ఇల్లు కొంటున్నారా? మరి అవన్నీ చెక్ చేశారా?

ఇల్లు కొనేటప్పుడు ఆ ప్రాంతం ఎలాంటిది అన్నదానితో పాటు భద్రత చాలా ముఖ్యం. మీరు లైఫ్ స్టైల్ కు దగ్గరగా ఉండే ప్రాంతంలో ఇల్లు కొనడానికి

అనిత ఫ్లాట్ కొనడం కోసం ల్యాప్ టాప్ లో సెర్చ్ చేస్తోంది. ప్రాపర్టీపై మంచి అవగాహన ఉన్న అనిల్ కు కాల్
చేసింది. తన కన్ఫ్యూజన్ పోగొట్టుకోవడానికి అతడిని ఈ విషయంలో సలహా అడిగింది. తాను రెండు ఫ్లాట్ లను
చూసినట్లు అని చెప్పింది. ఒకటి రెసిడెన్షియల్ సొసైటీలో ఉంది. విశాలమైన రోడ్లు ఉన్నాయి. దగ్గరలో స్కూల్,
కాలేజ్ ఉన్నాయి. మరొకటి చౌకగానే వస్తుంది. కానీ ఇంటీరియల్ లో ఉంది. దానికి రేటు రావడానికి కూడా
సమయం పట్టవచ్చు. అందుకే ఈ రెండింటిలో ఏది కొనాలన్నదానిపై అనిత కన్ఫ్యూజ్ అవుతోంది.

అనిల్ కు విషయం అర్థమైంది. లొకేషన్ ఏది బాగుంటే అక్కడ ఫ్లాట్ కొమని అనిల్ చెప్పాడు. ప్రతీ ప్రాంతంలోనూ
ధరలు పెరుగుతాయని చెప్పలేం అని అనిల్ అన్నాడు. ఇక ఇంట్లో ఉంటామా.. దానిని అమ్ముకుంటారా
అన్నదానికన్నా ఆ ప్రాంతంలో అవసరమైన కనీస సదుపాయాలు కచ్చితంగా ఉండాలి. అవి ఇంటి ధరను
పెంచుతాయి. దీంతో అనిల్ ను అనిత ఓ ప్రశ్న అడిగింది. ఏఏ అంశాలు ఇంటి ధరను పెంచుతాయి?

పెట్టుబడి కోసం ఆస్తులు కొనాలన్నా.. నివాసం ఉండాలన్నా… చాలా మంది ఫ్లాట్, భూమి, ఇల్లు కొనాలన్నా బడ్జెట్
ను మాత్రమే చూస్తారు. బడ్జెట్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇది వాళ్ల జేబుకు సంబంధించిన విషయం.
అలాగని భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను మర్చిపోకూడదు. మీరు ఎక్కడ ఇల్లు కొనుగోలు చేసినా… దాని
పరిసరాల్లోని కొన్ని ప్రత్యేక అంశాలను గమనించాలి. ఇది మీరు అక్కడ నివసించడాన్ని ఈజీగా చేస్తుంది.
దీంతోపాటు కొత్త ఇంటిని కొనడానికి మీ పాత ఇంటిని ఎప్పుడు అమ్మినా మంచి ధర వస్తుంది. సో.. ఇంటిని
కొనేముందు.. దాని పరిసరాల్లో ఏఏ ప్రత్యేక అంశాలను చెక్ చేయాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
వీటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది వ్యక్తులు పెళ్లి చేసుకున్నప్పుడో, పిల్లలు పుట్టినప్పుడో ఇల్లు కొనాలనుకుంటారు. అలాంటి వారికి,
ఇంటి సమీపంలో ఒక మంచి విద్యా సంస్థ.. అంటే స్కూల్, కాలేజ్ ఉండటం చాలా ముఖ్యం. ప్రాక్టికల్ లైఫ్ లో
కూడా.. పెద్ద సంస్థల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కొనాలంటే.. దాని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. స్కూళ్లు,
కాలేజీలు ఇప్పటికే ఉన్న లేదా నిర్మించే అవకాశం ఉన్న ప్రాంతంలో ఇల్లు కొనడం చాలా ప్రయోజనకరంగా
ఉంటుంది. ఈ ప్రాంతాల్లో అద్దె ద్వారా సంపాదనకు చాలా అవకాశాలు ఉంటాయి.

