మీరు షేర్ మార్కెట్లో స్వయంగా వ్యాపారం చేయకూడదనుకుంటే, మ్యూచువల్ ఫండ్స్ లో SIP లేదా లంప్సమ్ గా మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఒకవేళ షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలి.. కాని స్టాక్ మార్కెట్ లో స్టాకులు కొనడం, అమ్మడం చేయకూడదనుకుంటే.. అప్పుడు మీ మొత్తాన్ని పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ (PMS) కింద పెట్టుబడి పెట్టవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్‌లో.. ఈక్విటీలలో పెట్టుబడి పెట్టి స్కీమ్స్ కొంటారు. అదే పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్‌లో అయితే.. మీ లక్ష్యాలకు అనుగుణంగా మీ కోసం మనీ మేనేజర్లు ప్రత్యేకంగా పోర్ట్ ఫోలియోను తయారుచేస్తారు. కాకపోతే ఇందులో మీరు కనీసం 50 లక్షల రూపాయిలను పెట్టుబడిగా పెట్టాలి.
PMS బజార్ లేటెస్ట్ స్టడీ రిపోర్ట్ చూస్తే.. పోర్ట్‌ఫోలియో నిర్వహణ సేవలు, మ్యూచువల్ ఫండ్ల పనితీరు గురించి తెలుస్తుంది. ఇది ఈ రెండింటినీ పోల్చి చూసింది. ఈ అధ్యయనంలో వివిధ అంశాలపై మ్యూచువల్ ఫండ్స్, PMS ల మధ్య వ్యత్యాసాలు, వాటి రిటర్న్స్ గురించి వివరించింది. అలాగే వివిధ కేటగిరీలు, టైమ్ ఫ్రేమ్స్ తో ఉండే బెంచ్ మార్క్ ల ఆధారంగా వీటి పెర్ ఫార్మెన్స్ గురించి చెప్పింది.
నివేదిక ప్రకారం, గత 5 సంవత్సరాలలో, 59 PMS పథకాలు బెంచ్‌మార్క్‌ను అధిగమించాయి, అయితే మ్యూచువల్ ఫండ్ పథకాలలో 46 శాతం మాత్రమే బెంచ్‌మార్క్‌ను అధిగమించాయి. 3 సంవత్సరాల, 10 సంవత్సరాల కాలానికి పెట్టిన పెట్టుబడులలో ఇదే ధోరణి కనిపించింది. PMS అన్ని వర్గాల్లో స్థిరంగా అద్భుతమైన రాబడిని అందిస్తోంది.
PMS, MF ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. రెండింటినీ ఒకే స్థాయిలో పోల్చడం సరికాదు. అయితే, రెండూ పెట్టుబడి వృద్ధికి అవకాశాలను అందిస్తాయి. కానీ వారి కస్టమర్లు దృష్టి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. మీరు PMS, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, ముందుగా మీరు కొన్ని ప్రాథమిక విషయాలను అర్థం చేసుకోవాలి. PMS , MF మధ్య తేడా ఏమిటి? ఎవరు ఎందులో పెట్టుబడి పెట్టాలి? మొదలైన వాటి గురించి తెలుసుకోవాలి.
PMS గురించి మాట్లాడినట్లయితే, వారు వ్యక్తిగతంగా ఇన్వెస్ట్ మెంట్లపై ఫోకస్ పెడతారు. ఫండ్ మేనేజర్లు పెట్టుబడిదారుడి నిర్దిష్ట అవసరాలను దృష్టిలో పెట్టుకుని.. దానికి అనుగుణంగా ఉండే పోర్ట్‌ఫోలియోలను రూపొందించడంపై వారు ఎక్కువ శ్రద్ధ చూపుతారు. PMS రెండు రకాల పథకాలను అందిస్తుంది – డిస్క్రీషనరీ, నాన్ డిస్క్రీషనరీ. ఈ నాన్ డిస్క్రీషనరీలో ఫండ్ మేనేజర్ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటాడు, అయితే ఫండ్ మేనేజర్ పెట్టుబడిదారుడి నుంచి ముందే అనుమతిని తీసుకుంటాడు. మ్యూచువల్ ఫండ్స్ లాగా, PMSలో పూలింగ్ ఉండదు. ఏ యూనిట్లనూ జారీ చేయరు.
SEBI నిబంధనల ప్రకారం, PMS ప్రొవైడర్లందరూ ప్రతి పథకం పనితీరును వెల్లడించాలి. అలాగే, ప్రతి వ్యూహాన్ని బయటకు చెప్పాలి. పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండాలి. ఇది కాకుండా, దానికి సంబంధించిన బెంచ్‌మార్క్‌తో పోల్చాలి. పెట్టుబడి పెట్టడానికి ముందు, మీరు దాని గురించి పూర్తి సమాచారంతో ఉండాలి.
