EMI కట్టలేకపోతున్నారా? SIP ఫార్ములాతో ఆ భారాన్ని ఈజీగా తగ్గించుకోవచ్చు!

ఆర్థిక లక్ష్యం.. దానిని సాధించాల్సిన సమయాన్ని ముందుగానే నిర్ణయించుకుంటే, పెట్టుబడి ప్రణాళికపై దృష్టి ఉంటుంది

రోహిత్ తన ల్యాప్‌టాప్‌లో కొత్త ఇంటి కోసం వెదుకుతున్నాడు. ఇంతలో రంజీత్ వచ్చి.. రోహిత్ కు కంగ్రాట్స్
చెప్పాడు. నువ్వు తండ్రి అయిన వెంటనే కొత్త ఇంటి కోసం వెదకడం మొదలుపెట్టావా? అని అడిగాడు. దీంతో
రోహిత్.. అవును రంజిత్.. ఇప్పుడు నాకు పెద్ద ఇల్లు కావాలి. అందుకే సొంత ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నాను
అన్నాడు. దీంతో రంజిత్ ఇది మంచి ఐడియా అన్నాడు. దీంతో రోహిత్ రంజిత్ ను ఇంటి విషయం అడిగాడు.
నువ్వు ఈ మధ్యనే ఇల్లు కొన్నావు కదా… నీ దగ్గర డౌన్ పేమెంట్ డబ్బు ఉందా లేక ఎక్కడి నుంచైనా ఏర్పాటు
చేశావా? అన్నాడు. దీంతో రంజిత్.. అదేం లేదు రోహిత్ భాయ్ అంటూ…ఇల్లు కొనడం అనేది లాంగ్ టర్మ్ గోల్.
కాబట్టి నేను కొన్నేళ్ల ముందు నుంచి ప్రిపేర్ అయ్యాను అన్నాడు. దీంతో రోహిత్.. అయితే ఆ ప్రిపరేషన్ ఏంటి.. ఎలా
ఉంటుంది చెప్పన్నాడు. దానికి రంజిత్ చెప్పింది ఒక్కటే.. ప్రిపరేషన్ అంటే డబ్బు సమకూర్చుకోవడం, ప్రణాళిక
వేసుకోవడం. తక్కువ ఖర్చు చేయాలి.. ఎక్కువ ఆదా చేయాలన్నాడు. దీనికోసం తాను ఈక్విటీలో పెట్టుబడి
పెట్టానని చెప్పాడు. అయితే నేరుగా స్టాక్ మార్కెట్‌లో కాకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి
పెట్టానన్నాడు. ఇతర ఆస్తుల కంటే ఎక్కువ రాబడిని ఇస్తుంది కాబట్టి ఇది మంచి ఆప్షన్ అన్నాడు.

హోమ్ లోన్, ఇంకా కొంత పెట్టుబడితో రంజీత్ తన సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నాడు. ఎందుకంటే ఇల్లు
కొనడం అనేది ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. అది కేవలం హోమ్ లోన్ వస్తేనే కొనలేం. శాలరీ తీసుకునేవారు.. ఒకేసారి
భారీగా డౌన్ పేమెంట్ చేయలేరు. ఒకేసారి పెద్ద మొత్తం కనుక.. గృహ రుణం, పెట్టుబడి.. ఈ రెండింటి కలయిక
కచ్చితంగా అవసరం. మరి ఈ కాంబినేషన్‌ని రోహిత్ ఎలా సాధిస్తాడు అనేది ఇప్పుడు ప్రశ్న. ఇంటి డౌన్‌పేమెంట్
కోసం డబ్బును ఎలా సమకూర్చుకోవాలి? మీ కోసం సరైన పెట్టుబడిని ఎలా ఎంచుకోవాలి.. ఏ పొరపాటు
జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం.

ఇల్లు కొనడానికి, ధరలో కొంత భాగాన్ని ముందస్తు డౌన్ పేమెంట్ ద్వారా చెల్లించాలి. ఈ డౌన్ పేమెంట్ ఎంత
ఎక్కువ ఉంటే, మీరు హోమ్ లోన్ EMI భారాన్ని అంత ఎక్కువగా తగ్గించుకోగలుగుతారు. మీరు ప్రాపర్టీ ధరలో
60 శాతం డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన 40 శాతాన్ని బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించండి… అప్పుడు గృహ రుణం
భాగం తక్కువగా ఉంటుంది, దానిపై మీ వడ్డీ ఖర్చులు తక్కువగా ఉంటాయి.

డౌన్‌పేమెంట్ మొత్తానికి జోడించడానికి ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్
ప్లాన్ లేదా SIP అనేది నెలవారీ ప్రాతిపదికన పెట్టుబడి పెట్టడానికి ఒక గొప్ప మార్గం. ఇది ఇంటి ధరలో 60 శాతం
వరకు డౌన్ పేమెంట్‌ను సేకరించడంలో సహాయపడుతుంది. రోహిత్ డౌన్‌పేమెంట్ మొత్తాన్ని ఎక్కువగా
ఉంచాలని కోరుకున్నాడు. SIP ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు.
ఈక్విటీని ఎంచుకోవడం అంటే చాలా కాలం పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

మనీఫ్రంట్ సహ-వ్యవస్థాపకుడు, CEO అయిన మోహిత్ గ్యాంగ్… రోహిత్ ఇంటిని ఎప్పుడు కొనుగోలు చేయాలో
ముందుగా నిర్ణయించుకోవాలని, దానికి టైమ్ ఫ్రేమ్‌ని నిర్ణయించుకోవాలని సలహా ఇస్తున్నారు. దీని తర్వాత,
టెన్యూర్ ముగిసే సమయానికి మీకు ఎంత పెద్ద కార్పస్ కావాలో ఆలోచించుకోవాలి. ఆపై ఈ లక్ష్యాన్ని
సాధించడానికి మీరు ప్రతీ నెలా ఎంత పెద్ద మొత్తాన్ని ఆదా చేయాల్సి ఉంటుందో చెక్ చేయండి. వీటన్నింటి
తర్వాత, వెంటనే ఆ మొత్తంతో SIPని ప్రారంభించండి.

