మూన్‌లైటింగ్ పని గురించి ఐటీ రిటర్న్స్ లో చెప్పాల్సిందే.. లేదంటే..

ఇన్‌కమ్ ట్యాక్స్ లో మూన్‌లైటింగ్‌పై నిర్దిష్ట నిబంధన లేదు. అయితే, దీనిపై ఎలాంటి పన్ను ఉండదని దీని అర్థం కాదు. అదనపు ఆదాయంపై పన్ను ఉద్యోగం రకంపై ఆధారపడి ఉంటుంది.

ఐటీ కంపెనీలో పనిచేసే అవినాష్‌కి సంబంధించిన కథే ఈరోజు మనం చెప్పుకుందాం. అతను 2022-23 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చార్టర్డ్ అకౌంటెంట్ (CA)ని సంప్రదించాడు. సీఏ సూచనల మేరకు ఫారం-16, ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్‌లు వంటి అన్ని అవసరమైన పత్రాలను పంపించాడు. కాసేపటి తర్వాత సీఏ అతడికి ఫోన్ చేసి అతను 50 వేల రూపాయలు టాక్స్ బకాయి ఉన్నట్టు సమాచారం ఇచ్చాడు.

అవినాష్ అవాక్కయ్యాడు. ఈ టాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అని ఆశ్చర్యపోయాడు. కొద్ది సేపటి తర్వాత సీఏ, ‘‘మీ జీతంతో పాటు ఇతర ఆదాయ వనరులు ఏమైనా ఉన్నాయా?’’ అని ప్రశ్నించాడు. తాను ఆగస్ట్ నెలలో ఒక పార్ట్ టైమ్ ప్రాజెక్ట్ వర్క్ చేసినట్టు అవినాష్ గుర్తుచేసుకుని చెప్పాడు.

సాధారణ ఉద్యోగంతో పాటు, అవినాష్ చేసే ఏదైనా అదనపు పనిని మూన్ లైటింగ్ గా పరిగణిస్తారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మీరు ఒక నిర్దిష్ట కంపెనీ కోసం 9 గంటలు పని చేస్తున్నారు. తరువాత మీ మిగిలిన సమయంలో మీరు మరొక కంపెనీకి పనిచేశారు. దీనిని మూన్ లైటింగ్ అంటారు. దాని నుంచి వచ్చే ఆదాయాన్ని మూన్ లైటింగ్ ద్వారా వచ్చే ఆదాయం అంటారు.

ఇన్‌కమ్ ట్యాక్స్ లో మూన్‌లైటింగ్‌పై నిర్దిష్ట నిబంధన లేదు. అయితే, దీనిపై ఎలాంటి పన్ను ఉండదని దీని అర్థం కాదు. అదనపు ఆదాయంపై పన్ను ఉద్యోగం రకంపై ఆధారపడి ఉంటుంది. ఇది జీతం ఆదాయం, వృత్తిపరమైన రుసుము లేదా వ్యాపార ఆదాయం ఇలా వర్గీకరిస్తారు.

మూన్‌లైటింగ్ ద్వారా వచ్చే ఆదాయం జీతం రూపంలో ఉంటే, మీరు దానిని మీ బేస్ కంపెనీ నుంచి వచ్చే ఆదాయంతో పాటు జీతం కింద చూపవచ్చు. మూన్‌లైటింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని జీతంగా స్వీకరించినట్లయితే, దానిని ఆదాయపు పన్ను రిటర్న్‌లో ‘సేలరీ ‘ హెడ్ కింద చూపించాలి. తగ్గింపులు – మినహాయింపుల తర్వాత, మూన్‌లైటింగ్ ద్వారా వచ్చే ఆదాయాలపై వర్తించే స్లాబ్ రేటుపై పన్ను విధిస్తారు. మీరు అర్హత పరిమితుల ప్రకారం ఒకసారి మాత్రమే స్టాండర్డ్ డిడక్షన్, 80C, 80D, మొదలైన తగ్గింపులను క్లెయిమ్ చేయవచ్చు

రెండవ ఉద్యోగం నుంచి వచ్చే ఆదాయాలు ఫ్రీలాన్స్ పని లేదా వృత్తిపరమైన ఫీజు నుంచి వచ్చినట్లయితే, అది “వ్యాపారం అలాగే వృత్తి” కింద ఆదాయంగా పరిగణిస్తారు. వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే ఆదాయం లాగానే, ఈ ఆదాయాల పై కూడా తదనుగుణంగా పన్ను విధిస్తారు.