PMSలో వ్యూహం.. మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఉన్నట్టే ఉంటుంది. PMSలు మోడల్ పోర్ట్‌ఫోలియోలను మాత్రమే జారీ చేస్తాయి. ఇది ఓ పథకం లేదా ప్రణాళిక కంటే… వ్యూహం ప్రకారం పెట్టుబడి పెడుతుంది. PMSలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. కనిష్టంగా రూ.50 లక్షల నుండి మొదలవుతుంది. కాబట్టి దీని రీచ్ ప్రత్యేకించి మెరుగైన నికర విలువ కలిగిన వారికి మాత్రమే అని అర్థమవుతోంది.
మరోవైపు, మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బుతో స్టాక్‌లు, బాండ్లను కొనుగోలు చేయడానికి ప్రొఫెషనల్ గా మేనేజ్ చేసే పూల్. ఇందులో పెట్టుబడిదారుడు కేవలం 100 రూపాయలతో పెట్టుబడి పెట్టవచ్చు.
PMS అనేది 20 నుండి 30 స్టాక్స్ పోర్ట్‌ఫోలియోలను అందిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్.. పెట్టుబడిదారులకు దాదాపు 40 నుండి 50 షేర్ల వరకు విభిన్నమైన పోర్ట్‌ఫోలియోలను అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. SEBI నిర్ణయించిన కేటగిరీలను అనుసరించాలి. అయితే PMS పనితీరు ప్రతీ నెలా బయటకు చెప్పాలి.
టాప్ PMS ప్రొవైడర్లలో PMS, 70 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇవ్వగలదు, అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సగటు ఒక-సంవత్సరపు రాబడి 20 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది.. అంతే. PMS బజార్ నివేదిక ప్రకారం, PMS ఒక సంవత్సరం పాటు అన్ని కేటగిరీలలో మ్యూచువల్ ఫండ్స్ కంటే మెరుగైన పనితీరును కనబరిచింది.
గణాంకాలను పరిశీలిస్తే, PMS ఒక సంవత్సరం రాబడి 87 శాతం అయితే.. ఈ కేటగిరీ మ్యూచువల్ ఫండ్ల రాబడి 64 శాతం. స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఒక సంవత్సరం రాబడి 17 శాతం కాగా, PMS 94 శాతం బంపర్ రాబడిని ఇచ్చింది.
ఎప్పుడైతే కనీసం రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారో అప్పుడే పీఎంఎస్లో పెట్టుబడి పెట్టే ఆలోచన చేయవచ్చని లాడెరప్ వెల్త్ మేనేజ్మెంట్ ఎండీ రాఘవేంద్ర నాథ్ చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్ కంటే PMS మరింత ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. PMS మార్కెట్ పరిస్థితులను బట్టి ఏ స్టాక్‌లో అయినా పెట్టుబడి పెట్టవచ్చు. అప్‌ట్రెండ్ సమయంలో క్యాష్ ని కూడా ఉంచుకుంటుంది.
ఆదాయాల గురించి చెప్పుకుంటే.. ట్యాక్స్ పరంగా మ్యూచువల్ ఫండ్స్ PMS కంటే మెరుగైనవి. మ్యూచువల్ ఫండ్స్‌లో, డబ్బు విత్ డ్రా పై మాత్రమే పన్ను ఉంటుంది. PMSలో, పెట్టుబడిదారులు.. స్టాక్ అమ్మకాలు లేదా డివిడెండ్లపై పన్ను చెల్లించాలి. PMSలో తరచుగా కొనుగోళ్లు, విక్రయాలు చేస్తే పన్ను తప్పదు. ఇది కాంపౌండింగ్ ప్రక్రియను స్లో అయ్యేలా చేస్తుంది. అయితే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ అటువంటి ట్యాక్సులను సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
PMS అనేది వ్యక్తిగతమైన స్ట్రాటజీల కోసం చూస్తున్న HNI పెట్టుబడిదారుల కోసం. అయినా సరే.. మీరు ఈ పెట్టుబడులను పర్యవేక్షించాలి. మీరు.. అర్హత కలిగిన పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ బృందం నుండి సలహా తీసుకోవాలి. ఆ సలహా ఆధారంగా ఆస్తులు, ఆర్థిక ప్రణాళికను వేసుకోవాలి. PMS పెట్టుబడులు అధిక ఫీజులు, పన్నులకు లోబడి ఉంటాయి. కాబట్టి PMS ప్రొవైడర్‌ను ఎంచుకునే ముందు, మీరు తప్పకుండా PMS ఫండ్ నిర్వహణ ఫీజు గురించి తెలుసుకోవాలి. ఈ ఫీజు 1 నుండి 3 శాతం వరకు ఉంటుంది. ఇది కాకుండా, ఎంట్రీ లోడ్ ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్ ఫీజును కూడా చెల్లించాలి.
మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే సరైనవి.
దీనికి మరోవైపు చూస్తే.. PMS అనేది అధిక రిస్క్ తో మెరుగైన రాబడిని ఇచ్చే ఫండ్స్ అని చెప్పాలి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన పోర్ట్‌ఫోలియోలను కోరుకునే HNIలకు ఇవి సరైనవి. PMS.. ప్రత్యేకమైన శ్రద్ధ, నిపుణుల సలహా, గొప్ప పనితీరును అందిస్తుంది. కనీసం రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పాలి.
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.