పేటీఎం చరిత్ర ఇది.. అందుకే ఇన్ని సమస్యలు!

మళ్లీ, గత సంవత్సరం.. అంటే అక్టోబర్ 2023లో, KYC నిబంధనలను కొనసాగించకపోవడంతో.. RBI 5.39 కోట్ల రూపాయల పెనాల్టీని విధించింది. గత వారం ఆర్‌బిఐ విధించిన ఆంక్షలతో పేటీఎం

అది కేంద్ర బడ్జెట్‌ సమయం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్థిక మంత్రి.. సామాన్యుల కోసం ఎలాంటి తాయిలాలు ఇస్తారో అని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూసిన సమయమది. ఢిల్లీకి చెందిన శ్రీరామ్ కూడా ఆదాయపు పన్ను చెల్లించే వారికి పన్ను మినహాయింపుల రూపంలో పెద్ద ఉపశమనం ఉంటుందనుకున్నారు. కానీ రిలీఫ్ ఉంటుందనుకుంటే.. Paytm వాలెట్ వ్యాపారంపై నిషేధం రూపంలో శ్రీరామ్‌ లాంటివారికి షాక్ తగిలింది.

RBI సర్క్యులర్ ప్రకారం, ఎప్పుడైనా సరే క్రెడిట్ అయ్యే.. క్యాష్‌బ్యాక్‌లు, రీఫండ్‌లను మినహాయించి… ఫిబ్రవరి 29 తర్వాత ఎలాంటి కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ ఇన్ స్ట్రుమెంట్స్, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, NCMC కార్డ్‌లలో డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్-అప్‌లు అనుమతించరు. కస్టమర్‌లు వారి సంబంధిత ఖాతాల నుండి బ్యాలెన్స్‌లను విత్ డ్రా చేసుకోవడానికి, లేదా ఆ మొత్తాన్ని వినియోగించుకోవడానికి… ఫిబ్రవరి 29 డెడ్ లైన్. సో ఈ తేదీ వరకు వారి బ్యాలెన్స్‌లను వాడుకోవడానికి ఎటువంటి పరిమితులు లేవు.

Paytm పేమెంట్స్ బ్యాంక్ వాలెట పై నిషేధం.. శ్రీరామ్ లాంటి వినియోగదారులకు మేల్కొలుపే అయినా, ఈ నిషేధం లేదా పరిమితికి.. ఆరేళ్ల కిందటే బీజం పడింది. 2017లో, Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) RBI నుండి బ్యాంకింగ్ లైసెన్స్‌ని పొందింది. తరువాత బ్యాంక్ తన కార్యకలాపాలు ప్రారంభించిన ఒక సంవత్సరంలోనే, లైసెన్సింగ్ షరతులను ఉల్లంఘించినందుకు.. KYC నిబంధనలను పాటించనందుకు రెగ్యులేటరీ క్లాంప్‌డౌన్‌ను ఎదుర్కొంది. దీనివల్ల జూన్ 2018లో కొత్త ఖాతాల ఓపెనింగ్ ఆగిపోయింది.

2021లో రెండో క్రాక్ డౌన్ వచ్చింది. PPBL తప్పుడు సమాచారాన్ని
సమర్పించిందన్న RBI కోటి రూపాయిల ఫైన్ ను విధించింది. తరువాత ఆరు నెలలకే.. Paytm, One97 కమ్యూనికేషన్‌ల సర్వర్‌లు రెండు వేర్వేరు సర్వర్ లుగా పనిచేయకపోవడంతో PPBLపై RBI.. పర్యవేక్షణ పరిమితిని విధించింది. ఇది వెంటనే అమల్లోకి రావడంతో దాని ప్రభావం కూడా వేగంగా పడింది. ఫిన్‌టెక్ కొత్త కస్టమర్‌లను బోర్డింగ్ ను ఆపివేయాల్సి వచ్చింది. సమగ్ర సిస్టమ్ ఆడిట్ నిర్వహించడానికి ఎక్స్ టర్నల్ ఆడిట్ సంస్థను నియమించింది.

మళ్లీ, గత సంవత్సరం.. అంటే అక్టోబర్ 2023లో, KYC నిబంధనలను కొనసాగించకపోవడంతో.. RBI 5.39 కోట్ల రూపాయల పెనాల్టీని విధించింది. గత వారం ఆర్‌బిఐ విధించిన ఆంక్షలతో పేటీఎం కార్యకలాపాలపై పరిస్థితి పరాకాష్టకు చేరుకుంది.

మీడియా నివేదికల ప్రకారం ఇది మాత్రమే కాదు, KYC, డిజిటల్ మోసాలు, మనీ లాండరింగ్ వంటివి ఉన్నాయి. KYC గురించి చెప్పాలంటే, పెద్ద సంఖ్యలో కస్టమర్‌లు వారి KYC ఆమోదం పొందలేదు. లేదా వారి PAN ను ధృవీకరించలేదు.

ఇవే కాకుండా.. RBI దర్యాప్తులో మరికొన్ని విషయాలు వెలుగుచూశాయి. ఒకే పాన్ నెంబర్ ను వంద కంటే ఎక్కువ ఖాతాలకు.. మరికొన్ని కేసుల్లో ఒకే పాన్ నెంబర్ ను వేలాది కస్టమర్ ఖాతాలకు లింక్ అయి ఉంది. ఆ ఖాతాలలోని లావాదేవీల విలువ కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉంది. ఇది కనీస KYCకి నిబంధనలను కూడా పాటించలేదు. మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇంకా, మ్యూల్ అకౌంట్స్ ను పెద్ద మొత్తంలో డోర్ మంట్ ఖాతాల నుంచి ఉపయోగించారు. పేటీఎం నిర్వహిస్తున్న 35 కోట్ల ఖాతాల్లో 31 కోట్ల ఖాతాలు యాక్టివ్ గా లేవని CNBC TV 18 రిపోర్ట్ తెలిపింది.

Published: February 19, 2024, 18:02 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.