Dark Patterns: ఆన్ లైన్ షాపింగ్ లో డార్క్ ప్యాటర్న్

కస్టమర్ పై ఒత్తిడి చేసి వస్తువులు కొనిపించేలా చేయడాన్ని డార్క్ ప్యాటర్న్(Dark Patterns) అంటారు. అందరూ ఇలాంటి డార్క్ ప్యాటర్న్ ల వలలో ఉన్నారు.

శ్రీనిధి, శ్రీయ స్నేహితులు. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. శ్రీనిధి ఒక డ్రస్ గురించి శ్రీయకు చెప్పింది. దానిపై ఆన్ లైన్ లో (Dark Patterns) భారీ డిస్కౌంట్స్ ఉన్నాయని.. ఇప్పుడు తీసుకుంటే తక్కువ ధరలో కొనొచ్చని శ్రీనిధి అంది. అయితే, శ్రీయ వేరే వెబ్సైట్ లో కూడా చెక్ చేస్తాను అంది. ఎందుకంటే, ఎక్కడ తక్కువకి దొరికితే అక్కడ కొనుక్కోవచ్చు అని చెప్పి వేరే వెబ్సైట్ లో చెక్ చేసింది. అక్కడ కొంచెం ఎక్కువ ధర కనిపించింది. దీంతో శ్రీనిధి ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకు. నేను చెప్పిన దగ్గర వెంటనే కొనేయి.. మళ్ళీ రేటు పెరిగిపోతుంది అని చెప్పింది శ్రీనిధి. వీరు మాట్లాడుకుంటూ ఉండగానే శ్రీయ ఫోన్ కు నోటిఫికేషన్ వచ్చింది. అది తాను డ్రెస్ చెక్ చేసిన వెబ్సైట్ నుంచి. అక్కడ ఆమె చూసిన డ్రస్ పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నామని.. అది ఒక్కరోజు మాత్రమే అనీ.. వెంటనే కొనకపోతే డిస్కౌంట్ రాదు అని ఆ మెసేజ్ లో ఉంది. ఇది చూసి శ్రీయ ఆశ్చర్యపోయింది. అప్పుడు శ్రీనిధి వెంటనే కొనుక్కో.. లేకపోతె ఎటువంటి డిస్కౌంట్ రాదు.. అని హెచ్చరించింది.

ఇప్పుడు శ్రీయ షాపింగ్ చేసినా చేయకపోయినా ఆమె ఇష్టం మాత్రమే కాదు. అది ఆ షాపింగ్ వెబ్సైట్ కోరికగా మారిపోయింది. ఇక ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఇలా మీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు జరిగే ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఆన్ లైన్ షాపింగ్ లో ఏదైనా వస్తువును విష్ లిస్ట్ లో చేర్చారు అంటే.. ఇక అక్కడ నుంచి ఇలా నోటిఫికేషన్స్ రావడం మొదలైపోతుంది.

మీరు ఇష్టపడిన టీ-షర్ట్ ఇప్పుడు మీకోసం తక్కువ ధరలో ఇస్తున్నాం. వెంటనే కొనండి. స్టాక్ తక్కువ ఉంది. ఈ ఆఫర్ మీకు మాత్రమే. అది కూడా 12 గంటల్లో ముగిసిపోతుంది. ఈలోపు స్టాక్ కూడా అయిపోవచ్చు. అందుకే, వెంటనే మీ ఆర్డర్ పూర్తి చేయండి. ఇప్పటికే మీరు ఇష్టపడిన టీ-షర్ట్ ను 225 మంది కొనుగోలు చేశారు. అందుకే ఆలస్యం చేయకండి. ఇలా నోటిఫికేషన్ మోత మోగిపోతుంది. ఇలా కస్టమర్ పై ఒత్తిడి చేసి వస్తువులు కొనిపించేలా చేయడాన్ని డార్క్ ప్యాటర్న్(Dark Patterns) అంటారు.

