ఫిన్‌ఫ్లూయెన్సర్‌ చెప్పేది వినాలని డబ్బు ఖర్చు చేస్తున్నారా? మునిగిపోతారు జాగ్రత్త!

వినయ్.. ప్రసాద్ ఇద్దరూ మంచి మిత్రులు. వారు ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించిన విషయాలపై మాట్లాడుకుంటున్నారు. వినయ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే.. దాని గురించి అతనికి పెద్దగా ఏమీ తెలీదు. ఇదే విషయాన్ని స్నేహితుడు ప్రసాద్ కి చెప్పాడు..

  • KVD varma
  • Last Updated : September 19, 2023, 23:28 IST

వినయ్.. ప్రసాద్ ఇద్దరూ మంచి మిత్రులు. వారు ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించిన విషయాలపై మాట్లాడుకుంటున్నారు. వినయ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాడు. అయితే.. దాని గురించి అతనికి పెద్దగా ఏమీ తెలీదు. ఇదే విషయాన్ని స్నేహితుడు ప్రసాద్ కి చెప్పాడు. తాను ఏమి చేయాలి? అని అడిగాడు. దానికి సందీప్ ఈరోజుల్లో స్టాక్ మార్కెట్లో బిజినెస్ చేయడం చాల ఈజీ అని చెప్పాడు. నీకులాంటి వారి కోసం ఫిన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వారు సహాయం చేస్తారు. వారి సలహా ప్రకారం బిజినెస్ చేయవచ్చు అని చెప్పాడు ప్రసాద్. అయితే, ఫిన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరు? వారు ఏమి చేస్తారు? అని అడిగాడు వినయ్. ఫిన్‌ఫ్లూయెన్సర్, అంటే ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్.. ఈ వ్యక్తులు ఫైనాన్స్ – ఇన్వెస్ట్‌మెంట్‌పై సమాచారాన్ని అందిస్తారని చెప్పాడు వినయ్. వారు చెప్పే విషయాలను నేను అర్ధం చేసుకోగలనా? అని ప్రశ్నించాడు వినయ్. చేసుకోవచ్చు.. కావాలంటే వారి వీడియోలు చూసి మార్కెట్ కి సంబంధించిన కోర్స్ చేయి అని ప్రసాద్ సలహా ఇచ్చాడు. దీంతో ఆశ్చర్యపోయిన వినయ్.. అలాంటి కోర్స్ లు కూడా ఉంటాయా? అన్నాడు. అవును.. ఉంటాయి అని చెప్పాడు ప్రసాద్.

చాలా మంది ఫిన్‌ఫ్లుయెన్సర్లు అలాంటి కోర్సులు నిర్వహిస్తారు.. వారు ట్రేడింగ్, మార్కెట్ పై లోతైన విశ్లేషణ మొదలైనవన్నీ నేర్పిస్తారు. ఈ వ్యక్తులు స్వయంగా వ్యాపారం చేయడం ద్వారా లక్షల రూపాయలు సంపాదిస్తారు. అని చెప్పిన ప్రసాద్ తానూ అటువంటి కోర్స్ ఒకటి చేయాలని చూస్తున్నానని చెప్పాడు. తరువాత దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను చూపించాడు. అది చూసిన వినయ్.. నిజమే వీళ్ళు బాగానే సంపాదించారు అన్నాడు. ఇలా అయితే తానూ కూడా భారీగా సంపాదించగలను అని చెప్పాడు. కానీ.. దీనిలో సేఫ్టీ ఎంత ఉంటుంది అని అడిగాడు. తనకు ఆ విషయం కచ్చితంగా తెలియదని.. అయితే, ఈ ఫిన్‌ఫ్లుయెన్సర్స్ ను అనుసరించడం ద్వారా చాలామంది డబ్బు సంపాదిస్తున్నారనీ చెప్పాడు ప్రసాద్.

