మీరు కొనుగోలు చేసే ముందు దాన్ని డీకోడ్ చేయండి!
“మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ను ఎలా కొనుగోలు చేస్తారు?” ఇది ఒకే సమాధానం ఉండని ప్రశ్న. ఎందుకంటే ఒక్కొక్కరి అవసరాలు ఒక్కోలా ఉంటాయి. అమన్ పాలసీ ఆప్షన్స్ ను చెక్ చేస్తున్నాడు. అతను ఆల్ రౌండ్ ఆరోగ్య బీమా పాలసీ కోసం చూస్తున్నాడు.
మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ టైమ్ హెల్త్ ప్లాన్ గురించి అమన్ తెలుసుకున్నాడు. ఈ లైఫ్ టైమ్ హెల్త్ ప్లాన్ లోని ఐదు అంశాలు అమన్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఈ ఐదు ఫీచర్లలో.. జీవితకాలానికి తగిన బీమా మొత్తం, విదేశాల్లో చికిత్స పొందే సౌకర్యం, బీమా మొత్తాన్ని పెంచుకోవడానికి తగిన స్వేచ్ఛ, అవసరాలకు అనుగుణంగా ఫీచర్లను కస్టమైజ్ చేసుకునే సౌలభ్యం, అనారోగ్యం తీవ్రంగా ఉన్నప్పుడు స్క్రీనింగ్ కోసం కవరేజ్ లాంటి ఆప్షన్లు ఉన్నాయి.
ఈ ప్లాన్ విశేషాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం.
దేశంలో ఆరోగ్య ద్రవ్యోల్బణం సాధారణ రేటు కంటే రెండింతలు పెరుగుతోంది.
ఒక పెద్ద హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందంటే.. దాని కోసం 10 నుంచి 20 లక్షల రూపాయల కవరేజీ కొద్ది రోజుల్లోనే అయిపోతుంది.
లైఫ్ టైమ్ హెల్త్ ఇండియా ప్లాన్ లో.. బీమా మొత్తాన్ని అన్ లిమిటెడ్ గా రీస్టోర్ చేసే ఫీచర్ ఉంది. ఈ పాలసీ కింద కవర్ అయిన వృద్ధులు.. మొదటి సంవత్సరం నుండే ఆరోగ్య చెకప్ లకు అర్హత పొందుతారు. వారికి హాస్పిటలైజేషన్ కు ముందు, తరువాతి ఖర్చులు, డే కేర్ ట్రీట్మెంట్, ఆయుష్ ట్రీట్మెంట్, అంబులెన్స్ కోసం కవరేజీ ఉంటుంది. ఈ ప్లాన్ ఆర్గాన్ డోనర్ ఖర్చులను కూడా కవర్ చేస్తుంది.
లైఫ్ టైమ్ హెల్త్ ఇండియా ప్లాన్ ప్రీమియంలో… వివిధ ఆఫర్లు ఉన్నాయి.
వీటిలో ప్రీమియం మినహాయింపు, పోర్టబిలిటీ కొనసాగింపు… లాయల్టీ డిస్కౌంట్లు ఉన్నాయి.
మీరు పాలసీని ఎక్కువ కాలం ఉంచుకుంటే… మీరు ప్రీమియంపై మంచి డిస్కౌంట్స్ ను కూడా పొందుతారు.
మీరు ప్రీమియంపై ఎప్పుడు, ఎంత తగ్గింపు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు వ్యక్తిగత పాలసీలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులను కవర్ చేస్తే మీకు 15% తగ్గింపు లభిస్తుంది. మీరు రెండు సంవత్సరాల పాటు పాలసీని కొనుగోలు చేస్తే మీకు 7.5% తగ్గింపు లభిస్తుంది. ఆన్ లైన్ రెన్యువల్ చేస్తే 3% తగ్గింపు… యాక్టివ్ పాలసీ 4 నుండి 7వ సంవత్సరం మధ్య 5% తగ్గింపు ఉంటుంది. 8వ సంవత్సరం నుండి, ప్రతి సంవత్సరం 10% తగ్గింపు ఉంటుంది.
