లీవ్ అండ్ లీజ్ ఎగ్రిమెంట్ ఓనర్స్‌కి ఉపయోగకరం.. ఎలా అంటే..

మీరు ఇంటిని అద్దెకు తీసుకున్నప్పుడు, మీరు రెంటల్ ఎగ్రిమెంట్ లేదా లీజ్ ఎగ్రిమెంట్ గురించి తరచుగా వింటూ ఉంటారు. మీరు కూడా ఇలా అగ్రిమెంట్ చాలాసార్లు చేసి ఉండవచ్చు. అయితే, మనలో చాలా మంది దీనిని  కేవలం ఓ పేపర్ వర్క్ గా భావిస్తారు. ఓకే టేనేంట్

  • KVD varma
  • Last Updated : September 15, 2023, 21:11 IST

మీరు ఇంటిని అద్దెకు తీసుకున్నప్పుడు, మీరు రెంటల్ ఎగ్రిమెంట్ లేదా లీజ్ ఎగ్రిమెంట్ గురించి తరచుగా వింటూ ఉంటారు. మీరు కూడా ఇలా అగ్రిమెంట్ చాలాసార్లు చేసి ఉండవచ్చు. అయితే, మనలో చాలా మంది దీనిని  కేవలం ఓ పేపర్ వర్క్ గా భావిస్తారు. ఓకే టేనేంట్ తో అగ్రిమెంట్ అయింది. సాక్షుల సంతకాలు పూర్తీ అయ్యాయి. మన ఇంటి తాళం టేనేంట్ చేతిలో పెట్టేస్తే పని అయిపొయింది అని అనుకుంటూ ఉంటారు. నిజానికి ఈ కథ అంత సింపుల్ కాదు. ఎందుకంటే, చాలాసార్లు టేనేంట్ కి ఓనర్స్ కి మధ్యలో వివాదాలు తలెత్తాయి. అది కూడా ముఖ్యంగా ఇల్లు ఖాళీ చేసే విషయంలో. మీరు ఇంటి ఓనర్ అయితే.. ఇల్లు అద్దెకు ఇస్తూ ఉంటె కనుక ఇటువంటి వివాదాలు రాకుండా ఉండాలంటే మీకు లీవ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ సహాయపడుతుంది. అసలు ఈ లీవ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ అంటే ఏమిటి? రెంటల్ అగ్రిమెంట్ బదులుగా ఈ ఎగ్రిమెంట్ ఎందుకు చేయాలి? ఇలాంటి అనుమానాలు మీకు వస్తున్నాయా? ఈ వీడియోలో దీని గురించి తెలుసుకుందాం.

రెంటల్ అగ్రిమెంట్ ద్వారా ఇంటి యజమాని ఇంటిని అద్దెకు ఇచ్చినప్పుడు, అతను నిర్ణీత కాలానికి ఇంటిని టేనేంట్ కు చట్టబద్ధంగా ఇస్తాడు. దీనర్థం, నిర్ణీత సమయం వరకు, టేనేంట్ ప్రాపర్టీ పోసేషన్ అంటే ఆస్తి స్వాధీనం కు సంబంధించి చట్టపరమైన హక్కులను పొందుతాడు.

లీవ్ అండ్ లైసెన్స్ ఒప్పందంలో ఇది అలా ఉండదు. లీవ్ అండ్ లైసెన్స్ ఒప్పందం ఇండియన్ ఈజ్‌మెంట్స్ యాక్ట్, 1882 కింద వస్తుంది. ఇక్కడ, యజమాని తన ఆస్తిని ఉపయోగించుకునే హక్కును మాత్రమే టేనేంట్ కు ఇస్తాడు. అలాగే టేనేంట్ కు ఎలాంటి స్వాధీనం ఇవ్వడం లేదని లీవ్ అండ్ లైసెన్స్ ఒప్పందం చెబుతుంది. దీని అర్ధం టేనేంట్ మీ ప్రాపర్టీని యూజ్ చేసుకోగలడు అంతే. ప్రాపర్టీ నియంత్రణ మీ చేతిలోనే అంటే యజమాని చేతిలోనే ఉంటుంది.

లీవ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్.. అద్దె లేదా లీజు అగ్రిమెంట్ చేసే ప్రక్రియ సరిగ్గా ఒకే విధంగా ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్‌లలో కొన్ని విషయాలు చిన్న మార్పులు ఉంటాయి అంతే. లీవ్ అండ్ లైసెన్స్ ఎగ్రిమెంట్ టైటిల్‌లో రెంటల్ ఎగ్రిమెంట్ బదులుగా ‘లీవ్ అండ్ లైసెన్స్ ఎగ్రిమెంట్’ పదాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. యజమాని లేదా భూస్వామికి బదులుగా, మీరు ‘లైసెన్సర్’ అనే మాటని ఉపయోగిస్తారు. టేనేంట్ లేదా లెస్సీకి బదులుగా, మీరు ‘లైసెన్సీ’ని ఉపయోగిస్తారు. ఇది మాత్రమే కాదు, మీరు అగ్రిమెంట్ లో రెంట్ అంటే అద్దెకు బదులుగా లైసెన్స్ ఫీజు అని రాయాల్సి ఉంటుంది.

