క్రెడిట్ కార్డ్ లోన్ పర్సనల్ లోన్ ఏది బెటర్?

మీరు క్రెడిట్ కార్డ్ EMI ప్రయోజనాలను చూస్తే.. మీకు వెంటనే రుణం లభిస్తుంది. మినిమమ్ డాక్యుమెంట్స్ సరిపోతాయి.

మీరు ఖరీదైన వస్తువును కొనుగోలు చేయాలనుకుంటే, క్రెడిట్ కార్డ్ EMI లేదా పర్సనల్ లోన్ లో ఏది తీసుకోవాలి? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. రెండు రకాల రుణాలకూ వాటి స్వంత లాభాలు, నష్టాలు ఉన్నాయి. రెండూ వేర్వేరు ఆర్థిక వ్యూహాలను అనుసరిస్తాయి. మీకు పెద్ద కొనుగోలు కోసం నిధులు కావాలంటే, వ్యక్తిగత రుణం సరైన ఎంపిక కావచ్చు. దీనిలో మీరు క్రమపద్ధతిలో రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. అయితే సాధారణ షాపింగ్, ప్రమోషనల్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందడం కోసం అయితే, EMI ఆప్షన్ తో క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ రెండింటినీ వేర్వేరు పేరామీటర్స్ ప్రకారం పోల్చి చూద్దాం. ముందుగా రుణ పరిమితి గురించి మాట్లాడుకుందాం

పర్సనల్ లోన్‌లో రుణ పరిమితి సాధారణంగా మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే, క్రెడిట్ కార్డ్‌తో పోలిస్తే మీరు ఇందులో పెద్ద రుణాన్ని పొందవచ్చు. దీనికి విరుద్ధంగా, క్రెడిట్ కార్డ్ లోన్ అనేది మీ కార్డులో ఉన్న లిమిట్ ప్రకారం ఉంటుంది.

ఇప్పుడు డిస్బర్స్‌మెంట్ గురించి మాట్లాడుకుందాం. అంటే లోన్ ఎలా పొందాలి? వ్యక్తిగత లోన్‌లో, లోన్ ఆమోదం పొందిన తర్వాత, మీ బ్యాంక్ ఖాతాకు ఆ మొత్తం ఒకేసారి ట్రాన్స్ ఫర్ అవుతుంది. దీనికి కొన్ని రోజులు పట్టవచ్చు. దీనికి విరుద్ధంగా, క్రెడిట్ కార్డ్ లోన్ వెంటనే అందుబాటులోకి వస్తుంది. మీ క్రెడిట్ పరిమితి ఎంత మిగిలి ఉంటే అంత మొత్తాన్ని వెంటనే లోన్ గా పొందవచ్చు.

మీరు ఈ మొత్తంతో కొనుగోలు చేసి, EMIలో తిరిగి చెల్లించవచ్చు. డాక్యుమెంటేషన్ గురించి చూస్తే.. పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తున్నప్పుడు, ఇన్ కమ్ ప్రూఫ్.. ఉపాధి ధృవీకరణ పత్రం, ఐడెంటిటీ ప్రూఫ్ వంటి ముఖ్యమైన పత్రాలు ఇవ్వాలి. అయితే చాలా క్రెడిట్ కార్డ్ లోన్‌లలో, అదనపు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కార్డ్ తీసుకునేటప్పుడు, అవసరమైన చాలా డాక్యుమెంట్స్ ను ఇస్తారు.

ఇప్పుడు వడ్డీ రేటు గురించి మాట్లాడుకుందాం. వ్యక్తిగత రుణ వడ్డీ రేట్లు ఫిక్సుడ్ గా ఉంటాయి. మీ క్రెడిట్ స్కోర్, లోన్ రూల్స్ బట్టి వీటిని నిర్ణయిస్తారు. ఇంట్రస్ట్ రేటు.. క్రెడిట్ కార్డ్ రుణాల కంటే తక్కువగా ఉండవచ్చు.

