇందులో, మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 10
లక్షల డౌన్‌పేమెంట్ చేశారు. మీరు దానిపై 5 శాతం రివార్డ్ రిటర్న్ రేటును పొందారనుకుందాం. అంటే మీరు రూ.
50,000 ఆదా చేశారన్నమాట.

దీనికి విరుద్ధంగా, మీరు నగదు రూపంలో అంటే నేరుగా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే, మీరు ఏమీ పొందలేరు. మీరు
క్రెడిట్ కార్డ్‌తో ఎలా పొదుపు చేయవచ్చో అర్థం చేసుకోవడం కష్టం కాదు. మీరు కార్డ్‌పై రెగ్యులర్ రివార్డ్‌లను
పొందవచ్చు. మీరు మైల్ స్టోన్ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. వార్షిక రుసుము కూడా మాఫీ అవుతుంది.
అనేక క్రెడిట్ కార్డ్‌లలో, సంవత్సరానికి కొంత మొత్తాన్ని ఖర్చు చేసిన తర్వాత వార్షిక రుసుము మాఫీ అవుతుంది.
కాబట్టి కారును కొనుగోలు చేసిన తర్వాత, మీ వార్షిక రుసుమును మాఫీ చేయడం ఖాయం. మైల్ స్టోన్స్ ను
సాధించడంలో చాలా ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రయోజనాలను వేల సంఖ్యలో ఎయిర్‌మైల్‌ల
రూపంలో పొందవచ్చు. అయితే, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం
ముఖ్యం.

క్రెడిట్ కార్డ్ చెల్లింపు కోసం కార్ డీలర్‌లు మీకు 1 నుండి 2 శాతం అదనంగా వసూలు చేయవచ్చు. దీన్ని ఛార్జ్
చేయడం ద్వారా, డీలర్‌లు MDR భారాన్ని కస్టమర్‌పై మోపుతారు. MDR అంటే మర్చంట్ డిస్కౌంట్ రేటు.
ఇది మీరు పొందే నికర రివార్డ్ రిటర్న్‌లను ప్రభావితం చేయడమే కాకుండా మీరు కారు కోసం చెల్లించే మొత్తం
ధరను కూడా పెంచుతుంది. దీన్ని నివారించడానికి, డీలర్‌తో మాట్లాడండి. ఛార్జ్‌ని 1 శాతం కంటే తక్కువకు
తగ్గించమని అడగండి. చాలా సార్లు డీలర్లు ఈ మొత్తం ఛార్జీని మాఫీ చేస్తారు. కాబట్టి 4-5 మంది డీలర్‌లను
విచారించిన తర్వాత కారును కొనుగోలు చేయండి.

ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. బిల్లింగ్ సైకిల్‌లో బ్యాలెన్స్‌ను తిరిగి చెల్లించడానికి మీ వద్ద తగినంత నగదు
ఉన్నప్పుడు మాత్రమే కారును కొనుగోలు చేయడానికి క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించండి. క్రెడిట్ కార్డ్‌ తో కారుకు
ఫైనాన్స్ చేసే మార్గంగా కొనుగోలుదారు దీన్ని తప్పుగా భావించకూడదు. క్రెడిట్ కార్డ్ లోన్‌పై 15 నుండి 25
శాతం అధిక వడ్డీని చెల్లించాలి. ఇది ఆటో లోన్ కంటే చాలా ఎక్కువ. ఇది కాకుండా, మీరు ఆ నెలలో మీ క్రెడిట్
పరిమితిలో ఎక్కువ భాగాన్ని కారు కొనుగోలు కోసం ఖర్చు చేస్తారు. ఇది మీ CURని పెంచుతుంది. అంటే క్రెడిట్
వినియోగ నిష్పత్తిని పెంచుతుంది. ఇది CIBIL స్కోర్‌ను ప్రభావితం చేయవచ్చు. కాబట్టి, క్రెడిట్ పరిమితిని దృష్టిలో
ఉంచుకుని డౌన్‌పేమెంట్ మొత్తాన్ని నిర్ణయించుకోండి. ఈ విధంగా, మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి కారును
కొనుగోలు చేయవచ్చు. కానీ అంతకంటే ముందు ఈ సౌకర్యం వల్ల లాభాలు, నష్టాలను అంచనా వేయడం చాలా
ముఖ్యం.

Published: March 25, 2024, 16:22 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.