యాక్సిడెంట్ పేరుతో సైబర్ మోసం! పసిగట్టేదెలా? పట్టించేదెలా?

ఆ యాప్ ద్వారా వారు బాధితుడి ఫోన్, ఇతర పరికరాలకు యాక్సెస్ పొందుతారు. ఈ యాక్సెస్‌తో, వారి బ్యాంక్ ఖాతాలతో పాటు ఇతర ఆర్థిక వివరాలను పొంది.. వాటి సాయంతో బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తారు.

62 ఏళ్ల శోభకు తెల్లవారుజామున తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. అవతలివారు చెప్పిన వార్త విని షాక్ కు గురయ్యారు. తన కొడుకు ప్రమాదానికి గురయ్యాడని ఆసుపత్రిలో చేర్చారని.. శస్త్రచికిత్స చేయాలన్నది ఆ కాల్ సారాంశం. దీనికోసం అత్యవసరంగా 1.5 లక్షల రూపాయలు చెల్లించాలంటూ ఆ ఫోన్ చేసినవాళ్లు చెప్పారు.

అటువైపు నుంచి ఏడుపు వినిపించడంతో శోభ కంగారుపడింది. చికిత్స కోసం డబ్బు ఇవ్వకపోతే, కొడుకు బతకడని చెప్పారు. దీంతో శోభలో కంగారు ఇంకా పెరిగింది. అందుకే వెంటనే శోభ తన బ్యాంకింగ్ యాప్‌ని ఓపెన్ చేసింది. ఆమె డబ్బు పంపాలనుకుంది, కానీ ఈ ఆందోళన వల్ల ఎంత మొత్తం పంపించాలో ఆమె మర్చిపోయింది. అందుకే ఎంత మొత్తం పంపాలో నిర్థారించుకోవడానికి కుమారుడి నెంబర్ కు కాల్ చేసింది. కానీ ఆ ఫోన్ ను అతడే లిఫ్ట్ చేయడంతో ఆశ్చర్యపోయింది జరిగిన సంఘటన మొత్తాన్ని ఆమె వివరించింది. డబ్బులు పంపమని ఎప్పుడూ తాను అడగలేదని అతడు చెప్పాడంతో విస్తుపోయింది!

తన నుంచి డబ్బు దోచుకోవడానికి పెద్ద ఉచ్చు పన్నారని శోభకు అర్థమైంది. శోభ తృటిలో ఆర్థిక నష్టం నుంచి తప్పించుకుంది. శోభలాంటి వేలాది మంది సీనియర్ సిటిజన్లు ఈ సైబర్ మోసాలకు గురవుతున్నారు.

వృద్ధులను మోసగాళ్లు ఎలా మోసం చేస్తారో చూద్దాం. వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియా , యాప్‌లలో షేర్ చేసినప్పుడు, సైబర్ నేరగాళ్లు ఆ డేటాను సేకరిస్తారు . స్కామ్ కాల్స్ ను చేస్తారు.

సైబర్ నేరగాళ్లు తాము సేకరించిన ఆ డేటాతో ఫేక్ కాల్స్ పరంపర మొదలవుతుంది. వృద్ధ జంటలు ఒంటరిగా నివసిస్తున్నారని వారికి తెలిస్తే.. విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ కాల్ చేస్తారు. లేదంటే కరెంట్ కట్ చేస్తామని బెదిరిస్తారు.

పైగా కాలర్ చేసినవారు బిల్ కట్టడానికి తాము సహాయం చేస్తామంటారు. తెలివిగా మాటలు కలిపి.. వారితో థర్డ్-పార్టీ యాప్‌ని డౌన్‌లోడ్ చేయిస్తారు.

ఆ యాప్ ద్వారా వారు బాధితుడి ఫోన్, ఇతర పరికరాలకు యాక్సెస్ పొందుతారు. ఈ యాక్సెస్‌తో, వారి బ్యాంక్ ఖాతాలతో పాటు ఇతర ఆర్థిక వివరాలను పొంది.. వాటి సాయంతో బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తారు.

అదేవిధంగా, స్కామర్‌లు మీకు తెలిసిన నంబర్ నుండి సందేశం లేదా వాయిస్ కాల్‌లు చేయడానికి WhatsAppని ఉపయోగిస్తారు. వారు మెడికల్ ఎమర్జెన్సీని కోసం డబ్బు అడుగుతారు. అలాంటి అత్యవసర వైద్య సేవలు అని చెప్పడంతో చాలామంది భయాందోళనలకు గురవుతారు. అందుకే వెంటనే వేలు లేదా లక్షల మొత్తాన్ని వెంటనే పంపుతారు.

ఇటువంటి సందర్భాలలో AI కొన్నిసార్లు కాలర్ వాయిస్‌ని అనుకరించడానికి లేదా నంబర్‌ను హ్యాక్ చేయడానికి ఉపయోగిస్తారు. మీరు ఇలాంటి సైబర్ బెదిరింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగే డబ్బును వేరే వారికి ట్రాన్స్ ఫర్ చేసేముందు మీకు తెలియని అభ్యర్థనను అంగీకరించవచ్చా లేదా అని ముందుగా ధృవీకరించుకోండి.

దీని తరువాత, కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వ్యక్తులను పిలుస్తారు.

సీనియర్ సిటిజన్‌లను లక్ష్యంగా చేసుకునే ఇటువంటి మోసాలు చేసే కేసులు రోజురోజుకు ఎలా పెరుగుతున్నాయో చూద్దాం!

చాలా మంది సీనియర్ సిటిజన్లకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండదు. విద్యుత్ బిల్లులు, KYC వివరాల అప్డేట్ మొదలైన వాటి పేరుతో ఎవరైనా వారిని మోసం చేస్తారనే ఆలోచన వారికి లేదు.

వృద్ధులకు ఇలాంటి కాల్స్ ద్వారా.. కరెంటు నిలిపివేయబడుతుందని లేదా వారి బ్యాంక్ ఖాతా మూసివేయబడుతుందని బెదిరిస్తారు. లేదా వారి కుటుంబ సభ్యుడు ప్రమాదానికి గురయ్యారని కాల్ చేసిన వ్యక్తి చెప్పినప్పుడు, సీనియర్ సిటిజన్లు భయపడతారు. వారు భయాందోళనలకు గురవుతారు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటారు.

అందువల్ల, మీరు ఇంట్లో మీ పెద్దలను అప్రమత్తం చేయాలి. తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ లిఫ్ట్ చెయ్యవద్దు అని చెప్పండి. వారు ఫోన్ లిఫ్ట్ చేస్తే.. వారు చెప్పిన సమాచారాన్ని ముందుగా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎలాంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దు. చెల్లింపు లేదా రివార్డ్ పాయింట్‌లను పొందడానికి యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని అడిగితే, ఆ తప్పు చేయకండి. అలాగే చాలా చోట్ల ఫోన్ నంబర్లు షేర్ చేసుకోవడం వల్ల స్పామ్ కాల్స్ బాధితులుగా మారుతున్నారు. కాబట్టి, అవసరమైన చోట మాత్రమే మీ నెంబర్‌ను షేర్ చేయండి.

Published: December 8, 2023, 17:39 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.