Insurance Bonus: ప్రతి సంవత్సరం డబ్బు ఇచ్చే ఇన్సూరెన్స్ పాలసీ

పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా పని చేస్తుంది, ఈ పాలసీలో అందుకున్న బోనస్‌ని ఎలా ఉపయోగించాలి? Insurance Bonus ఇచ్చే పాలసీలు

రాజీవ్‌కి ప్రతి సంవత్సరం రాబడి వచ్చే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాడు. పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Bonus) ప్రతి సంవత్సరం పాలసీహోల్డర్ కు బోనస్‌ని ఇస్తుందని అతను తెలుగుసుకున్నాడు. అయితే, అతనికి ఈ ప్రోడక్ట్ గురించి పెద్దగా తెలియదు. అతనికి చాలా డౌట్స్ ఉన్నాయి – పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎలా పని చేస్తుంది, ఈ పాలసీలో అందుకున్న బోనస్‌ని ఎలా ఉపయోగించాలి? ఈ ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో , పార్టిసిపేటింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ని పార్ పాలసీ అని కూడా అంటారు. ఇది బీమా రక్షణతో పాటు మెచ్యూరిటీ సమయంలో హామీ ఇచ్చిన మొత్తాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా వచ్చే లాభంలో కొంత భాగం(Insurance Bonus) కూడా పాలసీ హోల్డర్ కి కూడా చెల్లిస్తుంది. ఈ మొత్తం బోనస్ లేదా డివిడెండ్‌గా ఇస్తారు. దీనిని వార్షిక ప్రాతిపదికన పే చేస్తారు. ఈ విధంగా, ఇన్సూరెన్స్ కంపెనీ లాభాల్లో పాలసీదారు కూడా భాగస్వామి అవుతాడు. అందుకే అలాంటి పాలసీని పార్టిసిపేటింగ్ పాలసీ అంటారు. ఈ పాలసీలో, పాలసీదారుకు హామీ- హామీ లేని ప్రయోజనాలు రెండూ అందుతాయి. ఇది బోనస్ – డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. నాన్-పార్టిసిటింగ్ పాలసీలు సాధారణంగా హామీ ఇచ్చిన ప్రయోజనాలను మాత్రమే అందిస్తాయి. పాలసీహోల్డర్ కు ఎలాంటి లాభం లేదా డివిడెండ్(Insurance Bonus) అందదు.

ఈ పాలసీలో బోనస్(Insurance Bonus) నుంచి ఎలా ప్రయోజనం పొందవచ్చు చూద్దాం..

పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రధాన ప్రయోజనం ఏమిటంటే అది బోనస్‌ల(Insurance Bonus) రూపంలో రాబడితో పాటు హామీ ఇచ్చిన ఇన్సూరెన్స్ రక్షణను అందిస్తుంది. ఇది మీ పిల్లల కోసం మీరు నిర్దేశించిన ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. ఈ ప్రయోజనాలను చూసి రాజీవ్ కూడా ఈ పాలసీని తీసుకున్నారు. బోనస్ వార్షిక ప్రాతిపదికన చెల్లిస్తారు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ వెబ్‌సైట్ ప్రకారం, బీమా కంపెనీ పాలసీదారులకు అనేక ఎంపికలను అందిస్తుంది. మొదటి ఎంపికలో, మీరు మీ బ్యాంక్ ఎకౌంట్ లో ప్రతి సంవత్సరం బోనస్ క్రెడిట్ పొందవచ్చు. రాజీవ్ ఈ ఎంపికను ఎంచుకుంటే, అతనికి ప్రతి సంవత్సరం ఈ బోనస్ లభిస్తుంది. రెండవ ఎంపికలో, మీరు మీ వార్షిక ప్రీమియంలో బోనస్ మొత్తాన్ని సర్దుబాటు చేయవచ్చు. ఉదాహరణకు, రాజీవ్ వార్షిక ప్రీమియం 30,000 రూపాయలు.. అతను 2,000 రూపాయల బోనస్ పొందుతున్నట్లయితే. అప్పుడు అతను దానిని ప్రీమియంలో సర్దుబాటు చేయవచ్చు. దీని తర్వాత రాజీవ్ కేవలం 28,000 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో డబ్బును కూడబెట్టుకోవడమే మీ లక్ష్యం అయితే, మీరు పాలసీలో తిరిగి బోనస్ మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఇది హామీ మొత్తానికి యాడ్ అవుతుంది.

టాక్స్ మినహాయింపుల విషయానికి వస్తే.. మీ పాలసీ వార్షిక ప్రీమియం హామీ మొత్తంలో 10% కంటే ఎక్కువ కానట్లయితే, మెచ్యూరిటీ సమయంలో బోనస్(Insurance Bonus) – అందుకున్న మొత్తం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(10D) ప్రకారం పన్ను రహితంగా ఉంటుంది. మీరు ప్రతి సంవత్సరం బోనస్ తీసుకోవాలని ఎంచుకుంటే, ఈ మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటుంది. ఏప్రిల్ 1, 2023 తర్వాత కొనుగోలు చేసిన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వార్షిక ప్రీమియం ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే, దాని నుంచి వచ్చే ఆదాయం పన్ను రహితంగా ఉండదని గుర్తుంచుకోండి.

ఈ పాలసీ గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో చూద్దాం. వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు జితేంద్ర సోలంకి మాట్లాడుతూ, భాగస్వామ్య జీవిత బీమా పాలసీలు ప్రాథమికంగా ఎండోమెంట్ ప్లాన్‌లని చెప్పారు. . ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ పాలసీలను బోనస్‌తో పాటు బీమా కవర్, సమ్ అష్యూర్డ్ వంటి ఫీచర్లను హైలైట్ చేయడం ద్వారా సెల్ చేస్తాయని అన్నారు. మొత్తంమీద, ఈ పాలసీలు చాలా ఖర్చులతో వస్తాయి. దీని ఫలితంగా పెట్టుబడిపై నికర రాబడి సంవత్సరానికి 6% కంటే ఎక్కువ ఉండదని జితేంద్ర అంటున్నారు. ఇది ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో ప్రభావవంతంగా ఉండదు. అటువంటి సందర్భంలో, ఈ ఎంపిక పెట్టుబడికి మంచిది కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. మీరు పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ పాలసీలో పెట్టుబడి పెడితే, దీర్ఘకాలిక ఆప్షన్ ఎంచుకోండి. మీరు పాలసీలో బోనస్ లేదా డివిడెండ్‌ని సేకరించడాన్ని ఎంచుకోవాలి. ఇది మీ టార్గెట్ రీచ్ కావడాన్ని ఈజీ చేస్తుంది.

Published: September 28, 2023, 14:35 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.