Risk o Meter: రిస్కోమీటర్ ఉపయోగం ఏమిటి తెలుసుకుందాం..

Risk o Meter అంటే ఏమిటి? దీని వలన మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినవారికి కలిగే ఉపయోగం ఏమిటి? తెలుసుకుందాం. SEBI సెట్ చేసిన రిస్క్‌మీటర్‌ల వివరాలు

గుంటూరుకు చెందిన అనన్య ఇటీవల మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఎన్‌ఎఫ్‌ఓ అంటే కొత్త ఫండ్ ఆఫర్‌ను చూసి అందులో ఇన్వెస్ట్ చేయాలనీ నిర్ణయించుకుంది. ఈ ఎన్‌ఎఫ్‌ఓ గురించి ఒక వార్తాపత్రికలో పెద్ద ప్రకటన కూడా వచ్చింది. కానీ అందులో రిస్క్-ఓ-మీటర్ (Risk o Meter)అని రాసి ఉన్న ఫోటో చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఈ రిస్క్-ఓ-మీటర్ లేదా రిస్కోమీటర్ ఎందుకు ఇచ్చారు? దీని అర్థం ఏమిటి? అనన్య లాంటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లందరూ ఈ విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మ్యూచువల్ ఫండ్‌లను పెట్టుబడిదారులకు మరింత అనుకూలంగా మార్చేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ 2021 సంవత్సరంలో ఇలాంటి అనేక చర్యలు తీసుకుంది. మ్యూచువల్ ఫండ్స్‌తో సంబంధం ఉన్న రిస్క్‌ల గురించి పారదర్శకతను పెంచడానికి, రిస్కోమీటర్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ రిస్క్ ప్రొడక్ట్ లేబులింగ్‌లో SEBI మార్పులు చేసింది. రిస్కోమీటర్ అనేది వాస్తవానికి ప్రతి మ్యూచువల్ ఫండ్ NFO సమయంలో విడుదల చేసే ఒక ఇమేజ్. దీనిలో ఫండ్‌లో ఎంత ప్రమాదం ఉందో యారో గుర్తు ద్వారా చూపిస్తారు. ఈ రిస్క్‌మీటర్‌లో తక్కువ రిస్క్ నుంచి చాలా ఎక్కువ రిస్క్ వరకు ఆరు స్థాయిల రిస్క్ కనిపిస్తుంది. సెబీ నిర్దేశించిన నిబంధనల ద్వారా ప్రతి మ్యూచువల్ ఫండ్ పథకానికి రిస్క్ స్థాయి ఇస్తారు.

జనవరి 1, 2021 నుంచి SEBI సెట్ చేసిన రిస్క్‌మీటర్‌ల (Risk o Meter) ఆరు గ్రూపులు ఈ క్రింది విధంగా ఉన్నాయి – తక్కువ అంటే తక్కువ రిస్క్, తక్కువ నుంచి మోడరేట్ అంటే తక్కువ నుంచి మోడరేట్ రిస్క్, మోడరేట్ అంటే మధ్యస్థం నుంచి అధిక స్థాయి వరకు రిస్క్, మోడరేట్ హై అంటే మీడియం నుంచి హై లెవెల్ వరకు, రిస్క్ హై అంటే అధిక ప్రమాదం – చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ ప్రమాదం అని ఆరు రకాల రిస్క్స్ సూచిస్తాయి. SEBI ప్రతి నెల ఫండ్ హౌస్‌ల రిస్క్‌మీటర్‌ను అంచనా వేస్తుంది. ప్రతి నెల 10వ తేదీలోగా, ఫండ్ హౌస్ తన స్కీమ్ రిస్క్ స్థాయిని నిర్ణయించుకోవాలి. పోర్ట్‌ఫోలియో బహిర్గతంతోపాటు దానిని ప్రదర్శించాలి. ఇది కాకుండా, రిస్క్‌మీటర్‌లో ఏదైనా మార్పు వార్తాపత్రిక, SMS, ఇ-మెయిల్ వంటి వివిధ మాధ్యమాల ద్వారా యూనిట్‌హోల్డర్‌లకు అంటే పెట్టుబడిదారులకు తెలియజేయాలి.

ఇది మాత్రమే కాకుండా, ఫండ్ హౌస్ తన వెబ్‌సైట్, AMFI వెబ్‌సైట్‌లోని వార్షిక నివేదికలో ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రిస్క్‌మీటర్(Risk o Meter) ఏమిటో – ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఎన్నిసార్లు దానిని మార్చారో కూడా వెల్లడించాలి. రిస్క్-ఓ-మీటర్ పెట్టుబడిదారులకు మంచిదని, వారు తమ రిస్క్ హంగర్ ను బట్టి ఫండ్‌లను షార్ట్‌లిస్ట్ చేయవచ్చనీ మధుబన్ ఫిన్‌వెస్ట్ వ్యవస్థాపకుడు దీపక్ గగ్రానీ చెబుతున్నారు. కానీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇది మాత్రమే ప్రమాణం కాకూడదు. దీనికి ఇతర పారామితులు కూడా ముఖ్యమైనవని ఆయన అంటున్నారు. రిస్కోమీటర్ అనేది నిర్దిష్ట మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌తో సంబంధం ఉన్న రిస్క్‌ను అర్థం చేసుకోవాలనుకునే పెట్టుబడిదారులకు సహాయక సాధనం. దీన్ని బట్టి అన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలకు ఒకే విధమైన రిస్క్ ఉండదని వారు అర్థం చేసుకుంటారు. పెట్టుబడి కోసం రిస్క్‌మీటర్‌ను మాత్రమే పారామీటర్‌గా ఉపయోగించకూడదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకునే ముందు, పెట్టుబడిదారులు పెట్టుబడి లక్ష్యం, హోరిజోన్ అంటే ఎంతకాలం పెట్టుబడి పెట్టాలి, రిస్క్ హాంగర్ వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. పెట్టుబడిదారుడు ఎంత రిస్క్ తీసుకోగలడో లేదా ఎంత రిస్క్(Risk o Meter) తీసుకోవాలో అర్థం కాకపోతే, అతను ఫైనాన్షియల్ ప్లానర్ సహాయం తీసుకోవాలి.

Published: October 10, 2023, 21:41 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.