Retairment: ఇలా చేస్తే రిస్క్ లేని రిటైర్మెంట్ జీవితం గ్యారెంటీ..

రిటైర్మెంట్ లైఫ్ కోసం ఏదైనా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారా? అయితే retairment లైఫ్ కోసం ఒక మంచి రిస్క్ లేని ప్లాన్ ఒకటి ఉంది.

హైదరాబాద్‌లోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో పనిచేస్తున్న 40 ఏళ్ల నరేంద్రకుహెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ కోసం మంచి పాలసీలు ఉన్నాయి. అయితే, తన పిల్లల చదువుల ఖర్చుల నేపథ్యంలో తన రిటైర్మెంట్ తరువాత పరిస్థితుల కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు నరేంద్రపెద్ద కొడుకు చదువు పూర్తి అయింది. ఇప్పుడు నెలకు 15 వేల రూపాయలను తన రిటైర్మెంట్ ప్లాన్ (retairment) కోసం ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నాడు. అయితే, తానూ పెట్టె పెట్టుబడిపై ఎటువంటి రిస్క్ ఉండకూడదని కోరుకుంటున్నాడు. ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా సురక్షితంగా ఉంది తగిన రాబడి రావాలనేది అతని ఆలోచన.

నరేంద్ర లానే మీరు కూడా ఉద్యోగం చేస్తూ రిటైర్మెంట్ లైఫ్(retairment) కోసం ఏదైనా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారా? అయితే అందుకోసం ఒక మంచి రిస్క్ లేని ప్లాన్ ఒకటి ఉంది. అది EPF లో ఉన్న స్వచ్చంధ పెట్టుబడి అంటే వాలంటరీ ఇన్వెస్ట్మెంట్. దీనినే VPF అంటారు. ఇది ఉద్యోగస్తులకు మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఇన్వెస్ట్ మెంట్ వలన టాక్స్ బెనిఫిట్స్ కూడా బాగా ఉంటాయి.

నరేంద్ర బేసిక్ సాలరీ నెలకు 30,000 రూపాయలు. అందులో 12% పీఎఫ్ కోసం వెళుతుంది. దీనికి కంపెనీ మరో 12% కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు నరేంద్ర తాను కోరుకుంటే.. తన పీఎఫ్ ఎకౌంట్ కు 12% కాకుండా.. కొంత సొమ్ము యాడ్ చేయవచ్చు. 12% కంటే ఎక్కువ పీఎఫ్ ఎకౌంట్ కి జమ చేస్తే దానిని VPF వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ అంటారు.

ఇలా ఎక్కువ జమ చేయడం కోసం ఏమీ పరిమితి లేదు. మీరు ఎంత కావాలనుకుంటే అంత ఇలా జమ చేయవచ్చు. ఒక ఎంప్లాయీ కావాలనుకుంటే తన బేసిక్ సాలరీ మొత్తం ఇందులో జమ చేసుకోవచ్చు. PF అనేది సామాజిక భద్రతకు సంబంధించిన పథకం. అన్ని చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే ఈ పథకంలో పెట్టుబడిపై ప్రభుత్వం అత్యధిక వడ్డీని ఇస్తుంది… VPF కి కూడా PF ఖాతాతో సమానమైన వడ్డీ(retairment) లభిస్తుంది.

ప్రభుత్వం PFపై వార్షిక ప్రాతిపదికన ఇటీవల వడ్డీని ప్రకటించింది… 2022-23 సంవత్సరానికి PFపై 8.15 శాతం వడ్డీని ప్రకటించింది. ఈ వడ్డీ PPF, NSC, KVP, RD -FD వంటి చిన్న పొదుపు పథకాల కంటే ఎక్కువగా ఉంది. అటువంటప్పుడు నరేంద్ర ఈ స్కీమ్‌లకు బదులుగా VPF లో పెట్టుబడి పెట్టడం ద్వారా తన రిటైర్మెంట్ లైఫ్(retairment) కోసం మరింత డబ్బును పోగుచేయవచ్చు.