దీనికి ఏ ITR ఫారమ్ వర్తిస్తుంది? అనే విషయం తెలుసుకుందాం

నిమిత్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు, సిఎ నితేష్ బుద్ధదేవ్.. మూన్‌లైటింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వేతనంగా పొందినట్లయితే, దానిని ఐటీఆర్-1 ఫారమ్‌లో చూపాలని వివరిస్తున్నారు. అయితే, మొత్తం ఆదాయం 50 లక్షల రూపాయలు దాటితే లేదా ఏదైనా మూలధన లాభాలు ఉంటే, అప్పుడు ITR-2 ఫారమ్ వర్తిస్తుంది. అదేవిధంగా, వ్యాపారం లేదా వృత్తిపరమైన రుసుము నుంచి అదనపు ఆదాయం ఉంటే అలాగే పన్ను చెల్లింపుదారుడు ప్రిజమ్ప్టివ్ టాక్సేషన్ స్కీమ్ (PTS)ని ఎంచుకుంటే, వారు ITR-4 ఫారమ్‌ను పూరించాలి. ప్రొఫెషనల్ ఫీజుల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం 50 లక్షల రూపాయలు దాటితే, దానిని ITR-3 ఫారమ్‌లో చూపవచ్చు.

ఊహాత్మక పన్ను పథకం అంటే ఏమిటి? చూద్దాం. ఫ్రీలాన్సర్‌లు అలాగే కన్సల్టెంట్‌లు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 44ADA ప్రకారం, ముందస్తు పన్ను పథకాన్ని ఎంచుకోవడానికి అనుమతి ఇచ్చారు.

ఈ పథకం స్థూల రశీదులు అంటే మొత్తం ఆదాయం 50 లక్షల రూపాయలకు మించని నిపుణులకు మాత్రమే వర్తిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పరిమితిని 75 లక్షల రూపాయలకు పెంచారు. ఈ పథకం కిందకు వచ్చే ప్రొఫెషనల్‌లు వారి స్థూల రశీదులలో 50%ని ఊహాజనిత ఆదాయంగా చూపగలరు. పన్ను గణన ఈ మొత్తంపై ఆధారపడి ఉంటుంది . లీగల్, మెడికల్, ఇంజనీరింగ్, టెక్నికల్ కన్సల్టెన్సీ, ఆర్కిటెక్ట్‌లు, CBDT ద్వారా నోటిఫై అయిన ఇతర వృత్తుల నిపుణులు ఈ పథకంలో చేర్చడం జరిగిందని గమనించడం ముఖ్యం.

అదేవిధంగా, Section 44ADలో, చిన్న వ్యాపార యజమానులు అటువంటి ఊహాజనిత పన్నుల పథకాలను ఎంచుకోవచ్చు. దీని మొత్తం టర్నోవర్ లేదా స్థూల రసీదులు 2 కోట్ల రూపాయల కంటే తక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి, ఈ పరిమితి 3 కోట్ల రూపాయలకు పెంచారు. ఈ రెండు సందర్భాల్లోనూ, నగదు రూపంలో వచ్చిన మొత్తం.. మొత్తం ఆదాయంలో 5% మించకూడదు. అయితే, కమీషన్, బ్రోకరేజ్ లేదా ఏజెన్సీ వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం అయితే, ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు.

మూన్‌లైటింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వృత్తిపరమైన రుసుముగా చూపాలని బుద్ధదేవ్ సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, ఈ పనిలో అయ్యే ఖర్చులను ఖర్చుల వర్గం కింద తగ్గింపులుగా చూపవచ్చు. అంతేకాకుండా, ఈ ఆదాయంపై పన్నును లెక్కించడం ద్వారా, మీరు అన్ని నాలుగు వాయిదాల అడ్వాన్స్ పన్నును సకాలంలో చెల్లించాలి.

మూన్‌లైటింగ్ సేవల కోసం కంపెనీలు లేదా విక్రేతలకు చెల్లింపులు చేసినప్పుడు, మూలం దగ్గర పన్ను అంటే TDS తీసివేస్తారు. ఈ మొత్తం ప్రభుత్వం వద్ద జమ చేస్తారు. దీనివలన మీ సంపాదన గురించి ప్రభుత్వానికి సమాచారం చెరిపోతుందని అర్ధం చేసుకోవాలి. అటువంటప్పుడు మూన్‌లైటింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని దాచడానికి బదులుగా మీరు దానిని మీ పన్ను రిటర్న్‌లో ప్రకటించి, పన్నులను చెల్లించాలి. లేదంటే మీరు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసును అందుకోవచ్చు. అటువంటి ఆదాయాన్ని దాచడం పన్ను ఎగవేతగా పరిగణిస్తారు. ఇది భారీ జరిమానాలు.. చట్టపరమైన పరిణామాలకు దారి తీస్తుంది.

Published: July 24, 2023, 22:50 IST