అద్భుతమైన ఆదాయాలను క్లెయిమ్ చేసే ఫిన్‌ఫ్లూయెన్సర్‌ల పోస్ట్‌లు వ్యక్తులను సులభంగా ట్రాప్ చేస్తాయి. సందీప్ -వినయ్ కూడా ఫిన్‌ఫ్లూయెన్సర్ నుంచి 15-20,000 రూపాయల కోర్సు తమకు షేర్ మార్కెట్‌లోని ప్రతి ట్రిక్ నేర్పుతుందని భావిస్తున్నారు. అయితే ఈ కోర్సు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఎవరికీ తెలియదు.

వినయ్ – సందీప్ మాత్రమే ఇలాంటి ఫిన్‌ఫ్లూయెన్సర్‌లచే ప్రభావితమైన వారు కాదు. సోషల్ మీడియాలో, మీరు అలాంటి వందల కొద్దీ ఫిన్‌ఫ్లూయెన్సర్‌లను.. వారి మిలియన్ల కొద్దీ అనుచరులను చూస్తారు. ఈ ఫైన్‌ఫ్లుయెన్సర్‌లు మీరు షేర్‌లు అలాగే డెరివేటివ్‌లలో లక్షల-కోట్ల రూపాయలను సంపాదించడంలో మీకు సహాయపడతామని చెబుతారు. వారు లక్షల్లో షేర్లు మరియు డెరివేటివ్‌లలో సంపాదించినట్లు నకిలీ స్క్రీన్‌షాట్‌లను చూపడం ద్వారా ప్రజలను ఆకర్షిస్తారు. వారు తమ విలాసవంతమైన లైఫ్ స్టైల్ చూపిస్తారు. వారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ కోర్సులు ఇవ్వడం ద్వారా లేదా వారి ప్రీమియం టెలిగ్రామ్ ఛానెల్‌లకు పాస్‌లను విక్రయించడం ద్వారా ప్రజలను మోసం చేస్తారు.

ఇటువంటి కోర్సులు – టెలిగ్రామ్ ఛానెల్‌లు ప్రజల ఆర్థిక అక్షరాస్యతను కొంతమేర పెంచవచ్చు. ఫిన్‌ఫ్లూయెన్సర్‌ల సలహాలను గుడ్డిగా విశ్వసించడం ఖర్చుతో కూడుకున్నది. ఒక టెలిగ్రామ్ ఛానెల్‌కు చెందిన ఫిన్‌ఫ్లూయెన్సర్‌ భారీగా సంపాదిస్తున్నట్లు చెప్పుకుంటూ పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు అనేక నివేదికలు ఉన్నాయి. మీరు వేలకొద్దీ వీడియోలను చూడొచ్చు. అందులో అందమైన లాభాలు వస్తున్నట్టు కనిపించవచ్చు. అయితే ఈ వ్యక్తులు తమ నష్టాల గురించి కూడా వీడియోలు చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడూ అటువంటి పని చేయరు. అలా అని వారికీ అసలు ఎప్పుడూ నష్టమే రాలేదని ఎవరైనా చెప్పగలరా? అదీ జరగదు. ఎలాంటి విశ్లేషణ లేకుండానే షేర్ల కొనుగోలు, అమ్మకాలు చేయాలని చాలామంది సలహాలు ఇస్తున్నారు. ట్రేడింగ్ యాప్‌లు కూడా ఈ ఫిన్‌ఫ్లూయెన్సర్‌ల వృద్ధి చెందుతున్న వ్యాపారానికి గణనీయంగా దోహదపడతాయి. ఈ యాప్‌లు తమ అనుబంధ లింక్‌లను ప్రమోట్ చేయడానికి మంచి కమీషన్ ఇస్తున్నాయి.