వస్తువులను కొనుగోలు చేయడానికి తమ వెబ్‌సైట్‌కి వచ్చిన వారికి మెసేజ్ లు పంపే ఆన్‌లైన్ డిజైన్ సాధనాలు ఇవి. మీరు ఇప్పుడు కొనుగోలు చేయకపోతే, మీరు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని మీకు అనిపించేలా చేయడమే Dark Patterns  ఉద్దేశ్యం.

శ్రీయ లానే, మనం అందరం కూడా ఇలాంటి డార్క్ ప్యాటర్న్(Dark Patterns) లకు చిక్కుకుపోయి ఉన్నాం. బిస్కెట్ల ప్యాకెట్ కొనడానికి మనం ఆన్‌లైన్ కిరాణా ప్లాట్‌ఫారమ్‌కి వెళతాం. మనం దానిని షాపింగ్ కార్ట్‌కి యాడ్ చేసిన వెంటనే, ప్రత్యేక ఆఫర్‌ల నోటిఫికేషన్‌ల దాడి మొదలవుతుంది. 12 రూపాయలకు ఒక బిస్కెట్ ప్యాకెట్, 20 రూపాయలకు రెండు ప్యాకెట్లు, 35 రూపాయలకు 4 ప్యాకెట్లు.. పొదుపు పేరుతో 1కి బదులు 4 ప్యాకెట్లు కొనమని ప్రలోభపెట్టడం కూడా ఒక డార్క్ ప్యాటర్న్ వ్యూహమే.

అదేవిధంగా, మీరు ఆన్‌లైన్‌లో హోటల్ గదిని బుక్ చేసినప్పుడు షేమింగ్‌ని నిర్ధారించడానికి డార్క్ ప్యాటర్న్‌(Dark Patterns)లను ఎదుర్కొంటారు. మీరు ట్రావెల్ అగ్రిగేటర్ సైట్‌లో మీ బుకింగ్ క్వెరీని ఉంచిన వెంటనే, ఒకదాని తర్వాత మరొకటి పాప్-అప్ ప్రకటనలు రావడం ప్రారంభమవుతాయి – “ఈ సమయంలో మరో 25 మంది ఈ పేజీని చూస్తున్నారు.. హోటల్ గదిని ఇప్పుడే బుక్ చేసుకోండి. 15 శాతం తగ్గింపు పొందండి. . లేకుంటే మీరు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.. ఇప్పుడు ఒక గది మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి త్వరపడండి..” ఇవి కస్టమర్ ని వెంటనే తీసుకోకపోతే ఇబ్బంది పడిపోతామేమో అనే భయంలోకి నెట్టేస్తాయి. దీంతో అది పోతుందనే భయంతో మీరు తొందరపడి బుకింగ్ చేయడం అనే తప్పు చేస్తారు.

వినియోగదారుల ప్రాధాన్యతలను ప్రభావితం చేసేందుకు ఈ-కామర్స్ కంపెనీలు ఉపయోగించే వ్యూహాల గురించి ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. డార్క్ ప్యాటర్న్(Dark Patterns) లను ఆపడానికి – వినియోగదారులను రక్షించడానికి మార్గదర్శకాలను సిద్ధం చేయడానికి 17 మంది సభ్యులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేశారు.

