అభయ్ చాలా కాలంగా క్రెడిట్ కార్డ్ వాడుతున్నాడు. ఇంట్లో ఒక్కడికే క్రెడిట్ కార్డు ఉంది. అభయ్ కొడుకు అంకిత్ ఇప్పుడే కాలేజీకి వెళ్లడం మొదలుపెట్టాడు. ఇప్పుడు తన కొడుకు క్రెడిట్ కార్డ్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. కొత్త కార్డు కష్టాలను అభయ్ కోరుకోవడం లేదు. ఎందుకంటే కార్డు వచ్చాక.. బిల్లులు కట్టాలి. ఎక్కడ తన కొడుకు ఎక్కువుగా పెడతాడో అన్న ఆందోళన ఉంది. మరిప్పుడు ఏం చేయాలి?
అభయ్ సమస్యకు మా దగ్గర ఓ పరిష్కారం ఉంది. ఈ సొల్యూషన్ పేరు యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్. ఇది ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది? డీటైల్డ్ గా చూద్దాం.
యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌ని సప్లిమెంటరీ కార్డ్ లేదా సెకండరీ కార్డ్ అని కూడా అంటారు. ఇది నిజానికి మీ ప్రైమరీ క్రెడిట్ కార్డ్ కు పొడిగింపు అనుకోండి. అంటే, మీరు మీ క్రెడిట్ కార్డ్‌తో పాటు మరో కార్డ్ కూడా తీసుకోవచ్చు. అదే కార్డ్‌ని యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ అంటారు. కార్డ్ హోల్డర్లు తమ క్రెడిట్ లైన్‌ను ఈ కార్డ్ ద్వారా కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. అదనపు కార్డ్‌కు ప్రధాన కార్డు లాగే అదే క్రెడిట్ పరిమితి ఉంటుంది. ఒక విధంగా, ఇది బ్యాంక్ ఉమ్మడి ఖాతా లాంటిది. దీనివల్ల పెద్ద బెనిఫిట్ ఏమిటంటే.. యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ మీ ఆర్థిక నిర్వహణను సులభం చేస్తుంది. క్రెడిట్ లిమిట్ షేర్ అయి ఉంటుంది. పైగా వేర్వేరు క్రెడిట్ కార్డ్ ఖాతాల అవసరం ఉండదు. దీనివల్ల క్రెడిట్ కార్డ్ ఖర్చులను మేనేజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఇవే కాకుండా, వ్యక్తిగతంగా ఖర్చుల పరిమితిని సెట్ చేస్తుంది.
ఈ సదుపాయం ముఖ్యంగా తల్లిదండ్రులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తమ పిల్లలకు ఖర్చుల కోసం డబ్బు ఇచ్చేవారు… దానిని కంట్రోల్ చేయాలనుకుంటే.. వారికిది ఉపయోగం. మీరు ప్రతి యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌పై ఖర్చు పరిమితిని సెట్ చేయవచ్చు. అంటే, మీరు మీకు నచ్చిన విధంగా దీనిని సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల కుటుంబంలోని ఏ వ్యక్తి కూడా అవసరానికి మించి ఖర్చు చేయరు. మీరు ప్రతి లావాదేవీని ట్రాక్ చేయవచ్చు.
క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో ఎవరు ఎక్కడ, ఏ వస్తువుపై ఖర్చు చేస్తున్నారో మీకు తెలుస్తుంది. సెకండరీ యూజర్స్ కోసం క్రెడిట్ స్కోర్‌ను బిల్డ్ చేయడంలో సహాయపడుతుంది. కార్డ్ ను సరిగా వినియోగించడం, సకాలంలో చెల్లింపులు చేయడం, ప్రైమరీ, సెకండరీ కార్డ్ హోల్డర్ల క్రెడిట్ స్కోర్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది.
మొదటిసారిగా క్రెడిట్ కార్డ్ ను ఉపయోగిస్తున్న లేదా వారి క్రెడిట్ హిస్టరీని మెరుగుపరచాలనుకునే వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇది లైఫ్‌లైన్‌గా పనిచేస్తుంది. కుటుంబ సభ్యులు విడివిడిగా నివసిస్తున్నట్లయితే లేదా ఎక్కడికైనా ప్రయాణిస్తున్నట్లయితే… అత్యవసర పరిస్థితి తలెత్తితే, కార్డ్ మీకు ఆర్థిక కవరేజీని అందిస్తుంది.
ఇప్పుడు ఈ కార్డ్ కోసం ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. దీని ప్రక్రియ చాలా సులభం. బ్యాంక్ సైట్ కు వెళ్లి.. క్రెడిట్ కార్డ్ విభాగంలో ఈ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోండి. అప్లికేషన్ ఫారమ్‌లో ప్రైమరీ, సెకండరీ కార్డ్ హోల్డర్ సమాచారాన్ని ఇవ్వండి. సెకండరీ కార్డ్ హోల్డర్ కోసం కొన్ని డాక్యుమెంట్లు అడగవచ్చు. వాటిని సబ్ మిట్ చేయండి. అది ప్రాసెస్ చేసి, ఆమోదించిన తర్వాత కార్డ్ మీ అడ్రస్ కు వస్తుంది.
కాబట్టి ఈ విధంగా మీరు మీ కుటుంబ అవసరాలకు అనుగుణంగా యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. ఇటువంటి ఇతర సమాచారాన్ని పొందడానికి Money9ని చూస్తూ ఉండండి.
Published: March 18, 2024, 17:46 IST
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.