అద్దె ఇంట్లో ఉన్న వస్తువులకూ ఇన్సూరెన్స్ చేయవచ్చు.. ఎలా?

అదేవిధంగా, డిజిట్ ఇన్సూరెన్స్ హోమ్ కంటెంట్ పాలసీలో, రూ. 1 లక్ష నుండి 50 లక్షల వరకు బీమా మొత్తం అందుబాటులో ఉంది. ఇందులో

అద్దె ఇంట్లో ఉన్న వస్తువులకూ  ఇన్సూరెన్స్ చేయవచ్చు.. ఎలా?

నికిత తన కుటుంబంతో కలిసి ఇటీవల అద్దె ఇంటికి మారింది. ఇంతకు ముందు ఆమె సొంత ఇంట్లో ఉండేవారు కానీ పెద్ద కుటుంబం కారణంగా ఆ ఇల్లు చిన్నదైపోయింది. నికితా కొత్త ఇంటికి మారాక.. ఆ ఇంట్లోని వస్తువులను ఎలా బీమా చేసుకోవాలో అర్థం కావడం లేదా? మీ ఇంటితోపాటు ఇంటిలోని వస్తువులకు బీమా చేయడం చాలా సులభం. దీని కోసం, మీరు భవనం నిర్మాణంతో పాటు ఇంట్లో ఉంచిన ఆస్తులను కూడా కవర్ చేసే.. సమగ్ర గృహ బీమా పాలసీని తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ ఇల్లు నికితాది కాదు కాబట్టి ఆమె దానికి హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదు. మరిప్పుడు ఏం చేయాలి?

మీకు కూడా నికితా లాంటి సమస్య ఉంటే దీనిని సులభంగా పరిష్కరించుకోవచ్చు. మీరు మీ అద్దె ఇంట్లో ఉంచిన మీ వస్తువులకు మాత్రమే బీమా చేయాలనుకుంటే, దీని కోసం మీరు కంటెంట్-ఓన్లీ కవర్ ప్లాన్ అనే ప్రత్యేక బీమా ప్లాన్ తీసుకోవచ్చు.

వివిధ బీమా కంపెనీల హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల కింద, మీ ఇంటిలోని విభిన్న కంటెంట్‌లను కవర్ చేసేలా కంటెంట్-ఓన్లీ కవర్ ప్లాన్‌లు ఉన్నాయి. టీవీ, ఫ్రిజ్, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కవర్ అవుతాయి. ఇందులో ఎలక్ట్రిక్ చిమ్నీ, ఖరీదైన లైటింగ్ తో పాటు ఇంట్లో అమర్చిన ఫర్నీచర్, ఫిక్చర్‌లు కవర్ అవుతాయి. మీరు ఆభరణాలు, ఖరీదైన పెయింటింగ్ లేదా కళాకృతి వంటి విలువైన వస్తువులకు కూడా ప్రత్యేకంగా కవరేజీని తీసుకోవచ్చు. అయితే, దీని కోసం మీరు యాడ్-ఆన్ కవర్ తీసుకోవాలి. ఈ వస్తువులకు ఏదైనా నష్టం జరిగితే.. మీ జేబుకు ఎటువంటి నష్టం జరగదు.

ఇప్పుడు ఈ బీమాను ఎలా తీసుకోవాలనే ప్రశ్న తలెత్తుతోంది.
దాదాపు అన్ని సాధారణ బీమా కంపెనీలు ఈ రకమైన బీమాను అందిస్తున్నాయి. మీరు బీమా తీసుకుంటున్న కంపెనీకి మీ ఇంట్లోని విలువైన వస్తువుల లిస్టును ఇవ్వాల్సి ఉంటుంది. దీనితో పాటు, ఈ వస్తువుల అంచనా ధరను కూడా తెలపాల్సి ఉంటుంది. ఏదైనా నష్టం జరిగితే, బీమా కంపెనీకి క్లెయిమ్ చేయాలి. ఆ వస్తువుల రీప్లేస్‌మెంట్ విలువను కంపెనీయే నిర్ణయిస్తుంది. ఈ విలువను నిర్ణయించేటప్పుడు, భీమా సంస్థ తరుగుదల వంటి కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవచ్చు. అంటే వస్తువులు పాతవి అయితే వాటి ధరలలో తగ్గుదల అని అర్థం. బీమా పాలసీని తీసుకునే ముందు, మీరు ఆ పాలసీకి సంబంధించిన నిబంధనలను, షరతులను జాగ్రత్తగా చదవాలి. దీనివల్ల పాలసీలో ఏవి కవర్ అవుతాయి, ఏవి కావు అనేది మీరు తెలుసుకోవచ్చు

