ఫండ్స్ లో డైరెక్ట్ - రెగ్యులర్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి

డైరెక్ట్ ప్లాన్‌లో, పెట్టుబడిదారుడు డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంట్ ద్వారా వెళ్లకుండా నేరుగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు... మరోవైపు, రెగ్యులర్ ప్లాన్‌లో, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంట్ సహాయంతో మాత్రమె ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.

రాము, సోము ఇద్దరూ అన్నదమ్ములు. అయినా.. ఇద్దరికీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. వారి అభిప్రాయాలు ఈ విషయంలో కలవవు. మ్యూచువల్ ఫండ్స్ విషయమే తీసుకుంటే రాము మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతాడు. సోము డైరెక్ట్ ప్లాన్ లో పెట్టుబడి పెడతాడు. ఇప్పుడు మీరు ఈ డైరెక్ట్.. రెగ్యులర్ ప్లాన్స్ ఏమిటి అనే ఆలోచనలో పడి ఉంటారు. అవునా? ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ కోసం ఏది లాభదాయకమైన డీల్ అవుతుంది? ఏ ప్లాన్ ఎటువంటి వారికి సరిపోతుంది? ఈ వీడియోలో అర్ధం చేసుకునే ప్రయతం చేద్దాం.

డైరెక్ట్ ప్లాన్‌లో, పెట్టుబడిదారుడు డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంట్ ద్వారా వెళ్లకుండా నేరుగా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు… మరోవైపు, రెగ్యులర్ ప్లాన్‌లో, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంట్ సహాయంతో మాత్రమె ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.

మీరు మనదేశంలోని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే AMFI గణాంకాలను పరిశీలిస్తే, దేశంలోని టాప్ 30 నగరాల్లో, రిటైల్ ఇన్వెస్టర్లు ..HNI అంటే పెద్ద పెట్టుబడిదారుల మ్యూచువల్ ఫండ్ ఆస్తులలో 55 శాతం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వచ్చాయి. ఈ టాప్ 30 నగరాల నుంచి , వ్యక్తిగత ఆస్తులలో కేవలం 19 శాతం మాత్రమే ప్రత్యక్ష పెట్టుబడి ద్వారా వచ్చాయి. టాప్ 30 నగరాల్లో మెట్రో నగరాలు జైపూర్, లక్నో వంటి రాజధాని నగరాలు ఉన్నాయి. ఇందులో డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా పెట్టుబడి వాటా 55% వద్ద ఉంది.

అదేవిధంగా, మనం ఈ టాప్ 30 నగరాలు కాకుండా B30 ప్రాంతం గురించి మాట్లాడినట్లయితే, అప్పుడు వ్యక్తిగత పెట్టుబడిదారులలో 21% మాత్రమే డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వచ్చారు. వారి ఆస్తులలో 5% మాత్రమే ప్రత్యక్ష పెట్టుబడి ద్వారా వచ్చాయి. కాబట్టి, చిన్న పెట్టుబడిదారులు ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా పెట్టుబడి పెడుతున్నారని స్పష్టమవుతుంది.

మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో డిస్ట్రిబ్యూటర్‌లు ఎందుకు అంత ముఖ్యమైనవి అని ఇప్పుడు మీరు అనుకుంటున్నారా? మ్యూచువల్ ఫండ్‌లను హేతుబద్ధీకరించడానికి ఇటీవలి సంవత్సరాలలో SEBI ..AMFI చాలా వర్గాలను రూపొందించాయి, ప్రతి సంవత్సరం డజన్ల కొద్దీ పథకాలు ప్రారంభం అవుతుంటాయి. అటువంటి పరిస్థితిలో, ఒక సాధారణ పెట్టుబడిదారుడు ఈ పథకాలన్నింటి నుంచి తనకు కావలసిన ఒక దానిని ఎంచుకోవడం అంత తేలికైన పని కాదు… అందుకే ప్రజలు తమ ఆర్థిక లక్ష్యాల ప్రకారం సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడానికి డిస్ట్రిబ్యూటర్స్ సహాయం తీసుకుంటారు.

మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వృద్ధికి డిస్ట్రిబ్యూటర్స్ ఆధారిత ప్రాపర్టీస్ ఇప్పటికీ ముఖ్యమైనవిగా ఉన్నాయని ఇన్వెస్టగ్రఫీ ఫౌండర్ ..CFP శ్వేతా జైన్ చెప్పారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా, డిస్ట్రిబ్యూటర్స్ ఆధారిత సాధారణ ప్రణాళికల ధర తగ్గింది. దీని కారణంగా, ప్రజలు డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా పెట్టుబడి పెట్టడం సౌకర్యంగా భావిస్తారు. అక్కడ నుంచి వారు సలహా తీసుకోవచ్చు ..దీని కోసం ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మరోవైపు, రెగ్యులర్ ప్లాన్‌ల కంటే డైరెక్ట్ ప్లాన్‌లు చౌకగా ఉంటాయి. కానీ వాటిని సపోర్ట్ చేసేవారు లేదా గైడెన్స్ ఇచ్చేవారు ఎవరూ లేకపోవడంతో వాటిలో వృద్ధి తగ్గుతోంది.

డైరెక్ట్ ప్లాన్ ..రెగ్యులర్ ప్లాన్ సాధారణంగా ఒకే మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో అందుబాటులో ఉండే రెండు ఎంపికలు. ఇందులో పోర్ట్‌ఫోలియో ..ఫండ్ మేనేజర్ ఒకే విధంగా ఉంటారు. వ్యయ నిష్పత్తిలో అంటే వాటిపై చేసిన వ్యయంలో మాత్రమే తేడా ఉంటుంది. రెగ్యులర్ ప్లాన్‌తో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్ ఖర్చు తక్కువ. దీనికి కారణం డైరెక్ట్ ప్లాన్‌లో డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంట్ అవసరం లేదు. అందువల్ల, డిస్ట్రిబ్యూషన్ ..కమీషన్ ఖర్చు వాటిలో ఆదా అవుతుంది. ఈ సేవింగ్స్ డైరెక్ట్ ప్లాన్ నికర ఆస్తి విలువ (NAV) రెగ్యులర్ ప్లాన్ కంటే ఎక్కువగా ఉంటాయి. డైరెక్ట్ ప్లాన్ ..రెగ్యులర్ ప్లాన్ మొత్తం వ్యయ నిష్పత్తి అంటే TERలో 0.5% నుంచి 2% వరకు వ్యత్యాసం ఉండవచ్చు.

రాము-సోము ఒక్కొక్కరు రూ. 25,000 చొప్పున 10 సంవత్సరాల పాటు వేర్వేరు ప్లాన్‌లలో ఇన్వెస్ట్ చేస్తే, రాబడిలో తేడా ఎంత ఉంటుందో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం.

రాము రెగ్యులర్ ప్లాన్‌లో నెలకు 25 వేల SIP ప్రారంభించి 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టింది అనుకుందాం. ఈ ప్లాన్‌పై ఖర్చు నిష్పత్తి 2 శాతం. ఇది 12 శాతం రాబడిని పొందగలదని అంచనా. మరోవైపు, సోము కూడా అదే పథకంలో డైరెక్ట్ ప్లాన్ ద్వారా నెలకు రూ. 25,000 SIP ప్రారంభించి 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే… దీనిపై ఖర్చు నిష్పత్తి కేవలం 1% ..ఆశించిన రాబడి 12%. అలా 10 ఏళ్ల తర్వాత సోము తన డైరెక్ట్ ప్లాన్ ద్వారా తన సోదరుడు రాము కంటే రూ.3 లక్షలు ఎక్కువ సంపాదించాడు.

రాము – సోము రాబడుల గణన రిటర్న్‌ల పరంగా డైరెక్ట్ ప్లాన్ మంచిదని చెబుతుంది. ఎందుకంటే, ఇది తక్కువ వ్యయ నిష్పత్తి కారణంగా అధిక రాబడిని ఇస్తుంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే, డైరెక్ట్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడానికి మ్యూచువల్ ఫండ్‌ల గురించి తగిన పరిజ్ఞానం ..అవగాహన అవసరం… అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులకు పంపిణీదారులు లేదా ఆర్థిక సలహాదారుల సహాయం అవసరం లేదు కాబట్టి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

Published: August 5, 2023, 16:23 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.