బీమా పాలసీని సరెండర్ చేస్తున్నారా? మరి.. ఈ రూల్స్ తెలుసా?

IRDAI సరెండర్ ఛార్జీలను తగ్గించి ఉంటే, బీమా కంపెనీలు ఏజెంట్ కమీషన్‌ ను తగ్గించాల్సి వచ్చేది. సహజంగానే ఇది బీమా విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

alternate

బీమా నియంత్రణ సంస్థ IRDA జీవిత బీమా పాలసీ సరెండర్ విలువకు సంబంధించిన నిబంధనలను మార్చింది. మెచ్యూరిటీకి ముందు బీమా పాలసీని క్లోజ్ చేయడాన్ని సరెండర్‌గా భావిస్తారు. మీరు పాలసీని సరెండర్ చేస్తే, మీరు చెల్లించిన ప్రీమియంలో కొంత భాగమే మీకు తిరిగి వస్తుంది. దానిని సరెండర్ విలువ అంటారు. సరెండర్ విలువకు సంబంధించిన కొత్త నియమాలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చాయి.

సరెండర్ విలువకు సంబంధించిన కొత్త నియమాలు ఏమిటి? నిబంధనల మార్పు ప్రభావం ఎలా ఉంటుంది? బీమా పాలసీని సరెండర్ చేసేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలి? ఓసారి క్లియర్ గా చూద్దాం.

మెచ్యూరిటీకి ముందే పాలసీని వాపసు చేస్తే బీమా చేసిన వ్యక్తి నష్టపోతాడు. కస్టమర్లను భారీ నష్టాల నుంచి కాపాడేందుకు సంప్రదాయ పాలసీల సరెండర్ విలువను పెంచాలని ఇటీవల ఐఆర్‌డీఏ ప్రతిపాదించింది. ఇప్పుడు ముందుగా సరెండర్ విలువకు సంబంధించిన నియమాలేంటో చూద్దాం.

ఇప్పటి వరకు జీవిత బీమా కంపెనీలు పాలసీని సరెండర్ చేయడానికి రెండు ఆప్షన్‌లు ఇస్తున్నాయి. మొదటిది – గ్యారంటీడ్ సరెండర్ వాల్యూ. ఇందులో మీరు పాలసీ తీసుకున్న తరువాత 3 ఏళ్లు పూర్తయ్యాకే పాలసీని సరెండర్ చేయవచ్చు. మూడేళ్లలోపు పాలసీని సరెండర్ చేస్తే డబ్బు తిరిగి రాదు. రెండవ ఆప్షన్‌లో, పాలసీదారు ప్రత్యేక సరెండర్ విలువను పొందుతారు. ఈ విలువను ప్రాథమిక హామీ మొత్తం, మొత్తం బోనస్, సరెండర్ విలువ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రీమియం మూడేళ్లపాటు చెల్లించినట్లయితే, డిపాజిట్ చేసిన మొత్తంలో 30 శాతం వరకు అందుబాటులో ఉంది. నాలుగు నుండి ఏడు సంవత్సరాల మధ్య పాలసీని సరెండర్ చేస్తే అప్పటివరకు ఉన్న మొత్తంలో 50% వరకు అందుబాటులో ఉంటుంది.

ఇన్సూరెన్స్ కంపెనీలకు సరెండర్ విలువకు సంబంధించి వేర్వేరు నియమాలు ఉన్నాయి. IRDA ఇప్పుడు సరెండర్ విలువకు సంబంధించిన నిబంధనలను నిర్ణయించింది. ఇప్పుడు మీరు పాలసీని సరెండర్ చేస్తే.. మీకు హామీతో కూడిన రాబడి వస్తుంది. కానీ ఇది బీమా చేసిన వారికి పెద్దగా ప్రయోజనం చేకూర్చదు. ఇక కొత్త సిస్టమ్‌లో, పాలసీ పాతదైతే సరెండర్ విలువ మునుపటి కంటే ఎక్కువగా ఉంటుంది.

కొత్త నిబంధనల ప్రకారం, పాలసీని రెండో సంవత్సరంలో సరెండర్ చేస్తే, మొత్తం ప్రీమియంలో 30 శాతాన్ని రీఫండ్ చేస్తారు. అయితే మీరు మొదటి రెండు ప్రీమియంలు చెల్లించినప్పుడే సరెండర్ విలువ ప్రయోజనం అందుకోగలరు. పాలసీని మూడో సంవత్సరంలో సరెండర్ చేయవచ్చు. అది విఫలమైతే, బీమా కంపెనీ ఆ మొత్తంలో 35 శాతాన్ని తిరిగి చెల్లిస్తుంది.

