ట్యాక్స్ ను సేవ్ చేసే అద్భుతమైన మార్గాలు ఇవే!

దినేష్ లాగా, మీ 80C పరిమితి కూడా అయిపోయినట్లయితే, మీరు మీ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి, డబ్బును ఆదా చేసుకోవడానికి ఈ మినహాయింపుల నుంచి ప్రయోజనాన్ని పొందవచ్చు.

alternate

దినేష్ కాస్త కంగారుగా కూర్చోవడంతో.. ఏంటి అలా ఉన్నావు అంటూ ఉత్సవ్ అడిగాడు. దీంతో దినేష్ అసలు విషయం చెప్పాడు. తనకొచ్చేదే కొద్దిపాటు జీతమని.. కానీ అందులో కూడా ట్యాక్స్ రూపంలో ఎక్కువగా కట్ అవుతోందన్నాడు. ట్యాక్స్ ను సేవ్ చేసే పెట్టుబడి ఏమైనా పెట్టావా లేదా అని ఉత్సవ్ అడిగాడు. సెక్షన్ 80C కింద వచ్చేవాటి కోసమే సేవ్ చేశానని దినేష్ చెప్పాడు. ఇది కాకుండా వేరే ఏమైనా హెల్త్ పాలసీ కానీ, ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్ మెంట్ కానీ ఏమైనా చేశావా అని ఉత్సవ్ అడిగాడు. కానీ తనకు ట్యాక్స్ సేవింగ్స్ గురించి అలాంటి ఐడియా ఏమీ లేదన్నాడు. ఉత్సవ్ క్లియర్ గా చెప్పాడు. అలాంటి పాలసీలు కూడా ఉన్నాయన్నాడు. దీంతో అవేంటా అని తెలుసుకోవాలని దినేష్ చాలా క్యూరియాసిటీతో అడిగాడు.

తమ 80సీ మినహాయింపు పరిమితి రూ.1.5 లక్షలతో ఈపీఎఫ్, పిల్లల ట్యూషన్ ఫీజులు, జీవిత బీమాతో నింపడం వల్ల చాలా మంది ప్రజలు, ముఖ్యంగా శ్రామిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ? సరే, చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే 80C కాకుండా, పన్ను ఆదా చేయడానికి ఇతర ఎంపికలు ఉన్నాయి. వాటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

80C కాకుండా, పన్ను ఆదా చేయడానికి మొదటి ఆప్షన్.. నేషనల్ పెన్షన్ సిస్టమ్.. అంటే NPS పథకం. మీరు 80C లో 1.5 లక్షల లిమిట్ ను వాడుకున్నట్టయితే.. 80CCD 1(B) మీకు రిలీఫ్ ఇస్తుంది. NPS లో పెట్టుబడికి టైర్‌-1 లో సెక్షన్ 80CCD 1(B) కింద రూ. 50,000 అదనపు తగ్గింపు ఉంది. ఈ మినహాయింపు సెక్షన్ 80Cలో రూ.1.5 లక్షల పరిమితి కంటే ఎక్కువ.

రోజురోజుకు పెరుగుతున్న వైద్య ఖర్చులను కవర్ చేయడానికి ఆరోగ్య బీమా తప్పనిసరి. ఆరోగ్య బీమా అదనపు ప్రయోజనం పన్ను ఆదా. సెక్షన్ 80D కింద పాలసీ హోల్డర్ తో పాటు జీవిత భాగస్వామి, వారి బిడ్డకు ఆరోగ్య బీమా ప్రీమియంపై 25,000 వరకు తగ్గింపు పరిమితి ఉంటుంది. సీనియర్ సిటిజన్‌లకు అంటే 60 ఏళ్లు పైబడిన వారికి 50,000 వరకు ఉంటుంది. మీరు మీ కోసం, మీ సీనియర్ సిటిజన్ తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమాను తీసుకుంటే, 75,000 రూపాయలు వరకు తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం, గృహ రుణం తీసుకొని ఇంటిని కొనుగోలు చేయడం లేదా నిర్మించడంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ట్యాక్స్ పేయర్.. తాను స్వయంగా ఉండడానికి ఇంటిని హోమ్ లోన్ పై కొనుగోలు చేస్తే.. ఆ రుణంపై చెల్లించే వడ్డీపై రూ. 2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. ఒకవేళ కొనుగోలు చేసిన ఇల్లు లెట్-అవుట్ అయితే.. దానిపై మీరు మొత్తం వడ్డీపై మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్‌పై అంటే ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లింపుపై సెక్షన్ 80C కింద మినహాయింపు లభిస్తుంది.

ప్రశ్న-1)- నిర్మాణంలో ఉన్న రెసిడెన్షియల్ ప్రాపర్టీ విషయంలో హోమ్ లోన్ వడ్డీపై తగ్గింపును ఎప్పుడు, ఎలా క్లెయిమ్ చేయవచ్చు?

ఉన్నత చదువులు చదివి, దాని కోసం రుణం తీసుకుని కెరీర్ ప్లాన్ చేసుకోవడం ఈ రోజుల్లో కామన్. చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న విద్యార్థులు సెక్షన్ 80E కింద రుణ వడ్డీపై పన్ను మినహాయింపు పొందవచ్చు. పిల్లలు లేదా అతని లేదా ఆమె తల్లిదండ్రులు దీని నుంచి ప్రయోజనం పొందవచ్చు. మీరు ఎడ్యుకేషన్ లోన్ వడ్డీని చెల్లించడం ప్రారంభించిన సంవత్సరం నుంచి మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. మీరు లోన్ తిరిగి చెల్లించే కాలానికి మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అయితే, మినహాయింపు ప్రయోజనం మ్యాగ్జిమమ్ 7 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు, మీరు 10 సంవత్సరాల పాటు ఎడ్యుకేషన్ లోన్ చెల్లిస్తే, అందులో మీకు మినహాయింపు ప్రయోజనం దక్కేది 7 ఏళ్ల వరకు మాత్రమే. వడ్డీ చెల్లింపుపై మినహాయింపును క్లెయిమ్ చేయడానికి ఎలాంటి లిమిట్ లేదు.