హోమ్ కంటెంట్ కవర్‌లో సౌకర్యవంతమైన టెన్యూర్ అందుబాటులో ఉంది. 1 నుంచి 5 ఏళ్ల పాటు ప్లాన్ తీసుకోవచ్చు. మీ అవసరాన్ని బట్టి ప్లాన్ తీసుకోవచ్చు. ఇది సమగ్ర కవరేజీని అందిస్తుంది. అగ్ని, ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, ప్రమాదవశాత్తు నష్టం మొదలైన వాటి వల్ల కలిగే నష్టాలను కవర్ చేస్తుంది.

ఇప్పుడు క్లెయిమ్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ కోసం మీరు ఏం చేయాలంటే.. మీ వస్తువులకు నష్టం జరిగనన వెంటనే.. బీమా కంపెనీ అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్ లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ IDకి ఆ సమాచారాన్ని తెలియజేయాలి. సులభంగా క్లెయిమ్ చేయడానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ ను సిద్ధంగా ఉంచాలి. క్లెయిమ్‌ను నిర్ధారించడానికి కంపెనీ మీ నుండి సాక్ష్యం, వివరణ కోసం అడగవచ్చు. దాని కోసం మీ దగ్గర బిల్లులు, వోచర్‌లు ఉండాలి. కంపెనీ.. ఒక ఇన్వెస్టిగేటర్ ను నియమిస్తుంది. అతడు మీ క్లెయిమ్ ను ఆధారాలను పరిశీలిస్తాడు. ఈ విషయంలో మీరు అతనికి సహకరించాలి.

ఈ రకమైన బీమా కోసం ఎంత ప్రీమియం చెల్లించాలి అనేది కూడా ముఖ్యం. దీన్ని రెండు వేర్వేరు ఉదాహరణలతో అర్థం చేసుకుందాం.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హోమ్ కంటెంట్ పాలసీని కలిగి ఉంది.ఇందులో రూ.30,000 నుండి రూ.50 లక్షల విలువైన ఆస్తులకు బీమా చేయవచ్చు. బీమా మొత్తం ప్రకారం పాలసీ ప్రీమియాన్ని నిర్ణయిస్తారు. మీకు రూ. 10 లక్షల బీమా మొత్తం కావాలి అనుకుందాం, దీని కోసం మీరు ఏటా రూ. 6,300 పన్నుతో పాటు ప్రీమియం చెల్లించాలి. అదే విధంగా రూ.50 లక్షల బీమా మొత్తానికి ప్రీమియం.. పన్నుతోపాటు రూ.31,500కి పెరుగుతుంది.

అదేవిధంగా, డిజిట్ ఇన్సూరెన్స్ హోమ్ కంటెంట్ పాలసీలో, రూ. 1 లక్ష నుండి 50 లక్షల వరకు బీమా మొత్తం అందుబాటులో ఉంది. ఇందులో రూ.10 లక్షల బీమా మొత్తానికి వార్షిక ప్రీమియం రూ.1,346, రూ.50 లక్షల బీమా మొత్తానికి రూ.4,982 చెల్లించాలి.

చివరిగా మనం అలాంటి పాలసీని తీసుకోవడం మంచిదని చెబుతాను. దీనితో మీరు దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు మొదలైన సందర్భాల్లో పెద్ద నష్టాల నుండి బయటపడతారు. అవును.. పాలసీ తీసుకునేటప్పుడు, నిబంధనలు, షరతులను చదవండి. దీనివల్ల మీరు మంచి ఆప్షన్ ను ఎంచుకోవడం సాధ్యమవుతుంది.

Published: March 6, 2024, 18:13 IST