పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా బ్యాంక్ వాళ్లూ చెప్పని ఈ 6 అంశాలనూ చెక్ చేయకపోతే...!

పర్సనల్ లోన్ అనేది హోమ్ లోన్, కార్ లోన్ లేదా ఎడ్యుకేషన్ లోన్ కంటే భిన్నంగా ఉంటుంది. దీనికి కారణం హోమ్ లోన్ తీసుకోవడం ద్వారా మీరు ప్రాపర్టీని నిర్మిస్తారు.

మనకు అకస్మాత్తుగా డబ్బు అవసరం. కాని అది అందుబాటులో లేనప్పుడు … పర్సనల్ లోన్‌ తీసుకుంటాం. దీనికి పెద్దగా పేపర్‌వర్క్ ఉండదు. తనఖా పెట్టాల్సిన ఇబ్బంది లేదు. పైగా 2-3 రోజుల్లో ఖాతాలో డబ్బులు పడిపోతాయి. అందుకే ఎక్కువమంది వ్యక్తిగత రుణాన్ని ఎంచుకుంటారు. లోన్ కి అర్హత ఉంటే.. బ్యాంకులు వెంటనే లోన్ ను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే వ్యక్తిగత లోన్ పొందడం చాలా సులభం. కానీ మీరు పర్సనల్ లోన్ తీసుకునేముందు ఈ 6 విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. నిజానికి బ్యాంకులు కూడా ఈ విషయాలను మీకు చెప్పవు.

1) పర్సనల్ లోన్ అనేది అన్‌సెక్యూర్డ్ లోన్. ఈ లోన్ కోసం ఎలాంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. పర్సనల్ లోన్‌పై వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం. అంటే దాదాపు 11 % శాతం నుంచి మొదలై 44 శాతం వరకు ఉంటుంది. పర్సనల్ లోన్ వంటి ఖరీదైన లోన్ ను తీసుకునేటప్పుడు, కనీసం 5-6 బ్యాంకులతో మాట్లాడండి. దీనివల్ల మీరు తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందవచ్చు. వడ్డీ రేటులో కొద్ది పాటి తేడా కూడా.. లోన్ మొత్తం వ్యయంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.

బ్యాంకుల వెబ్‌సైట్ల ప్రకారం, వ్యక్తిగత రుణానికి SBI – 11.15 శాతం నుంచి 14.30 శాతం వసూలు చేస్తుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే PNB 11.40 శాతం నుంచి 16.95 శాతం వసూలు చేస్తుంది. HDFC బ్యాంక్ 10.75 శాతం నుంచి 24 శాతం వసూలు చేస్తుంది. అయితే ICICI బ్యాంక్ 10.80 శాతం నుంచి 16 శాతం మధ్య వడ్డీ రేట్లు వసూలు చేస్తుంది.

2) వడ్డీ రేట్లతో పాటు, వ్యక్తిగత రుణాలపై బ్యాంకులు ఇతర ఛార్జీలను కూడా విధిస్తాయి. వీటిలో ఒకటి ప్రాసెసింగ్ ఫీజు. లోన్ పొందడానికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా లోన్ మొత్తంలో 1 శాతం నుంచి 3 శాతం మధ్య ఉంటుంది. చాలా సార్లు, ప్రాసెసింగ్ రుసుముపై కనిష్ట , గరిష్ట మొత్తం కూడా సెట్ చేస్తారు. అదేవిధంగా, వ్యక్తిగత రుణాల ప్రీ-పేమెంట్ లేదా ఫోర్‌క్లోజర్ విషయాన్ని చెక్ చేయాలి. కొన్నిసార్లు ప్రీ-పేమెంట్ ఛార్జీలు చెల్లించాలి. అంతే కాదు, EMI చెల్లింపులు చేయలేని సందర్భంలో పెనాల్టీలు కూడా చెల్లించాలి. కాబట్టి, మీరు లోన్‌ని ఎంచుకునే ముందు, ఈ ఛార్జీలన్నింటి గురించి తెలుసుకోండి.

3) పర్సనల్ లోన్ తీసుకునే ముందు, మీరు వాయిదాను తిరిగి చెల్లించగలరా లేదా అని ఖచ్చితంగా చెక్ చేయండి. ముందుగా, EMI మొత్తాన్ని తెలుసుకోవడానికి వీలుగా.. పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్‌లో లోన్ మొత్తం, వడ్డీ రేటు, కాలవ్యవధిని ఎంటర్ చేయండి. దీని తర్వాత, మీ దగ్గరున్న క్యాష్ ను లెక్కించండి. అంటే ఎంత ఆదాయం వస్తోంది, ఎంత ఖర్చు అవుతుంది… ఇలా దీనినీ విశ్లేషించాలి. మీరు సులభంగా తిరిగి చెల్లించగలిగేంత మొత్తాన్నే EMIగా ఉంచండి. EMI అవసరమైన ఖర్చులపై ప్రభావం చూపకూడదు. పెట్టుబడులు, అన్ని లోన్ EMIలు మీ ఆదాయంలో 30-40 శాతానికి మించకూడదన్న విషయాన్ని మర్చిపోవద్దు.