క్రెడిట్ కార్డ్ లోన్‌పై EMI కన్వర్షన్ కు కూడా వివిధ వడ్డీ రేట్లు ఉండవచ్చు. మరో ముఖ్యమైన పారామీటర్ ఏమిటంటే.. లోన్ రకం. పర్సనల్ లోన్ అనేది వాయిదాల మీద చెల్లించే రుణం. దీనిలో నిర్ణీత కాలవ్యవధిలో వడ్డీతో కలిసి నిర్ణీత మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డ్ రుణం ఒక రివాల్వింగ్ క్రెడిట్ లైన్. అంటే, మీరు మీ క్రెడిట్ లిమిట్ వరకు రుణం తీసుకోవచ్చు. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. ఆపై మళ్లీ రుణం తీసుకోవచ్చు. ఈ రెండు రుణాల లాభాలు, నష్టాలను మనం పరిశీలిస్తే…

పర్సనల్ లోన్‌లో భారీ మొత్తం అందుబాటులో ఉంటుంది. వడ్డీ రేటు 10.5 నుండి 24 శాతం మధ్య ఉండవచ్చు. లోన్ కాలపరిమితి 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల మధ్య ఉండవచ్చు. అయితే క్రెడిట్ కార్డ్ EMIలో వడ్డీ రేటు 12.5 శాతం నుండి మొదలవుతుంది. ఇది బ్యాంకును బట్టి మారవచ్చు.

పర్సనల్ లోన్ సకాలంలో తిరిగి చెల్లించడం వలన మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది. పర్సనల్ లోన్ ప్రతికూలతలను చూస్తే.. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులకు వడ్డీ రేటు పెరుగుతుంది. అంటే, వారికి రుణం చాలా ఖరీదైనది కావచ్చు. క్రెడిట్ హిస్టరీ బాగాలేకపోతే.. క్రెడిట్ స్కోర్ సరిగా లేకపోతే.. అప్పుడు రుణం పొందడంలో ఇబ్బంది ఉంటుంది. మీరు గడువు కంటే ముందే రుణాన్ని తిరిగి చెల్లించాలనుకుంటే, మీరు ముందస్తు చెల్లింపు రుసుము లేదా ప్రీ-క్లోజర్ ఫీజును చెల్లించాల్సి రావచ్చు.

మీరు క్రెడిట్ కార్డ్ EMI ప్రయోజనాలను చూస్తే.. మీకు వెంటనే రుణం లభిస్తుంది. మినిమమ్ డాక్యుమెంట్స్ సరిపోతాయి. స్వల్పకాలంలో క్యాష్ ఫ్లో కావాలనుకుంటే.. ఈ లోన్ ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక విలువ ఉన్న ట్రాన్జాక్షన్స్ ను EMIగా మార్చవచ్చు. తిరిగి చెల్లించే వ్యవధిని 3 నుండి 24 నెలలుగా ఉంచుకోవచ్చు. ప్రతికూలతల గురించి చూస్తే.. క్రెడిట్ కార్డ్ రుణాలు దీర్ఘకాలంలో మరింత ఖరీదైనవిగా ఉంటాయి. ప్రత్యేకించి మీరు ముందుగా బ్యాలెన్స్‌ను చెల్లించకపోతే… ఈ రుణాలు నేరుగా మీ క్రెడిట్ కార్డ్ లో అందుబాటులో ఉన్న పరిమితికి లింక్ అవుతాయి. కాబట్టి… దీనివల్ల మీ కొనుగోలు ఇతర అవసరాల కోసం క్రెడిట్ పవర్ తగ్గుతుంది. క్రెడిట్ వినియోగ నిష్పత్తి కూడా.. అంటే CUR పెరగవచ్చు. ఇవన్నీ మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తాయి.

ఇది కాకుండా, సులభంగా క్రెడిట్ లభ్యత వల్ల, మీరు అనవసరంగా ఖర్చు చేయవచ్చు. ఇది మీ రుణ భారాన్ని పెంచుతుంది. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ EMI మధ్య మీకు ఏది బెటర్ అనేది మీ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ లోన్ లేదా ఇన్‌స్టంట్ లోన్.. తక్షణ లేదా స్వల్పకాలిక అవసరాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యక్తిగత రుణం దీర్ఘకాలికంగా సరిపోతుంది.

కానీ రుణం తీసుకునేటప్పుడు, తక్షణ అవసరం గురించి ఆలోచించడమే కాకుండా… దీర్ఘకాలికంగా మీ ఆర్థిక పరిస్థితిపై దాని ప్రభావం ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి. మీ క్రెడిట్ స్కోర్‌పై రుణం ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించాలి. ఇది చాలా ముఖ్యం. వీటన్నింటి తర్వాత మాత్రమే, మీకు ఏ రుణం సరైనదో నిర్ణయించుకోండి.

Published: April 15, 2024, 17:30 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.