మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?

SIPని ప్రారంభించడానికి మీ వద్ద పెద్ద మొత్తం లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి నెలా చెల్లించగలిగే మొత్తంతో

కరీం పేపర్ చదువుతూ స్నేహితుడితో మాట్లాడుతున్నాడు
కరీం: విద్య ఎంత ఖరీదైంది?
సల్మాన్- అవును…అది ఖరీదు అయిపోయింది కానీ ఇప్పుడు ఏం చదువుతావు…
కరీం- తమ్ముడు, నాకు చదువుకోవడం ఇష్టం లేదు…కానీ నా కొడుకు చదువుతాడు…
సల్మాన్- హే, మీ అబ్బాయికి ఇప్పుడు ఒక సంవత్సరం… ఇప్పటి నుండి ఎందుకు టెన్షన్ పడుతున్నావ్… చదువుకు
చాలా టైం ఉంది…
కరీం- తమ్ముడూ, ద్రవ్యోల్బణం మరీ ఎక్కువైంది…నీ కొడుకు చదువు గురించి ఇప్పుడు ఆలోచించకుంటే ఇంకెందుకు
ఆలస్యం…
సల్మాన్-ఆలస్యం…ఏం ఆలస్యమైంది అన్నయ్యా…
కరీం- తమ్ముడు చూడు… 20 ఏళ్ల తర్వాత చదువుకు రూ.2 కోట్లు ఖర్చు చేసేంత డబ్బు నా దగ్గర లేదు… ఇప్పటి
నుండే ప్లానింగ్ చేయాలి…
సల్మాన్- నిజమే మిత్రమా…అయితే పిల్లల చదువు కోసం ఎలా ప్లాన్ చేయాలి?

కరీం ఆందోళన న్యాయమే…చిన్నవయసులో మీ పిల్లల చదువు కోసం ప్లాన్ చేయకపోతే…అతను ఉన్నత
చదువుల కోసం కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నప్పుడు.. మీరు ఆ చదువుకు అయ్యే ఖర్చులను భరించాల్సి రావచ్చు
అంత ఆర్థిక స్థోమత లేకపోతే… మీరు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. దానిపై వడ్డీ చెల్లించాలి. అది చెల్లించేసరికీ మీ
వయస్సు దాటిపోతుంది. లేదా మీ పిల్లలు.. ఉద్యోగం సంపాదించాక ఈ ఎడ్యుకేషన్ లోన్ భారాన్ని మోయాల్సి
ఉంటుంది. పిల్లల చదువుల కోసం సమయానికి ప్రణాళికలు వేసుకోలేకపోతే… ఆహారంలో కంటే చదువులో ఉన్న
ద్రవ్యోల్బణం మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తుంది. అయినా చింతించకండి. ఎందుకంటే ఈ రోజు చిన్న మొత్తాలను
దాచుకుంటూ వెళితే.. పెద్ద కార్పస్‌ని ఏర్పాటు చేయవచ్చు. సో, మీరు మీ పిల్లల చదువు గురించి ఆందోళన
చెందాల్సిన అవసరం లేదు.

వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం.. అంటే గత కొన్ని దశాబ్దాలుగా రిటైల్ ద్రవ్యోల్బణం రేటు దాదాపు 6 శాతంగా
ఉంది. విద్యా వ్యయం 11-12 శాతం చొప్పున పెరుగుతోంది. అంటే విద్యా వ్యయం ప్రతి 6 నుండి 7
సంవత్సరాలకు దాదాపు రెట్టింపు అవుతుంది.

2023 సంవత్సరంలో బ్యాంక్ బజార్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రముఖ బిజినెస్ స్కూల్‌లో
2-సంవత్సరాల MBA ప్రోగ్రామ్ ఖర్చు 2003 సంవత్సరంలో రూ. 3 లక్షలుగా ఉంది. ఇది 2013 సంవత్సరంలో
రూ.16.6 లక్షలకు పెరిగింది. 2023 సంవత్సరంలో రూ. 24.6 లక్షల రూపాయిలు అయింది. గత 20 ఏళ్లలో
విద్యారంగ ద్రవ్యోల్బణం 11 శాతం చొప్పున పెరిగింది.

