ఈ జేబు నుంచి ఆ జేబుకు.. టపరియా షేర్ల మాయాజాలం..

వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా షేర్ దాని ప్రాధమిక విలువ కంటే తక్కువ ట్రేడింగ్ అవుతున్న వాటిని కొనడం. ఇందులో చౌకగా కొని ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా లాభం తీసుకుంటారు. అయితే, షేర్లను ఎంచుకోవడానికి కేవలం మంచి విలువ ఉన్న అవకాశం ఒక్కటే సరిపోదు. ఇప్పుడు టపరియా టూల్స్ లో ఇదే జరుగుతోంది.

రోషన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ లో చాలా అనుభవం ఉన్నవాడు. అతను ఎక్కువగా వాల్యూ ఇన్వెస్ట్మెంట్ పై దృష్టి పెడతాడు. వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా షేర్ దాని ప్రాధమిక విలువ కంటే తక్కువ ట్రేడింగ్ అవుతున్న వాటిని కొనడం. ఇందులో చౌకగా కొని ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా లాభం తీసుకుంటారు. అయితే, షేర్లను ఎంచుకోవడానికి కేవలం మంచి విలువ ఉన్న అవకాశం ఒక్కటే సరిపోదు. ఇప్పుడు టపరియా టూల్స్ లో ఇదే జరుగుతోంది.

మే 30న FY23 ఫలితాలతో పాటు, ఈ కంపెనీ ప్రకటించింది. డివిడెండ్ రూ. 77.50 ప్రకటించింది. అంతే కాదు బోనస్ షేర్లు 4:1 నిష్పత్తిలో కేటాయిస్తూ ప్రకటన చేసింది. నాలుగు షేర్లకు ఒక బోనస్ షేర్ ఇస్తారు. మనం బోనస్ విషయాన్ని పక్కనపెట్టి చూస్తె కనుక.. బోనస్ అలాగే పెద్ద మొత్తంలో డివిడెండ్ ప్రకటించినప్పటికీ ఈ షేర్ 12 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పరిస్థితికి రోషన్ మాత్రమే కాదు స్టాక్ మార్కెట్లో కాస్త అనుభవం ఉన్న ఎవరైనా ఆశ్చర్య పోతారు. నేరుగా షేర్లను కొనడానికి ఆర్డర్ వేస్తారు. రోషన్ కూడా అదేపని చేశాడు. కానీ, అతనికి షేర్లు అలాట్ కాలేదు. అంటే కంపెనీలో షేర్ హోల్డర్లు ఎవరూ షేర్లను అసలు అమ్మటం లేదని రోషన్ గ్రహించాడు. అదేవిధంగా ఈ కంపెనీ ఫ్లోట్ కూడా పెద్ద ఎక్కువేమీ లేదు. అంటే దీని వాల్యూం నిల్ కి దగ్గరగా ఉంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది అని రోషన్ రీసెర్చ్ చేశాడు. కంపెనీ ఫలితాలు, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసి ఇదంతా ప్రమోటర్ల పని అని అతను గ్రహించాడు.

ఈ సంస్థ ఆర్థిక పనితీరును పరిశీలించిన రోషన్ ప్రమోటర్ల ప్రయోజనం కోసం షేర్ ధరలతో ప్లే చేస్తున్నారు అని అర్ధం అయింది. FY23లో కంపెనీ ఆదాయం రూ. 764 కోట్లు… కాగా లాభం రూ. 72.32 కోట్లుగా ఉంది. మార్కెట్ క్యాప్ రూ. 3.34 కోట్లు మాత్రమే. కానీ అది సంక్లిష్టతను పెంచింది… తర్వాత షేర్ హోల్డింగ్ ప్యాటర్న్‌ని చెక్ చేశాడు. ఈ కంపెనీ ప్రమోటర్లు, అంటే తపారియా అలాగే బంగూర్ కుటుంబానికి దాదాపు 70% వాటా ఉంది… అంటే దాదాపు 21.25 లక్షల షేర్లు ఉన్నాయి… ఇక పబ్లిక్ వాటా 30.2%… అంటే 9.25 లక్షలు. అంటే కంపెనీ మొత్తం షేర్లు 30.35 లక్షలు మాత్రమే.

