హోమ్ లోన్ లో LTV రేషియో తెలిస్తే.. బోలెడు లాభం!

బేరసారాలు లేకుండా ఏ బ్యాంకూ వడ్డీ రేటును తగ్గించదు. అటువంటి పరిస్థితిలో, రాహుల్ లాగా, మీరు కూడా హోమ్ లోన్ ద్వారా ఇల్లు కొనాలని

హోమ్ లోన్ లో  LTV రేషియో తెలిస్తే..  బోలెడు లాభం!

ఇల్లు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్న రాహుల్… దాని కోసం ఒకేసారి భారీ మొత్తం సమకూర్చుకోవడం కష్టమే. అందుకే హోమ్ లోన్ సాయంతో తన ఇంటి కలను నెరవేర్చుకోవాలి అనుకున్నాడు. అయితే బ్యాంకు నుండి ఎంత రుణం వస్తుంది? ఇంకా మిగిలిన మొత్తాన్ని ఎలా సమకూర్చాలి అన్నదే ప్రశ్న. దీనిని డౌన్ పేమెంట్ అంటారు. దీంతో రాహుల్ అయోమయంలో పడ్డాడు. రాహుల్‌కు.. తన రుణం LTV నిష్పత్తి.. అంటే లోన్-టు-వేల్యూ రేషియో గురించి తెలిస్తే… అప్పుడు అతనికి అన్ని లెక్కలూ అర్థమవుతాయి. ఈ LTV రేషియో అంటే ఏంటి? దానిని ఎలా డిసైడ్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం.

RBI మార్గదర్శకాల ప్రకారం… బ్యాంకులు ఇంటి ధరలో కొంత పరిమితి వరకు మాత్రమే రుణాలు ఇవ్వగలవు. ఆస్తిపై రుణం మొత్తం లోన్-టు-వేల్యూ పై ఆధారపడి ఉంటుంది. ఇది ఇంటి విలువ ప్రకారం ఎంత రుణం ఇవ్వవచ్చో తెలియజేస్తుంది. RBI నిబంధనల ప్రకారం, ఇంటి విలువ రూ. 30 లక్షల వరకు ఉంటే, బ్యాంకులు అందులో 90 శాతం వరకు గృహ లోన్ ఇవ్వవచ్చు. ఇంటి విలువ 30 లక్షల నుండి 75 లక్షల మధ్య ఉంటే లోన్-టు-వేల్యూ రేషియో 80 శాతం వరకు ఉంటుంది. ఇంటి ధర 75 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, బ్యాంకులు 75 శాతం వరకు మాత్రమే లోన్ ఇవ్వగలవు.

మీరు 60 లక్షల విలువైన ఇంటిని కొనుగోలు చేస్తారనుకుందాం. RBI నిబంధనల ప్రకారం, బ్యాంకులు 80 శాతం వరకు లోన్-టు-వేల్యూని ఇవ్వవచ్చు. కానీ బ్యాంకులు మీకు 80 శాతం రుణం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. బ్యాంకు 70 శాతం లోన్-టు-వేల్యూ నిష్పత్తిని అందిస్తే, మీరు 42 లక్షల హోమ్ లోన్ పొందుతారు. అంటే మిగిలిన 18 లక్షలు మీ చేతి నుంచి పెట్టుకోవాలి. దీనిని డౌన్ పేమెంట్ అంటారు. మీరు బ్యాంకులో లోన్ కోసం అప్లై చేసినప్పుడు… మీరు కోరుకున్నంత లోన్ రావాలని లేదు.

LTV నిష్పత్తిని నిర్ణయించేటప్పుడు బ్యాంకులు అనేక అంశాలను పరిశీలిస్తాయి. గృహ కొనుగోలుదారు లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యం, ​​అతని ఆదాయం, ఇప్పటికే ఉన్న అన్ని లోన్లను పరిగణనలోకి తీసుకుంటుంది. అతని వయస్సు , కొనుగోలు చేసిన ఆస్తి రకం.. అతని పరిస్థితిని కూడా లెక్కలోకి తీసుకుంటుంది.

