మొహ్సిన్ కొన్ని నెలల క్రితం క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. పెద్దగా ఆలోచించకుండా ఇతరులను చూసి ఈ కార్డు తీసుకున్నాడు. కార్డుపై చాలా అప్పు పేరుకుపోయింది. ఇప్పుడు ఈ లోన్‌పై విధించే భారీ వడ్డీతో ఇబ్బంది పడ్డాడు. బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ సదుపాయంతో కొత్త క్రెడిట్ కార్డ్‌ని పొందమని ఒక స్నేహితుడు అతనికి సలహా ఇచ్చాడు. తక్కువ వడ్డీ రేటుతో కార్డ్ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి వ్యవధి ఉంటుంది. అంటే, బిల్లును తిరిగి చెల్లించడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. అందుకే మొహ్సిన్ ఈ సూచన బాగుంది అనుకున్నాడు.
మొహ్సిన్ మాత్రమే కాదు, క్రెడిట్ కార్డ్‌ల అధిక వడ్డీ రేట్లు, భారీ అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్న చాలా మందికి.. బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ ఆప్షన్ గురించి తెలియదు. ఈ సౌకర్యం ఎలా పని చేస్తుంది? మనం వివరంగా తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ సరిగ్గా ఉపయోగించకపోతే, వినియోగదారుడికి రుణ భారం పెరిగిపోతుంది. ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారవచ్చు.అధిక వడ్డీ ఛార్జీలను నివారించడానికి, మీ క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరచడానికి… క్రెడిట్ కార్డ్ రుణాన్ని త్వరగా తిరిగి చెల్లించడం చాలా ముఖ్యం.
ఇటువంటి పరిస్థితిలో, క్రెడిట్ కార్డుకు సంబంధించిన బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ సౌకర్యం చాలా ఉపయోగపడుతుంది.అధిక వడ్డీ కారణంగా పెరిగిన రుణభారాన్ని ఎదుర్కోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.క్రెడిట్ కార్డ్‌లో బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ అనేది ఓ ప్రక్రియ. దీనిలో మీ ప్రస్తుత క్రెడిట్ కార్డ్ రుణం మరొక కార్డ్‌కి ట్రాన్స్ ఫర్ అవుతుంది. నిబంధనలు, షరతులు ఉన్న ఆ కొత్త కార్డ్‌లో… బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ ప్రధాన ఉద్దేశం రుణాన్ని బదిలీ చేయడమే. కొత్త కార్డు అందించే తక్కువ వడ్డీ రేట్లు లేదా పొడిగించిన రీపేమెంట్ వ్యవధిని ఉపయోగించుకోవాలి. మీ లోన్‌ను కొత్త కార్డ్‌కి బదిలీ చేయడం ద్వారా, మీరు వడ్డీ ఛార్జీలను తగ్గించుకోవచ్చు. మీ లోన్‌ను వేగంగా చెల్లించడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ ఎలా జరుగుతుందో దశల వారీగా అర్థం చేసుకుందాం.
ముందుగా, మీ ప్రస్తుత క్రెడిట్ కార్డ్ రుణం గురించి తెలుసుకోండి. ఈ రుణంలో ఉన్న అన్ని ఛార్జీలు… ఆపై బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ సౌకర్యాన్ని అందించే క్రెడిట్ కార్డ్‌ల గురించి.. వాటి నిబంధనలు/షరతులు, వడ్డీ రేట్లు, రీపేమెంట్ కాలవ్యవధి గురించి సమాచారాన్ని సేకరించండి. వాటిని కంపేర్ చేయండి. మీ అవసరాలకు సరిపోయే కార్డ్‌ని ఎంచుకోండి. దీని తర్వాత, మీరు ఎంచుకున్న కార్డ్ కంపెనీని సంప్రదించండి. మెయిల్ లేదా కస్టమర్ కేర్ నంబర్ ద్వారా సంప్రదించండి. బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ రిక్వెస్ట్ ను ఇవ్వండి. మీ ప్రస్తుత రుణం, మీరు ట్రాన్స్ ఫర్ చేయాలనుకుంటున్న మొత్తం ఎంత అనే వివరాలు ఇవ్వండి.
కొత్త కార్డ్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు, మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి.ముందుగా వడ్డీ రేటును చెక్ చేయాలి. ఇప్పటికే ఉన్న కార్డ్ కంటే వడ్డీ రేటు ఎంత తక్కువగా ఉందో చూడాలి. రీపేమెంట్ కాలవ్యవధిపై కూడా ఫోకస్ చేయాలి. అదనపు వడ్డీ ఛార్జీలను వేయకుండా మీకు తగినంత సమయం ఇస్తున్నారో లేదో చూడండి. అలాగే కొత్త క్రెడిట్ కార్డ్‌కి బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ కి ఏవైనా ఫీజులు ఉన్నాయా? ఎందుకంటే ఈ ఫీజులు రుణాన్ని ట్రాన్స్ ఫర్ చేసే మొత్తం ఖర్చుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఇది గుర్తుంచుకోవడం ముఖ్యం. అలాగే అదనపు ప్రయోజనాల గురించి కూడా తెలుసుకోండి. క్యాష్‌బ్యాక్, రివార్డ్‌లు లేదా కొత్త క్రెడిట్ కార్డ్‌తో వచ్చే ఏవైనా ఇతర ప్రయోజనాలపైనా ఫోకస్ పెట్టండి. దీనివల్ల మీరు బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ నుండి అధిక ప్రయోజనాన్ని పొందవచ్చు.
కాబట్టి క్రెడిట్ కార్డ్‌లలో లభించే ఈ సదుపాయం.. క్రెడిట్ కార్డ్ రుణాన్ని వేగంగా తిరిగి చెల్లించడంలో, డబ్బును ఆదా చేయడంలో మీకు ఎలా సహాయపడుతుందో ఇప్పుడు మీరు అర్థమైంది కదా. కొత్త కార్డ్‌తో తక్కువ వడ్డీ రేటు లేదా పొడిగించిన రీపేమెంట్ వ్యవధి వంటి ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో మీరు మీ ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు.
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.