ఛారిటీకి సంబంధించిన డీడ్‌ల ద్వారా కూడా పన్నును ఆదా చేయవచ్చు. మీరు ఎంచుకున్న రిలీఫ్ ఫండ్‌లు లేదా ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి, జాతీయ రక్షణ నిధి వంటి స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇస్తే, మీరు సెక్షన్ 80G కింద మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. సంస్థను బట్టి మీరు దేనికి విరాళం ఇస్తున్నారో, విరాళం మొత్తంపై గరిష్టంగా 50 లేదా 100 శాతం మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. నగదు రూపంలో రూ.2000 కంటే ఎక్కువ విరాళం ఇస్తే పన్ను మినహాయింపు ప్రయోజనం ఉండదు. వస్తువుగా చేసిన విరాళానికి పన్ను మినహాయింపు ఉండదు. ఈ ప్రయోజనాన్ని కోసం.. ట్యాక్స్ పేయర్స్.. కొన్ని షరతులను ఫాలో అవ్వాలి.

ప్రశ్న-2)- సెక్షన్ 80G కింద విరాళంపై మినహాయింపును క్లెయిమ్ చేయడానికి షరతులు ఏమిటి? మొత్తం ఆదాయంలో ఎంత శాతం విరాళంగా ఇవ్వవచ్చు?

మీరు.. మీపై ఆధారపడిన దివ్యాంగుని చికిత్స కోసం ఖర్చు చేస్తే, సెక్షన్ 80DD కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఆధారపడిన వ్యక్తి 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ దివ్యాంగులైతే.. రూ.75,000 వరకు వైద్య ఖర్చులపై మినహాయింపు, 80 శాతం అంతకంటే ఎక్కువ అంగవైకల్యం ఉంటే.. రూ.1,25,000 వరకు మినహాయింపు పొందవచ్చు. ఇది ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, అంధత్వం, దృష్టి తక్కువగా ఉండడం , వినికిడి లోపం వంటి వైకల్యాలను కవర్ చేస్తుంది. ఈ క్లెయిమ్ కోసం మెడికల్ అథారిటీ నుండి సర్టిఫికెట్ అవసరం.

మీరు లేదా మీపై ఆధారపడిన కుటుంబ సభ్యులు క్యాన్సర్, డిమెన్షియా, పార్కిన్సన్స్, మోటారు న్యూరాన్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నట్లయితే, దీని చికిత్సకు భారీగా ఖర్చు అవుతుంది. అప్పుడు సెక్షన్ 80DDB కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి, మినహాయింపు పరిమితి 40,000 రూపాయలు లేదా చికిత్స మొత్తం. ఇందులో ఏది తక్కువ అయితే అది వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లకు ఈ పరిమితి ₹ 1 లక్ష. రూపాయిలు.

అద్దెకు ఉండే ఉద్యోగులు ఇంటి అద్దె అలవెన్స్ అంటే హెచ్‌ఆర్‌ఏపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. దీని కోసం, కంపెనీ నుండి హెచ్‌ఆర్‌ఏ పొందడం , వారు అద్దెకు నివసించడం తప్పనిసరి.

HRAను క్లెయిమ్ చేయడానికి కొన్ని షరతులు ఉన్నాయి.
మొదటిది- HRAగా స్వీకరించిన అసలు మొత్తం,
రెండవది- మెట్రో సిటీలో బేసిక్ శాలరీలో 50 శాతం + డీఏ.. నాన్ మెట్రో సిటీలో బేసిక్ జీతంలో 40 శాతం + డీఏ.
మూడవది- వార్షిక బేసిక్ శాలరీ + డీఏ నుంచి వార్షిక అద్దెలో 10 శాతం మినహాయించిన తర్వాత మిగిలిన మొత్తం.

ఈ మూడింటిలో ఏది తక్కువైతే అది మీకు మినహాయింపు అవుతుంది.

అసంఘటిత రంగంలో చిన్న సంస్థల్లో పని చేసే ఉద్యోగులు లేదా స్వీయ ఉపాధి వల్ల ఇంటి అద్దెను పొందలేని వారు… ఇలాంటివారు ఆదాయపు పన్ను సెక్షన్ 80GG కింద ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన అద్దెపై 60 వేల వరకు మినహాయింపును పొందవచ్చు.

దినేష్ లాగా, మీ 80C పరిమితి కూడా అయిపోయినట్లయితే, మీరు మీ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి, డబ్బును ఆదా చేసుకోవడానికి ఈ మినహాయింపుల నుంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న ట్యాక్స్ పేయర్స్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది. మీకు ఇంతవరకు మాత్రమే సమయం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆదా పెట్టుబడులు పెట్టడానికి మార్చి 31, 2024 వరకే సమయముంది. కాబట్టి ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడు సెక్షన్ 80డి, 80జి వంటి మినహాయింపుల ప్రయోజనాన్ని పొందడం మంచిది. అలాగే, మీరు వాటిని కొత్త ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 కోసం ట్యాక్స్ ప్లాన్ లో కూడా చేర్చుకోవచ్చు.

Published: April 4, 2024, 10:57 IST

ట్యాక్స్ ను సేవ్ చేసే అద్భుతమైన మార్గాలు ఇవే!