సాధారణంగా, వ్యక్తులు దీర్ఘకాలికంగా ఆరోగ్య బీమా పాలసీలను ఎంచుకుంటారు.
మీరు ManipalCigna లైఫ్ టైమ్ హెల్త్ ప్లాన్ ను ఎంచుకుంటే… మీరు ప్రీమియంల రూపంలో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేయవచ్చు.
లైఫ్ టైమ్ హెల్త్ గ్లోబల్ ప్లాన్ లో.. మీరు విదేశాలకు వెళ్లేటప్పుడు ట్రావెల్ సమయంలో కూడా ఆరోగ్య కవరేజీని పొందవచ్చు…
మీరు విదేశీ పర్యటనలో ఉన్నట్లయితే… మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురైతే.. అప్పుడు చాలా కష్టమైన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితులను హ్యాండిల్ చేసేలా ManipalCigna లైఫ్ టైమ్ హెల్త్ గ్లోబల్ ప్లాన్ ను తయారుచేశారు.
దీని అర్థం, మీరు భారతదేశంలో ఉన్నప్పుడు ఈ ప్లాన్ తో… మీరు లైఫ్ టైమ్ హెల్త్ ఇండియా ప్లాన్ ను ఉపయోగించుకుంటారు. మీరు విదేశాలలో ఉన్నప్పుడు, మీరు గ్లోబల్ ప్లాన్ ను యాక్టివేట్ చేయవచ్చు.
27 క్లిష్టమైన అనారోగ్య సమస్యలు లైఫ్ టైమ్ హెల్త్ ప్లాన్ లో కవర్ చేశారు. ఇతర ప్లాన్లతో పోల్చినప్పుడు ఈ నెంబర్.. మొత్తం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలోనే అత్యధికం అని చెప్పాలి.
బీమా చేయించుకున్న వ్యక్తి విదేశాల్లో ఉన్నప్పుడు ఈ వ్యాధులతో బాధపడితే… ఆసుపత్రి ఖర్చులకు కవరేజీ లభిస్తుంది.
అంతే కాదు, ఆసుపత్రిలో చేరడానికి ముందు, తర్వాత చేసే ఖర్చులు కూడా కవర్ అవుతాయి. ఈ ఖర్చులో.. విదేశాలలో అంబులెన్స్ లు, ఎయిర్ అంబులెన్స్ కవరేజీ ఉంటుంది.
ప్లాన్‌లో గ్లోబల్ రోబోటిక్, సైబర్ నైఫ్ సర్జరీ… గ్లోబల్ ట్రావెల్ వ్యాక్సినేషన్… ఆధునిక, అధునాతన చికిత్స… ఎవరైనా మరణిస్తే ఆ డెడ్ బాడీని స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి అయ్యే ఖర్చులను కూడా ఇది కవర్ చేస్తుంది. బీమా చేయించుకున్న వ్యక్తి విదేశాల్లో మరణిస్తే… మృతదేహాన్ని భారత్ కు తీసుకురావడానికి అయ్యే ఖర్చులను బీమా కంపెనీ భరిస్తుంది.
ఈ రోజుల్లో, క్యాన్సర్, గుండె, మెదడుకు సంబంధించిన తీవ్రమైన వ్యాధుల చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది. ఈ అనారోగ్యాలన్నీ లైఫ్ టైమ్ హెల్త్ గ్లోబల్ ప్లాన్ లో కవర్ చేశారు.
వీటితో పాటు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా కవర్ అవుతాయి. ప్లాన్ లో అనేక ఇతర వ్యాధులు, శస్త్రచికిత్సలకు కూడా కవరేజీ ఉంది.
లైఫ్ టైమ్ హెల్త్ ప్లాన్ తో, మీరు మణిపాల్ సిగ్నా క్రిటికల్ ఇల్నెస్ యాడ్-ఆన్ కవర్ని ఎంచుకోవచ్చు.
ఇన్సూరర్.. ఒకేసారి పేమెంట్ ను చెల్లిస్తాడు. బీమా చేయించుకున్న వ్యక్తికి తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు మొదటి రోగనిర్ధారణ తర్వాత… ఇది ఎంచుకున్న బీమా మొత్తానికి సమానంగా ఉంటుంది అని అర్థం.