భవిష్యత్తులో కూడా విద్యా ద్రవ్యోల్బణం 11 శాతం చొప్పున పెరిగి, 2023లో రూ.24.6 లక్షలు ఉన్న ఫీజు…
2028లో రూ.41 లక్షల 45 వేలకు పెరుగుతుందని అనుకుందాం. 2033 సంవత్సరం అంటే 10 సంవత్సరాల
తర్వాత రూ. 69.8 లక్షలు అవుతుంది. 2038లో రూ. 1 కోటి 17 లక్షలు అవుతుంది. 2043లో రూ.1 కోటి 98
లక్షలు అవుతుంది.

2023లో పుట్టి ప్రస్తుతం ఏడాది వయసున్న కరీం కొడుకు… 2043లో అంటే 20 ఏళ్ల వయసులో ఎంబీఏలో
అడ్మిషన్ తీసుకుంటే కరీం రెండేళ్ల చదువుకు దాదాపు రూ.2 కోట్లు ఖర్చు అవుతుంది. ఏ మధ్యతరగతి వ్యక్తి అయినా
ఒకేసారి రూ.2 కోట్లు ఏర్పాటు చేయడం అంత తేలిక కాదు. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డ పుట్టిన కొంత వ్యవధిలో
ఉన్నత చదువులు చదివించాలన్న కరీం ఆలోచన కచ్చితంగా నిజమే.

మీ పిల్లవాడు 15-20 సంవత్సరాల తర్వాత ఏమి చదువుతాడో కనుక్కోవడం కష్టం. కానీ కొన్ని ప్రాథమిక
ప్రశ్నలకు సమాధానాలు అవసరం. ఇలా ఎన్ని సంవత్సరాల తర్వాత ఉన్నత చదువులకు డబ్బు కావాలి అనేది
తెలియాలి. ద్రవ్యోల్బణం కాలిక్యులేటర్ సహాయంతో మీరు మీ బిడ్డ తీసుకోవాలనుకుంటున్న కోర్సు భవిష్యత్తు ధరను
మీరు తెలుసుకోవాలి. ద్రవ్యోల్బణం కాలిక్యులేటర్… ద్రవ్యోల్బణం ప్రకారం మీ ప్రస్తుత ఖర్చులను కలపడం ద్వారా మీ
భవిష్యత్తు ఖర్చును లెక్కిస్తుంది… ద్రవ్యోల్బణం రేటుతో పెరుగుతుందని అనుకుందాం. ద్రవ్యోల్బణం 11 శాతం చొప్పున
పెరుగుతుంది అనుకుంటే.. ఈరోజు రూ. 1 లక్ష ఖరీదు చేసే కోర్సు, 10 సంవత్సరాల తర్వాత మీరు ఆ కోర్సు
కోసం రూ. 2 లక్షల 84 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఎడ్యుకేషన్ ఫండ్‌ను స్టార్ట్ చేసేటప్పుడు సమయపాలన చాలా ముఖ్యం… మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం
ప్రారంభిస్తే… మీ డబ్బు కాంపౌండింగ్ ద్వారా వృద్ధి చెందడానికి అంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. చిన్న
మొత్తాన్ని అయినా పెట్టుబడిగా పెట్టడం ప్రారంభిస్తే.. అది కొంతకాలానికి పెద్ద కార్పస్ గా మారుతుంది.

పెట్టుబడి కోసం సరైన ఆప్షన్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, ఎంప్లాయీ
ప్రావిడెంట్ ఫండ్ అంటే EPF, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే PPF, ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే FD , కుమార్తె కోసం
సుకన్య సమృద్ధి యోజన వంటి అనేక పెట్టుబడి ఆప్షన్ లు అందుబాటులో ఉన్నాయి.

మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో 12 శాతం వరకు రాబడిని పొందవచ్చు. 2023-24 ఆర్థిక
సంవత్సరానికి EPFపై వడ్డీ 8.25 శాతం. PPFలో సంవత్సరానికి 7.1 శాతం. బ్యాంక్ FDలో 7 నుండి 8 శాతం,
సుకన్య సమృద్ధి యోజన 8.2 శాతం వడ్డీ రేటును కలిగి ఉంది. మీరు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని ఇచ్చే
పెట్టుబడి ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Question-1)- విద్యా ద్రవ్యోల్బణం రేటు 11 శాతం. దీర్ఘకాలిక కోణంలో అంటే 15-20 సంవత్సరాలు, ఈక్విటీ
మ్యూచువల్ ఫండ్స్, EPF, PPF, FD, సుకన్య సమృద్ధి యోజనలో పిల్లల చదువు కోసం డబ్బును పెట్టుబడి
పెట్టడానికి ఏది ఎంచుకోవాలి. సరైన పెట్టుబడిని ఎంచుకోకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రిటర్న్‌లు స్థిరంగా ఉండవు. అది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
అయితే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుండి దీర్ఘకాలంలో మంచి రాబడిని ఆశించవచ్చు. కరీం కొడుకు 2043-44
సంవత్సరంలో ఎంబీఏ చేస్తాడు అనుకుందాం. విద్యా ఖర్చుల ద్రవ్యోల్బణం 11% చొప్పున పెరిగితే అప్పుడు MBA
ఖర్చు దాదాపు రూ.2 కోట్లు అవుతుంది. కరీం ఇక నుండి ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలి?

కావలసిన లక్ష్యం మొత్తం రూ. 2 కోట్లు. పెట్టుబడి వ్యవధి 20 ఏళ్లు. ఆశించిన రాబడి 12 శాతం. దీని ప్రకారం,
అతను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో నెలవారీ రూ.20 వేల SIPని ప్రారంభించాలి. ఈ కాలంలో అతను మొత్తం
రూ.48.50 లక్షలు పెట్టుబడి పెడతాడు.

ప్రశ్న-2)- 20 ఏళ్లలో పిల్లల చదువు కోసం రూ.2 కోట్ల కార్పస్‌ను ఏర్పాటుచేయడమే లక్ష్యం. దీని కోసం ఏ
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టాలి?

మీరు విద్య వంటి లక్ష్యం కోసం పెట్టుబడి పెట్టినప్పుడు… డబ్బును సేవ్ చేసుకుంటూ వెళ్లడంతో పాటు, ఈ డబ్బును
సకాలంలో విత్ డ్రా చేసుకోవడానికి మీరు తగిన వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి.

Question-3)- మీరు ఎడ్యుకేషన్ కార్పస్ దగ్గరకు చేరుకున్నప్పుడు, మీరు డబ్బును విత్‌డ్రా చేసి ఎక్కడ ఉంచాలి?

SIPని ప్రారంభించడానికి మీ వద్ద పెద్ద మొత్తం లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ప్రతి నెలా
చెల్లించగలిగే మొత్తంతో ఇప్పుడు పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. మీ ఆదాయాలు పెరిగే కొద్దీ SIP మొత్తాన్ని
పెంచుతూ ఉండండి. దీని కోసం, మీరు SIPని ప్రారంభించేటప్పుడు స్టెప్-అప్ లేదా టాప్-అప్ SIP ఆప్షన్ ను
ఎంచుకోవచ్చు.

మీరు మీ పిల్లల చదువుకో లేదా మరేదైనా లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేస్తే.. పెట్టుబడి పెట్టడం మర్చిపోకండి. అయితే మీ
ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీని కనీసం ఏడాదికి ఒకసారి అయినా సమీక్షించండి. మీరు లాంగ్ టెర్మ్ గోల్స్ కోసం ప్లాన్
చేస్తే.. జీవితంలో అనేక ఒడిదొడుకులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల, ఉద్యోగం కోల్పోవడం,
తీవ్రమైన అనారోగ్యం లేదా మరణం.. ఇలాంటివాటికి ముందే తగినంత కవరేజ్ తో టెర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్ ను
కట్టండి. ఇలాంటివాటిని ముందే ప్లాన్ చేయండి. అప్పుడు మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది.

Published: April 19, 2024, 17:33 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.