BANK GUARANTEED PLANS: గ్యారంటీ ఆదాయాన్నిచ్చే ఇన్సూరెన్స్ పాలసీలు మంచివా?

సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండమని ఆ మేనేజర్ చెప్పారు. ఆ తర్వాత, గ్యారంటీడ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టమని భూపాల్‌కి సలహా ఇచ్చారు.

BANK GUARANTEED PLANS: గ్యారంటీ ఆదాయాన్నిచ్చే ఇన్సూరెన్స్ పాలసీలు మంచివా?

నోయిడాలో భూపాల్ వ్యాపారం బాగా జరుగుతోంది. తన భూమికి సంబంధించి కొన్ని నెలల కిందట పెద్ద మొత్తంలో పరిహారం అందింది. అతని ఖాతాలో పెద్ద మొత్తంలో అది క్రెడిట్ అయ్యింది. అతను కొత్త చెక్‌బుక్ కోసం దరఖాస్తు చేయడానికి బ్యాంక్ కి వెళ్లినప్పుడు, రిలేషన్ షిప్ మేనేజర్ భూపాల్ తో మాట్లాడారు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండమని ఆ మేనేజర్ చెప్పారు. ఆ తర్వాత, గ్యారంటీడ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టమని భూపాల్‌కి సలహా ఇచ్చారు. పెట్టుబడి వల్ల కలిగే భారీ ప్రయోజనాలను మేనేజర్ వివరించారు. అతను రెండు లక్షల రూపాయల వార్షిక ప్రీమియంతో 10 ఏళ్ల వ్యవధి కలిగిన పాలసీని భూపాల్‌కి విక్రయించారు.

భూపాల్ కేసు ఒక్కటే కాదు. మీరు కూడా మీ ఖాతాలో పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసినట్లయితే, మీ బ్యాంక్ మేనేజర్ లేదా సిబ్బంది పెట్టుబడి ఉత్పత్తులను మీకు సిఫార్స్ చేయవచ్చు. వారు మీకు వివిధ పెట్టుబడి పథకాల గురించి చెప్పవచ్చు. నిజానికి, బ్యాంకులకు కూడా ఇప్పుడు అమ్మకాల విషయంలో పెద్ద లక్ష్యమే ఉంది. వారు అమ్మకాల లక్ష్యాన్ని పూర్తి చేసినప్పుడే వారి జీతంలో కొంత భాగాన్ని పొందుతారు. దీన్ని సాధించడానికి, వారు బ్యాంక్ FDలు, మ్యూచువల్ ఫండ్‌లు , బీమా పాలసీలలో పెట్టుబడి పెట్టమని కస్టమర్‌లను ఒప్పిస్తారు… అయితే, ఈ రోజుల్లో, బ్యాంకులు ఎక్కువగా గ్యారంటీడ్ బీమా ప్లాన్‌లను విక్రయించడంపై దృష్టి పెడుతున్నాయి.

భీమా పరిశ్రమ ప్రకారం, గ్యారంటీడ్ బీమా పాలసీలు వారి ఉత్పత్తులలో పెద్ద భాగం. అయితే, బీమా కంపెనీలు ఏ పథకం ద్వారా ఎంత ప్రీమియం సంపాదిస్తున్నాయో వెల్లడించవు… ఇతర పథకాలతో పోల్చితే, గ్యారంటీడ్ ప్లాన్‌ల ప్రీమియంలో గణనీయమైన పెరుగుదల ఉంది.