4) పర్సనల్ లోన్ కాలవ్యవధిని తెలివిగా ఎంపిక చేసుకోవాలి. తక్కువ కాల వ్యవధి అంటే అధిక EMI కట్టాలి. అయితే ఎక్కువ కాలం అంటే.. ఎక్కువ వడ్డీ నిచెల్లించాలి. ఉదాహరణకు, మీరు 3 సంవత్సరాలకు 11 శాతం వడ్డీ రేటుతో 5 లక్షల రూపాయల లోన్ తీసుకుంటే, EMI 16,369 రూపాయలు అవుతుంది. మీరు 3 సంవత్సరాలకు వడ్డీగా 89,297 రూపాయలు చెల్లించాలి. అదే మొత్తంలో లోన్‌కు 5 సంవత్సరాల కాలవ్యవధిని ఎంచుకుంటే.. EMI 10,871 రూపాయలకు తగ్గుతుంది. అయితే మీరు వడ్డీగా ₹1,52,273 చెల్లించాలి. లోన్ కాలవ్యవధిని 2 సంవత్సరాలు పొడిగిస్తే మీరు 62,976 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

(https://groww.in/calculators/personal-loan-emi-calculator)

5) లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, బ్యాంకులు మీ ఆదాయం, వయసు, ఉద్యోగ స్థిరత్వం, క్రెడిట్ స్కోర్‌లను తనిఖీ చేస్తాయి. దీని ఆధారంగా కొన్నిసార్లు బ్యాంకులు మీకు అవసరమైన దానికంటే ఎక్కువ రుణాన్ని అందిస్తాయి. మీ అవసరాలను బేరీజు వేసుకుని, లోన్ మొత్తాన్ని నిర్ణయించుకుని, దానికి కట్టుబడి ఉండడం మంచిది. ఎంత ఎక్కువ లోన్ తీసుకుంటే, వడ్డీ అంత ఎక్కువగా ఉంటుంది.

6) త్వరితగతిన లాభాలు పొందాలంటే పర్సనల్ లోన్ తీసుకుని స్టాక్ మార్కెట్ లేదా ఏదైనా క్రమబద్ధీకరించని లేదా సందేహాస్పదమైన పథకంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచించకండి. ఇందులో రాబడితో పాటు రిస్క్ కూడా ఎక్కువే. మీ పెట్టుబడి మీద వచ్చే రాబడి తక్కువగా ఉంటుంది. అంటే మీరు రుణం తీసుకున్న రేటు కంటే పెట్టుబడిపై రాబడి తక్కువగా ఉంటుంది. లేదా ఏదైనా కారణాల వల్ల డబ్బు పోగొట్టుకుంటే, మీరు పెద్ద ఆర్థిక ఇబ్బందుల్లో పడవచ్చు.

పర్సనల్ లోన్ అనేది హోమ్ లోన్, కార్ లోన్ లేదా ఎడ్యుకేషన్ లోన్ కంటే భిన్నంగా ఉంటుంది. దీనికి కారణం హోమ్ లోన్ తీసుకోవడం ద్వారా మీరు ప్రాపర్టీని నిర్మిస్తారు. ఆటో లోన్ వల్ల వాహనం వస్తుంది. కానీ ఎడ్యుకేషన్ లోన్… కానీ పర్సనల్ లోన్‌లో అలాంటి ప్రయోజనం ఉండదు. ఇక్కడ మీరు మీ వ్యాపారాన్ని నడపడానికి రుణం తీసుకుంటారు. దానిపై మీరు అధిక వడ్డీని చెల్లిస్తారు. అటువంటి పరిస్థితిలో, కచ్చితంగా అవసరమైనప్పుడు మాత్రమే వ్యక్తిగత రుణాన్ని తీసుకోండి. అవసరమైన దానికంటే ఎక్కువ రుణం తీసుకోకపోవడమే బెటర్. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ అభిరుచిని నెరవేర్చుకోవడానికి లేదా ఎక్కువ రాబడిని సంపాదించడానికి.. రుణం తీసుకుని మాత్రం పెట్టుబడి పెట్టకండి.

Published: April 20, 2024, 17:19 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.