Insurance Premium: టెన్షన్ ఎందుకు? మల్టీ ఇయర్ ప్రీమియం ఉందిగా

ఒకేసారి రెండు లేదా మూడు సంవత్సరాలకు ప్రీమియం కట్టేస్తే.. మూడేళ్ళ వరకూ రెన్యూవల్ చేయాల్సిన అవసరం లేదు. Multi Year Insurance Premium

స్వాతి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని అనుకుంది. ఆమెకు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒకేసారి మూడేళ్లకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Premium) తీసుకోవచ్చని చెప్పడంతో అయోమయంలో పడింది. అదెలా సాధ్యం అవుతుంది? తప్పుగా విన్నానా? అని ఆలోచనలో పడింది. అయితే.. ఆమె సరిగ్గానే వినండి. ఒకేసారి రెండు లేదా మూడు సంవత్సరాలకు ప్రీమియం కట్టేస్తే.. మూడేళ్ళ వరకూ రెన్యూవల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా స్వాతి లానే ఈ మల్టీ ఇయర్ ఇన్సూరెన్స్ గురించి మొదటిసారి వింటున్నట్లయితే కనుక ఈ వీడియో మీ కోసమే.

సాధారణంగా, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఒక సంవత్సరం పాటు ఉంటాయి. ఒక సంవత్సరం తర్వాత, మనం ప్రీమియం(Insurance Premium) చెల్లించడం ద్వారా పాలసీలను పునరుద్ధరిస్తాము. మల్టీ ఇయర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు 2 లేదా 3 సంవత్సరాల ప్రీమియం ఒకేసారి చెల్లించి ప్రతి సంవత్సరం పాలసీని రెన్యూవల్ చేయాల్సిన ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

మల్టీ ఇయర్ హెల్త్ ఇన్సూరెన్స్ వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ముందుగా చూద్దాం.
దేశంలో ఆరోగ్య వ్యయం వేగంగా పెరుగుతోంది. సాధారణ ద్రవ్యోల్బణం ఏడు శాతం వద్ద ఉండగా, ఆరోగ్య సంరక్షణ ద్రవ్యోల్బణం దాదాపు రెట్టింపు స్థాయిలో 14 శాతంగా ఉంది. క్లెయిమ్‌లు చేయడానికి పెరిగిన ఖర్చు కారణంగా, గత ఏడాదిలో ఆరోగ్య బీమా ప్రీమియంలు(Insurance Premium) 25 శాతం వరకు పెరిగాయి. రానున్న రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ మరింత ఖరీదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్వాతి మల్టీ ఇయర్ పాలసీని తీసుకుంటే, పెరిగే ప్రీమియం భారాన్ని ఆమె భరించాల్సిన అవసరం లేదు.

మల్టీ ఇయర్ పాలసీలలో, బీమా కంపెనీలు ప్రీమియంపై(Insurance Premium) 8 నుంచి 15 శాతం వరకు తగ్గింపును కూడా ఇస్తాయి. ఉదాహరణకు, స్వాతి వార్షిక ప్రీమియం ఇప్పుడు 20,000 రూపాయలు అనుకుందాం. ఈ కోణంలో చూస్తే, మూడేళ్ల పాలసీకి ప్రీమియం 60,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. బీమా కంపెనీ దీనిపై 10 శాతం తగ్గింపును ఇస్తోంది. దీనివలన ఆమె 6000 రూపాయల ప్రయోజనం పొందవచ్చు. ఈ విధంగా, పాలసీదారులకు 54,000 రూపాయలకు మూడేళ్ల కవర్ లభిస్తుంది. అయితే, మీరు ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ ప్రాతిపదికన ప్రీమియం చెల్లించవచ్చు. అయితే, అటువంటి ఆప్షన్స్ క్రింద ప్రీమియం మొత్తం పెరుగుతుంది.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80డి కింద, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం 25,000 రూపాయల వరకు వార్షిక ప్రీమియంపై(Insurance Premium) పన్ను మినహాయింపు పొందుతారు. మీరు మీ తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా తీసుకుంటే, మీరు గరిష్టంగా 25,000 రూపాయల వార్షిక ప్రీమియంపై అదనపు మినహాయింపు పొందుతారు. మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే, మీరు 50,000 రూపాయల ప్రీమియంపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఉదాహరణకు, స్వాతి తన కోసం మూడేళ్లపాటు 54,000 రూపాయల ప్రీమియం చెల్లించినట్లయితే, ఆమె సంవత్సరానికి 18,000 రూపాయలపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఆమె ఆర్థిక సంవత్సరంలో 18,000 రూపాయలపై మాత్రమే పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందగలదు.

ఈ రకమైన పాలసీల వల్ల వచ్చే నష్టాలను కూడా పరిశీలిద్దాం. మల్టీ ఇయర్ పాలసీలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. మీరు పోర్టింగ్ ప్రయోజనాన్ని పొందలేరు. పాలసీ తీసుకున్న ఒక సంవత్సరం తర్వాత కంపెనీ సేవలతో మీరు సంతృప్తి చెందకపోతే, మీరు మీ పాలసీని మరొక కంపెనీకి పోర్ట్ చేయలేరు. అంటే మీరు ఇన్సూరెన్స్ పాలసీ ఫోర్స్ లో ఉన్న అన్ని సంవత్సరాలు అదే కంపెనీలో ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా, బీమా కంపెనీ ప్రీమియం(Insurance Premium) రేట్లు తగ్గితే, మీరు దాని ప్రయోజనం పొందలేరు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రీమియం తగ్గే అవకాశాలు దాదాపు శూన్యం.

ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

బహుళ-సంవత్సరాల ఆరోగ్య బీమా పాలసీ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు ప్రీమియం రేట్ల పెరుగుదల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పన్ను – పెట్టుబడి నిపుణుడు బల్వంత్ జైన్ చెప్పారు. పాలసీ వ్యవధిలో ప్రీమియం పెరిగితే, అది మిమ్మల్ని ప్రభావితం చేయదు. ఆరోగ్య బీమా పాలసీని సకాలంలో పునరుద్ధరించడం చాలా ముఖ్యం. మీరు దానిని పునరుద్ధరించడం మర్చిపోతే, అప్పుడు పాలసీ లాప్స్ అవుతుంది. తమ పాలసీని రెన్యువల్ చేసుకోవడం మరచిపోయే వ్యక్తులకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది. పాలసీని ఎక్కువ కాలం రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మల్టీ ఇయర్ హెల్త్ పాలసీని కొనుగోలు చేస్తుంటే, తొందరపడకండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, కంపెనీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ట్రాక్ రికార్డ్‌ను తనిఖీ చేయండి అని బల్వంత్ జైన్ సూచిస్తున్నారు.

 

Published: October 12, 2023, 14:49 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.