ఇప్పుడు రోహిత్ 10 సంవత్సరాల తర్వాత ఇల్లు కొనుగోలు చేస్తానని నిర్ణయించుకున్నాడు. రోహిత్ 10 ఏళ్లలో
రూ.50 లక్షల కార్పస్‌ను ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఇందుకోసం రోహిత్ ప్రతి నెలా రూ.21,735 SIP
చేయాల్సి ఉంటుంది. ఇంత సుదీర్ఘ కాలంలో, మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో 12 శాతం వార్షిక రాబడిని
అంచనా వేయవచ్చు. ఆర్థిక నిపుణులు ప్రకారం 10 సంవత్సరాలలో ఇంటిని కొనుగోలు చేయాలని లక్ష్యంగా
పెట్టుకుంటే, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ , ఈటీఎఫ్‌లలో SIP ద్వారా పెట్టుబడి పెట్టడం అనేది బెస్ట్ ఆప్షన్. కానీ
ఇన్వెస్ట్ చేసే ముందు మీ రిస్క్ ప్రొఫైల్ ప్రకారం ఫండ్‌ను ఎంచుకోండి.

మీరు 10 సంవత్సరాల తర్వాత ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే, పాసివ్ ఫండ్స్ అంటే మార్కెట్ ఇండెక్స్
ఆధారిత పథకాలు, మిడ్, స్మాల్ క్యాప్ స్కీమ్‌లు మంచి ఆప్షన్స్ అని మనీఫ్రంట్‌కు చెందిన మోహిత్ గ్యాంగ్
చెప్పారు. ICICI ప్రూ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, UTI నిఫ్టీ 200 మొమెంటం 30 ఇండెక్స్ ఫండ్, DSP మిడ్ క్యాప్ ,
టాటా స్మాల్ క్యాప్ వంటి పథకాలలో పెట్టుబడులు పెట్టవచ్చు.

ICICI ప్రూ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ 1 సంవత్సరంలో 29.75%, 3 సంవత్సరాలలో 15.23% , 5 సంవత్సరాలలో
14.71% రాబడిని ఇచ్చింది. మిడ్‌క్యాప్ ఫండ్ సంగతి చూస్తే.. DSP మిడ్‌క్యాప్ ఫండ్ 1 సంవత్సరం రాబడి
38.72%, 3 సంవత్సరాలలో ఈ పథకం 14.67% రాబడిని ఇచ్చింది. 5 సంవత్సరాలలో ఇది 16.25% రాబడిని
ఇచ్చింది. టాటా స్మాల్ క్యాప్ రాబడిని చూస్తే.. ఈ పథకం 1 సంవత్సరంలో 36.3% రాబడిని, 3 సంవత్సరాలలో
28.84% రాబడిని , 5 సంవత్సరాలలో 25.21% రాబడిని ఇచ్చింది.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు రోహిత్ వంటి పెట్టుబడిదారులు కొన్ని విషయాలను
గుర్తుంచుకోవాలి. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్, గోల్డ్, యులిప్, మ్యూచువల్ ఫండ్స్ వంటి అనేక ఆర్థిక ఉత్పత్తులు
ఉన్నాయి. కాబట్టి సరైన దానిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మ్యూచువల్ ఫండ్‌లు సాంప్రదాయ ఆర్థిక
ఉత్పత్తుల కంటే మెరుగైన రాబడిని అందించగలవు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని
చెప్పాలి. కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ మెంట్ రిస్క్ తో కూడుకుని ఉంటుంది. వీటిలో పెట్టబడులు
దీర్ఘకాలం ఉండేలా ఇన్వెస్టర్లు చూసుకోవాలి. ఇలా చేస్తే.. మార్కెట్ల హెచ్చుతగ్గులను అధిగమించడంలో ఇది
సహాయపడుతుంది. ఇంటిని కొనుగోలు చేయడానికి కార్పస్‌ను ముందుగానే సిద్ధం చేయాలి. దీనికోసం పెట్టుబడిని
ముందుగానే ప్రారంభించాలి. అప్పుడే మీకు కాంపౌండింగ్ ప్రయోజనం దక్కుతుంది. SIP ఇన్వెస్ట్‌మెంట్‌లను
క్రమబద్ధంగా చేయండి. మీ పోర్ట్‌ఫోలియోను వివిధ పథకాల ద్వారా వైవిధ్యంగా ఉంచండి.

ఆర్థిక లక్ష్యం.. దానిని సాధించాల్సిన సమయాన్ని ముందుగానే నిర్ణయించుకుంటే, పెట్టుబడి ప్రణాళికపై దృష్టి
ఉంటుంది. మీ లక్ష్యాన్ని సాధించడానికి సరైన స్కీమ్‌లను ఎంచుకోండి. ఈ విధంగా మీరు కొనుగోలు సమయంలో
లోన్ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇల్లు కొనాలంటే ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ తప్పనిసరి. కాబట్టి ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్
విషయంలో ఏదైనా గందరగోళం ఉంటే, ఫైనాన్షియల్ అడ్వైజర్ నుండి సలహా తీసుకోవడానికి సంకోచించకండి.
ఆర్థిక సలహాదారుడు మీ ఆర్థిక పరిస్థితి, మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం గురించి అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా
మంచి ఈక్విటీ స్కీమ్ ల గురించి సలహా ఇస్తారు.

Published: April 19, 2024, 17:50 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.