ఇప్పుడు LTV రేషియో ఎలా లెక్కిస్తారో ఆ ఫార్ములాని చూద్దాం. దీనిని కొనుగోలు చేయబోయే ఆస్తిపై లభించే లోన్, ఆస్తి ధర ఆధారంగా లెక్కిస్తారు. లోన్ మొత్తాన్ని ఆస్తి విలువతో భాగించి, ఆపై 100తో గుణించండి. ఉదాహరణకు రాహుల్ 50 లక్షల డీల్‌ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. RBI నిబంధనల ప్రకారం, అతనికి 80 శాతం అంటే 40 లక్షల వరకు రుణం వస్తుంది. కానీ బ్యాంక్ దాని గురించి కచ్చితంగా చెప్పలేదు. రాహుల్ ఆర్థిక పరిస్థితి.. షరతులను బట్టి కేవలం 35 లక్షల రూపాయిల లోన్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ఇంటి ఎల్‌టీవీ రేషియో (35 లక్షలు/50 లక్షలుx100) 70 శాతం. రాహుల్ 15 లక్షల డౌన్ పేమెంట్ చేయాలి.

రాహుల్ డౌన్ పేమెంట్ మొత్తాన్ని మరింత పెంచితే, అతను LTV రేషియోను తగ్గించగలడు. బ్యాంకులు.. ఎక్కువ డౌన్ పేమెంట్ ఉన్న కస్టమర్‌లకు ప్రాధాన్యత ఇస్తాయి. LTV రేషియో ఎంత తక్కువగా ఉంటే… బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అంతగా మొగ్గు చూపుతాయి.

ట్యాక్స్, ఇన్వెస్ట్ మెంట్ ఎక్స్ పర్ట్ బల్వంత్ జైన్ ఏం చెప్పారంటే.. గృహ రుణం విషయంలో, ఆస్తి విలువలో అగ్రిమెంట్-టు-సెల్‌లో అనేది మ్యాటరే కాదు. బ్యాంక్ ఆస్తి విలువను స్వయంగా అంచనా వేస్తుంది. ఈ రెండు వేల్యూస్ లో ఏది తక్కువుంటే దానిని బ్యాంక్ పరిగణనలోకి తీసుకుని దాని ఆధారంగా లోన్ ఇస్తుంది.

రుణాన్ని ఆమోదించడంలో కొనుగోలుదారుడి వార్షిక ఆదాయం, వయసు, క్రెడిట్ హిస్టరీ చాలా ముఖ్యం అని జైన్ చెప్పారు. మీ లోన్-టు-వేల్యూ రేషియో తక్కువగా ఉంటే, అది బ్యాంక్ రిస్క్ ఆఫ్ మార్జిన్‌ను తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితిలో, బ్యాంక్ మీకు తక్కువ వడ్డీకి రుణం ఇస్తుంది. అయితే దీని కోసం మీరు చేయాల్సి ఉంటుంది బ్యాంక్‌తో చర్చలు జరపడం.

బేరసారాలు లేకుండా ఏ బ్యాంకూ వడ్డీ రేటును తగ్గించదు. అటువంటి పరిస్థితిలో, రాహుల్ లాగా, మీరు కూడా హోమ్ లోన్ ద్వారా ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ముందుగా డౌన్ పేమెంట్ కోసం మంచి మొత్తాన్ని ఏర్పాటు చేసుకోండి. మీరు డౌన్ పేమెంట్‌గా ఎక్కువ డబ్బు చెల్లిస్తే… మీ లోన్-టు-వేల్యూ నిష్పత్తి తక్కువగా ఉంటుంది. ఇది మీకు హోమ్ లోన్ రావడాన్ని సులభతరం చేస్తుంది. మీకు వడ్డీ కూడా తక్కువే పడుతుంది.

Published: April 4, 2024, 18:33 IST