ట్యాక్స్ సేవింగ్ కు ఇదే లాస్ట్ ఛాన్స్! ఏం చేయాలంటే..!

పన్ను ఆదా చేయడానికి ఐదో మార్గం ఇంటిని అద్దెకు తీసుకోవడం. ఉద్యోగులు.. హౌస్ రెంట్ అలవెన్స్.. అంటే హెచ్‌ఆర్‌ఏపై పన్ను మినహాయింపును క్లెయిమ్

alternate

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే FY2023-24 ముగింపు దశకు చేరుకుంది. కాబట్టి ఈ సంవత్సరం మీ ఆదాయంపై పన్ను ఆదా చేయడానికి ఇదే చివరి అవకాశం. మార్చి 31 తర్వాత, పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయంపై పన్ను తగ్గించుకోవడానికి వివిధ ట్యాక్స్ సేవింగ్స్ ఆప్షన్స్ ను ఉపయోగించుకోలేరు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోకుండా పన్ను రూపంలో డబ్బు.. జేబులో నుంచి పోకుండా ఉండాలంటే.. ట్యాక్స్ సేవింగ్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలను మార్చి 31లోపు తెలుసుకోవడం మంచిది. మనం ఇప్పుడు ఆ పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. దీని ద్వారా మీరు పన్ను ఆదాను ఎలా చేసుకోవచ్చో మీకు తెలుస్తుంది.

అన్నింటిలో మొదటిది, మీరు మీ ఆదాయాలపై పన్ను ఎంత ఉందో తెలుసుకోవాలి. దీని కోసం, ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కి (incometaxindia.gov.in) వెళ్ళండి… ట్యాక్స్ ఇన్ ఫర్మేషన్ అండ్ సర్వీసెస్ కింద ఉన్న ట్యాక్స్ టూల్స్ కు వెళ్లి దాని కింద ఉన్న వ్యూ ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తరువాత Tax Calculator-Old Vis-a-vis New Regime ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఈ కాలిక్యులేటర్ సహాయంతో, మీరు మీ ఆదాయాన్ని లెక్కించవచ్చు. పాత, కొత్త పన్ను విధానంలో.. ట్యాక్స్ ను సేవ్ చేసే పెట్టుబడుల వివరాలను లేదా మినహాయింపుల వివరాలను ఇచ్చి.. వాటి ద్వారా మీకు పడే ట్యాక్స్ ఎంతో తెలుసుకోవచ్చు. ఇది రెండు రకాల పన్ను విధానాలను చూపిస్తుంది. దీనిని బట్టి మీకు నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు.

పాత పన్ను విధానంలో దాదాపు 70 మినహాయింపులు, తగ్గింపులు ఉన్నాయి. పన్ను భారాన్ని తగ్గించడానికి వీలుగా వీటిని క్లెయిమ్ చేయవచ్చు. కొత్త విధానంలో, పన్ను ఆదా చేయడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే, తగ్గింపులు చాలా తక్కువుగా ఉంటాయి. అలాగే, పన్ను రేటు కూడా తక్కువ. కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు, అయితే పాత విధానంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు. మీరు జీతం తీసుకునేవారైతే.. పాత విధానంలో వలే 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానంలో కూడా పన్ను లేదు. రూ.1,000 స్టాండర్డ్ డిడక్షన్ అందుబాటులో ఉంటుంది. అంటే, కొత్త విధానంలో రూ.7.5 లక్షల వరకు ఉద్యోగుల ఆదాయంపై పన్ను ఉండదు.

పన్ను ఆదా కోసం, చాలా మంది వ్యక్తులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80Cని ఉపయోగిస్తున్నారు. ఇది జీవిత బీమా, ఉద్యోగుల భవిష్య నిధి (EPF), ట్యూషన్ ఫీజులు వంటి వాటిని కూడా కవర్ చేస్తుంది. పన్ను ఆదా కోసం పెట్టుబడి పెట్టే ముందు, వీటిలో ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టారో చెక్ చేసుకోండి. ఈ మొత్తాన్ని 80C కింద ఉన్న రూ. 1.5 లక్షల పరిమితి నుంచి తగ్గించిన తరువాత కొత్త పెట్టుబడులు పెట్టండి.