అతను ఇంకో విషయం గ్రహించాడు. అంటే కంపెనీ ఈక్విటీ చిన్నది… అంటే మొత్తం షేర్ల సంఖ్య చాలా తక్కువ. దీని వల్ల షేరు ధరను నియంత్రించడం సులభమే… అయినా అతను సంతృప్తి చెందలేదు. నిశితంగా పరిశీలించినప్పుడు కంపెనీలోని పబ్లిక్ షేర్‌హోల్డర్‌లలో చాలా మందికి తపారియా అలాగే బంగూర్ ఇంటిపేరు ఉన్నట్లు అతను కనుగొన్నాడు. అంటే ప్రమోటర్లు దాదాపు మొత్తం కంపెనీని పరోక్షంగాయాజమాన్యాన్ని కలిగి ఉంటారు. వారు ధరను నియంత్రిస్తున్నారు… బహుశా అందుకేనేమో.. ఫ్రీ ఫ్లోట్‌ను అంటే బహిరంగ మార్కెట్‌లో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్న షేర్లను నియంత్రిస్తున్నట్లు ప్రమోటర్లపై ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణల దృష్ట్యా, సెప్టెంబర్ నుంఛి డిసెంబర్ 2010 మధ్య కాలంలో, కంపెనీ 11 ప్రమోటర్ అలాగే ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీలను తిరిగి వర్గీకరించాలని నిర్ణయించుకుంది. ఈ సంస్థలకు పబ్లిక్ షేర్‌హోల్డర్‌ల హోదా ఇచ్చారు. అంటే ప్రమోటర్లు కానివారు… ఈ 11 సంస్థలు కంపెనీలో 12.28% వాటాను కలిగి ఉన్నారు. అయితే ఈ తరలింపు ఉన్నప్పటికీ… 26 జూన్ 2019న, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఈ 11 ఎంటిటీల పునర్విభజన ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కంపెనీపై వారి నియంత్రణను ముగించలేదు అని పేర్కొంది. ఎందుకంటే ఈ అన్ని సంస్థలు ప్రమోటర్‌లతో సన్నిహితంగా పనిచేస్తున్నాయి. ఈ ఉత్తర్వులను కంపెనీ సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేసింది. 9 నవంబర్ 2021న, SAT SEBI ఆర్డర్‌ను తిరస్కరించింది.

ఇప్పుడు రోషన్‌కి మొత్తం కథ అర్థమైంది… ప్రమోటర్లు తమ కంపెనీ షేర్లతో ఎలా ఆడుకుంటారు.. షేర్ ధరలను ఎలా తారుమారు చేస్తారు.. మొత్తం డివిడెండ్‌ను కుటుంబానికి ఎలా బదిలీ చేస్తారు… చాలా సింపుల్ గా చెప్పాలంటే వారు డబ్బును ఒక జేబులో నుంచి మరొక జేబుకు బదిలీ చేస్తారు.
రెగ్యులేటర్ సెబీతో పాటు స్టాక్ ఎక్స్ఛేంజీలు కూడా టపారియా టూల్స్‌కు సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది స్పష్టమైన విషయం అని చెప్పవచ్చు.

ఈ స్టాక్‌లు కార్పొరేట్ గవర్నెన్స్ సమస్యలపై మనీ 9 ఇన్వెస్టర్లు కేవలం భారీ డివిడెండ్‌లను ఆశించి ఇలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మానుకోవాలని సూచిస్తోంది. కంపెనీ ఫండమెంటల్స్‌ ఆధారంగా దీర్ఘకాలికంగా మాత్రమే ఇన్వెస్ట్‌ చేయాలి… మీరు సొంతంగా రిసెర్చ్ చేయలేకపోతే ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.

Published: August 5, 2023, 16:12 IST

పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇప్పుడే Money9 App డౌన్ లోడ్ చేసుకోండి.