FDలు, మ్యూచువల్ ఫండ్‌లతో పోల్చినప్పుడు, బీమా పాలసీల విక్రయంపై మీ రిలేషన్‌షిప్ మేనేజర్‌కి చాలా కమీషన్ లభిస్తుంది. బీమా పాలసీలపై కమీషన్ రేటు మారుతూ ఉన్నప్పటికీ, గ్యారంటీడ్ బీమా ప్లాన్‌ల లో మొదటి సంవత్సరం ప్రీమియంపై కమీషన్ 40 నుండి 50 శాతం వరకు ఉంటుంది. రెండవ సంవత్సరం తరువాత, ఈ కమీషన్ 20 నుండి 30 శాతానికి తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్ వార్షిక కార్పస్‌పై గరిష్ట కమీషన్ 1% వరకు ఉంటుంది. నిజానికి, మార్చిలో, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDA) నిర్దిష్ట ఉత్పత్తులపై కమీషన్ పరిమితిని తొలగించింది. బీమా కంపెనీలు ఇప్పుడు తమ నిర్వహణ ఖర్చుల ఆధారంగా కమీషన్‌ను నిర్ణయించవచ్చు. బీమా కంపెనీలు బ్యాంకర్లకు కమీషన్ ఇన్సెంటివ్‌లను అందించడం ద్వారా గ్యారంటీడ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను విక్రయించమని ప్రోత్సహిస్తున్నాయి.

గ్యారంటీడ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు బీమా కవరేజీతో పాటు కొంత మొత్తంలో రాబడికి హామీ ఇచ్చే పెట్టుబడి ఎంపికలని చెప్పాలి. దేశంలోని చాలా బీమా కంపెనీలు ఇలాంటి ప్లాన్‌లను విక్రయిస్తున్నాయి. ముందుగా నిర్ణయించిన కాలానికి ప్రతి సంవత్సరం నిర్ణీత మొత్తాన్ని ప్రీమియంగా డిపాజిట్ చేయాలి. అదనంగా, బీమా కంపెనీ మీకు బీమా కవరేజీతో పాటు ముందుగా నిర్ణయించిన మొత్తానికి హామీ ఇస్తుంది. పాలసీదారు ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాలలో తీసుకోవచ్చు.

పన్ను మరియు పెట్టుబడి నిపుణుడు బల్వంత్ జైన్ చెప్పినదాని ప్రకారం చూస్తే.. బ్యాంకులు, బీమా కంపెనీలలో పనిచేసే వ్యక్తులు, వారు ఎక్కువగా లాభం ఉండే ఉత్పత్తిని మీకు విక్రయిస్తారని చెప్పారు. బ్యాంకర్లు.. గ్యారెంటీడ్ ఆదాయ ప్లాన్‌లలో బంపర్ కమీషన్‌ను పొందుతారు…అందుకే వారు అలాంటి పాలసీలను విక్రయించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జైన్ ప్రకారం, ఎవరైనా, ఎప్పుడైనా సరే.. తమ బీమా మరియు పెట్టుబడిని వేరుగా ఉంచుకోవాలి. పెట్టుబడి ఎప్పుడైనా ఆగిపోవచ్చు. మీ వార్షిక ఆదాయానికి 15 రెట్ల వరకు కవరేజీతో టర్మ్ ప్లాన్ తీసుకోండి. మిగిలిన డబ్బును SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. గ్యారంటీడ్ ఆదాయ ప్లాన్‌లు పెట్టుబడికి మంచి ఎంపిక కాదు.
గ్యారెంటీడ్ ఆదాయ ప్రణాళికలు మీరు మొదటిసారి విన్నప్పుడు చాలా ఆకర్షణీయంగా అనిపించవచ్చు… కానీ వార్షిక రాబడి దాదాపు 5-6 శాతం ఉంటుంది, ఇది ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో ప్రభావవంతంగా ఉండదు. మీ బ్యాంక్ మేనేజర్ కూడా అలాంటి పాలసీని కొనుగోలు చేయమని మిమ్మల్ని అడిగితే, ఒత్తిడికి లొంగకండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు లాభనష్టాల విశ్లేషణ చేయడం అవసరం. ఈ విషయంలో మీరు మీ ఫైనాన్షియల్ మేనేజర్‌ని సంప్రదించడం మంచిది.

Published: November 29, 2023, 12:08 IST