మీరు చూస్తున్న ప్రాంతం నుండి ఇతర లొకేషన్‌లకు కనెక్టివిటీ అనేది కేవలం ఐసింగ్ ఆన్ కేక్ మాత్రమే. బస్సు,
మెట్రో లేదా ఇతర పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా నగరంలోని మిగిలిన ప్రాంతాలకు బాగా కనెక్ట్ చేసిన ప్రాంతంలో
ఉన్న ఆస్తిని ప్రీమియంగా పరిగణిస్తారు. ఉదాహరణకు, గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో బస్సు, మెట్రో వంటి ప్రజా రవాణా
లేదు. అయితే బ్లూ లైన్, పింక్ లైన్ అనే రెండు మెట్రోలు ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-1 గుండా వెళతాయి. దీని
వల్ల అక్కడ అద్దెకు ఉండడానికి ఇష్టపడతారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అందుబాటులో ఉన్న ప్రాంతాలు లేదా రవాణా
సదుపాయం త్వరలో అందుబాటులోకి వస్తుందనుకున్న ప్రాంతాల్లోనే ఇల్లును కొనాలి. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్
పోర్ట్ వచ్చిందంటే ఇళ్ల ధరలు పెరుగుతాయి. ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లేకపోతే.. డబ్బు, సమయం వృధా
అవుతాయి.

చాలా కుటుంబాల్లో చిన్న పిల్లలు, పెద్దవారైన తల్లిదండ్రులను ఉంటారు, వారికి క్రమం తప్పకుండా వైద్య సేవలు
అవసరమవుతాయి. ఈ పరిస్థితుల్లో, ఆసుపత్రికి సమీపంలో ఇంటిని కొనాలి. దీనివల్ల సకాలంలో వారికి వైద్య
సేవలు అందుబాటులో ఉంటాయి.

పట్టణీకరణ కాలంలో, వారాలవారీగా సంతలు లేదా స్థానిక మార్కెట్‌లు ఉంటాయి. కానీ వీటి స్థానంలో షాపింగ్
మాల్స్ వచ్చాయి. కిరాణా దుకాణాలు స్థానంలో అత్యాధునిక కిరాణా దుకాణాలు వచ్చేశాయి. వాటి సమీపంలో
షాపింగ్ మాల్స్, రిటైల్ స్థలాలను ఉంటే అలాంటి ప్రాంతాలు లేదా సొసైటీలకు నేడు అధిక డిమాండ్ ఉంది.
ఇలాంటి రిటైల్ ప్లేసెస్ లో దుకాణాలు, క్లినిక్‌లు, మెడికల్ స్టోర్‌లు అన్ని నిత్యావసర వస్తువులు సులువుగా
దొరుకుతాయి. అందుకే ఇలాంటి వాటికి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ధరలు పెరుగుతాయి.

ఇల్లు కొనేటప్పుడు ఆ ప్రాంతం ఎలాంటిది అన్నదానితో పాటు భద్రత చాలా ముఖ్యం. మీరు లైఫ్ స్టైల్ కు దగ్గరగా
ఉండే ప్రాంతంలో ఇల్లు కొనడానికి ప్రయత్నించాలి. మీలాంటి వ్యక్తులు చుట్టూ ఉండటం వల్ల మీకు భద్రత
ఉంటుంది. మీరు ఇల్లు కొనే ప్రాంతం మీరు సురక్షితంగా జీవించేలా ఉండాలి.

మౌలిక సదుపాయాలను పెంచడానికి ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. అటువంటి ప్రాంతాల్లోని
ఆస్తులను పరిశీలిస్తే. అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే, ఆస్తుల
విలువను పెంచడానికి ఇవి దోహదపడతాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులు ఆ ప్రాంతంలో సౌకర్యాలు లేక ఉపాధి
అవకాశాలను కల్పిస్తాయి.

రీసేల్ ప్రాపర్టీని అంటే పాత ఇల్లు లేదా ఫ్లాట్‌ని కొనుగోలు చేసేటప్పుడు, ఖచ్చితంగా దాని ఏజ్ ను తనిఖీ
చేయండి. మీరు ఆస్తి వయసును తనిఖీ చేయడానికి స్ట్రక్చరల్ ఇంజనీర్ సహాయం తీసుకోవచ్చు. ఇది కాకుండా,
నిర్మాణ నాణ్యత గురించి కూడా తెలుసుకోండి. ఈ రెండూ ఆస్తి ధరను ప్రభావితం చేస్తాయి.

ఇల్లు అంటే… మీరు మళ్లీ మళ్లీ కొనడం, అమ్మడం లేదా నిర్మించడం లాంటిది కాదు. అందుకే ఇల్లు కొనేటపుడు
లొకేషన్, సౌకర్యాలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, సేఫ్టీని దృష్టిలో పెట్టుకోండి. ఈ లక్షణాలు మీ ఆస్తికి మాత్రమే కాదు.. ఇది
రీసేల్ విలువను మాత్రమే కాదు.. మీరు అద్దె ద్వారా కూడా మంచి ఆదాయాన్ని పొందేలా చేస్తుంది. అనిత లాగా,
మీరు ఎప్పుడైనా ఇల్లు కొనాలనుకుంటే… పరిసరాల్లోని వీటన్నింటినీ గమనించండి.

Published: March 22, 2024, 18:04 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.