మిమ్మల్ని ధనవంతులను చేసే 50:30:20 రూల్

ఇల్లు లేదా కారు నిర్వహణ ఖర్చులు వంటి స్వల్పకాలిక అవసరాలను తీర్చుకోవచ్చు. పొదుపు ఉద్దేశం డబ్బు అవసరమైనప్పుడు సులభంగా అందుబాటులో ఉంచడం.

రాబిన్ తన మొదటి ఉద్యోగం సంపాదించాడు… జీతం కోసం ఎదురు చూస్తున్నాడు… అతనికి చాలా ప్రణాళికలు ఉన్నాయి. కొత్త మొబైల్, కొత్త బట్టలు, వెకేషన్ ప్లానింగ్ ఇలా… కాలేజీ జీవితం నుండి బయటకు వచ్చి కొత్తగా
సంపాదించడం మొదలుపెట్టే యువతరానికి ఇలాంటి కోరికలు చాలా ఉంటాయి. దీని వల్ల నష్టమేమీ లేదు… కాకపోతే ఇవన్నీ పరిమితుల్లోనే ఉండాలి. అలా అయితే.. మొదటి 5-6 నెలల జీతం మీ అభిరుచుల కోసం ఖర్చుపెట్టుకోవచ్చు. అయితే ఆ తర్వాత పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం అలవాటు చేసుకోవాలి. దీని కోసం మీరు జీతంలో ఎంత మొత్తాన్ని పొదుపు చేయాలి అనేది ముందుగా తెలుసుకోవడం ముఖ్యం.

తమకు బాధ్యతలేమీ లేవు కదా అలాంటప్పుడు ఎందుకు పొదుపు చేయాలి అని చాలామంది అనుకుంటారు. కానీ డబ్బు ఆదా చేయడం వల్ల మీరు ఊహించదానికంటే మెరుగైన జీవితం లభిస్తుంది. నెలవారీ జీతంలో పొదుపు మొత్తాన్ని నిర్ణయించడానికి, మీరు జీతాన్ని కేటగిరీలుగా విభజించాలి… ఈ మూడు కేటగిరీలను చూస్తే.. అవసరం, కోరికలు, పొదుపు. ఈ వ్యక్తిగత ఫైనాన్స్ నియమాన్ని 50:30:20 నియమం అని కూడా అంటారు. ఈ నియమం సాధారణ పెట్టుబడితో పాటు నెలవారీ బడ్జెట్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది. మీ జీతంలో 50 శాతం ఇంటి అద్దె, గృహ రుణ వాయిదాలు, విద్యుత్, ఇంకా నిర్వహణ బిల్లులు,
కిరాణా వంటి వాటికి కేటాయించాలి. మీ రోజువారీ జీవితాన్ని నడపడానికి ఇవి అవసరం. ఈ ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశాలు చాలా తక్కవగా ఉంటాయి.

నెలవారీ ఆదాయంలో కొంత భాగం అవసరాలకు వెళుతుంది. ఇవి తప్పనిసరి కాదు. కానీ మీరు మీ లైఫ్ స్టైల్ కోసం లేదా ఆనందం కోసం వాటిపై ఖర్చు చేస్తారు.రెస్టారెంట్‌లో తినడం, మల్టీప్లెక్స్‌లో సినిమా చూడటం, ప్రయాణం చేయడం, వాచ్ లేదా మొబైల్ వంటి వస్తువులను కొనడం, జిమ్, యోగా క్లాస్ వంటివి… ఇలాంటి ఖర్చుల కోసం మీ జీతంలో 30 శాతాన్ని ఉంచుకుంటే… ఆర్థిక క్రమశిక్షణను ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు కోరుకున్న జీవితాన్ని గడపడానికి మీకు స్వేచ్ఛ లభిస్తుంది.

మీరు మీ జీతంలో కనీసం 20 శాతాన్ని పొదుపు, పెట్టుబడి కోసం కేటాయించాలి. వీలైతే, మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం, 30 శాతం ఆదా చేయడంపై దృష్టి పెట్టండి… ఇది మీ ఆర్థిక స్థితిని బలంగా మారుస్తుంది.
ఉదాహరణకు, రాబిన్ జీతం రూ. 30 వేలు. ఇందులో 50 శాతం అంటే 15 వేల రూపాయలు నిత్యావసర ఖర్చుల కోసం… 30 శాతం అంటే 9 వేల రూపాయలు అనవసర ఖర్చుల కోసం. .. కనీసం 20 శాతం అంటే 6 వేల రూపాయలను ఆదా చేయాలి.