అనేక రాష్ట్రాల్లో అద్దె నియంత్రణ చట్టం అమలులో ఉంది. రెంట్ లేదా లీజు ఒప్పందాలు అద్దె నియంత్రణ చట్టం కిందకు వస్తాయి అని ఇంటిగ్రాట్ లా వ్యవస్థాపకుడు వెంకట్ రావు చెప్పారు. చాలా హక్కులు అద్దెదారులకు అనుకూలంగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, మీరు లీవ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంటే, మీరు అద్దె నియంత్రణ చట్టం పరిధికి దూరంగా ఉంటారు. కాబట్టి, భూస్వామిగా, మీకు అనేక సమస్యలు తప్పుతాయి.

లీవ్ అండ్ లైసెన్స్ ఒప్పందంలో, లైసెన్సర్ లేదా లైసెన్స్ పొందిన వ్యక్తి మరణించిన తర్వాత ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. ఇది రెంటల్ అగ్రిమెంట్ లేదా లీజు అగ్రిమెంట్ లో ఉండదు. ఇందులో, ఇల్లు అద్దెకు తీసుకున్న వ్యక్తి మరణించిన తర్వాత, అతని చట్టబద్ధమైన వారసులు అదే ఇంటిలో అద్దెకు కొనసాగుతారు. లీజుకు తీసుకున్న వ్యక్తి మరణించిన కారంణంతో అతని కుటుంబ సభ్యులను ఇంటి నుంచి ఖాళీ చేయించ లేరు.

మీరు లైసెన్స్ ఒప్పందం ద్వారా ప్రాపర్టీని అద్దెకు ఇస్తే.. ఒకవేళ మీరు మీ ప్రాపర్టీని అమ్మేసుకుంటే కనుక ఈ ఎగ్రిమెంట్ టైం తీరిపోతుంది. మరోవైపు, రెంటల్ అగ్రిమెంట్ ద్వారా అద్దెకు తీసుకున్న ప్రాపర్టీ అమ్ముకోవడం జరిగితే, ఆస్తిని కొనుగోలు చేసే వ్యక్తి అద్దెకు ఉన్నవారు కంటిన్యూ కావడానికి అంగీకరించే బాధ్యత వహిస్తారు. అలాగే రెంటల్ అగ్రిమెంట్ కూడా కొనసాగుతుంది. ప్రాపర్తీని అమ్మేయడం రెంటల్ ఎగ్రిమెంట్ ను క్లోజ్ చేయదు.

అదేవిధంగా, లైసెన్స్ ఒప్పందంలో, లైసెన్సర్ అంటే, మరొకరికి లైసెన్స్ ఇచ్చిన భూస్వామి, ఆస్తిని మూడవ వ్యక్తికి ఉపయోగించడానికి లైసెన్స్ ఇవ్వలేరు. అయితే, రెంటల్ అగ్రిమెంట్ లో ప్రత్యేకంగా మూడో వ్యక్తికీ లీజుకు ఇవ్వకూడదు అని క్లాజు రాసుకుంటే తప్ప టేనేంట్ తను ఉంటున్న ప్రాపర్టీలో కొంత భాగాన్ని మూడో వ్యక్తికి కూడా అద్దెకు ఇవ్వవచ్చు.

లీవ్ అండ్ లైసెన్స్ ఒప్పందం ఎందుకు అవసరమో ఇప్పుడు మీరు అర్థం చేసుకుని ఉంటారు. అద్దెకు వచ్చిన వారు నిజాయితీగా ఉన్నంత కాలం సమస్య లేదు. కానీ అతను నిజాయితీ లేనివాడు అయితే. ఈ విషయంకోర్టులకు వెళ్ళే స్థాయికి చేరుకుంటుంది, ఆపై లీవ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ వలన లైసెన్సర్ తన ఆస్తిని తిరిగి తీసుకోవడం సులభం అవుతుంది. టేనేంట్స్ ఇంటిని స్వాధీనం చేసుకోకుండా నిరోధించడానికి ఇది సమర్థవంతమైన యంత్రాంగం. కాబట్టి, మీరు మీ ఇంటిని అద్దెకు ఇవ్వబోతున్నట్లయితే, మీ టైటిల్‌లో ‘రెంట్ అగ్రిమెంట్’కి బదులుగా ‘లీవ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ అనే పదాన్ని ఉపయోగించండి.

Published: September 15, 2023, 21:11 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.