ఈ బడ్జెట్ లో ఉద్యోగులకు కావాల్సినవి ఇవే!

ఈ లాజిక్ నీతాను కదిలించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటోంది. కాస్త ఊరట లభించినా లక్షల

ఈ బడ్జెట్ లో ఉద్యోగులకు కావాల్సినవి ఇవే!

నేను ఏ అవసరాన్ని వదులుకోవాలి, ఏది నెరవేర్చుకోవాలి?
నేను నా జీతాన్ని చాలాసార్లు లెక్కించాను …

ఇటీవల,  నేను ఈ కప్లెట్ గురించి విన్నాను… నీతాను కలిసిన తర్వాత, దీనికి ఓ క్లారిటీ వచ్చింది…

నీతా దేశంలోని మధ్యతరగతి శ్రామిక వర్గానికి చెందినది…

ఉచిత రేషన్ లేదా ఆయుష్మాన్ పథకం ప్రయోజనం పొందగలిగేంత పేదవారు కాదు… అలాగని.. ఎలాంటి చీకూచింతా లేకుండా ఖర్చు చేయగల ధనవంతులూ కాదు…

మధ్యతరగతి వారిలాగే, ఆమె తన ఖర్చులతో నెల రోజుల బండిని నడపడానికి చాలా కష్టపడాలి. కొన్నిసార్లు తన అవసరాలను తగ్గించడం ద్వారా, కొన్నిసార్లు తన పొదుపును తగ్గించడం ద్వారా సర్దుబాటు చేసుకోవాలి.

ఈరోజుల్లో ప్రతిరోజు వార్తాపత్రికల్లో బడ్జెట్‌పై వార్తలు వస్తున్నాయి

ఈ ‘గ్యారంటీల బడ్జెట్’లో ప్రభుత్వం తనకు ఏదైనా హామీ ఇవ్వగలదా అని నీతా కూడా ఆలోచిస్తోంది…

నీతా ఆశ్చర్యపోతూ అద్దం ముందు తనలో తానే మాట్లాడుకోవడం ప్రారంభించింది…పనిచేసే వ్యక్తికి ఏం కావాలి?

అంటే, పన్ను స్లాబ్‌ని విస్తరించాలి … సంపాదనపై పన్ను తగ్గించాలి, దీనివల్ల చేతిలో మరికొంత డబ్బు ఆదా అవుతుంది…
సరే, మధ్యతరగతి శ్రామిక ప్రజలు పన్నును మినహాయించిన తరువాత పొందే జీతం…

ఎక్కువగా పిల్లల స్కూల్ ఫీజులు, నెలవారీ కిరాణా సామాగ్రి, ఇంటి అద్దె, కారు పెట్రోల్ ఇలా ఖర్చయిపోతుంది.

కొంచెం మిగిలినా, కొంత బీమా ప్రీమియంకు వెళుతుంది. లేదా పెట్టుబడిగా మారుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో వారికి పన్ను మినహాయింపు లభిస్తే.. జీతంలో ఎలాంటి తగ్గుదల ఉండదని, చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటుందంటూ…

నీతా ప్రతిబింబం ఆమెకు ఇలా సమాధానమిచ్చింది.

ఇది ఎన్నికల బడ్జెట్… ప్రభుత్వానికి ఓట్లు కావాలి… వారు ఈ హామీలను ఇవ్వవచ్చు. అందుకే ఆశ కోల్పోవద్దు…
ఇప్పుడు అవసరమైన రెండో హామీ ఏమిటి?

80C పరిమితిని పెంచితే చాలా బాగుంటుంది… ఇంతకు ముందు 2014-15లో మార్పు వచ్చింది…
ప్రస్తుతం, పరిమితి రూ. 1.5 లక్షలుగా ఉంది… ఈ పరిమితిని పెంచడానికి నీతా గ్యారంటీ కోరుతోంది…
పిఎఫ్, పిల్లల ఫీజులకు రూ.1.5 లక్షలు సరిపోతుంది. మిగిలిన పెట్టుబడి రకాలు.. పొదుపు మొత్తాలు పన్ను ఆదాలో ఉపయోగపడవు.

ఈ లాజిక్ నీతాను కదిలించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటోంది. కాస్త ఊరట లభించినా లక్షల మంది ఈ బ్రాకెట్ నుంచి బయట పడతారు. ఇంకేదైనా గ్యారంటీ అడగండి అంటూ ఆమె తనలో తానే అనుకుంది.

మ్ మ్ మ్ మ్… ప్రభుత్వం కనీసం ఆరోగ్య బీమా ప్రీమియంలకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇచ్చినా బాగుంటుంది అనుకుంది.

నీతా రూ.40వేలు ప్రీమియం చెల్లిస్తుంది. మినహాయింపు పరిమితి రూ.25వేలు… ఇంత కూడా ప్రభుత్వం చేయలేదే అని అనుకుంది…?

ప్రతి ఒక్కరికీ ఆయుష్మాన్ ప్రయోజనాన్ని అందించలేని పక్షంలో.. కనీసం ఇన్సూరెన్స్ ను తీసుకునే దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ఇదయినా చేయాలనుకుంది…

మొత్తంగా చూస్తే.. ఉద్యోగస్తులు.. ఈ గ్యారంటీని కోరుతున్నారు.

ఆదాయపు పన్ను తగ్గింది కనుక కొంత డబ్బు ఆదా అవుతుంది. ఇక రెండోదానిని చూస్తే.. పెట్టే పెట్టుబడులపై పన్ను మినహాయింపు కూడా ఉండాలి…

Published: January 25, 2024, 17:00 IST