పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ బెటరా? భారమా?

సవాళ్ల గురించి చెప్పాలంటే, నగరాల వెలుపల ఉన్న ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య ఇప్పటికీ పరిమితంగానే ఉంది. దీంతో సుదూర

టాటా మోటార్స్ ఇటీవల తన రెండు ఎలక్ట్రిక్ కార్లు టియాగో, నెక్సాన్ ధరలను 1 లక్ష 20 వేల వరకు తగ్గించింది. టాటా మోటార్స్ తగ్గింపు ధర వల్ల పెట్రోల్‌తో పోలిస్తే EV వాహనాలు ధర విషయంలో ఎంత సౌలభ్యంగా మారాయి? దేశంలో EV సెగ్మెంట్ మార్కెట్ ఎంత పెద్దదిగా ఉంది? మరి వీటి ఆధారంగా ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి? దీని గురించి తెలుసుకుందాం.

టాటా మోటార్స్ Tiago EV ధరను రూ. 70,000, Nexon EV ధరను రూ. లక్షా ఇరవై వేలు తగ్గించింది. Tiago EV యొక్క ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు 7 లక్షల 99 వేలు. Nexon EV ధర 14 లక్షల 49 వేల నుండి ప్రారంభమవుతాయి. ధర తగ్గించిన తరువాత.. 6.99 లక్షల ధర ఉన్న Tiago EV… కాంపాక్ట్ MG కామెట్ తర్వాత.. దేశంలో రెండో చౌకైన ఎలక్ట్రిక్ కారుగా మారింది.

టాటా మోటార్స్ ఈ ధరను తగ్గించిన తరువాత… భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడం సులభం అయింది. పెట్రోల్ కారుతో పోలిస్తే EV ప్రారంభ అదనపు ధరను తిరిగి పొందేందుకు కస్టమర్లకు తక్కువ సమయం పడుతుంది.

EVలను పెట్రోల్ కార్లతో పోల్చినప్పుడు.. ఇంధనంపై దీర్ఘకాలిక పొదుపు , మెయింటినెన్స్ ను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అది ఎలాగో ఓ ఉదాహరణ చెబుతాం. పెట్రోల్ మోడల్ Tiago XTA ఎక్స్-షోరూమ్ ధర 6 లక్షల 95 వేల రూపాయిలు. ఇక ఎలక్ట్రిక్ మోడల్ Tiago EV XT మీడియం రేంజ్ ధర 8 లక్షల 99 వేల రూపాయిలు. EV మోడల్‌పై రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువగా ఉన్నా.. దాని ఇన్సూరెన్స్ కాస్ట్ ఎక్కువ. ఇవన్నీ లెక్క చూస్తే.. Tiago EV దాదాపు లక్షా 60 వేల రూపాయిలు ఎక్కువని అర్థమవుతోంది.

ఇటీవలి కాలంలో EV వాహనాల రన్నింగ్ కాస్ట్ అంటే ఇంధనం, ఇతర ఖర్చులు తగ్గినప్పటికీ… రోజువారీ ప్రయాణాన్ని బట్టి రన్నింగ్ కాస్ట్ అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు 30 కి.మీ అంటే 3 సంవత్సరాలలో 33,000 కి.మీ దూరం వెళ్లింది అని అనుకుంటే.. Tiago XTA బీమా ప్రీమియం, సర్వీస్, ఇంధనం లేదా ఛార్జింగ్ ఖర్చుతో సహా 2 లక్షల 41 వేల రూపాయిలు అయ్యింది. అయితే EVతో పోల్చితే, EV దాదాపు రూ. 26 వేలు తగ్గుతుంది. అదే EV XT కు ఇవన్నీ లెక్కేస్తే.. దాని కాస్ట్ 56 వేల 487 రూపాయిలు అయ్యింది. పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే.. EV మోడల్స్ 26 వేల రూపాయిలు తక్కువని అర్థం చేసుకోవచ్చు.

EVలు మొదట్లో కాస్త కాస్ట్లీగా అనిపించినా.. లాంగ్ రన్ లో వీటి వల్ల కొంతమొత్తం పొదుపు అవుతుంది. Tiago EV వాహనం రోజూ 40 కి.మీ.తిరిగితే.. బ్రేక్ ఈవెన్ రావడానికి 3 ఏళ్ల నాలుగు నెలలు పడుతుంది. మీరు 30 కి.మీ డ్రైవ్ చేస్తే రోజువారీ మీ అదనపు ఖర్చులు నాలుగున్నరేళ్లలో రికవరీ అవుతాయి. ఒకవేళ మీ వాహనం 15 కిలోమీటర్లు తిరిగితే.. ఆరేళ్ల ఎనిమిది నెలల్లో బ్రేక్ ఈవెన్ వస్తుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ వాహనంలోని బ్యాటరీ 8 సంవత్సరాల తర్వాత లేదా లక్షా 60 వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత రీప్లేస్ చేయాలి.

ఇప్పుడు ఛార్జింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించిన ఛాలెంజ్‌ల గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో EVని ఛార్జింగ్ చేసే సౌలభ్యం, ఖర్చు ప్రాంతాలను బట్టి మారవచ్చు. పబ్లిక్ స్టేషన్‌లో యూనిట్‌కు ఛార్జింగ్ ఖర్చు 5 నుంచి 15 రూపాయిల మధ్య ఉంటుంది. ఫాస్ట్ ఛార్జర్‌లకైతే దీని రేటు ఎక్కువుంటుంది. మరోవైపు, మీ ఇంట్లో లేదా సొసైటీలో మౌలిక సదుపాయాలు ఉంటే, ఛార్జింగ్ యూనిట్‌కు 2 నుంచి 9 రూపాయిలు ఖర్చు అవుతుంది. గృహ విద్యుత్ ధరలు వాణిజ్య ధరల కంటే తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇంట్లో ఛార్జింగ్ కాస్ట్ తక్కువే. కానీ ఛార్జింగ్ కు ఎక్కువ సమయం పడుతుంది.

సవాళ్ల గురించి చెప్పాలంటే, నగరాల వెలుపల ఉన్న ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య ఇప్పటికీ పరిమితంగానే ఉంది. దీంతో సుదూర ప్రయాణాలకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలంటే.. అది పెద్ద సవాల్ గానే ఉంది. EV బ్యాటరీల సర్వీసింగ్‌పై అవగాహన, చైతన్యం లేకపోవడం, పెట్రోల్ వాహనాలతో పోలిస్తే తక్కువ సర్వీస్ సెంటర్లు ఉండడం వల్ల సవాళ్లు పెరుగుతున్నాయి.

ఆటో నిపుణుడు వికాస్ యోగి చెప్పినదాని ప్రకారం, ఇటీవలి ధరల తగ్గింపు తర్వాత, EVని కొనుగోలు చేయడం చౌకగానే మారింది. పెట్రోలుతో పోలిస్తే అదనపు ఖర్చును.. చాలా త్వరగా తిరిగి పొందవచ్చు. మీరు EVని 10 లక్షల రూపాయిల కంటే తక్కువకే కొంటే.. రోజూ 50 నుంచి 60 కిలోమీటర్లు డ్రైవ్ చేయండి. ఇంట్లోనే ఛార్జ్ చేయండి.

మొత్తంమీద, దేశంలో EV వాహనాల ధరలు తగ్గుతున్నాయి. బీమా ధర కూడా మునుపటితో పోలిస్తే తగ్గింది. ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెరుగుదలతో, EVల నిర్వహణ చౌకగా మారుతుందని, ఇది రోడ్లపై వీటి సంఖ్యను మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

Published: March 23, 2024, 17:30 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.