లైఫ్ టైమ్ హెల్త్ ప్లాన్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీరు మీ అవసరాలకు అనుగుణంగా దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు.
ఈ ప్లాన్ 50 లక్షల రూపాయల నుండి మూడు కోట్ల రూపాయల వరకు కవరేజీని అందిస్తుంది. మీరు భారతదేశంలో ఉన్నా, విదేశాలలో ఉన్నా మీ అవసరాల ఆధారంగా ఎంచుకోవచ్చు.
అదేవిధంగా, ప్లాన్‌లో కవర్ చేసిన 27 క్లిష్టమైన అనారోగ్యాలలో, మీరు వీటన్నింటినీ లేదా క్యాన్సర్ ఆప్షన్ ను కానీ ఎంచుకోవచ్చు.
గ్లోబల్ ప్లాన్‌లో ఏరియా ఆఫ్ కవర్ లేదా AOC ఫీచర్ కింద, రెండు ఆప్షన్ లు ఉన్నాయి:
మొదటిది వరల్డ్ వైడ్, అంటే ప్రపంచవ్యాప్త కవరేజ్. రెండవది USA, కెనడా మినహా ప్రపంచవ్యాప్త కవరేజ్. అంటే అమెరికా, కెనడాలో మినహా ఇతర దేశాలలో కవరేజ్.
ఈ ప్లాన్‌లో, ముందుగా ఉన్న అనారోగ్య క్లెయిమ్ లపై 50% కో-పేమెంట్ నిబంధన వర్తిస్తుంది… ఈ నిబంధన AOCలో మార్పుల తర్వాత మొదటి సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత ఈ కో-పేమెంట్ నిబంధన ఉండదు.
మీరు మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ టైమ్ హెల్త్ ప్లాన్ ను కొనుగోలు చేస్తుంటే, మీరు ఈ ప్లాన్ లో మరికొన్ని ఫీచర్లను చేర్చవచ్చు.
ఉదాహరణకు, ఈ ప్లాన్ లో మీరు ఏటా 15 శాతం హామీ బోనస్ ను పొందుతారు. ఇది మీ బీమా మొత్తాన్ని పెంచుతుంది. దీనితో మీరు హెల్త్ కేర్ ఇన్ ఫ్లేషన్ ను తట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రసూతి ప్రయోజనాల గురించి చూస్తే.. మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ టైమ్ హెల్త్ ప్లాన్ లో మహిళలు రూ. 1 లక్ష వరకు ప్రసూతి కవరేజీని పొందుతారు. ఇక్కడ నవజాత శిశువు చికిత్స, టీకా ఖర్చులకు కవరేజ్ ఒక ఏడాది వరకు ఉంటుంది.
ఈ పాలసీని IVF చికిత్స కోసం కూడా ఉపయోగించవచ్చు.
IVF కవర్ గరిష్టంగా రూ. 2.5 లక్షల వరకు అందుబాటులో ఉంటుంది.
లైఫ్ టైమ్ హెల్త్ ప్లాన్ లో రూ. 1 లక్ష వరకు సరోగసీ కవరేజీ కూడా అందుబాటులో ఉంది.ఇందులో సరోగేట్ మదర్ చికిత్స కూడా ఉంటుంది.
ఊసైట్ (Oocyte) డోనర్ ప్రాసెస్‌లో, ఏదైనా సమస్య ఏర్పడితే, బీమా కంపెనీ ఒక లక్ష రూపాయల వరకు ఖర్చులను భరిస్తుంది. మారుతున్న జీవనశైలి, అలవాట్ల వల్ల… కొత్త కొత్త జబ్బులు పుట్టుకొచ్చాయి. చికిత్సా పద్ధతుల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి.
కాబట్టి అమన్.. తనకు అవసరమైన అన్ని ఫీచర్లను మణిపాల్ సిగ్నా లైఫ్ టైమ్ హెల్త్ ప్లాన్ లో పొందగలడు.అమన్ లాగానే, మీరు కూడా ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. మీ ఆరోగ్య భద్రతపై అన్ని రకాల బాధల నుంచి దూరంగా ఉండొచ్చు.
పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.