IPOలు అదరగొడుతున్నాయి.. ఇన్వెస్ట్ చేసేముందు ఏమి చూడాలి?

కంపెనీలు IPO ల నుంచి బాగానే సేకరిస్తున్నాయి. ఇన్వెస్టర్స్ మంచి రాబడిని పొందుతున్నారు. గత కొన్ని సంవత్సరాలలో కొన్ని IPOలు ఫ్లాప్ అయ్యాయి.

ఇపుడైతే అంతా ఓకే.. ఈ సంవత్సరం ఒకరకంగా బాగానే ఉంది. కంపెనీలు IPOల ద్వారా డబ్బును బాగానే సేకరిస్తున్నాయి. ఇన్వెస్టర్స్ కూడా మంచి రాబడిని పొందుతున్నారు. అయితే, గత కొన్ని సంవత్సరాలలో కొన్ని IPOలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఈ పరిస్థితి ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యంగా ఏమిటంటే.. రిటైల్ ఇన్వెస్టర్స్ ప్రస్తుతం IPOల ట్రెండ్ ను ఎంజాయ్ చేయాలా? దానిలో ఇన్వెస్ట్ చేసే పందేలు కాయాలా? ఇన్వెస్ట్ చేయలీ అని మనం అనుకుంటే ఏమి చేయాలి? ఏ విషయాలు గుర్తుంచుకోవాలి? అసలు IPO మార్కెట్లో వచ్చే నష్టాలు ఏముంటాయి? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీటికీ జవాబులు అర్ధం చేసుకుందాం.

ఈ సంవత్సరం లిస్ట్ అయిన చాలా IPOలు ఉన్నాయి. ఒక ప్రీమియం తో సహాయ అన్నీ వాటాదారులకు సానుకూల రాబడిని అందించాయి. ఈ సంవత్సరం, , 34 IPOలు మెయిన్‌బోర్డ్‌లో ఇప్పటివరకు లిస్ట్ అయ్యాయి. వీటిలో మూడు 100 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించాయి. నాలుగు 50 – 100 శాతం మధ్య రాబడి ఇచ్చాయి. 20 ఐపీవోలు 10 నుంచి 50 శాతం మధ్య రాబడిని ఇచ్చాయి. మూడు IPOలలో ప్రతికూల రాబడి కనిపించింది. ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి ముందు ఏమి చూడాలి? దేనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అనే దాని గురించి మాట్లాడుదాం. ముందుగా, కంపెనీ ఆర్థిక స్థితిని తనిఖీ చేయండి.ముందరి సంవత్సరాలకు సంబంధించిన కంపెనీ ఆర్థిక నివేదికలను విశ్లేషించండి . ఎంత ఆదాయం వచ్చింది, ఎంత లాభం వచ్చింది… కంపెనీ స్థిరంగా లాభదాయకంగా ఉందా లేదా… కంపెనీకి ఎంత అప్పు ఉంది.ఇటువంటి వివరాలు అన్నిటినీ స్పష్టంగా తెలుసుకోండి. ఈ సమాచారం అంతా ఐపిఓ ఆమోదం కోసం కంపెనీ సెబికి సమర్పించిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డిఆర్‌హెచ్‌పి)లో చూడవచ్చు. డిఆర్‌హెచ్‌పిలో కంపెనీ తన బలహీనతలను కూడా వెల్లడిస్తుంది. కంపెనీకి సంబంధించి ఏవైనా వివాదాలు లేదా చట్టపరమైన కేసులు ఉంటే కనుక ఆర్థిక ఫలితాల విషయంలో, మీరు కనీసం గత ఐదు సంవత్సరాల గణాంకాలను పరిశీలించాలని గుర్తుంచుకోండి.