నరేంద్ర ప్రతి నెలా VPFలో రూ. 15 వేలు పెట్టుబడి పెడితే… వార్షిక పెట్టుబడి రూ. 1.8 లక్షలు అవుతుంది… ఈ విధంగా 20 ఏళ్లలో మొత్తం రూ. 36 లక్షలు జమ అవుతుంది. అయితే గత ఏడాది పీఎఫ్ మొత్తాన్ని 8.15 శాతం వడ్డీ రేటు స్థిరంగా ఉంటుందని అనుకుంటే, దానిపై రూ.54.62 లక్షల వడ్డీ వస్తుంది. కాబట్టి పదవీ విరమణ సమయంలో అతనికి రూ.90.62 లక్షలు అందుతుంది. ఇది PF ఎకౌంట్ నుంచి వచ్చే సొమ్ముకు అదనం.

EPFలో సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. VPFలో పెట్టుబడి కూడా ఈ పరిధిలోకి వస్తుంది. EPF మరియు VPFలో ఏటా రూ. 2.5 లక్షల వరకు పెట్టుబడిపై పొందే వడ్డీ పన్ను రహితంగా ఉంటుంది. వార్షిక పెట్టుబడి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే… ఆ అదనపు మొత్తానికి వచ్చే వడ్డీని ఇన్వెస్టర్ వార్షిక ఆదాయంలో కలుపుతారు. దానిపై శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

VPFలో పెట్టుబడి పెట్టే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని ప్రారంభించడానికి, మీరు మీ కంపెనీ HR విభాగానికి ఈ విషయాన్ని చెప్పాలి. అక్కడ వారు మీకు ఒక ఫామ్ ఇస్తారు. అందులో మీరు నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో చెప్పాలి. దీని తర్వాత మీ VPF ఎకౌంట్ ఓపెన్ అవుతుంది. మీ జీతం పెరిగే కొద్దీ మీరు ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని కూడా పెంచుకోవచ్చు. మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో ఉండి. డబ్బు ఆదా చేసే స్థితిలో ఉన్నట్లయితే… మీరు VPFలో పెట్టుబడి(retairment) పెట్టడం మీకు బాగా సహాయపడుతుంది అని పన్ను – పెట్టుబడి నిపుణుడు బల్వంత్ జైన్ చెబుతున్నారు. దీని వలన మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. మెరుగైన రాబడితో పాటు, మీరు పన్ను ఆదా విషయంలో భారీ పొదుపులను కూడా చేయవచ్చు అని బల్వంత్ జైన్ వివరిస్తున్నారు.

ఇది కాకుండా ఎవరైనా సరే పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేయడానికి, డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో కూడా పెట్టుబడి పెట్టాలి. VPF లో పెట్టుబడి చేయడం వల్ల రుణానికి పరిహారం లభిస్తుంది… VPF లో ఇన్వెస్ట్ చేయడం మీ రిటైర్‌మెంట్‌కు(retairment) బీమాగా పని చేస్తుంది. మీరు మీ రిటైర్డ్ జీవితాన్ని సుఖంగా గడపాలనుకుంటే, తగినంత డబ్బు కోసం ఏర్పాట్లు చేసుకోండి. మీరు దీన్ని ఎంత త్వరగా ప్రారంభిస్తే.. అంత మంచిది. దానివలన రిటైర్మెంట్ సమయానికి పెద్ద మొత్తంలో కార్పస్ సిద్ధంగా ఉంటుంది. ఇది మీకు వృద్ధాప్యంలో పదవీ విరమణ కోసం పెద్ద కార్పస్ పేరుకుపోతుంది… ఇది వృద్ధాప్యంలో చాలా సహాయకారిగా ఉంటుంది.

Published: September 29, 2023, 11:01 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.