సెక్షన్ 80C పరిమితి మిగిలి ఉంటే, మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో అంటే PPF, పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టవచ్చు. వీటిలో, ELSS కు కనీస లాక్ ఇన్ పిరియడ్ 3 ఏళ్లు.

సెక్షన్ 80C లిమిట్ పూర్తయితే.. మీరు అదనపు పన్నును ఆదా చేయడానికి జాతీయ పెన్షన్ సిస్టమ్.. అంటే NPS పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. సెక్షన్ 80CCD (1B), టైర్-1 ఖాతాలో పెట్టుబడిపై రూ. 50,000 వరకు అదనపు మినహాయింపు లభిస్తుంది.

పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చుల దృష్ట్యా, ప్రతి వ్యక్తికి ఆరోగ్య బీమా అవసరం. ఆరోగ్య బీమా ఆసుపత్రి ఖర్చులను కవర్ చేయడమే కాకుండా పన్ను ఆదా చేయడంలో కూడా సహాయపడుతుంది. IT చట్టంలోని సెక్షన్ 80D కింద, స్వీయ, భార్య, పిల్లలకు ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.25,000 వరకు తగ్గింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు పాలసీ తీసుకుంటే రూ.50,000 వరకు మినహాయింపు ఉంటుంది.

నాలుగో ఆప్షన్ పెట్టుబడి కాదు.. కానీ పన్ను ఆదా చేయడంలో సహాయపడుతుంది. మీరు సమాజ సంక్షేమం కోసం విరాళం ఇవ్వడం ద్వారా కూడా పన్ను ఆదా చేయవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80G కింద, రిలీఫ్ ఫండ్స్, స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళంపై పన్ను మినహాయింపు ఉంటుంది. స్వచ్ఛంద సంస్థను బట్టి, విరాళం మొత్తంపై 50% లేదా 100% తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. ఏ సమస్యా రాకుండా ఉండడానికి.. నగదుకు బదులుగా చెక్కు ద్వారా ఆ మొత్తాన్ని విరాళంగా ఇవ్వండి. DD లేదా ఆన్‌లైన్‌లో బదిలీ ద్వారా చెల్లించవచ్చు.

పన్ను ఆదా చేయడానికి ఐదో మార్గం ఇంటిని అద్దెకు తీసుకోవడం. ఉద్యోగులు.. హౌస్ రెంట్ అలవెన్స్.. అంటే హెచ్‌ఆర్‌ఏపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. దీని కోసం వారు యజమాని.. అంటే కంపెనీ నుంచి ఇంటి అద్దెను (హెచ్‌ఆర్‌ఎ) పొందాలి.

HRA క్లెయిమ్ చేయడానికి కొన్ని షరతులు ఉన్నాయి.
మొదటిది- HRAగా స్వీకరించిన అసలు మొత్తం,
రెండవది- మెట్రో సిటీలో బేసిక్ జీతంలో 50 శాతం, డీఏతోపాటు నాన్ మెట్రో సిటీలో బేసిక్ జీతంలో 40 శాతం ప్లస్ డీఏ.
మూడవది- వార్షిక బేసిక్ జీతంలో 10 శాతం, వార్షిక అద్దె నుండి DA మినహాయించిన తర్వాత మిగిలి ఉన్న మొత్తం.
మూడింటిలో తక్కువ మొత్తం తగ్గింపు మొత్తం అవుతుంది.

మీరు ఈ ట్యాక్స్ సేవింగ్స్ ఆప్షన్స్ ను జాగ్రత్తగా పరిశీలించి, వాటిని మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా సెట్ చేసుకోవాలి. దీనితో పాటు మార్చి 31లోపు పెట్టుబడి పెట్టాలి. ఏ సమస్యా రాకుండా ఉండేలంటే.. చార్టర్డ్ అకౌంటెంట్‌ని సంప్రదించడం మంచిది. మీరు అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లయితే.. కంపెనీకి అద్దె రసీదు, రెంట్ అగ్రిమెంట్ ను సమర్పించకపోతే… మీరు ITR ఫైల్ చేస్తున్నప్పుడు HRA క్లెయిమ్ చేయవచ్చు.

Published: March 15, 2024, 16:42 IST

ట్యాక్స్ సేవింగ్ కు ఇదే లాస్ట్ ఛాన్స్! ఏం చేయాలంటే..!