గత రెండు మూడు సంవత్సరాల ఆర్థిక గణాంకాలపై మాత్రమే ఆధారపడవద్దు ఎందుకంటే కంపెనీలు తరచుగా IPOకి ముందు తమ నెంబర్స్ మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తాయి. అంతేకాకుండా, కంపెనీ ప్రమోటర్లు – మేనేజ్‌మెంట్ టీం ను అంచనా వేయడం చాలా అవసరం. ఈ వ్యక్తులు కంపెనీలో కీలకమైన నిర్ణయాలకు బాధ్యత వహిస్తారు. బలమైన, విశ్వసనీయమైన,అనుభవజ్ఞులైన ప్రమోటర్లు… కంపెనీని పురోగతి వైపునకు నడిపిస్తారు. మీరు మంచి రాబడిని అందుకుంటారు. అదేవిధంగా, మీరు కంపెనీ షేర్ల వాల్యుయేషన్‌ను కూడా చూడాలి. కంపెనీ ఓవర్‌వాల్యుయేట్ అయినట్లు అనిపిస్తే… దానికి దూరంగా ఉండటం మంచిది. దీన్ని చెక్ చేయడానికి, ఇతర సారూప్య కంపెనీలు ఏ ధరలో లిస్ట్ అయ్యాయి? ఇంకా, ప్రమోటర్లు IPOలో తమ ప్రస్తుత షేర్లను విక్రయిస్తున్నారా? అంటే ఇది అమ్మకానికి ఆఫర్ లేదా కొత్త షేర్లు జారీ అవుతున్నాయా? అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.కొత్త షేర్లను జారీ చేసే IPOలలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. IPO ప్రాస్పెక్టస్ నుంచి ఈ సమాచారాన్ని సేకరించవచ్చు. IPO నిధులను విస్తరణకు ఉపయోగించాలని అనుకుంటున్నారా? లేదా కంపెనీ రుణాలను చెల్లించడానికి లేదా వ్యవస్థాపకులు లేదా పెట్టుబడిదారుల నుంచి షేర్లను కొనుగోలు చేయడానికి ఉపయోగించే ఉద్దేశ్యం ఉందా అనే విషయాలు గమనించాలి. ఒకవేళ ఐపీవో మొత్తంలో గణనీయమైన భాగాన్ని కంపెనీ తన రుణాన్ని తిరిగి చెల్లించడానికి లేదా వ్యవస్థాపకులు లేదా పెట్టుబడిదారుల నుంచి షేర్లను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తుంటే అటువంటి ఐపీవోలలో పెట్టుబడి పెట్టడం విషయంలో వెనకడుగు వేయడమే మంచిది.

IPOలో పెట్టుబడి పెట్టేటప్పుడు, స్టాక్ మార్కెట్ ప్రస్తుత స్థితిని పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా అవసరం. మార్కెట్ బుల్లిష్‌గా ఉంటే, లిస్టింగ్ ఊపందుకోవడంతో జరుగుతుంది. మార్కెట్ అయితే నిరంతర క్షీణతలను ఎదుర్కొంటుంటే, IPO ఒక హెచ్చరిక గుర్తుతో ఓపెన్ అవుతుంది. స్టాక్ మార్కెట్ నిపుణుడు రవి సింగ్ IPOలో పెట్టుబడి పెట్టేటప్పుడు, పెట్టుబడిదారులు కంపెనీ, దాని పోటీదారులు, ఆర్థిక పరిస్థితి, గురించి లోతైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ముఖ్యమైన కేసులు లేదా వివాదాలు, మొత్తం పరిశ్రమ ఆరోగ్యం, అంటే, కంపెనీకి సంబంధించిన రంగం ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన అంటున్నారు. మొత్తమ్మీద IPOలు సాధారణ పెట్టుబడిదారులకు మంచి డబ్బు సంపాదించడానికి అవకాశాన్ని కల్పిస్తాయని చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్… ఇన్వెస్టర్లు జాగ్రత్తలు పాటించి, పెట్టుబడి పెట్టే ముందు క్షుణ్ణంగా పరిశోధన చేస్తే… నష్టాలను తప్పించుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో అదీ స్టాక్ మార్కెట్ లాంటి చోట పెట్టుబడులు పెట్టేటప్పుడు మీ ఆర్థిక సలహాదారుని సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మంచిది.

Published: October 13, 2023, 14:40 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.