రాబిన్ ముందుగా తన నెలవారీ పొదుపు నుండి అత్యవసర నిధిని క్రియేట్ చేయాలి. దాని పరిమాణం 3 నుండి 6 నెలల అవసరమైన ఖర్చులకు సమానంగా ఉండాలి. ఉద్యోగ నష్టం, వైద్యం లేదా ఊహించని
ఖర్చులను కవర్ చేయడానికి అత్యవసర నిధిని ఉపయోగించవచ్చు. అత్యవసర నిధి ఉండటం వలన కష్ట సమయాల్లో పెట్టుబడులను నిలిపివేయడం లేదా రుణాలు తీసుకోవలసిన అవసరం ఉండదు.
పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బుకు కొరత ఉండదు. కావాలంటే ప్రతి నెలా మీ పొదుపు మొత్తాన్ని అత్యవసర నిధిలో పెట్టవచ్చు.

మీరు ఎమర్జెన్సీ ఫండ్ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. లేదా మీరు పొదుపు, పెట్టుబడి రెండింటినీ స్థిర నిష్పత్తిలో చేయవచ్చు. మీరు పొదుపులో 10 శాతాన్ని అత్యవసర నిధితో పాటు
పెట్టుబడిలో పెట్టవచ్చు పెట్టుబడి పెట్టే ముందు మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి.మొదటిది- పెట్టుబడి ఉద్దేశ్యం ఏమిటి… విద్య, కారు, ఇల్లు కొనడం, వివాహం లేదా పదవీ విరమణ
ప్రణాళిక వంటివి… రెండవది- ఎంతకాలం పెట్టుబడి పెట్టాలి? మూడవది- సమయం పూర్తయిన తర్వాత ఎంత డబ్బు అవసరం? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీరు ప్రతి నెలా ఎక్కడ, ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ణయిస్తాయి.

ఉదాహరణకు, మీరు దీర్ఘకాలిక లక్ష్యం కోసం అంటే 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్… అయితే మీరు స్వల్పకాలానికి అంటే 1 నుండి 3 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు డెట్ మ్యూచువల్ ఫండ్లలో SIP చేయవచ్చు… పెట్టుబడిని ప్రారంభించే ముందు, ఖచ్చితంగా ఆర్థిక సలహాదారు నుండి సలహా తీసుకోండి.చాలా మంది యువత పొదుపు, పెట్టుబడిని ఒకేలా భావిస్తారు… కానీ అది అలా కాదు…

నిజానికి, పొదుపు అంటే మీరు తక్కువ డబ్బుతో పెద్ద ఫండ్ ని ఏర్పాటు చేసుకోవడం. తద్వారా మీరు ఆర్థిక అత్యవసర అవసరాలు.. అంటే కష్ట సమయాల్లో డబ్బు అవసరం అయినప్పుడు.. అంటే, వైద్య ఖర్చులు,
ఇల్లు లేదా కారు నిర్వహణ ఖర్చులు వంటి స్వల్పకాలిక అవసరాలను తీర్చుకోవచ్చు. పొదుపు ఉద్దేశం డబ్బు అవసరమైనప్పుడు సులభంగా అందుబాటులో ఉంచడం. నగదుగా ఉంచుకోవడం లేదా పొదుపు ఖాతాలలో
ఉంచిన మీ డబ్బును సేవింగ్స్ అంటారు. మరోవైపు, ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి కారణం.. ఆర్థిక లాభాలాను సంపాదించడానికే. పెట్టుబడి లక్ష్యం రాబడిని సంపాదించడమే. మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, ప్రాపర్టీ, బంగారంలో డబ్బును ఇన్వెస్ట్ చేయడాన్ని ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. కంపెనీ పనితీరు, మార్కెట్ పరిస్థితులపై రాబడులు ఆధారపడి ఉంటాయి.

Published: April 22, 2024, 18:11 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.