వీరి పరిస్థితి గమనించిన SEBI చర్యలు మొదలు పెట్టింది. ఎవరైనా రీసెర్చ్ అనలిస్ట్ కాకపోతే, అతను ఏ స్టాక్ గురించి అయినా చిట్కాలు ఇవ్వకూడదని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చట్టం చేసింది. షేర్ల కొనుగోలు- అమ్మకానికి సంబంధించి సలహాలు ఇచ్చే నమోదుకాని సంస్థలపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. కానీ SEBI చర్య తర్వాత, ఫిన్‌ఫ్లుయెన్సర్‌లు మాటలతో ఆడుకోవడం ప్రారంభించారు. ఉదాహరణకు, వారు ‘కొనుగోలు’ – ‘అమ్మకం’కి బదులుగా ‘సపోర్ట్’ – ‘రెసిస్టెన్స్’ వంటి పదాలను ఉపయోగించడం ప్రారంభించారు. అంటే మాటలు మార్చి పరోక్షంగా సలహాలు ఇస్తున్నారు. ఇటీవల, SEBI ఒక కన్సల్టేషన్ పేపర్ కూడా తీసుకువచ్చింది. దీనిలో రిజిస్టర్ అయిన మధ్యవర్తులు లేదా నియంత్రిత సంస్థలతో కనెక్షన్‌లను ఏర్పాటు చేయకుండా ఫిన్‌ఫ్లూయెన్సర్‌లపై పరిమితులు విధించే ప్రతిపాదన చేశారు. ఈ ఫిన్‌ఫ్లూయెన్సర్‌లు చేసిన ఆదాయాల అతిశయోక్తి క్లెయిమ్‌లను ఆపడం SEBI లక్ష్యం. సెబీ ఏదైనా స్టాక్ ధరను పెంచకుండా ఫిన్‌ఫ్లుయెన్సర్‌లను ఆపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిపాదనపై సెప్టెంబర్ 15లోగా స్పందించాలని షేర్ హోల్డర్స్ ను కోరింది.

ఫిన్‌ఫ్లుయెన్సర్‌లు మీ కాన్సెప్ట్‌ను రెండు మూడు రోజుల్లో క్లియర్ చేస్తారని క్లెయిమ్ చేస్తారు. కానీ, రెండు-మూడు రోజుల్లో మార్కెట్‌ను అర్థం చేసుకోవడం లాజికల్‌గా అనిపించడం లేదు. అవును, మార్కెట్‌లో మీ కాన్సెప్ట్‌ను క్లియర్ చేయడానికి మీరు చదవడం అవసరం.పెద్ద నిపుణులు పుస్తకాలు చదవడం ద్వారా తమ జ్ఞానాన్ని పెంచుకుంటారు కాబట్టి మీకు పెట్టుబడి, వ్యాపారం గురించి మంచి జ్ఞానం కావాలంటే, మీరు దాని కోసం కూడా చదవవలసి ఉంటుంది. మీరు కొత్తవారైతే.. మార్కెట్‌లోకి ప్రవేశించాలనుకుంటే, మీరు ఫిన్‌ఫ్లుయెన్సర్‌ని అనుసరించాల్సిన అవసరం లేదు. YouTubeలోని కంటెంట్ చాలా సాంకేతికంగా ఉంటుంది. కాబట్టి మీరు దానిని అర్థం చేసుకోవడంలో కూడా సమస్య ఉంటుంది. మీరు సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీల యూట్యూబ్ ఛానెల్‌లను చూడవచ్చు. ఇదంతా అర్ధం చేసుకుని జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి పరిస్థితిలోనూ గుడ్డిగా ఎవరినీ నమ్మకండి. నిజంగా అన్ని లక్షలు సంపాదించే వ్యక్తులు మీకోసం వీడియోలు చేసి.. క్లాసులు పెట్టి.. మీదగ్గర డబ్బులు తీసుకునే పని ఎందుకు చేస్తారు? ఇటువంటి వాటిని నమ్మే ముందు లాజికల్ గా ఆలోచించండి.

Published: September 19, 2023, 23:28 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.