డార్క్ ప్యాటర్న్‌లు ఇ-కామర్స్ సైట్‌ల రహస్య వ్యూహమని ప్రొఫెసర్, కన్స్యూమర్ వాయిస్ మేనేజింగ్ ఎడిటర్ శ్రీరామ్ ఖన్నా చెబుతున్నారు. దీని ద్వారా, వారు వినియోగదారులను ఆకర్షిస్తారు. వారిని తప్పుదారి పట్టిస్తారు. . వారికి అవసరం లేకపోయినా కూడా షాపింగ్ చేసేలా చేస్తారుఅని ఆయన అన్నారు. నిజానికి కస్టమర్ కు తెరవెనుక ఏమి జరుగుతుందో కూడా తెలియదు… సైట్‌ల ఈ స్క్రీన్‌లు ఒక చోట నుంచి మరొక చోటకి ఆటోమెటిక్ గా కస్టమర్ రీచ్ అయిపోయేలా ప్రోగ్రామ్ చేసి ఉంటాయి. ఇది వినియోగదారుని ప్రభావితం చేస్తుంది. వారు షాపింగ్‌ చేస్తారు. ఇది ఇ-కామర్స్ కంపెనీలకు లాభదాయకం. అదేవిధంగా వినియోగదారులకు హానికరం.

కాబట్టి, ఈ ట్రిక్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొన్ని డార్క్ ప్యాటర్న్(Dark Patterns) లను గుర్తించింది – తప్పుడు సమాచారం, అత్యవసరం అనిపించేలా చేయడం – వస్తువులు స్టాక్ అయిపోవచ్చని వినియోగదారులను మోసం చేయడం ద్వారా కస్టమర్ షాపింగ్ చేయవలసి వచ్చేలా ఇవి చేస్తున్నాయి. శ్రీయ విషయంలో ఇదే జరిగింది.
రెండవ ట్రిక్ బాస్కెట్ స్నీకింగ్ – అంటే కస్టమర్ సమ్మతి లేకుండా అదనపు ప్రోడక్ట్స్ లేదా సర్వీస్ లను యాడ్ చేయడం అలాగే సబ్‌స్క్రిప్షన్ ట్రాప్‌లు – దీని అర్థం సర్వీస్ కోసం సైన్ అప్ చేయడం సులభం కానీ దాని నుంచి బయటకు రావడం కష్టం…

ఇక మూడవది బైట్ & స్విచ్- మీకు ఒక ఉత్పత్తికి సంబంధించిన ప్రకటన చూపిస్తారు. కానీ మీరు వేరొక దాని డెలివరీని పొందుతారు. ఇవి తరచుగా తక్కువ నాణ్యత గల ప్రోడక్ట్స్ అయి ఉంటాయి. వీటి పేర్లు భిన్నంగా ఉంటాయి కానీ ప్రయోజనం ఒకటే – అది వినియోగదారుని తప్పుదారి పట్టించడం.

2030 నాటికి, భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విలువ 1 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు చేస్తున్న ఆన్‌లైన్ లావాదేవీలు – షాపింగ్ సంఖ్య చాలా రెట్లు పెరుగుతుందని అర్థం. దీనితో, వినియోగదారులను చీకటిలో ఉంచి, డబ్బు ఖర్చు చేసేలా చేసే ఈ డిజిటల్ కంపెనీల వ్యూహాలు కూడా పెరుగుతాయి. ప్రభుత్వం నిబంధనలు తెస్తుంది కానీ ప్రభుత్వ నిబంధనలను సులభంగా తప్పించుకోవచ్చు. ఆ నిబంధనలు తప్పించుకుని కొత్త వ్యూహాలను అనుసరించే అవకాశమూ ఉంది. కాబట్టి మీరు ఈ-కామర్స్ కంపెనీల విక్రయ వ్యూహాన్ని నివారించాలనుకుంటే, మీరు ఎలర్ట్ గా ఉండటం మంచిది. ప్రలోభాలకు లొంగకుండా.. మీకు తప్పనిసరి అవసరం అయితే మాత్రమే ఆ వస్తువును కొనండి. అలానే, డిస్కౌంట్స్ వంటి Dark Patterns ఆకర్షణలో పడకండి. ఒకటికి పది సార్లు అన్ని విధాలుగానూ చెక్ చేసుకున్న తరువాత మాత్రమే మీకు అవసరం అయినా వస్తువును కొనుక్కోండి.

Published: September 25, 2023, 13:41 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.