Real Estate: ఫారిన్ ఇన్వెస్టర్స్ రియల్ ఎస్టేట్ వైపు షిఫ్ట్ అవుతున్నారు

విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల పై లాభాలను బుక్ చేసుకోవడం కంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్(Real Estate) కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు

సెప్టెంబరులో, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, భారతీయ మార్కెట్‌లో స్థిరంగా అమ్మకాలు జరుపుతూ వచ్చారు. సెప్టెంబరు 25వ తేదీ వరకు ఉన్న గణాంకాలు విదేశీ పెట్టుబడిదారులు 11,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు సూచిస్తున్నాయి. ఇది ఇంతకు ముందు ఆరునెలల పరిస్థితికి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే, గత ఆరునెలల కాలంలో వారు స్థిరంగా కొనుగోలు(Real Estate) చేశారు.

అయితే, సెప్టెంబరులో, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అమ్మడం లేదా లాభాలను బుక్ చేసుకోవడం కంటే ఎక్కువగా రియల్ ఎస్టేట్(Real Estate) కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతూ వచ్చారు. సెప్టెంబర్ 15 నాటికి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ వెబ్‌సైట్ డేటా ప్రకారం, రియల్ ఎస్టేట్ రంగ కంపెనీల్లో FPIల పెట్టుబడులు 81,577 కోట్ల రూపాయలకు పెరిగాయి. విదేశీ పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ రంగంలో ఈ పెట్టుబడి సంఖ్య 2023లో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పుడు FPIలు రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎందుకు ఆకర్షణీయంగా చూస్తున్నాయి? మీరు కూడా వాటిలో పెట్టుబడి పెట్టాలా? అనేది ఇప్పుడు ప్రశ్న.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు రెపో రేటును ఆరుసార్లు పెంచింది. ఇలా రెపోరేటు వరుసగా పెరగడంతో భారతదేశంలో రెపో రేటు ప్రస్తుతం 6.5% వద్ద ఉంది, దీని వలన హోమ్ లోన్స్(Real Estate) చాలా ఖరీదైనవిగా మారాయి. ఇది ముఖ్యంగా అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లు కొనుగోలు చేయాలనుకునే వారిని ప్రభావితం చేస్తుంది. అధిక రుణ వడ్డీ రేటు అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లను కొనుగోలు చేయడాన్ని మరింత ఖర్చుతో కూడుకున్నదిగా చేసింది. సాధారణంగా ఇలాంటి ఇళ్లను కొనుగోలు చేసేవారు వడ్డీ రేట్ల విషయంలో సెన్సిటివ్ గా ఉంటారు. కాబట్టి, అటువంటి ప్రాపర్టీస్ అమ్మకాలపై కూడా ఇది ప్రభావం చూపింది. అయితే విదేశీ పెట్టుబడిదారులు(Real Estate) ఈ షేర్లను ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? అందుబాటు ధరల్లో వచ్చే ఇళ్ల అమ్మకాలు తగ్గిపోయినప్పటికీ, రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోని ప్రీమియం – లగ్జరీ విభాగాలు అధిక వడ్డీ రేట్ల వల్ల ప్రభావితం కాలేదు.

అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ నిర్వహించిన ఇటీవలి రియల్ ఎస్టేట్ వినియోగదారుల సెంటిమెంట్ సర్వే ప్రకారం, 2023 మొదటి 6 నెలల్లో భారతదేశంలోని టాప్ 7 నగరాల్లో 45 లక్షల రూపాయల కంటే ఎక్కువ ధరలతో మధ్య – ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ సాధారణం కంటే గణనీయంగా ఎక్కువగా ఉంది.

భారతదేశంలోని ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయిన కంపెనీలు ఈ ధోరణుల నుంచి ప్రయోజనం పొందాయి. ఈ కంపెనీలు అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లతో (Real Estate)పోలిస్తే ప్రీమియం – లగ్జరీ విభాగాలలో మరింత ముఖ్యమైన ఉనికిని కలిగి ఉన్నాయి. ఏప్రిల్ 1, 2023 నుంచి సెప్టెంబర్ 25, 2023 వరకు రియల్ ఎస్టేట్ రంగ కంపెనీలు 24% నుంచి 74% వరకు రాబడిని అందించాయి. రియల్టీ ఇండెక్స్ నిఫ్టీ కంటే మూడు రెట్లు ఎక్కువ రాబడిని అందించినప్పటికీ, టాప్ 10 కంపెనీలలో, 6 నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ 47.2% రాబడిని అధిగమించి, 50% కంటే ఎక్కువ రాబడిని అందించాయి.

ఇప్పుడు, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు – బలమైన పనితీరు తర్వాత స్థిరాస్తి షేర్‌లను కొనుగోలు చేయాలా వద్దా అనేది పెద్ద ప్రశ్నఅని స్టాక్ మార్కెట్‌లో నిపుణుడైన రవి సింగ్ అంటున్నారు. “ధరల పెరుగుదల కారణంగా, ప్రాపర్టీ ధరలు సామాన్య ప్రజల బడ్జెట్‌కు సరిపోవడం లేదు. దీంతో తక్కువ-విలువైన ఆస్తులకు – అద్దె ఆదాయానికి డిమాండ్ పెరిగింది. మెట్రో నగరాల నుంచి పెట్టుబడిదారులు దేశంలో రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడి పెట్టడానికి దరి తీసింది. అయితే, రియల్ ఎస్టేట్‌కు ఓపెన్ కావడాన్ని తగ్గించుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు మీ పెట్టుబడిపై 50% లాభాన్ని ఆర్జిస్తున్నట్లయితే, సిమెంట్ – ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలకు మారడం మంచిది. పెట్టుబడి కోణంలో, ఈ రంగంలో DLF – గోద్రెజ్ ప్రాపర్టీలు ప్రాధాన్య ఎంపికలు అని చెప్పవచ్చు. అయితే వాటి ధరల్లో 10-15% తగ్గుదల ఉంటే మాత్రమే వాటిలో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించండి.” అంటూ రవి సింగ్ అభిప్రాయపడ్డారు. కాబట్టి, మొత్తంగా FPIలు రియల్ ఎస్టేట్ రిటైల్ ఇన్వెస్టర్‌లు తమ పెట్టుబడిని పెంచుతున్నప్పటికీ, ఇన్వెస్టర్స్ ఇందులో పొజిషన్ తీసుకునే ముందు కనీసం 1-2 త్రైమాసికాల వరకు వేచి ఉండాలి. వడ్డీ రేట్లు తగ్గే వరకు వేచి ఉండి చూసే విధానంలో ఉండటం మంచిది.

Published: September 30, 2023, 15:09 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.