PPF Rules: ప్రావిడెంట్ ఫండ్ నుంచి డబ్బు విత్ డ్రా రూల్స్ ఏమిటి?

మీరు PPF(PPF Rules) డబ్బును ఎప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చో తెలుసుకునే ముందు, మీరు PPF ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవాలి

ఆనందరావు తన కూతురి చదువు కోసం కొంత డబ్బు ఆదా చేశాడు. అయితే, ఆమె చదువు కోసం కట్టాల్సిన ఫీజులకు అది సరిపోలేదు. ఇంకా కొంత మొత్తం అవసరం అవుతోంది. అతనికి దీనికోసం మరో 2 లక్షల రూపాయలు కావాలి. అతను తన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF Rules) ఎకౌంట్ నుంచి డబ్బు తీసుకోవాలా లేదా ఏదైనా లోన్ తీసుకోవాలా అనే సందిగ్ధంలో ఉన్నాడు. PPF నుంచి విత్ డ్రా చేసుకోవడం అంటే అది ప్రీ మెచ్యూర్ విత్ డ్రా అవుతుంది. ఎందుకంటే PPF 15 ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది. అయితే, కొన్ని పరిస్థితులలో, 15 సంవత్సరాల కంటే ముందు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

మీరు PPF(PPF Rules) డబ్బును ఎప్పుడు విత్‌డ్రా చేయవచ్చో వివరించే ముందు, మీరు PPF ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవాలి. PPF ఎకౌంట్ లో 15 సంవత్సరాల లాక్-ఇన్ ఉంది. మీరు ఇందులో సంవత్సరానికి 1.5 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ మొత్తంపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. మెచ్యూరిటీ సమయంలో అందుకున్న మొత్తం మొత్తం పన్ను రహితంగా ఉంటుంది. ప్రస్తుతం, ఈ పథకం వార్షిక వడ్డీ 7.1% చెల్లిస్తుంది. ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీని సమీక్షిస్తుంది.

PPF నుంచి ఎప్పుడు డబ్బు తీసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం.

మీరు PPFలో(PPF Rules) మంచి మొత్తాన్ని ఆదా చేసి, అత్యవసరంగా డబ్బు అవసరమైతే – పర్సనల్ లోన్ తప్ప వేరే మార్గం లేకుంటే, మీరు PPF నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం, మీరు సరైన కారణాన్ని చెప్పాల్సి ఉంటుంది. మీరు పిల్లల విద్య, మీ చికిత్స లేదా కుటుంబ సభ్యుల చికిత్సల కోసం PPF ఎకౌంట్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయం 6 సంవత్సరాల తర్వాత, అంటే పెట్టుబడి పెట్టిన ఏడవ సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తుంది. కానీ మీరు ఇందులో ఉన్న మొత్తం ఎమౌంట్ విత్‌డ్రా చేయలేరు. మీరు విత్ డ్రా చేసుకునే సంవత్సరానికి ముందు నాలుగు సంవత్సరాల చివరిలో మిగిలి ఉన్న బ్యాలెన్స్‌లో 50 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా ఉపసంహరణ సమయంలో ఎకౌంట్ లో జమ చేసిన మొత్తం సొమ్ములో 50 శాతాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు ఈ రెండు ఎంపికలలో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఉదాహరణకు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆనందరావు PPF(PPF Rules)ఎకౌంట్ తెరిచి ఉంటే, అతను 2022-23 తర్వాత తన పిల్లల చదువు కోసం తన PPF నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అతను 2018-19 ఆర్థిక సంవత్సరం చివరిలో బ్యాలెన్స్‌లో 50 శాతం లేదా మార్చి 31, 2023 నాటికి డిపాజిట్ చేసిన మొత్తం ఫండ్‌లో 50 శాతం… ఏది తక్కువైతే అది విత్‌డ్రా చేసుకోవచ్చు.

కాబట్టి ఆనంద రావు తన కూతురి చదువు కోసం మెచ్యూరిటీకి ముందే తన PPF ఎకౌంట్(PPF Rules) నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోగలుగుతాడనేది ఆనందరావుకు శుభవార్త అని చెప్పవచ్చు. డబ్బు విత్ డ్రా చేసిన తర్వాత కూడా అతని ఎకౌంట్ యాక్టివ్‌గా ఉంటుంది. కానీ అతను సంవత్సరానికి ఒకసారి మాత్రమే విత్ డ్రా చేసుకోగలడని గుర్తుంచుకోవాలి. ఈ మొత్తం పన్ను రహితంగా ఉంటుంది. దానిపై ఎటువంటి పెనాల్టీ ఉండదు.

మీరు 15 సంవత్సరాల పదవీ కాలానికి ముందే మీ PPF ఎకౌంట్ క్లోజ్ చేయవచ్చా? దీని గురించి అర్ధం చేసుకుందాం.

కొన్ని సందర్భాల్లో, మీరు ఐదేళ్ల తర్వాత మీ PPF ఎకౌంట్(PPF Rules) క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎకౌంట్ హోల్డర్ తనకు తానుగా, అతని జీవిత భాగస్వామి లేదా అతని బిడ్డ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటే, చికిత్స కోసం, మీరు మొత్తం ఎమౌంట్ విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ PPF ఎకౌంట్ ను ముందుగానే క్లోజ్ చేయవచ్చు. అదేవిధంగా, ఎకౌంట్ హోల్డర్ లేదా అతని పిల్లలకు ఉన్నత విద్య కోసం డబ్బు అవసరమైతే, అతను ఎకౌంట్ క్లోజ్ చేయవచ్చు. ఎకౌంట్ హోల్డర్ విదేశాల్లో స్థిరపడి ఉంటే, అంటే, అతను NRI అయ్యి ఉంటే, ఈ ఎకౌంట్ ను ముందుగానే క్లోజ్ చేయవచ్చు. ముందుగానే ఎకౌంట్ క్లోజ్ చేసినపుడు ఒక శాతం వడ్డీ మినహాయిస్తారు.

PPF ఎకౌంట్ మెచ్యూరిటీకి ముందే ఎకౌంట్ హోల్డర్ మరణిస్తే, అతని నామినీ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాంటప్పుడు, ఎకౌంట్ ఐదేళ్లు ఉండాలనే నిబంధన వర్తించదు. ఎకౌంట్ హోల్డర్ మరణించిన తర్వాత, అతని PPF ఎకౌంట్(PPF Rules) క్లోజ్ అయిపోతుంది. డబ్బు నామినీకి లేదా చట్టపరమైన వారసుడికి వెళుతుంది. అలాంటి ఎకౌంట్స్ కొనసాగించడం సాధ్యం కాదు.

Published: September 27, 2023, 14:30 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.