బీమా పాలసీని నాలుగో సంవత్సరం నుంచి ఏడో సంవత్సరం మధ్య సరెండర్ చేసినట్లయితే… చెల్లించిన మొత్తం ప్రీమియంలో 50 శాతం.. బీమా చేసిన వ్యక్తికి రీఫండ్ చేస్తారు. మెచ్యూరిటీకి ముందు రెండేళ్ల వ్యవధిలో పాలసీని సరెండర్ చేస్తే, అప్పుడు మీకు ప్రీమియం మొత్తంలో 90 శాతం రీఫండ్ చేస్తారు.

పాలసీ సింగిల్ ప్రీమియం అయితే, దానిని రెండేళ్ల తర్వాత సరెండర్ చేయవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం, డిపాజిట్ చేసిన మొత్తం ప్రీమియంలో 75 శాతాన్ని మూడో సంవత్సరంలో తిరిగి ఇస్తారు. పాలసీ గడువుకు రెండేళ్ల ముందు పాలసీని సరెండర్ చేస్తే, 90 శాతాన్ని రీఫండ్ చేస్తారు.

ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుంది?

సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ జితేంద్ర సోలంకి చెప్పింది ఏమిటంటే.. కొత్త మార్గదర్శకాల్లో గ్యారెంటీ సరెండర్ వేల్యూను ఏర్పాటు చేశారని.. .కానీ బీమా చేసిన వారికి పెద్దగా ప్రయోజనం ఉండదని… కొత్త రూల్స్ మునుపటిలానే ఎక్కువ లేదా తక్కువ ఉన్నాయని చెప్పారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ దాని మునుపటి ప్రతిపాదన ప్రకారం.. కొంత కాలం తర్వాత సరెండర్ ఛార్జీని తీసివేయాలనే నిబంధన ఉంది. కానీ బీమా పరిశ్రమ లాబీయింగ్ వల్ల, ఈ ప్రతిపాదనను వెనక్కు తీసుకున్నారు. పాత ప్రతిపాదనను అమలు చేసుంటే.. నిర్ణీత వ్యవధి తరువాత .. సరెండర్ వేల్యూగా మొత్తం ప్రీమియం ను పొందే అవకాశం ఉండేది. సరెండర్ ఛార్జీ మాఫీ అయ్యేది. ఇప్పుడు మెచ్యూరిటీకి ఒక సంవత్సరం ముందు పాలసీని సరెండర్ చేస్తే, మొత్తంలో 90 శాతం మాత్రమే తిరిగి ఇస్తారు. మొత్తంగా, IRDAI కొత్త నిబంధనల వల్ల బీమా కంపెనీలు ప్రయోజనం పొందుతాయి…

అబద్ధాలు చెప్పి బీమా పాలసీలను అమ్మేసే కేసులు దేశంలో వేగంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. 80 ఏళ్లు పైబడిన వారికి కూడా పాలసీలను విక్రయిస్తున్నారు. భారీగా కమీషన్ వస్తుందన్న దురాశతోనే ఇలా చేస్తున్నారు.

IRDAI సరెండర్ ఛార్జీలను తగ్గించి ఉంటే, బీమా కంపెనీలు ఏజెంట్ కమీషన్‌ ను తగ్గించాల్సి వచ్చేది. సహజంగానే ఇది బీమా విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. సరెండర్ విలువను పెంచడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే.. బీమా మిస్‌సెల్లింగ్ కు అడ్డుకట్ట వేయవచ్చు. ఈ సమస్యపై IRDA తిరోగమనం భీమా పాలసీల మిస్ సెల్లింగ్‌ను పెంచుతుంది. దీని పర్యవసానాలను బీమా చేసినవారు భరించాల్సి ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా జీవిత బీమా పాలసీని జాగ్రత్తగా ఆలోచించి కొనుగోలు చేయండి. ఎవరి ఒత్తిడితోనైనా ఏ పాలసీని కొనుగోలు చేయకండి.. మెచ్యూరిటీకి ముందే బీమా పాలసీని క్లోజ్ చేస్తే నష్టమే. ఈ పరిస్థితుల్లో మీరు చెల్లించిన ప్రీమియంలో కొద్ది మొత్తమే మీకు తిరిగి వస్తుంది. పాలసీని సరెండర్ చేసే ముందు, దానికి సంబంధించిన నియమాలను పూర్తిగా అర్థం చేసుకోండి.

Published: April 22, 2024, 16:40 IST

బీమా పాలసీని సరెండర్ చేస్తున్నారా? మరి.. ఈ రూల్స్ తెలుసా?